ఆకాంక్షల ఆర్తరావం


Sun,July 17, 2011 05:58 AM

pranahitha-telangaana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమీ సున్నితమైన మాటల వెనుక వెక్కిరిస్తున్నది మీ వలస పెత్తనం. మీ సీమాంధ్ర బుద్ధి.
మీ నెత్తుటి జాడ. మీ నాయనా అంతే.. తెలంగాణకు మేమెప్పుడూ వ్యతిరేకం కాదని, నడిగడ్డ
దాటి నంద్యాలకెళ్ళి ఎంత దుర్మార్గంగా మాట్లాడారో?ఎంత క్రౌర్యంగా తెలంగాణను
బెదిరించారో? యాది మరువలేము కదా! జగన్ . న్యాయం ఒకటే ఉంటుంది. ధర్మం కూడా.
చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధతలు కూడా ఒకటే ఉంటాయి. రెండు కళ్ళుంటాయి. అవి ఒకే చూపు
చూస్తాయి. కానీ మీ సోదరుడు చంద్రబాబు లాగా ఒక కన్ను కోస్తాంధ్ర వేపు మరో
కన్ను తెలంగాణ వేపు ప్రసంరించడం సాధ్యం కాదు గాక కాదు.


jagan-telangaana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమృత్యువుకు ఒక గొంతు కనుక ఉంటే మీరు నా మృత్యురావాల కన్నా బిగ్గరగా
నా ఆకాంక్షల ఆర్తరావాలను విని ఉండేవారు- జాన్ల్ఫ్రో అవును. మృత్యువుకిక్కడ గొంతే లేదు. ఒక అనంతంగా సాగే మృత్యు ఘోష. మిస్టర్ జగన్. నీకీ మృత్యు ఘోష వినపడనే లేదు. శీతలంగా భయం వ్యాపించినట్టుగా , చావు నిలు కమ్ముకున్న ప్రపంచంలో రుద్రవీణగా జీవిస్తున్నది తెలంగాణ. ఏం చెప్పమంటావ్. తెలంగాణ సున్నిత సమస్య ఏమీ కాదు. అది నెత్తురు మరకలంటిన మానుకోట రాయి కన్నా కఠినమైనది. నువ్వొక వేపు రెండు కళ్ళ సిద్ధాంతం కన్నా హీనంగా తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని ప్రకటిస్తున్న వేళ మరోవేపు .. రుతువు తప్పని ఆత్మహత్యల జాడ వెక్కిరిస్తున్నది. తెలుసా! జగిత్యాల ప్రాంతం రాయికల్ మండలం ఆలూరులో ప్రవీణ్ రెడ్డి గొంతులో పొడుచుకొని మృత్యు రహస్యం విప్పాలనుకున్నాడు. తెలంగాణ కోసమే. నోవా కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం . గర్ల్ ఫ్రెండో,గాడ్జెటో , ఎస్సెమ్మెస్సో, ట్వీటో?, ఫేస్‌బుక్కో, జీనో, టీషర్టో...తమన్నాయో. ఫ్యాషనో, పవన్ కళ్యాణో ఆలోచించే ఇప్పటి తరం వాడే సందేహం లేదు. సమస్య ఏమిటంటే, మిస్టర్ జగన్, అతను తెలంగాణను సున్నితమైన సమస్య అనుకోవడం లేదు. అది నెత్తుటి బాకీ సమస్య అనుకున్నాడు. హింసకు తావు లేదంటున్నది కదా ఉద్యమం.

శాంతియుతంగా గాంధీ పద్ధతుల్లో జరగాలి కదా! ఉద్యమం. కర్రలేదు గొర్రె కూడా కరుస్తున్నది. మీడియా విషం మెదడులో సరసరా నెత్తురు కాసారమై రగులుతున్నది. ఏం చేయమంటావు జగన్. అతను తనను తాను హింసించుకున్నడు. నిజానికి తెలంగాణ ఇప్పుడు తనను తాను హింసించుకుంటున్నది. పెద్దమ్మలోళ్ళు ఛెర్నాకోలతో కొట్టుకుని రక్తాలు కార్చుకుని హింసించుకున్నట్టుగానే.. తెలంగాణ తనను తాను హింసించుకుంటున్నది. ఏ జాతికీ ఇంతటి దుస్థితి రాకూడదు పుణ్యాత్ములారా! మీరు మీమీ రాజకీయాల్లో, మీమీ ప్రణాళికల్లో, మీమీ వ్యాపార సామ్రాజ్యాల పరిరక్షణల్లో సున్నితమైన మాటలు మాట్లాడుతున్నరు కానీ. అవి అంత సొబగుగా లేవు. మీ సున్నితమైన మాటల వెనుక వెక్కిరిస్తున్నది మీ వలస పెత్తనం. మీ సీమాంధ్ర బుద్ధి. మీ నెత్తుటి జాడ. మీ నాయనా అంతే.. తెలంగాణకు మేమెప్పుడూ వ్యతిరేకం కాదని, నడిగడ్డ దాటి నంద్యాలకెళ్ళి ఎంత దుర్మార్గంగా అడ్డం,పొడుగూ మాట్లాడారో?ఎంత క్రౌర్యంగా తెలంగాణను బెదిరించారో? యాది మరువలేము కదా! జగన్ . న్యాయం ఒకటే ఉంటుంది. ధర్మం కూడా. చట్టబద్ధత , రాజ్యాంగ బద్ధతలు కూడా ఒకటే ఉంటాయి. రెండు కళ్ళుంటాయి. అవి ఒకే చూపు చూస్తాయి. కానీ మీ సోదరుడు చంద్రబాబు లాగా ఒక కన్ను కోస్తాంధ్ర వేపు మరో కన్ను తెలంగాణ వేపు ప్రసరించడం సాధ్యం కాదు గాక కాదు. నీదీ అంతే. చావు శబ్దాల ముందు ఆకాంక్షల ఆర్తరావాలు వినపడని మీ మొత్తం రాజకీయ నాయకుల లాగే.. ఇది సున్నితమూ, సెంటిమెంటూ , గాడిద గుడ్డు .. ముందు తేనె పూసిన రెండు సానుభూతి మాటలు. ఆనక నెపం కాంగ్రెస్ అధిష్ఠానం పైకి.. అలిసి పోయింది తెలంగాణ. తెలంగాణ ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నది.

నువ్వు ఇటా?అటా? నీది ఏ చూపు. ఏ వినికిడి. ఆకాంక్షల గొంతు వినిపించుకుంటావా? లేదా?అది రాజ్యాంగ బద్ధమైనదా? కాదా? అది న్యాయమైనదా? కాదా? నువ్వు బరాబర్ తెలంగాణ అడుగుతున్నవా? లేదా?గోడమీది పిల్లినిసులభంగా కనిపెట్టగలదు తెలంగాణ. తనను తాను హింసించుకోగలిగిన తెలంగాణ. నిప్పుల గుండంలో ధూలా ఆడుతూ పుటం పెట్టిన లోహమయి పదును దేరిన తెలంగాణ నీ మాటల మర్మాన్ని గుర్తించగలదు. దానికిప్పుడు ఆరు దశాబ్దాల గాయాలు నేర్పిన లోచూపు ఉంది. కాపోతే జ ‘గన్’ కు రెండు బ్యారెళ్ళున్నాయని అని ఓట్లకు గురిపెట్టి తెలంగాణ కు సానుభూతి వచనాలు, తేనెపూసిన మాటలను కురిపిస్తుందని , మరో బ్యారెల్ ద్వారా రాజ్యాధికార తంత్రాన్ని కురిపిస్తుందనీ తెలుసు. రెండు బ్యారెళ్ల ‘గన్’ లను కనిపెట్టగలదీ తెలంగాణ. అవునూ చెప్పడం మాత్రం మరవడమెందుకు? తెలంగాణకు అన్ని తుపాకులూ తెలుసు.పేలేవీ, పేలనివి, అన్నీ తెలుసు. ఏం చెయ్యమంటారు. జగన్.. మీరు ఆజాదూ గొంతుతో మీరు చిదంబరం గొంతుతో, ప్రణబ్ ముఖర్జీ గొంతులో నుంచి మాట్లాడినట్లే సున్నితం’ అంటిరి. ఏం చెయ్యమంటరు. పుణ్యాత్ములారా! చచ్చేవాళ్ళు చచ్చిపోతున్నారు. మృత్యువు అంతిమంగా తనను తాను కోల్పోయి ఓడిపోయిందిక్కడ ఇన్నాళ్లకైనా ఇప్పటికైనా... మృత్యువు గొంతుక కన్నా .. బిగ్గరగా వినబడిన ఆకాంక్షలు మా గడ్డ మీద 141 మంది.. అక్షరాలా నూటా నలభై ఒక్కమంది ప్రజావూపతినిధుల రాజీనామాలనిచ్చింది. ఉన్నదా చరివూతలో.. సాధ్యమా.. రాజీనామాలు కూడా ఆషామాషీకాదు. ఆమోదించుకోవడానికి వీలుగా... స్పీకర్ ఫార్మాట్‌లో ..మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఏ పార్టీ అని చెప్పాలి. బద్ద శత్రువులైన కాషాయ ఎర్రరంగుల వాళ్లు కూడా ఒకే ఒక ఆకాంక్ష కోసం ఒకే రాజీనామా పోరాటం చేసిన అరుదైన, అపురూప క్షణాలు.. తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎవరు మిగిలారు. ఒక రాజకీయ, సామాజిక డిమాండ్ కోసం ఆరుదశాబ్దాల కల కోసం, అణిచివేత పీడన, దోపిడీ అవహేళన, విధ్వంసం అయిన బతుకులు బాగు పడడం కోసం తెలంగాణ ఇప్పడు ఒకే ఒక ఆత్మ . ఒకే ఒక గొంతు ఒకే ఒక నినాదం. ఒకే ఒక ఊరేగింపు.

గంపగుత్తగా ఒకే ఒక రాజీనామా.. ప్రజాస్వామ్యంలో ఇంకేం చేయమంటారు.తెలుసా? రాజీనామాలు కూడా మమ్మల్ని మేము హింసించుకోవడమే. మా బంద్‌లు, మా ధర్నాలు, మా నేతల ఇళ్లమీద విసిరిన పేడ ముద్దలు, మా నాయకుల చింపేసిన అంగీలు.. ఒక్క సారి కూడా మేం మీ జోలికి రాలేదు. మీ వార్తకు రాలేదు. ఏం చెయ్యమంటరు. తెలంగాణ. దునియా ఎట్లున్నది. పదవిని పట్టుకొని వేలాడే నేత ఎందుకు? ఇవ్వాళ్ల రాజీనామా కాయితాన్ని మీ ముఖాల మీద విసిరేస్తున్నడు. లక్షల మంది చిన్నా, పెద్ద పిల్లలు రోడ్ల మీద కవాతు చేసి తెలంగాణ సంద్రమయిండ్రు.బందంటే చీమ చిటుక్కు మనక? ఎందుకు స్వచ్ఛం దంగా మూల గల్లీలో ఉన్న కిరణాషాపు కూడా ఎందుకు? మూతపడ్డది. ఎందుకు?ఒక దుఃఖంలో, సంస్మరణలో, బాధా తప్త హృదయాలలో ఉండాల్సిన వారు జయశంకర్ సారు పార్థివ దేహాన్ని మోస్తూనే.. శత్రువు మీద గురిపెట్టి రాయి విసిరారు. తెలంగాణ ఇంకెంత మాత్రం సహించదు కనుకే మా రాజకీయ నేతలు ఈ స్వరం అందుకున్నారు. అర్ధం చేసుకోవల్సింది. మీరే .. మిస్టర్ .. జగన్ ఇకచాలు.. నువ్వూ , చందబాబు, నువ్వూ లగడపాటి, నువ్వూ, అంతర్జాతీయ వ్యాపారవేత్తా ఒకటే. రెండుకళ్లో, రెండు బ్యారెళ్లో,ండు చెవులో? ఇక చాలు.. గోడ మీద పిల్లులను పసిగట్టే పులుల కన్నగడ్డ తెలంగాణ. అదింకెంత మాత్రం సున్నితమైందీ? సుకుమారమైందీ...సెంటిమెంటూ... కాదు. అదొక ఉప్పొంగుతున్న ధాత్రి .. వెల్లు ముంచక తప్పదు. జగన్ నువ్వూ తెలంగాణలో కొట్టుకపోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.

-- అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

country oven

Featured Articles