నాటి దోషి-నేటి ద్రోహులు


Tue,August 2, 2011 03:33 PM

వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలోచించే ముందు చరిత్రలోకి చూడమంటారు. తెలంగాణ ఉద్య మ చరిత్ర ఎప్పటికైనా రోమాంచితమే. ఏ ఉద్యమానికైనా ఊపిరి అందించగల జీవమేదో ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నదనిపిస్తుంది. ఎన్నో ఉద్యమాలు తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాయి, పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు సాగుతోన్న రాష్ట్ర ఉద్యమం కూడా చరిత్ర నుంచి నేర్చుకున్న ఎన్నో వ్యూహాలను పరిణతితో ప్రదర్శిస్తున్నది. ఆ పరిణతికి తెలంగాణ విద్యావంతుల కృషి మరిచిపోలేనిది. తెలంగాణలో పుట్టి పెరిగి జీవితాన్ని అడుగడుగునా ఘర్షణలతో జయించిన తెలంగాణ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఇలా ఎవరైతేనేం ప్రతి ఒక్కరు చరిత్ర నుంచి ఎంతో నేర్చుకుని సంయమనంతో, చతురతతో ముందుకు నడుస్తున్నారు. అయితే నడవనిదల్లా ఒక్క కాంగ్రెస్ నేతలేమో! అది కూడా కాంగ్రెస్‌లోని అందరిని తప్పుపట్టడం కోసం కాదు. అలాగని తెలుగుదేశం పార్టీని క్షమించి వదిలేసినట్టు కాదు. ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో లేదు.

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లూదిన కాంగ్రెస్ ఇవాళ ఇంతగా ఎందుకు డీలా పడిపోయిందన్నది అర్థం కాని విషయం. అందరినీ ఉద్యమీకరించిన తెలంగాణ పోరాట వారసత్వం కాంగ్రెస్‌లోని కొందరికి ఎందుకని అబ్బలేదన్నది ఆలోచించాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమంలో దోషుల గురించి ద్రోహుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చాలా మంది చెన్నారెడ్డి నుంచి మొదలుపెడుతుంటారు. కొందరైతే అతనే మొదటి, చివరి దోషిగా చెబుతుంటారు. కానీ ఇప్పటి నాయకుల రాజకీయాలను, ఎత్తుగడలను గమనిస్తోన్న వారు ఎవరైనా చరిత్రను మరోసారి చదివితే చెన్నారెడ్డి చాలా చిన్నవాడనిపిస్తుంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నాయకుల్లోనైతే ఒక్కొక్కరిలో వందమంది చెన్నారెడ్డిలు కనిపిస్తున్నారిప్పుడు. చెన్నారెడ్డి చిన్న కొడుకు శశిధర్‌డ్డి సంగతే చూడండి. ఆయన తండ్రికంటే నాలుగాకులు ఎక్కువగానే చదివినట్టు నిరూపించుకున్నాడు. అయినా మిగతా కొందరు నాయకులను ముఖ్యంగా మన మంత్రులను చూసినప్పుడు శశిధర్ చేసింది దోషమేమో కానీ ద్రోహం కాదని నా అభిప్రాయం.

ఎందుకంటే రాజీనామా చేశామని చెప్పిన వాళ్లు తమ పదవులను వదలిపెట్టలేదు. పనులను మానేయ్యలేదు. పైగా ముఖ్యమంత్రికి చాలా మంది చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో గుసగుసలు పెడితే, మరికొందరు పవర్ కోసం పాయింట్ల వారీగా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. పైకి రాజీనామా చేసి చేతులు దులిపేసుకున్న అందరూ పైళ్లు చకచకా చూసేస్తున్నారు. పాలన స్తంభించకుండా సహకరిస్తున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. అసలు వీళ్లని రాజీనామా చేయమని అడిగింది ఎందుకు? పాలన స్తంభించాలని, సంక్షోభం రావాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, కేంద్రం తెలంగాణ ప్రక్రియ కొనసాగించాలని. అలా అడిగి అడిగి గడిచిన ఆరువందల రోజుల్లో ఆరువందల మందికి పైగా అసువులు బాసారు.

అంటే రొజుకొక్కరి చొప్పున మొక్కు చెల్లించుకున్నారు. అయినా వాళ్లు కరగలేదు సరికదా ఈ ప్రభుత్వం సంక్షోభంలో పడకుండా కాపాడుతున్నారు. చచరిత్రలో ఇలాంటి పని చెన్నారెడ్డి కూడా చేయలేదు. 1968-69లో చెన్నారెడ్డి ఉద్యమం నడిపించిన కాలంలో రాజకీయాలు ఇలా లేవు. ప్రజలు కూడా ఇలా లేరు. కేంద్రంలో ఇందిరాగాంధీ ఎదురులేని మహారాణి. అప్పటికే సంజీవరెడ్డి నుంచి అధికారం అందిపుచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి యువరాజై వెలిగిపోతున్నాడు. ఆ సమయంలో ఖమ్మం జిల్లాలో పిడికెడు మంది విద్యార్థులు రాజేసిన నిప్పును చెన్నారెడ్డి ఒక జ్వాలగా రాజేశాడు. దానికి ఉద్యోగులు ఊపిరూది దావానలంలా జిల్లాలకు వ్యాపింపజేశారు. అయినా అది పల్లెలన్నిటికి చేరలేదు. ప్రజలందరినీ తాకలేదు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థులు కదిలారు తప్ప ప్రజల్లో ఇప్పటిలా చైతన్యం లేకపోయింది. ఇప్పుడు ఉద్యమం తాకని ఊరులేదు.

తెలంగాణ కావాలని చెప్పని మనిషిలేడు. చిన్న చితకా పల్లెల్లో కూడా ఆరువందల రోజులకు పైగా నిరశన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండేళ్లు కంటికి కునుకులేకుండా కోట్లాదిమంది ఉద్యమాన్ని కాపాడుకుంటున్నారు. ఉద్యమకారులను కాపాడుకుంటున్నారు. రాజీనామా చేసిన నేతలకు కాపలాకాసే వాళ్లూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నారెడ్డి లాంటి నాయకులు నాటి ఉద్యమాన్ని నిర్మించారు.

తమ వెంట నడవాలని వాళ్లు ప్రజలను వేడుకుంటున్నారు. ఇవాళ ప్రజలే ఆపని చేస్తున్నారు. ప్రజలు నాయకులను తమతో కలిసి నడవమంటున్నారు. అదీ చేతగాకపోతే కనీసం సీమాంధ్ర పాలకులకు సహకరించకుండా దూరంగా ఉండమంటున్నారు. నిజానికి అప్పుడు తెలంగాణ విషయంలో ఇక్కడి నేతల్లోనే భిన్నాభిప్రాయాలుండేవి. తెలంగాణ వద్దని వాదించిన వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీలకతీతంగా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదంటే మన నేతల బలం, బలగం ఏపాటిదో అధిష్ఠానానికి అర్థమైపోయింది.

చెన్నారెడ్డి ఇలాంటి బలహీనత ప్రదర్శించలేదు. ఉన్నంతకాలం ఒకే మాటపై ఉన్నాడు. నిరంకుశంగా అప్పటి ప్రభుత్వం సాగించిన అణచివేతలకు, హత్యాకాండలకు భయపడలేదు. ఉద్యమంలో ఉరుమై నిలిచాడు. అరెస్టయి జైలుపాలయ్యాడు. చెన్నారెడ్డి ఒక్కడే కాదు. దాదాపు నలభై మంది దాకా శాసనసభ్యులు తెలంగాణ కోసం జైలుకు వెళ్లారు. చెన్నారెడ్డితో పాటు కొండా లక్ష్మణ్‌బాపూజీ, అంజయ్య, ఈశ్వరీభాయి, సిహెచ్ రాజశ్వేరరావు, శివరావు షెట్కర్ లాంటి మహామహులు పీడీ యాక్ట్ కింద శిక్ష అనుభవించారు. అప్పటి నేతల వారసుల్లో చాలా మంది ఇప్పటి సభలో ఉన్నారు. కొందరు ఎంపీలు, కొందరు మంత్రులు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. విషాదమేమిటంటే వాళ్లిప్పుడు తమ తండ్రుల చరిత్రనే తక్కువ చేస్తూ, ఇప్పుడు తాము చేసిన త్యాగం మరెవ్వరూ చేయలేదని చెప్పుకుంటున్నారు. చరిత్రలో తాము తప్ప మరెవ్వరు రాజీనామాలు చేయలేదన్నట్టుగా మంత్రులు మాట్లాడడం విడ్డూరం.

ఈ ఉద్యమంలోనే టీఆర్‌ఎస్ చేసిన రాజీనామాలను అలా ఉంచుదాం. బహ్మానందరెడ్డి మంత్రివర్గం నుంచి చెన్నారెడ్డి, బాపూజీ సహా తెలంగాణ మంత్రులంతా రాజీనామాలు చేసి చరిత్ర సృష్టించారు. అలా చేసిన వాళ్లు ఢిల్లీ దిగివచ్చేలా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, దేశ హోం మంత్రి, చివరకు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని హైదరాబాద్ రప్పించారు. నాటి ఉద్యమం చిన్నదే కావచ్చు. ఎన్నడూ మన శాసనసభ్యుల్లో కనీసం సగం మంది కూడా సమర్థించి ఉండకపోవచ్చు. కానీ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారు. ఆంధ్రా ప్రాంత శాసనసభ్యులను చివరకు ముఖ్యమంత్రిని కూడా నోరెత్తకుండా చేశారు.

అప్పటికే ఇక్కడ చేరిపోయిన వ్యాపారులు, ఉద్యోగులు చివరకు రాజకీయ నాయకులలో సగం మందిని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అంతేకాదు శాసనసభలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని నిలదీసి నీళ్లు తాగించిన ఘనత ఈశ్వరీబాయి లాంటి వాళ్లది. జైలు నుంచి వచ్చాక శాసనసభలో జరుగుతోన్న చర్చకు అడ్డుపడి ముఖ్యమంత్రిగారు అన్నీ బాగానే చెప్తున్నారు. ఈ తొమ్మిది నెలల్లో ఎంతమంది మా బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నావో కూడా చెప్పు. పాలపండ్లు కూడా ఊడనివాళ్లను పట్టుకున్నావ్ అని నిలదీసింది. కర్కశుడు అని పేరుతెచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి ఆమె ధాటికి ఖిన్నుడైపోయాడు. నిందలు వద్దంటూనే అందుకు చాలా విచారిస్తున్నాను అనగలిగాడు. ఉద్యమంలో మూడువందల మంది బిడ్డలు చనిపోతే ముఖ్యమంత్రినే నిండు సభలో నిలువరించిన ఆ తల్లి కూతురు ఇప్పుడు మన మంత్రి గీతారెడ్డి.

ఆమె ఇప్పుడు ఆరువందల మంది ఆహుతైనా అడిగే సాహసం చేయలేకపోతున్నారు. నాటి ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన అంజయ్య సతీమణి మణెమ్మ మనలో లేరు. అలాంటి వారసులే సురేశ్ షెట్కర్. పార్లమెంటుకు వెళ్లడమే తనకు ముఖ్యమని మంకుపట్టుపడుతున్నాడు. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ల వారసులు చాలా మందే ఉన్నా ఒక్కరంటే ఒక్కరికైనా ఆ వాసన వారసత్వంగా రాకపోవడం విచిత్రం.

నాటి ఇందిరాగాంధీతో మన్మోహన్‌ను మాటవరసకైనా పోల్చలేము. బ్రహ్మానందరెడ్డి బలం ముందు కిరణ్‌కుమార్‌రెడ్డిని లెక్కలోకి తీసుకోలేం. తెలంగాణలోని పది మంది ఎంపీలు పక్కకు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే కుప్పుకూలే పరిస్థితి. రాజీనామా చేసిన మంత్రులు రాజీ పడకపోయి ఉంటే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడే సందర్భం. అప్పటి ఉద్యమకారులు అనేకసార్లు తిరగబడి పార్టీ నుంచి బహిష్కారానికి, అధిష్ఠానం ఛీత్కారాలకు గురై చివరకు ప్రత్యేక పార్టీలు పెట్టుకుని ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టలేక రాజీపడిపోయారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం నిలబడి ఉంది. నేతలు ముఖ్యంగా నాటి నేతల వారసులే రాజీ పడిపోతున్నారు.
అదీ విషాదం.

-ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ