వలస విముక్త తెలంగాణ


Sun,May 25, 2014 12:31 AM


ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ఈ ఉద్యమానికి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నాయకత్వం వహించడం ఇప్పటి భరోసా. ఒక భవిష్యత్ మీద ఆశ... పొద్దింకా పొడవలేదు. పోరాటం ఆగలేదు. వలస విముక్త తెలంగాణ రూపుదిద్దుకోవడం ఇప్పటి మన తక్షణ నినాదం.

కాబోయే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల సంఘాల సమావేశంలో తెలంగాణలో ఒక్క ఆంధ్ర ఉద్యోగి ఉండడు. ఆప్షన్‌లు లేవు. కిరికిరిపెడితే కొట్లాటకైనా సిద్ధమే అని అనడం ఊహించినమా? ఊహ సరే! ఇప్పుడు అనుభవించినం. తెలంగాణ రావడమంటే అదే. తెలంగాణ వస్తే ఏమి మారుతది? ఐమాక్స్‌ను కూల్చి ఇండ్లు కడ్తరా! ఏం మారుతది అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడిది అనుభవంలోకి వస్తే తెలంగాణ వస్తే ఏమవుతుందో? అర్థం కావలసే ఉన్నది. తెలంగాణ రావడం అంటే స్వీయ రాజకీయ అస్తిత్వం రావడం. స్వయం నిర్ణయాధికారం రావ డం. చిత్తూరు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డో, చంద్రబాబునాయుడో? కడప జగనో? సెక్రటేరియట్‌లో కొలువుదీరిన ఆంధ్రబాబులో కాకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం...ఆయన ఏర్పరచుకునే తెలంగాణ బాబుల బందం సెక్రటేరియట్ నడిపించి తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులు మాత్రమే ఉండాలని తేల్చిచెప్పడం. తెలంగాణ అవతరణ దినోత్సవం రాకముందే ఈ అనుభవం కేసీఆర్ కరాఖండీగా తేల్చిచెప్పిన అంశాల ప్రభావం సంబురం కలిగిస్తున్నది. మన రాష్ట్రం. మన ముఖ్యమంత్రి.

మన పాలన. అంతిమంగా మనకే నిర్ణయాధికారం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ఆకాంక్షల్లో ప్రధానమైనది ఇదే. ఇంటిపార్టీ అవసరం కూడా ఇప్పుడు తేలింది. తెలంగాణ ఓటర్లు ఎంత విజ్ఞులో? కేసీఆర్‌కే వాళ్లు ఎందుకు పట్టం కట్టారో? కూడా ఈ అయిదారు రోజుల పరిణామాలు తేల్చాయి. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్షల వెల్లడి. వలస ఆధిపత్యంపై దండయాత్ర. ఒక యంత్రాంగంగా పెత్తనం చేసిన సీమాంధ్ర ఏలికలు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, నిర్ణయాధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మన ప్రాంతంలో మనల్నే పాలితులుగా చేశారు. రాజకీయ ఆధిపత్యం ద్వారా పాలకులైన సీమాంధ్ర పెత్తందారీవర్గం ఇక్కడి వనరులను దోచింది. ఉద్యోగాలను కొల్లగొట్టింది. సీమాంధ్ర పెత్తందా ర్ల ప్రయోజనాల కోసం అంతర్గత వలస పెత్తనం సాంస్కతిక అణచివేతను సాగించింది. నీళ్లు, నిధులు దోచింది. అంతిమంగా తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది. సీమాంధ్ర పెత్తందార్ల ప్రయోజనాల కోసం తెలంగాణ పొరకపోడైంది. దీన్నుంచి పుట్టిపెరిగి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షగా మొలకెత్తి, వక్ష మై చివరకు తెలంగాణ ఉద్యమం విజయం సాధించింది.

ఆ విజయం ఏమి ఇస్తుందో? ఇవ్వాళ్ల అనుభవంలోకి వస్తున్నది. ఒక అస్తిత్వ పోరాటం పొందిన చైతన్యం భవిష్యత్తులో వలస లక్షణాలను, ప్రతీకలను వదిలించుకుని వలస విముక్తి ప్రాంతంగా ఆవిష్కతం కావడానికి తరతరాల అణచివేత, పీడన, ఆధిపత్యాలు అంతరించేందుకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నాంది పలుకుతున్న సందర్భం ఇది.. ఇది మొదటి మెట్టు. భిన్నంగా ఆలోచించే, ఆశించేవారు కోరుకునే ప్రజా తెలంగాణో, ప్రజాస్వామ్య తెలంగాణో? సామాజిక తెలంగాణో? సరే. సుదూరలక్ష్యాలు. అంతకుముందే స్వీయ రాజకీయ అస్తిత్వం వలస విముక్త తెలంగాణను ఆవిష్కరించే ఎజెండాను చేపట్టడం ఒక కీలక మలుపు. తెలంగాణకు భావి ఎజండా, తక్షణ ఎజండా ఇదే..

నారా చంద్రబాబునాయుడు ఆంధ్రలో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకున్న మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి సొంత మెజారిటీతో వచ్చింది. దేశం మోడీ మంత్రం జపిస్తున్నది. మోడీలో ఏకకాలంలో దేవుడినీ, నియంతనూ, ధీరోదాత్త నాయకుణ్నీ, దేశా న్ని పూర్తిగా మార్చగలిగే మహాశక్తిమంతుడిగా చూస్తున్నది. తోడు వచ్చీరాని మాటలతో, ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియని పవన్ కల్యాణ్ అసంగతంగా, అసందర్భంగా తెలంగాణ అనుకూలుడి ముసుగులో పచ్చి తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నడు. వలస పెత్తనపు ఆనవాళ్ల ను కాపాడే ఒక ముఠాగా ఈ కూటమి అవతరించనున్నది.

చంద్రబాబు నాయుడు మాటలే ఇందుకు నిలువుటద్దం. చంద్రబాబుకు, భారతీయ జనతాపార్టీ కూటమికి హైదరాబాద్ శివార్లలో వచ్చిన పదిహేనూ చిల్లర స్థానాలు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ఓటర్ల వల్ల వచ్చినవి. వారి ద్వంద్వ ఓటు ఒక సమస్య అయితే, పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రయోజనాల పరిరక్షకుడిగా అవతారమెత్తిన చంద్రబాబు కూట మితో ప్రభావితమైన ఓటర్లుగా ఇప్పటికే తయారయ్యారు. అది భవిష్యత్ ప్రమాదధోరణి. ఆధిపత్యం అంతరించాలంటే ఎంత కటువుగా, అప్రమత్తంగా ఉండాలో ఈ ముఠా మనకు తేల్చిచెప్పింది.

తెలంగాణలో 2019 నాటికి మేమే అధికారంలోకి వస్తాం అని ప్రకటించారు చంద్రబాబు. అంతటితో ఊరుకోలేదు. భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ర్టాలనూ కలిపేస్తామని కూడా ప్రకటించారు. దీనివెనక హిడెన్ ఎజెండా ఏమిటి? రెండు రాష్ర్టాలు విడిపోయినాక చంద్రబాబు తెలంగాణలో అధికారంలోకి రావడం ఏమిటి? దీనికి హైదరాబాద్ బయట నియోజకవర్గాల్లో గెలిచిన ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. పొరుగు రాష్ట్రం నాయకుడి పార్టీ మన రాష్ట్రంలో అధికారంలోకి రావడమనే అసంగతమైన మాటల మూలాలు చంద్రబాబు ఆధిపత్య ధోరణిలో ఉన్నవి. ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న అపార సంపదల మీద ప్రేమ, ఆయనతో పాటు ఆయన కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం, సామాజిక వర్గాలు సంపాదించిన అపరిమిత ఆస్తుల మీద మమకారం ఉన్నది. దానితోపాటు ఇక్కడి సెటిలర్లు ఇక్కడ బతకడం కాదు. ఎన్నికల వ్యవస్థలో ధనబలం, ఇతరేతర ప్రభావాల ఆధారంగా ఆంధ్ర వలస పెత్తనం కొనసాగించాలనే లోతైన కుట్ర ఉన్నది.

స్వయంగా చంద్రబాబు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తూ, ఈ అస్తిత్వ పోరాటం సాధించిన విజయాన్ని కించపరుస్తూ మాట్లాడి.. ఉల్టా కేసీఆర్, కోదండరాంలు ఉద్యోగ సంఘాలు ప్రజలను రెచ్చగొడ్తున్నారని ప్రచారం లంకించుకున్నారు. ఈ ప్రచారానికి ఆజ్యం పోసి అందించే మీడియా కూడా అట్లాగే, ఎప్పటిలాగే మళ్లీ మేకింగ్ ఆఫ్ మహాత్మాలో ఉన్నది. కట్టని రాజధాని, పెట్టని కోటల ప్రణాళికల సొగసైన క్రెడిట్ ఇప్పటికే ఆపాదిస్తూ చంద్రబాబును కీర్తిస్తున్న ఆంధ్ర మీడియా పనిలో పనిగా మోడీనీ ఆకాశానికి ఎత్తుతున్నది. ఇదీ పొంచి ఉన్న ప్రమాదం. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రికార్డు కాలం పనిచేసిన చంద్రబాబుకు వార్ రూమ్ అంటే ఏమిటో తెలియదా? వార్ రూమ్ అంటే వార్ అనుకునేంత అల్పజ్ఞానియా? కాదు. కానీ ఆయన తనకు వచ్చిన పదిహేను సీట్లను, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మనసులో పెట్టుకుని, అవమానకరంగా తెలంగాణను రెచ్చగొడ్తూ, ఎదుటి వారిని రెచ్చగొడ్తున్నారని మాట్లాడుతున్నారు. అదీ సమస్య.

తెలంగాణ బిల్లు పాసైనాక, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల్లో తెలంగాణ కోసమే ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది, పూర్తి మెజారిటీ సాధించి అధికారం స్వీకరిస్తున్న వేళ కూడా తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ఒక ఆంధ్రుడి మీదా చిన్న సంఘటనా జరగలేదు.

అది తెలంగాణ అనుసరించిన పోరాట స్ఫూర్తి. విద్వేషము, ప్రాంతీయ మౌఢ్యమూ దరికి రాకుండా సంయమనంతో, శాంతితో వ్యవహించిన తెలంగాణ ఉద్యమస్ఫూర్తి. అట్లా వార్‌రూమ్ అంటే యుద్ధం కోసమే అయితే ఎవరాపగలరు? చంద్రబాబుతో అతిపెద్ద సమస్య ఆయన ద్వంద్వ ప్రవత్తి. ఆయన ప్రచారం చేసుకుంటున్నదానికి, ఆయన అనుసరించిన విధానాలకూ మధ్య ఉన్న పెద్ద గండి. తెలంగాణలో మహామహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను మూతేసి, హైదరాబాద్‌ను నేనే అభివద్ధి చేశానంటాడాయన. ఇక్కడి ఉపాధిని దెబ్బతీసి, ఉపాధి కల్పించింది నేనేనంటాడు. ఈ వైరుధ్య ప్రవర్తన వల్ల తెలంగాణ ఆయనను ఎన్నడో? ప్రతినాయకుడిగా, తమకు సంబంధించనివాడిగా నిర్ధారించుకున్నది. అది ఆయనకు అర్థం కాదని కాదు. స్వయంగా రెచ్చగొడుతూ... తెలంగాణ నేతలను తనను రెచ్చగొట్టారని అంటాడాయన. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు? దాంట్లో తప్పేముంది? అవును సెక్రటేరియట్‌లో చక్రం తప్పితె కుదరదని గోరటి వెంకన్న చెప్పిన విషయం ఆయన అధికారంలోకి వచ్చిండు కనుక అమలుపరుస్తానంటున్నాడు.

allam తప్పా? తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులను పెట్టుకొని పని జరుగుద్దా? కాన్ఫిడెన్షియాలిటీ సంగతేమిటి? అసెంబ్లీలో తొంభైమంది ఆంధ్రోళ్లను పెట్టుకుని ఏమి నడిపించాలె కుదురు ద్దా? అయినా తెలంగాణ ఉద్యమం జరిగింది 1969 లోనైనా 1996 నుంచైనా కొలువులు కొల్లగొట్టినందుకు కూడా కదా! కటువుగా ఉన్నా వాస్త వం ఇంతేకదా! ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ లో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయం గా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ఈ ఉద్యమానికి మన రాష్ట్రం లో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నాయక త్వం వహించడం ఇప్పటి భరోసా. ఒక భవిష్యత్ మీద ఆశ... పొద్దింకా పొడవలేదు. పోరాటం ఆగలేదు. వలస విముక్త తెలంగాణ రూపుదిద్దుకోవడం ఇప్పటి మన తక్షణ నినాదం.

[email protected]

1186

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles