తెలంగాణకు ఇంక తెల్లారనే లేదు..!


Tue,August 16, 2011 05:32 PM

పొ. ఘంటా చక్రపాణి
(సామాజిక పరిశోధకులు)


భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దేశం యావత్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో జెండావందనం చేసింది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానికి ప్రధా న కారణం మన దేశం వలసపాలన నుంచి విముక్తిపొందడం. మనల్ని మనం పరిపాలించుకునే స్వేచ్ఛ, మన బతుకుల్ని మనం తీర్చిదిద్దుకోగలిగే అవకాశం, స్వాతంత్య్రానికి అర్థం నిర్వచనం కూడా అదే. ఏదైనా ఒక జాతి, దేశం, ప్రాదేశిక భూభాగానికి చెందిన ప్రజలు స్వపరిపాలనను, సార్వభౌమాధికారాన్ని కలిగి వుండడమే స్వాతంత్య్రం. కానీ దేశంలో ఇంకా అధికభాగం ప్రజలు తమని తాము పరిపాలించుకుని తమ జీవితాలను మెరుగుపరచుకునే దశకు చేరుకోలేదు. ఈ అరవై నాలుగేళ్లలో ఈ దేశంలోని అనేక జాతులు, తెగలు స్వాతంత్య్రం కోసం పరితపిస్తూనే ఉన్నాయి.

tellara-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
దేశంలోని అనేక ప్రాంతా లు ఇంకా తాము వలసపాలనలో ఉన్నామనే భావిస్తున్నాయి. అదే రకమైన దోపిడీ, పీడన నుంచి విముక్తికోసం ఆరు దశాబ్దాలలో అనేక ఉద్యమాలు సాగాయి. కొన్ని విజయం సాధిస్తే, అనేకం అణచివేతకు గురైనాయి. అయినా ప్రజల్లో ఇంకా ఈ దేశం పట్ల ప్రేమ చావలేదు. దేశ సార్వభౌమాధికారం పట్ల విశ్వాసం సడలలేదు. అందుకే స్వాతంత్య్ర దినమంటే ప్రజల్లో యెనలేని గౌరవం. ఇందుకు కారణం దేశం బాగుపడిందని, తమ బతుకులు మారిపోయాయని కాదు. మన దేశానికి బహుశా ఈ పోరాటం లేకున్నా స్వాతంత్య్రం వచ్చేదే.

ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధం తరువాత ఐరోపా సామ్రాజ్యవాదం కుప్పకూలి వలసవాద పాలన ప్రపంచవ్యాప్తంగా అంతమయింది. బ్రిటన్ తనంతట తానుగా అన్ని దేశాల నుంచీ విరమించుకుంది. నిజంగానే మన దేశాన్నుంచి విరమించుకునేదో లేదో కానీ, స్వాతంత్య్రం కోసం సాగిన ఉద్యమం స్వపరిపాలన ఆత్మగౌరవాలకు ప్రతీక. చరిత్ర నిండా దోపిడీ పాలన నుంచి భావి తరాలను విముక్తి చేయడానికి వేలాదిమంది చేసిన త్యాగాల ఫలితంగా సాధించిన విజయం కాబట్టే పంద్రాగస్టుకు ఆ గౌరవం.
పంద్రాగస్టుకు తెలంగాణకు అసలు సంబంధమే లేదు. మనకు 1947లో స్వాతంత్య్రం రాకపోయినా జెండావందనం చేయడం ఒక జాతీయ భావ వ్యక్తీకరణే తప్ప మనకు ఈ రోజున జరిగింది, ఒరిగింది ఏమీ లేదు. మరీ విచివూతంగా స్వాతంత్య్రం రావడంతో దేశమంతటా వలసపాలన అంతరిస్తే తెలంగాణలో మాత్రం నయా వలసపాలనకు బీజం పడింది.

స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి భారత సైన్యాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకుని, కలిపేసుకున్న ఎనిమిదేళ్లకే స్థానిక పరిపాలన అంతరించి ఆంధ్రా పాలన మొదలైంది. అప్పటిదాకా భూమిపువూతుల పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1956 ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరాయిపాలనలోకి వెళ్లింది. తెలంగాణలో వలస పాలన అంతం కావాలని ఇక్కడి ప్రజలు నాటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు తమకు సంబంధం లేకపోయినా జాతీయస్ఫూర్తితో జెండావందనం జరుపుకుని ఈ వ్యవస్థ మీద విశ్వాసం ప్రకటిస్తే, ప్రజలకు జవాబుదారీగా లేని మంత్రులు ప్రజల ఆకాంక్షలను తోసిరాజని అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొని ‘వలస’ ప్రభుత్వాల సేవలో పునరంకితమవుతున్నారు.

మన సంగతి అలా ఉంచుదాం. అసలు ఒక దేశంగా భారతదేశం నిజంగానే స్వాతంత్య్రం పొందిందా? ప్రజలకు స్వాతంత్య్రం వస్తే దోపిడీ పీడన ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్న లు. మనం స్వాతంత్య్రం సాధించుకోవడంలో సఫలీకృతులం అయినాం తప్ప, ఆ స్వాతంవూత్యాన్ని అందరికీ పంచడంలో ఘోరంగా విఫలమయినాం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా వేరువేరు పద్ధతుల్లో స్వాతంత్య్ర పోరాటాలు సాగుతున్నాయి. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. కొందరు తమ సంపదను అది అడవి కావచ్చు, భూమి కావచ్చు. ఆ భూమి కింది వనరులు కావచ్చు దోచుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు సాగిస్తుంటే మరికొందరు ప్రజల శ్రమను, సంపదను కైంకర్యం చేసి కోట్లకు పడగపూత్తిన అవినీతిపరులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

ముఖ్యంగా ఈ దేశంలో నలు మూలలా విస్తరించిన ఆదివాసులు, పల్లెపప్లూనా వివక్షలో నలిగిపోతున్న దళితులూ, అభవూదతలో బతుకుతున్న ముస్లింలు, ఆధిపత్యంలో ఊపిరాడని మహిళలు ఇట్లా అనేక జాతు లు, తెగలు, వర్గాలు నిజమైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూనే ఉన్నారు. లాల్‌గఢ్ నుంచి ఛత్తీస్‌గఢ్ దాకా విస్తరించి ఉన్న కొండల్లో నివసిస్తోన్న ఆదివాసుల సంగతే చూడండి. పదేళ్ల నుంచి ఈ దేశ సంపదను దోచుకుపోతోన్న విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతు న్నారు. ఈ పోరు స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తుంది. అప్పుడు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే. కానీ ఇవాళ వందలాది కంపెనీలు విస్తరించాయి. ప్రజలు ప్రాణత్యాగాలు చేసి పోరాడి తరిమేసిన విదేశీ పెట్టుబడిదారీ శక్తులను మన ప్రభుత్వాలే సాగిలపడి ఆహ్వానించి వాళ్ల అడుగులకు మడుగులొత్తుతున్నాయి.

అట్లా దేశ సంపదను విదేశీ శక్తులకు తాకట్టుపెట్టడం తప్పని చెప్పిన వాళ్లను, ఎదురు తిరిగిన వాళ్లను హింసావాదులని, దేశ ద్రోహులని కాసేపు అనుకుందాం. మరి గాంధీ మార్గంలో ఉద్యమాలు చేస్తున్న వాళ్లను మాత్రం గౌరవిస్తున్నారా? అవినీతికి వ్యతిరేకంగా గాంధీ మార్గంలో సత్యాక్షిగహానికి పూనుకున్న అన్నా హజారే పట్ల వ్యవహరిస్తోన్న పద్ధతి ప్రజాస్వామ్యానికే తలవంపు. అంతెందుకు తెలంగాణ విషయంలో పాలక వర్గాలు వ్యవహరిస్తోన్న పద్ధతి పార్లమెంటరీ వ్వవస్థకే అవమానం.

ఇంత జరుగుతోంటే మన గౌరవ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఏమంటున్నారో చూడండి.పార్లమెంటు ప్రతిష్ఠ కాపాడాలని, తెలిసిగానీ తెలియకగానీ అటువంటి రాజ్యాంగ వ్యవస్థల అధికారాలను, విశ్వసనీయతను దెబ్బతీయరాదని శ్రీమతి ప్రతిభాపాటిల్ గారు ప్రజలకు హితబోధ చేశారు. నిజానికి భారత రాజ్యాంగానికి రాష్ట్రపతి అధిపతి. అంటే ఈ దేశంలో పరిపాలన శాసనబద్ధంగా సాగుతున్నదీ లేనిది తెలుసుకోవాల్సిన వ్యక్తి. అలా సాగేలా చూడవలసిన బాధ్యత కూడా వారిదే. అలాగే పార్లమెంటు నడిచేది కూడా వారి కనుసన్నల్లోనే. మరి పార్లమెంటు విశ్వసనీయతను ఎవరు దెబ్బతీస్తున్నారో వారికి తెలియకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంటులో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఇరవై నెలలు దాటింది. అయినా వలస చీకటి తొలగిపోలేదు. తెలంగాణకింకా తెలవారలేదు.

ఈ స్వతంత్ర భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ ప్రజల స్వపరిపాలన పోరాటాలకు అంతకంటే ఎక్కువ చరిత్రే ఉంది. స్వాతంవూత్యోద్యమం ఎన్ని దశల్లో, ఎన్ని పాయలుగా జరిగిందో అంతకంటే ఎక్కువ సందర్భాల్లోనే సాగింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ పోరాటంలో ఉన్నంత సృజనాత్మక చైతన్యం, వైవిధ్యం జాతీయోద్యమంలో కూడా కనిపించదు. జాతీయోద్యమంలో ఎన్ని రోజుల పాటు సత్యాక్షిగహాలు జరిగాయో తెలియదు గానీ తెలంగాణలో బోధన్ లాంటి చిన్న పట్టణాల్లో కూడా గడచిన ఆరువందల రోజులుగా ప్రజలు నిరవధిక దీక్షల్లో ఉన్నారు. ఆరువందల పైబడి సామాన్యులు పార్లమెంటు చేస్తోన్న మోసానికి నిరసనగా ఉరికంబాలు ఎక్కారు. జాతీయోద్యమం కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది గానీ తెలంగాణ ఉద్య మం ఇవాళ పల్లెపప్లూకూ విస్తరించింది. అలాంటి ఒక మహోద్య మం అహింసాయుతంగా అప్రతిహతంగా ఇంకా కొనసాగుతున్నదంటే ఇక్కడి ప్రజలు ఆ పార్లమెంటును గౌరవించబట్టే.

దాదాపు పది సంవత్సరాల పాటు ఆ పార్లమెంటుపై విశ్వాసం ఉంచి అనేక పరీక్షలు, అవమానాలు ఎదురైనా భరించిన తెలంగాణ ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన, ఇస్తోన్న భరోసా ఏమిటో రాష్ట్రపతిగారే చెప్పాలి. ఇప్పుడు భారత రాష్ట్రపతిగా వారు హితబోధ చేయాల్సింది ప్రజలకు కాదు ఆ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్న తన పాలక పరివారానికి. నిజానికి ప్రభుత్వాలు వాటిని ఏలుతోన్న రాజకీయ పార్టీలే పార్లమెంటు మీద ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తున్నాయి. ఏ మాత్రం జవాబుదారీతనం లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. మాట మీద నిలబడాల్సిన ప్రభుత్వాలు రోజుకొక మాట చెప్పి ప్రజలను మాయ చేస్తున్నాయి. వ్యక్తులుగా నీతి, నిజాయితీ లేని వాళ్లు, అక్రమాలతో ప్రజలను దోచేసుకున్న వాళ్లు, గుత్తేదార్లు, బ్రోకరేజ్ చేసేవాళ్లు ఇవాళ శాసనకర్తలుగా అవతరించడం అన్నిటికంటే మించిన అమర్యాద అని వారు గమనించడం మంచిది.

అలాంటి వారి వల్లనే ఇవాళ డబ్బులుంటే పార్లమెంటుకు లక్షల మెజారిటీతో గెలవొచ్చని, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినా, అడగకపోయినా డబ్బులు అందుతాయని, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను ఆపవచ్చని తెలిసిపోయింది. గౌరవ పార్లమెంటు ఇప్పటికే వివాదస్పదమయింది. ముందు రాష్ట్రపతిగా వారు ఒక అడుగు ముందుకేసి ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు. నిజమే అవినీతి అతి అయిపోయిందనే పాపం హజారే ఆ వయసులో పార్లమెంటును నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు, దోపిడీలు, దొమ్మీలు చేసినవాళ్లు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని దోచేసిన వాళ్లు పార్లమెంటు లోపల ఉన్నారన్నది ఆయన వాదన.

వాళ్ల నుంచి విముక్తి కలిగినప్పుడే ఈ దేశానికి విముక్తి అని ఆయనతో పాటూ ఈ దేశ సౌభాగ్యం కోరుకుంటున్న వాళ్లు అందరూ భావిస్తున్నారు. దాన్ని ‘అతి’ అని కొట్టిపారేయడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అలా ప్రజలను అవహేళన చేసే తేలిక భావం పాలకవర్గాల్లో పెరిగిపోవడమే ఇవాళ రాజకీయాల్లో విలువల పతనానికి కారణం అవుతోంది. ప్రజలన్నా, వారి ఆకాంక్షలన్నా గౌరవం లేకుండాపోతోంది. అది పై నుంచి కింది దాకా అంతటా కనిపిస్తోంది.

TOP News35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ