ఎనిమిదో చాప్టరే ఇప్పడు శాసనం !


Fri,October 19, 2012 03:06 PM

చాలారోజుల కిందట సినీ నటుడు చిరంజీవి గారింట్లో ఆయన పెద్దకూతురు నిశ్చితార్థం జరిగింది. ఆయన ఆ కార్యక్షికమాన్ని తన ఇంటివరకే పరిమితం చేసుకున్నారు. ఎవరినీ పిలవలేదు. అయినా వాసన పసిగట్టిన మీడియా అక్కడికి వెళ్ళింది. వాళ్ళు లోపలికి అనుమతించలేదు. మొఖం మీదే తలుపువేసినా వదలకుండా కొందరు మీడియా మిత్రులు గోడ దూకి లోపలి వెళ్ళే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారి బంధుగణం వారికి ఉచితరీతిన మర్యాదలు చేసి అక్కడి నుంచి పంపించారు. మరుసటి రోజు పత్రికల్లో మీడియా మీద దాడి అంటూ మొదటి పేజీ కథనాలు హంగామా చేశారు. చిరంజీవి మీడియాను అవమానపరిచారని, అది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని గగ్గోలు పెట్టారు. నిజానికి అదొక ప్రైవేటు వ్యవహారం. తన ఇంటి లో విందు భోజనానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ, హక్కు ఎవరికైనా ఉంటుంది. అయినా పిలవని పేరంటానికి వెళ్లి అల్లరి చేసి, ఆనక పత్రికా స్వేచ్ఛ అంటూ రెచ్చిపోయి రచ్చ చేసిన మీడి యా ఇప్పుడు ప్రధాని పర్యటనలో మీడియాకు జరిగిన అవమానాన్ని ఖండించలేదు సరికదా అది అన్యాయం అన్నట్టు కూడా చూడడం లేదు.

ప్రధాని హైదరాబాద్‌కు వచ్చింది సొంత పనిమీద కాదు. ఆయన ప్రపంచమంతా ఎంతో గంభీరంగా చర్చిస్తోన్న జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. ఆ సదస్సులో ఆయన ఆతిథ్యం ఇస్తున్న దేశ ప్రధానిగా ఏం మాట్లాడినా ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. ప్రధాని కాబట్టి ఆయన ప్రసంగాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పత్రికలకు టీవీ చానళ్ళకు ఉంటుంది. కానీ ఆ ఆవరణలో ప్రవేశించడానికి తెలంగాణ మీడియాకు అనుమతి నిరాకరించా రు. అక్కడికి విధినిర్వహణలో వెళ్ళినవాళ్ళను అవమానించి వెనక్కి పంపించారు. ఇది అన్యాయం, అప్రజాస్వామికం అని అన్నందుకు వాళ్ళను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. అయినా ఆంధ్ర పత్రికలు ఒక్కటికూడా దీనినొక ప్రధానమైన వార్తాంశంగా చూడలేదు. అసలు ఆ వార్తకు ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. ఒక ప్రాంతానికి చెందిన వారిని, అందునా తమ తోటి పాత్రికేయ సహచరులను ప్రభు త్వం నిషేధిస్తే కనీసం స్పందించకపోవడం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీ య ఆధిపత్యానికి నిదర్శనం. ఒక ప్రాంతానికి చెందిన మీడియాను నిషేధించడం మీడియా హక్కుల సమస్య మాత్రమే కాదు. మొత్తం ఆ ప్రాంత ప్రజలను అవమానించడం. ప్రభుత్వం నిషేధించిన చానెళ్ళు, పత్రికలూ కేవలం తెలంగాణకే పరిమితమైనవి కాదు. అవి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో రిజిష్టర్ అయి న్ని ప్రాంతాల వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అందరి వార్తలు ప్రచురిస్తున్నాయి. పైగా ప్రధాని వచ్చింది హైదరాబాద్‌కు. అది తెలంగాణ గుండెకాయ. అలాంటిచోట తెలంగాణ వారిని అడ్డుకోవడమంటే ఈ ప్రాంత జర్నలిస్టులను అవమానించడం. అలాగే తెలంగాణ యాజమాన్యాలను కట్టడి చేయడం. ఇది సరిగ్గా శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌లో భాగంగా జరిగింది. ఆంధ్రా పత్రికలను, చానళ్లను మేనేజ్ చేసుకోవాలని, డబ్బులిచ్చి, వ్యాపార ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని, తెలంగాణ జర్నలిస్టులను నయానో భయానో లొంగ దీసుకోవాలని, తెలంగాణ మీడియా యాజమాన్యాలను, సంస్థలను కట్టడి చేయాలని ఆ పనికి మాలిన కమిటీలో తలమాసిన వాడెవ డో ఎనిమిదో చాప్టర్ పేరిట సృష్టించిన అదృశ్య అరాచక ఘట్టం ఇది. కోర్టు ముందు అదొక చెల్లని చిత్తూ కాగితం అని చెప్పిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ఒక రాజపవూతంగా అమలు జరుపుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది. దాన్ని ఖండించకపోవడమే ఇప్పుడు మన పత్రికాస్వేచ్ఛ పతనానికి పరాకాష్ట.

చాలా సందర్భాల్లో పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకుంటా యి. భారత రాజ్యాంగం మీడియాకు ఎలాంటి ప్రత్యేక హక్కులు, అధికారా లు ఇవ్వకున్నా తమకు తాము నాలుగో రాజ్యాంగ మూలస్తంభంగా తరచుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అది కొంత వరకు నిజమే! గడిచిన అరవయ్యేళ్ళలో పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షణలో క్రియాశీలమైన పాత్రను పోషించాయి. సామాన్యుడికి, బలహీనుడికి అండగా ఉన్నాయి. అన్యాయం జరిగిన సందర్భంలో న్యాయం వైపు నిలబడి నడిచాయి. మన రాష్ట్రంలో కూడా పత్రికలు ప్రజాపక్షం అన్న అభివూపాయం చాలావరకు ఉండింది. నక్సలైట్ల పేరుతో ప్రజలను అణచివేస్తున్నప్పుడు, బూటకపు ఎన్‌కౌంటర్‌లలో నక్సలైట్లను హతమారుస్తున్నప్పుడు, చివరకు కారంచేడు లాంటి మారణకాండ జరిగినప్పుడు కూడా పత్రికలు ప్రజాపక్షాన ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలోనే పత్రికలు కక్షగట్టి వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను ప్రజా ఉద్యమాలను శత్రు శిబిరంగా చూస్తున్నాయి. ఇది పత్రికా రంగంలో వచ్చిన కొత్త పతనానికి నిదర్శనం. ఆంధ్రవూపదేశ్ రెండుగా విడిపోయి ఉందనడానికి ఈ సంఘటన ఒక తాజా ఉదాహరణ. రాజ్యాంగంలో పేర్కొన్న మూడు వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా ఇప్పుడు ఆంధ్రవూపదేశ్‌కు ప్రాతినిధ్యం వహించ డం లేదు. మూడేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ ప్రాంతాల వారీగా విడిపోయాయి. శాసనసభ లోపల వెలుపల అన్ని పార్టీల్లో కూడాఎవరికీ వారే ఉంటున్నారు. కరుడుగట్టిన సీమాంధ్ర ఆధిపత్యంలో ఉన్న పార్ట్టీల్లో కూడా తెలంగాణ వేదికల పేరుతో వేరుకుంపట్లు వెలిశాయి. గడిచిన ఐదారు శాసనసభా సమావేశాల్లో ఏ ఒక్కరోజు కూడా ఏకాభివూపాయంతో సభ నడవలేదు. రాజకీయపక్షాలలో ఈ ప్రాంతీయ విభజన వల్లే ఏడాదిగా స్థానిక సంస్థల కు ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఒక్క శాసనసభ మినహా ఎక్కడా ప్రజావూపాతినిధ్యంలేని రాజ్యాంగ విరుద్ధమైన పాలనే సాగుతున్నది. శాసనసభ కూడా రాజ్యాంగ విరుద్ధంగా, తూ తూ మంత్రంగానే సాగుతోందన్న విమర్శలున్నాయి. ఇక రెండో మూల స్తంభంగా ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయి ఉంది. ఉద్యోగులు, అధికారులు ప్రాంతాల వారీగా విడిపోయారు.తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ అధికారుల నుంచి రోజువారీ వేతన ఉద్యోగుల దాకా స్వతంత్ర సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వానికి తమ సహాయ నిరాకరణను కూడా చవిచూపించారు. సకలజనులతో కలిసి సమ్మెలు చేశారు. మూడో మూలస్తంభామని భావించే న్యాయవ్యవస్థ కూడా నిట్టనిలువునా చీలిపోయి ఉంది. న్యాయవాదులు ప్రాంతీయ భావోద్వేగాలతో ఊగిపోతున్నారు. ఆ ఉద్వేగాల ఉప్పెనలో న్యాయమూర్తులు సైతం రాజీనామాలు చేసే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్క డా కనిపించని నాలుగో స్తంభం కూడా ‘వడపోత’ విధానానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జర్నలిస్టులను తమతమ సంస్థల నుంచి ఎరివేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పత్రికా స్వేచ్ఛను ఎలా కాపాడాలో ఉపదేశాలు చేసే సంపాదకులు ప్రభుత్వాలు తెలంగాణ మీడియా సంస్థల పట్ల సాగిస్తున్న బహిరంగ నిషేధానికి తమ మూగ సైగలతో సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి ముప్పుగానే భావించాలి.

ప్రధాని హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళిన పద్ధతి ఒక దేశాధినేత పర్యటనలా లేదు. ఒక పరాయి దేశంలోకి రహస్యంగా చొరబడిన పొరుగు దేశపు గూడచారిని తలపించింది. ఆయన కనీసం ఈ నేలమీద కాలుకూడా మోపకుండా తన పర్యటన పూర్తిచేసుకున్నారు. మన్మోహన్ ఈ దేశ ప్రధాని. ఈ దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఆయన రాజకీయ ప్రతినిధి. హైదరాబాద్ అలాగే తెలంగాణ ఆయన పాలిస్తున్న దేశంలో అంతర్భాగం. ఆయన ఎప్పుడైనా స్వేచ్ఛగా ఇక్కడికి రావొచ్చు. కానీ ఆయన వచ్చి వెళ్ళడానికి ఎంచుకున్న తీరు గౌరవవూపదంగా లేదు. ఆ పదవికే అవమానకరంగా అనిపించింది. ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాక్షిశయానికి వచ్చారు. ఆయన వెంట ఒక సీమాంధ్ర కాంట్రాక్టర్ ఆ విమానంలో వచ్చారు. ఆయన ఢిల్లీలో బయలుదేరడానికి గంట ముందే హైదరాబాద్ నగరాన్ని పారామిలటరీ దళాలకు అప్పగించి ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంవూతణలోకి తీసుకున్నారు. ఆయన బేగంపేటలో విమానంలో నుంచి ఆర్మీ సమకూర్చిన హెలీకాప్టర్‌లోకి మారారు. హైదరాబాద్ బేగంపేట విమానాక్షిశయం నుంచి సద స్సు జరిగే ప్రదేశానికి 13 కిలోమీటర్ల దూరం ఉంది. నేరుగా కారులో వస్తే ప్రధానికి పట్టే సమయం 15 నిమిషాలు. కానీ ఆయన అక్కడికి హెలీకాప్టర్ లో వచ్చారు. సాధారణంగా అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప అంత తక్కు వ దూరానికి ఎవరూ హెలీకాప్టర్ వాడరు. దారిలేని కారడవిలోనో, మందుపాతరలు ఉండే మార్గంలోనో తప్ప ఆ అవసరం రాదు. హైదరాబాద్‌లో అలాంటి అసాధారణ పరిస్థితులు లేవు. టెర్రరిస్టులో సంఘ విద్రోహశక్తులో లేరు. అలా ఉంటే ఇక్కడ అతి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగేదే కాదు. అలాంటి సదస్సుకు అధికారికంగా దర్జాగా రావాల్సిన ప్రధాని బిక్కుబిక్కుమంటూ రావడం బతుకుజీవుడా అన్నట్టు ఆఘమేఘాలమీద వెళ్ళిపోవడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది. దానికి తోడు దాదాపు ప్రధాని మళ్ళీ ఢిల్లీలో దిగేదాకా ట్రాఫిక్ నియంవూతణ అలాగే ఉండింది. స్కూళ్ళను, ఆఫీసులను మూసివేశా రు. అంతటితో ఆగకుండా హైటెక్ సిటీకి అందులో ఉన్న కంప్యూటర్ కంపెనీలకు, దేశ విదేశీ వాణిజ్య వ్యాపారసంస్థలకు ఒక్క పూట సెలవు కూడా ప్రకటించి అన్నీ మూసివేసి అప్రకటిత కర్ఫ్యూ విధించారు. సరిగ్గా మూడుగంటలు కూడా లేని ప్రధాని పర్యటనకు అనూహ్యమైన భద్రత కల్పించి ఆరుగంటల పాటు హడావిడి చేశారు. ఏ ఒక్క పత్రికా దీన్ని ప్రశ్నించలేదు. సీమాంధ్ర చానెల్స్ ఈ అవమానాన్ని ప్రశ్నించలేదు. ప్రైవేటు జీవితాల్లో చొరబడి పత్రికా స్వేచ్ఛ, తమ హక్కు అని అని దబాయించే వారికి వడపోత ఒక అవమానమని పత్రికల వ్యాపారులుగా, యజమానులుగా అది తమ హక్కు ల హననమని అనిపించలేదు. అలాంటిదేమీ జరగకుండానే జరిగినట్టు అన్ని పత్రికల్లో ప్రధాని గారి రాకతో హైదరాబాద్ నగరం పునీతమైనట్టు పతాక శీర్షికలలో మన్‌మోహనుడి ప్రసంగాన్ని ప్రచురించి ముగ్ధులైపోయారు.

సరిగ్గా ఎనిమిదో చాప్టర్‌లో సూచించినట్టుగానే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరుకుదనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధాని పర్యటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. ఆయనను ప్రధాని పల్లకీలో కూర్చోబెట్టి మోస్తోన్న ఈ రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు కనీస మర్యాద కోసమైనా ఆయన పర్యటన గురించి చెప్పలేదు. వారికి ఆహ్వానాలు పంపాలన్నా నియమాన్ని కూడా పాటించలేదు. ఇది అవమా నకరం. అది ఎంపీలకే కాదు. స్వయంగా ప్రధానికే అవమానం. పార్లమెంటు సాంప్రదాయాల ప్రకా రం ఎంపీలకుండే అరుదైన గౌరవాల్లో ఎక్కడికైనా, ఎటువంటి సందర్భంలోనైనా వెళ్ళే అధికారం కలిగి ఉండడం ఒకటి. అలా వెళ్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తప్ప అడ్డుచేప్పే అధికారం ఎవరికీ లేదు. కానీ ప్రధానిని కలిస్తే అలంటి ప్రమాదం ఏమీ లేదు. అలాంటప్పుడు ప్రధాని రాక గురించి ఎందుకని పార్లమెంటు సభ్యులకు చెప్పలేకపోయారు? ఎందుకని కనీస ఆహ్వానం కూడా పంపలేకపోయారు? ఇవి ఆ ఎంపీలు తేల్చుకోవాల్సి న విషయాలు. పార్లమెంటు సభ్యలను ఈ మధ్య ముఖ్యమంత్రి నివాసం ముందు కాపలా ఉండే చౌకీదార్ల మెడలు పట్టి నెట్టేసిన సంఘటనలు చూశాం. ఇక ప్రధానిని కలిసే పరిస్థితి వీళ్ళకు ఉందా అన్నది కూడా అనుమానమే. బహుశా అంత సీన్ లేదని భావించడం వల్లే ప్రధాని పర్యటనలో పాటించాల్సిన పద్ధతులు ప్రోటోకాల్ పాటించకపోయి ఉండవచ్చు. కానీ ఇది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే! కేవలం ఆ ఎంపీలనే కాదు వాళ్ళను ఎన్నుకున్న ప్రజలను కూడా అవమానించినట్టే భావించాల్సి ఉంటుంది.

ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడం, అనుమతులున్న ఉద్యమాలను అణచివేయడం కేసుల్లో విద్యార్థులను బంధించి భయపెట్టడం ఇవన్నీ ఎనిమిదో చాప్టర్‌లో భాగంగా జరుగుతున్నవే. ప్రధాని పర్యటనకు ముందే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్కను అక్రమంగా నిర్బంధించి జైలుకు తరలించడం, ఆమెపై అనేక కేసులు పెట్టి వేధించడం కూడా ఒక పథ కం ప్రకారం జరుగుతున్నవే. చట్టవ్యతిరేక చర్యలు ప్రభుత్వమే ఒకవైపు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలను సంఘ వ్యతిరేకులుగా, విద్రోహక శక్తులుగా ముద్రవేయాలని చూస్తోంది. కానీ విద్రోహులేవరో ఇప్పటికే తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇప్పుడు జర్నలిస్టుల పట్ల వివక్ష మూలం గా అది ప్రపంచమంతటికీ తేటతెల్లమయ్యింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారుపూవరూ ప్రధానికి అడ్డు తగులుతామని, ఇక్కడ అడుగు పెట్టనీయమ ని చెప్పలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని అదీ చట్టం అనుమతించే పద్ధతుల్లోనే చెపుతామని ప్రకటించారు. ఆ మేరకు నల్ల బెలూ న్లు గాలిలో వదులుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం, పోలీసులే ప్రధానిని భయకంపితుడిని చేశారు. గాలిలో ఎగిరే నల్ల బెలూన్‌లలో బుల్లెట్లను చూపించారు. జై తెలంగాణ నినాదాలు మందుపాతరలై మారుమోగుతాయని బెదిరించారు. పాపం దర్జాగా వచ్చి భారత ప్రధానిని దొడ్డిదారిలో రప్పించారు. అదే దారిలో పంపించారు. ఇంతకీ కిరణ్ కుమార్‌రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారో గానీ తెలంగాణవాదం హైదరాబాద్‌లో అడుగుపెట్టలేనంతగా బలపడిందని మాత్రం ప్రధానికి అర్థమై ఉంటుంది. అది చాలు. తెలంగాణలోని సబ్బండ వర్ణాల ఆకాంక్ష కోసం సంఘటితమైన తెలంగాణ జర్నలిస్టు ఫోరం పత్రికా స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడుతున్నది. ఆ పోరాటంలో తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్ష ఇమిడి ఉన్నది. దీనికి తెలంగాణ జాతి మొత్తం సంఘీభావం ప్రకటించాలి.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
[email protected]


35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ