నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త


Wed,May 18, 2016 03:34 AM

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు. తిప్పికొట్టింది తెలంగాణ. నోట్ల కట్టలు పుట్టలు పుట్టలై, చివరికి ఒక పార్టీ లంగరెత్తేసి, బెజవాడ కృష్ణా ఒడ్డున 30 వేల ఎకరాల కలల్లో తేలియాడుతున్నది. ఆ బాబుది ఇప్పుడిక్కడ నామమాత్రపు ఉనికి, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు తాళమే వేసుకుంటాడో, కాలేజీ నడుపుతాడో కానీ ఒక్క నోటు దెబ్బకు ఆయన అబ్బా అన్నడు. మరో బాబిప్పుడు నిద్రలేచాడు. అక్కడ అధికారంలోకి రాలేదు. వచ్చేదాకా ఓపిక లేదు. ఈ లోపున పార్టీ ఖాళీ అయ్యింది. ఇప్పుడాయన నీళ్లమీద నాట్యానికి ప్రయత్నం చేస్తున్నాడు. 8 అయిపోయింది. ఇప్పుడిక నీళ్లు. నియామకాల కుట్రలు విద్యుత్ సౌధలో ఆంధ్రుల అడ్డాల స్థాపన ప్రయత్నాల్లోనే ఉన్నది. ఇంతకీ ఈ ఆంధ్ర బాబులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు ఇది చౌకబారు రాజకీయ ఎత్తుగడలు మాత్రమేనా? అవగాహన రాహిత్యమా? కాదు, కాదు. అహంభావ ఫలితం. అది మాత్రమే కాదు ఆధిపత్య భావజాలం. నీటి పారుదల అంటే మన మెదళ్లలో ఒక భూతాన్ని కూచోపెడ్తారు. అది ఆంధ్ర, అన్నపూర్ణ, డెల్టా, ధవళేశ్వరం. అంతే డెల్టా కు నీరు పారితేనే, ధవళేశ్వరం దిగువన సస్యశ్యామ లం అయితేనే ప్రపంచం బతికి ఉన్నట్టు.

అదీ హక్కు భుక్తం అయినట్టు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఈ కుట్రలు చేశారు. అజ గళాల్లాంటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి నీటి పారుదల ప్రాజెక్టులలో వేల కోట్లు ముతమైపో యి, మాటలు నీటి మూటలైన చరిత్ర గతం. అసలు ఆంధ్రా బాబులే అంత. సరే ఆయన వెళ్లిపోయారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉండవల్లి, చంద్రబాబు, పరకాల లాంటి వాళ్లు తెలంగాణకు అడ్డం తిరిగి ఇవ్వాళ్ల చరిత్ర హీనులయ్యారు. కిరణ్ అయితే ఆయన కరెం టు సిద్ధాంత కిరణాలు ఆయన ఉనికినే ఆర్పేశాయి. ఎందుకిట్లా ఉంటారు?
ముందునుంచి ఒక ఆధిపత్యం ఎందుకు వస్తుం ది? తెలంగాణ సమాజం మాట్లాడుతున్న దానికీ, ఆచరిస్తున్నదానికీ మధ్య ఉన్న సామీప్యత, ఆంధ్ర నాయకత్వం, అన్నిరకాల, అన్ని పార్టీల, సంస్థల నాయకత్వం మాటలకు, చేతలకు మధ్య ఎందుకు లేదు? తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతదని భయభ్రాంతులను చేసింది ఆంధ్ర నాయకత్వం. కానీ తెలంగాణ సమాజం వందల సంవత్సరాలుగా కొనసాగించిన గంగా జమునా తెహజీబ్ అనే సమభావన సంస్కృతిని పాటించింది. హైదరాబాద్‌లో ఉం డే ఆంధ్ర, రాయలసీమ ప్రజలను భిన్నంగా, వేరుగా చూడనుకూడా చూడలేదు. విద్వేష భావనలో ఒక్కటంటే ఒక్క సంఘటనా జరగలేదు. కానీ గవర్నర్ గిరీ కానీ, తెలంగాణలో మీడియాపై దాడి కానీ, ఇవా ళ్ల చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి అందరూ ఒక్క టే గొంతుతో మాట్లాడుతున్న నీటి సమస్యలు కానీ వాళ్లు ఒక విద్వేషం కోసం ప్రయత్నిస్తున్నారు. నిజంగానే ఒక మానుకోట అని హెచ్చరించడం మంత్రి హరీష్‌రావు తప్పు కాదు. నిజానికి ఆ తప్పు నీటిలో నిప్పు వెదుకుతున్న జగన్‌ది.

జగన్ రక్తనాళాల్లో ప్రవహించేది వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నెత్తురే. పోలికా ఉంటుంది. స్వభావం కూడా వుంటుంది. తరం అంతరం కనుక జగన్‌ది దుడుకుగానూ, దుందుడుకుగానూ ఉంటుంది. వాళ్ల నాయ న ఎన్నికల సభలు హైదరాబాద్ స్టేట్‌లో పూర్తయినంక నంద్యాలకు మారేసరికి అలనాడు స్వరంమార్చి, తర్జని చూపి, గొంతుపెంచి, హైదరాబాద్ పోవాల్నంటే వీసా కావాలా? అని విద్వేషం కక్కిం ది. ఇప్పుడు జగన్ అదే హైదరాబాద్ గుండా వెళ్లే వంతెన నడిగడ్డ దాటి కర్నూలులో జలదీక్ష చేసి పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకంగా హిట్లర్ అనేంత నోటి దురద ప్రదర్శిస్తున్నాడు. ఈ స్వభావం ఎక్కడిది? ఒకరాష్ట్ర ముఖ్యమంత్రిని, స్వీయ రాజకీయ అస్తిత్వ సందర్భంలో హిట్లర్ అం టే చెలరేగే భావోద్వేగాల పర్యవసానాలకు ఎవరు బాధ్యులు? అయినా ఈ ఆధిపత్యం, అహంకారం ఎక్కడిది?

పేరుకు జలదీక్ష. కానీ అది ఆధిపత్య దీక్ష. పొరుగు రాష్ట్రంలో ఉనికి పూర్తిగా ధ్వంసమవుతున్న వేళ, స్వంత రాష్ట్రంలో క్యూలు కట్టి పార్టీ నుంచి పరారై పోతున్నవేళ, తనను తాను కాపాడుకోవడానికి, పార్టీ ని, ఉనికిని కాపాడుకోవడానికి జగన్ నిప్పును ముట్టుకున్నాడు. ఆయన పెద్ద తప్పు చేస్తున్నాడు. నీరెప్పుడూ నిప్పే. అది ఒక్క టీఎంసీ అయినా ప్రజ ల్లో అగాధాలు సృష్టించి, అగడ్తలు ఏర్పరిచి పది టీఎంసీల మానవ నెత్తురు పారించగలదు. ఇప్పుడు జగన్ ఆ ఇంగలం మీద కాలుపెట్టారు. కూలుతున్న గద్దెల్లో ఆయన అహంకారం కూడా కూలిపోవడం ఇప్పటి పర్యవసానం.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోతిరెడ్డిపాడు సంగతులు మాట్లాడినప్పుడల్లా రాయలసీమ మిత్రు లు కొందరు మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అనేవారు. వారి గొంతులో యూ టూ బ్రూటస్ అన్నట్టు ధ్వనించేది. లెక్కలు, గణాంకాల వివరాలు, క్యూసెక్కులు, టీఎంసీలు అని చెబితే వాళ్లొక మాట అడిగేవారు. పెన్నా, జీవితంలో ఎప్పుడూ పూర్తిగా పొర్లిపారని నదిని నమ్ముకొని, రాయలసీమ రైతాం గం, కనీసం నీటి వసతిలేని అనంతపురంతో కూడిన రాయలసీమ బతికేదెట్లా? అన్నది వాళ్ల ప్రశ్న. కొంత న్యాయమే అనిపించినా, పోతిరెడ్డిపాడు అనేది ఒక అక్రమ వెడల్పు అని వాళ్లు కూడా అంగీకరించకపో తే ఇక న్యాయం ఎక్కడిది? ఎన్ని టీఎంసీలు అన్నారు. తెలుగు గంగ పేరిట ఎన్ని టీఎంసీలు తీసుకుంటున్నారు. ఎంత ప్రవాహం ఎన్ని క్యూసెక్కులు పెంచారు. ఇదంతా చెయ్యడానికి నీటి మట్టాల నిల్వ ల రాజకీయం ఎంత చేశారో? అందరికీ తెలు సు. కానీ నిజాలు చెప్పి, మహబూబ్‌నగర్ అరిగోస, కాలొంకర, కన్నొంకర నల్గొండ ఫ్లోరైడ్ పీడ సంగతి మాట్లాడితే ఇది అన్యాయం అనిపిస్తే ఎట్లా? ఇప్పు డు రాయలసీమ వాసులు, సీమకు ప్రత్యేక హక్కు లు అడుగుతున్న వాళ్లు, తెలంగాణ ఉద్యమం నుంచి సానుభూతి కోరుకుంటున్నవాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. తెలంగాణలో ఉన్న వాటాను సద్వినియోగం చేసుకోవడానికి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ఒక్క చుక్కకూడా ఇతరుల నీరు వాడుకోకుం డా, రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్ల ఆమోదం కూడా పొంది, దత్తత తీసుకున్నప్పుడు కనీసం సానుభూతి మాటలకన్నా నోచుకున్న మహబూబ్‌నగర్, నల్లగొండల నీటి గోసను, శోకాలను తీర్చే పాలమూరు ఎత్తిపోతలకు అడ్డు కట్టడానికి కొంగ దీక్షలు చేస్తున్న జగన్ మీ సీమకు అసలుకే ఎస రు పెడుతున్న సంగతి ఇప్పుడు అడిగితే, అడిగి కడిగితే మంచిదని ఓ విన్నపం. రాయలసీమకు అన్యా యం చెయ్యడానికి, కృష్ణా, గుంటూరు, గోదావరి తప్ప మరేది కనిపించని జగన్, చంద్రబాబు, రఘువీరారెడ్డి ఎవరైనా ఒక్కటే. వాళ్ల మెదళ్లలో ఆంధ్ర, అన్నపూర్ణ, డెల్టా భూతం కూచొని ఉన్నట్టే. నాగార్జునసాగర్ దిగువన డెల్టా తర్వాత, ప్రకాశం బ్యారేజీ దాటుకొని సముద్రం పాలయ్యే కృష్ణమ్మ, ధవళేశ్వ రం దాటుకుని సముద్రం పాలయ్యే గోదావరి పైన కేటాయింపుల మేరకు ప్రాజెక్టులు కట్టుకుంటే కడుపునొప్పి ఏమి?

పోతిరెడ్డిపాడు ఆధారిత ప్రాజెక్టులకు ఎవరి ఆమో దం ఉన్నది. ఏ జల సంఘం, ఏ ట్రిబ్యునల్, ఏ కేం ద్రం, ఏ బోర్డు, ఈ ప్రాజెక్టులకు అనుమితిచ్చింది. అంతెందుకు గోదావరి దిగువన పోలవరానికి ఇప్పటికి కూడా అన్ని అనుమతులున్నాయా? మధ్యలోనే కట్టిన పట్టిసీమకు ఎవరు పట్టా రాసిచ్చారు. వీటికి లేని అనుమతులు? తెలంగాణలో నీటి కేటాయింపులకు అనువుగా కట్టుకునే ప్రాజెక్టులకు ఎందుకు అవసరం అవుతాయి. ఇది కడుపుమంట కాదా?

తెలంగాణ ఉద్యమం ట్యాగ్‌లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల గోస ఇవ్వాల్టిది కాదు. ఎగువన చెరువు పూడిక తీసినా, దిగువన ధవళేశ్వరానికి నీరె ట్లా? అని అడిగేవాళ్లని, ఎగువన చిన్న ఎత్తిపోతల ప్రణాళిక వేస్తే దిగువన నాగార్జున సాగర్ ఎడమ కాలువ కాదు. కుడికాలువ ప్రవాహం ఎట్లా? అని అడిగే వాళ్లనుంచి విముక్తి అయ్యింది తెలంగాణ. గోదావరి, కృష్ణ నీళ్లు అంతరిస్తున్న వేళ, రుతుపవనాలు గతి తప్పుతున్న వేళ, వాతావరణాలు కరువు ను శాశ్వతం చేస్తున్న వేళ, తెలంగాణ గోసంతా బోరుబావుల్లో, నీళ్లింకిన బావుల్లో, పళ్లాల రూపానికొచ్చిన ధ్వసంమైన చెరువుల్లో, కరెంట్ ఇంజన్‌లో విధ్వంసమైంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఈ నీటి పారుదల వ్యవస్థల పునరుద్ధరణే. అందుకే ప్రాణహి త అయినా, కాళేశ్వరం, మేడిగడ్డ అయినా, అందుకే పాలమూరు ఎత్తిపోతలు అయినా. అందుకే కేసీఆర్ కళ్లకు కళ కట్టిన జలాల, ప్రాజెక్టుల రీ డిజైనింగ్. అది ఫలవంతమైతేనే తెలంగాణకు జలకళ. ఆ ప్రాజెక్టులు పారితేనే తెలంగాణకు జల జీవం. లేదంటే తెలంగా ణ అరిగోస చెప్పతరం కానిది. భవిష్యత్ కూడా అం ధకారం లాంటిది. అందుకే ఒక రాష్ట్రం కోసం ఉమ్మ డి అస్తిత్వంతో కొట్లాడిన తెలంగాణ, ప్రాజెక్టుల నిర్మాణంలో నీళ్ల సమస్యను, తరతరాల మోసాలను తిరస్కరించి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేసి కోటి ఎకరాలకు జలం అనే ఒక కల కంటున్నది. అది కేసీఆర్ కల. అది తెలంగాణ ప్రభుత్వ కల. అది తెలంగాణ సమాజం కల. అది తెలంగాణ రైతాంగం కల. ఆ కల ను చిదమడానికి ఒక బాబు అనుమతులు లేవని ఢిల్లీలో చేసే ఫిర్యాదులు, వేసే నిందలు, మరో బాబు దొంగ దీక్షలు, మరో బాబు సన్నాయి నొక్కులు ఇంకానా ఇక చెల్లవు. నీరుతో జాగ్రత్త. అది నిప్పులా మండుతుంది. ఉద్వేగాలను రెచ్చగొట్టేవాళ్లు జాగ్రత్త. నీరులేని తెలంగాణ నిప్పైనప్పుడు తట్టుకోలేరు. అలనాడు మొండిగా మానుకోటకు కారకుడైన జగన్ ఇవ్వాళ్ల నీటితో చెలగాటమాడవద్దు. ఇప్పుడు దిమ్మె లు మాత్రమే కూలుతున్నవి. తర్వాత....
(వ్యాసకర్త: ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ)

1123

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles