బలుపు పనికిరాదు..జర జాగ్రత్త


Sun,June 15, 2014 01:22 AM

allamకుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల్నీ విసిరేస్తుంది తెలంగాణ. జాగ్రత్త. జాగ్రత్త. తెలంగాణ అనే నిప్పుతో చెలగాటం మంచిది కాదు. భవిష్యత్ మాదే. మీరు కొంచెం మర్యాదగా ఉంటే మంచిది.

బొడిగె శోభ ఒక దళిత స్త్రీ. ఒక ఎమ్మె ల్యే. దళాల్లో తిరిగిన మాజీ. సామాన్యురాలయిన శోభ కొంత చైతన్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజల సమస్యల వెంట తిరిగింది. బొడిగె శోభ తెలంగాణ స్త్రీ. ఉద్యమంలో ముందు నిలిచింది. కేసీఆర్ అరెస్టయినప్పుడు ఆ తర్వాత తీవ్రంగా స్పందించింది. కేసీఆర్‌కు గుర్తుండిపోయింది. ఉద్యమానంతరం ఆరు దశాబ్దాల కల సాకారమయింది. కేసీఆర్ శోభకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.

బాల్క సుమన్‌కు అనుకున్న టికెట్ పోరాడి శోభ సాధించుకున్నది. గెలిచింది. ప్రజాస్వామ్యం, ఓట్ల పతనపు విలువలు, ఎన్నికల కంపు, పలుకుబడి, ప్రతిష్టలనన్నింటినీ ఎడమ చేతి చిటికెన వేలుతో పక్కకు తోసి, గత కాలపు క్షీణ విలువలను తొక్కి బొడిగె శోభ అసెంబ్లీకి చేరింది. ప్రమాణ పత్రం చదువుతూ నాకు భయమైతంది అన్నది. నాకెందుకో దిగులు కలిగింది. నాకెందుకో చెమ్మ గిల్లింది. నాకెందుకో పట్టరాని సంబురమేసింది. నాకెందుకో ధైర్యం కలిగింది. ఇప్పటి నా హీరోయిన్ బొడిగె శోభ. తెలంగాణ ఉద్యమం సాధించిన గొప్ప విజయం ఇది. ఒకవేళ తెలంగాణ ఉద్యమమే లేకపోతే, అది సాకారం కాకపోతే బొడిగె శోభ ఎమ్మెల్యే కాదు. కానీ... శోభ భయాన్ని వెకిలిగా చిత్రించిన మీడియాకు ఎంత మదం. ఎంత దురహంకారం. ఎంత మిడిసి పాటు.

టూరింగ్ టాకీస్‌ల పాత సినిమాలను సూశెటోళ్లను పట్టుకచ్చి మల్టీఫ్లెక్స్‌ల హాలీవుడ్ సినిమా సూపెడితె ఎట్లుంటది ఇగో ఇట్లనే ఉంటది అంటది మదమెక్కిన మీడియా. మనుషులకు, ప్రవర్తనలకు సున్నితత్వాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. మనసూ ఉంటుంది. అవి స్పందిస్తాయనే కనీస స్పహ కొరవడిన మదం మీడియాది. ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఏదయినా చెలామణి అవుతుంది. ప్రమాణ స్వీకారం ఎపిసోడు కూడా కామెడీ కామెడీ అయిందట. కోట్లు కొల్లగొట్టినోళ్లు, లంగలు, లఫంగులు, దొంగలు, తెల్లబట్టలేస్కోని లోపట దొంగ దందాలను దాచుకునే క్రూరులు, నేరస్తులు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ మాటలు చదువుతుంటే కామెడీ అనిపించలే.

పాశికల్లు తాగెటోనికి ఫారెన్ మందు ముందలబెట్టినట్లే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కథ. ఇంత పరాకాష్ట. ఇంత వికతమా? పాశికల్లు తాగెటోడు మందిని ముంచడు. రెండెకరాలోడు వేలకోట్ల అధిపతి కాలేడు. వేల కోట్లా? లక్షల కోట్లా ముంచిందెంత? మూడగట్టుకున్నదెంత? తేలక జైలుకు పోడు. ఓటుకు అయిదువేలిచ్చి గెలిచొచ్చి పదివేలు సంపాదించడు. ఎవని పాశికల్లు వాడే తాగుతడు. కష్టపడి సంపాదించిన పది రూపాలు రొండి నుంచి తీసి ఇసిరిపారేసి బాజాప్తా తాగుతడు.

ఫారెన్ విస్కీ తాగెటోడు మంది రక్తం తాగుతడు. వాడు ముద్దుగా అనిపించి పాశికల్లు తాగెటోడు చట్టసభలో అడుగుపెట్టేందుకు అంటరానివాడిగా, కనిపించే మీడియాలో కుళ్లు పేరుకుపోయింది. తొలగించవలసిన విషం పేరుకుపోయింది. హేల్ ప్రొలటేరియట్. అవును ఉత్త మట్టి కాళ్లతో అసెంబ్లీ తివాచీల మీద మరకలు పడేలా తొక్కుకుంటూ నాట్యం చేసి పాటలు పాడే రసమయి బాలకిషన్‌లే నిండుతరు. ఒక రోజొస్తుంది. ప్రపంచం తలకిందులయ్యే రోజు. కపటం, దురన్యాయం, దౌర్జన్యం, దోపిడీ దొంగల స్థానంలో కల్లా కపటమెరుగని మట్టి మనుషులు నిండే రోజొకటి వస్తుంది. గుర్తుంచుకోండి. అప్పుడు మీ టీవీలు భళ్ళున బద్దలవుతవి. మీ అచ్చోసిన అచ్చులు చెల్లా చెదురవుతవి జాగ్రత్త.

లంగోటి కట్టుకునెటోనికి లాప్‌టాప్ ఇస్తే మడిశి ఏడ్నో పెట్టుకున్నరంట ఎంత మదం బలిసి కొట్టుకుంటే ఈ మాటలు రాసినవాడు ఒకడు మీడియాలో ఉండగలడు. ఎంత దురహంకారం లేకపోతే. తెలంగాణ అంటే ఎంత లేకి, చులకన భావం లేకపోతే ఈ మాటలను ప్రసారం చేసిన బాధ్యుడొకడు మీడియాలో కొనసాగుతడు. ఏమి వికతమిది. ఇది మామూలు అంశం కాదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. ఇదెట్లా రూపుదిద్దుకుంటున్నదో? ఎంత పాతుకుపోయిందో? విగ్రహ విధ్వంసంలా దీన్ని విధ్వంసం చెయ్యకపోతే తెలంగాణ వచ్చినా ఎట్లా మనం మన రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ గడపవలసి ఉంటుందో? ఆలోచించాల్సింది మనం. స్పందించాల్సింది మనం. సర్దుకొని, సవరించాల్సింది మనం.

రాంగోపాల్ వర్మ అనే ఒక ఒంటరివాడు. తను తప్ప మరే ప్రపంచమూ లేదనుకునేవాడు. హైదరాబాద్ అంతటా అందగాని పోస్టర్లని ట్వీట్ చేస్తడు. పవన్ కళ్యాణ్ అనే చంచలుడు తాటతీస్తా అంటడు. ఒక టీవీ వాడు నీ సిలుము మొఖం ఎప్పుడన్న అద్దంల చూసుకున్నవా? అని అంటడు. ఏమి అహంకారం ఇది. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి, కొట్లాడి, గెలిచి, ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి, మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ అవమానం. ఎక్కడిదీ ధైర్యం. ఎవడిచ్చిండు వీళ్లకీ హక్కు. అసలు ఎవరు వీళ్లు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. తెలంగాణ బానిసలు కొందరు ఇచ్చిన అండతో, కీలుబొమ్మలు కొందరు శత్రు శిబిరాల్లో దూరి దొంగలకు సద్దులు మోస్తుండడంతో, కొందరు రాజకీయ బానిసలు, కొందరు మీడియా బానిసలు, కొందరు తొత్తులు ఆంధ్ర చిలుకపలుకులు పలుకుతుండడంతోనే ఇంతా జరుగుతున్నది. ప్రతిఘటన కావాలి. తప్పదు.

ఇప్పుడు ఇది తెలంగాణ. మన రాష్ట్రం. ఖబడ్దార్ అని చెప్పగలగాలి. దళిత వ్యతిరేకత, పేదల పట్ల విముఖత, పెద్దలు, దోపిడీ దొంగలు, రాబందుల లాంటి సీమాంధ్ర పెత్తందారుల పట్ల ప్రేమ, ఇదీ మీడియా అవలక్షణం. దీన్ని అరికట్టకపోతే, మొదట్లోనే తుంచకపోతే.... ఎప్పుడన్నా మీ మీ నాయకుల మొఖాలు అద్దాల్లో చూయించగలరా? అని అడగవలసే ఉన్నది. నిలువెల్లా మూర్తీభవించి ఇంకిపోయి, నరనరానా జీర్ణించుకున్న ఆంధ్ర దురహంకార, ఆధిపత్యం నశించాల్సిందే. లేదా?....
తెలంగాణ ఉద్యమం సాధించిన ఫలం సామాన్యుడు చట్టసభల్లో అడుగుపెట్టడం. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనక కూచున్న నల్ల సూర్యుడి లాంటి గాదరి కిశోర్. అతనొక విద్యార్థి నాయకుడు.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముంగట శిబిరాల్లో ప్రసంగాలు చేస్తూ, క్యాంపస్‌ను కాగడాగా వెలిగించిన వారిలో ఒకడు. బాల్క సుమన్ ఏకంగా ఢిల్లీ పార్లమెంటులో తేలినవాడు. గుర్తున్నదా? మెట్‌పల్లి నుంచి వచ్చిన ఈ దళితుల పిల్లవాడి నెత్తికి పడ్డవి పదకొండు కుట్లు. ఉస్మానియాలో లాఠీచార్జి చేసి, దౌర్జన్యంగా, క్రూరంగా ప్రవర్తించి ఉద్యమానికి పరోక్ష ఊపునిచ్చిన స్టీఫెన్ రవీంద్ర చేతిలో లాఠీకి, తలకాయ అడ్డంపెట్టినవాడు బాల్క సుమన్. పీహెచ్‌డీ స్కాలర్. రాజకీయ కుటుంబం నుంచీ, వేల కోట్ల కంపెనీకి అధిపతి అయిన, స్వయంగా తెలంగాణ కోసం కొట్లాడే తత్వం కూడా కలిగిన వివేక్‌ను ఓడించి, పార్లమెంటులో అడుగుపెట్టడం మాటలు కాదు.

వివేక్‌కు వేల కోట్లు ఉంటే.. నాకు వందల కేసులు ఉన్నవి. అని ప్రకటించి మరీ గెలిచి వచ్చినవాడు. ఆర్ట్స్ కాలేజీలో పూసిన మోదుగుపూలు వాళ్లు. ఒక గువ్వల బాలరాజు, ఒక రేఖా నాయక్, ఒక రసమయి బాలకిషన్, ఒక బూర నర్సయ్యగౌడ్, ఒక సాదాసీదా ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఒక శ్రీనివాస్ గౌడ్, ఉద్యమంలో వికసించిన వజ్రాలై పాటలు పాడి, ధూమ్ ధామై, మోర్చాలు కట్టి, లాఠీలు మింగినవాళ్లు. ఉద్యమం వీళ్లను చట్టసభలకు నడిపించింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యం మీద దేశ ప్రజలు కోల్పోయిన ఒక నమ్మకాన్ని కొంతన్నా మళ్లీ పాదుకొల్పింది. అవును గర్విస్తున్నది తెలంగాణ. ఒక రంధి. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అసెంబ్లీలో కూచుంటే తెలంగాణ ఉద్యమం పొడవునా ఒక ప్రేరణగా నిలిచిన శ్రీకాంతాచారి కూచున్నట్టే ఉండేది. ఆమె గెలిస్తే దుఖ్కం తీరేది. కానీ అడ్డం పడ్డది కొందరు. అదొక్కలోటు.

అవును మధుసూధనాచారి మా నల్ల పొద్దు. ఏ శాసనసభలోనైతే తెలంగాణ పదం నిషేధించిన స్పీకర్ స్థానం దురహంకారానికి, ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచిందో? ప్రతీక అయిందో? ఆ ప్రతీకను, చిహ్నాన్ని తారుమారు చేసి కూచున్నడు మా తెలంగాణ స్పీకర్. వీళ్లు మీకు పాశికల్లు తాగెటోళ్ల లెక్క కొడితె మాకు పొడిచిన పొద్దు ల లెక్క అగుపడుతున్నరు.

తెలంగాణ ఉద్యమం మిమ్మ ల్నీ, మీ ఆధిపత్యాలను బండ కు సరిసికొట్టి, మీమీ కుళ్లు, దోపిడీ, పీడన రాజకీయ నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టించి నిలిచిం ది. గెలిచింది. జాగ్రత్త. కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరి స్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల్నీ విసిరేస్తుంది తెలంగాణ. జాగ్రత్త. జాగ్రత్త. తెలంగాణ అనే నిప్పుతో చెలగాటం మంచిది కాదు. భవిష్యత్ మాదే. మీరు కొంచెం మర్యాదగా ఉంటే మంచిది.

[email protected]

1614

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...