కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!


Fri,August 31, 2012 07:12 PM

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. వాన్‌పిక్ పేరుతో వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసినందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలు లో ఊచలు లెక్కబెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డతో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్‌పిక్ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్‌పిక్ వల్ల ఉపాధి కోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకా శం జిల్లా చినగంజాం మండలంలో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సమువూదాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు.

అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సమువూదాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుం ది. ఉస్మానియాలో ఎంఏ సైకాలజీ, బీఈడీ, ఎంఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నాచితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లె ళ్ళ పెళ్ళిళ్ళు చేశారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్‌పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.

ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్థితి తెలంగాణ లాగే ఉంద ని, అక్కడి సంపన్నులు తమను బతకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్‌పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూసేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించా రు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకు లు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజులపాటు ప్రకాశం, గుం టూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంధ హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్‌పిక్ విధ్వంసాన్ని కళ్ళ కు కట్టినట్టు చూపించారు.

బంగారం పండే భూములు, పుష్కలంగా నీళ్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులులేని స్థితి లో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నీరు పెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సార్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణ ప్రజలంతా ఏకబిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం? అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్‌పిక్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరిష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్‌పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏడుకొండలుకు ఫోన్ చేశాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ధ్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్‌పిక్‌ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.

జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్య మా అని ఇవాళ అక్కడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్‌పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ ’క్విడ్-వూపొ-కో ప్రాతిపదికన జరిగినవేనని సీబీఐ అంటోంది. న్యాయశాస్త్ర పరిభాషలో క్విడ్-వూపొ-కో ఆంటే బదులుకు బదులు అని. అంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కోట్లు జగన్ స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సీబీఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు.

కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిక్షిశామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్వినకొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీవీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వాన్‌పిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. అందు లో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది.అది పక్కన పెడితే వాన్‌పిక్ కోస్తా లో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.

వాన్‌పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుంటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేఖర్‌డ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచస్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్లు నెలకొల్పుతామని, పారిక్షిశామికవాడలు, ఆధునిక విమానాక్షిశయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా ఆయన కంపెనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగమేఘాల మీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరవూపాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్ఫై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అతీ భూములు, సముద్రం కోట కు గురికాకుండా చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవే టు కంపెనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రైవేటు వ్యక్తుల నుంచి, రైతుల నుంచి సేకరించుకునే స్వేచ్ఛను ఆ కంపెనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రహ్మానందరెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇంకేముం ది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని 30 వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవెన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళపాటు ఈ పనిలో తరించింది. వాన్‌పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్‌ల తో బ్రోకర్‌లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే లు, మంత్రులు కోట్లకు పడగపూత్తారు. లక్షలాదిమంది రైతులు, కూలీలు, సముద్రతీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్స్యకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్థితి వచ్చింది.

ఒక్క సీపీఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపెనీ కొనేసి ప్రతిఘటిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేశాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్బంధం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సీపీఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక ఛానెల్‌కు అధిపతి మరొక ఛానెల్‌కు పెట్టుబడిదారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్ఛను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!

నిజానికి పత్రికా స్వేచ్ఛ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబ డే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్ఛను ప్రస్తావించకపోయినా మీడియాకు స్వేచ్ఛ ఉండాలన్నది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. కోర్టు తీర్పులు చేసిన మంచి పని ఏమిటంటే మీడియా స్వేచ్ఛ అంటే పాత్రికేయుల స్వేచ్ఛ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్ఛ అని అనేక సందర్భాల్లో కోర్టులు తేల్చాయి.అంతే తప్ప యజమానుల స్వేచ్ఛ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజంలో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది.సాక్షిలో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండోవైపు ఏముందో తెలిసి వచ్చిం ది.

ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛ కిందికే వస్తుంది. ఇప్పుడు సీబీఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాఠకుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్ఛ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్ఛను హ రించినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్యవాదుపూవ రూ హర్షించ కూడదు.

అలాగే నిమ్మగడ్డ అరెస్టును పారిక్షిశామిక ప్రగతికి అవరోధమని కొందరు అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రా న్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిక్షిశామికవేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణ లో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం సృష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాదిమంది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పొట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిక్షిశామికవేత్తలేనా మనకు కావాల్సింది అన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట.

ఇప్పుడు వాన్‌పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఎమ్మా ర్, పోలేపల్లి మొదలు చంద్రబాబు హయాం నుంచి రాజశేఖర్‌డ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీద విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తా లో మొదలవుతున్న వాన్‌పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణదారుడు ఒకడే! ల్యాంకో హిల్స్, ఎమ్మార్, పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణవాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. లేకపోతే మన మాట లు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-వూపొ-కో అనే భావించాల్సి ఉంటుంది.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్ : [email protected]


35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ