ఉద్యమమూ...రాజకీయమూ..


Sun,May 11, 2014 12:32 AM

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సాధ్యమా? అన్నది భవిష్యత్ ప్రశ్న. సమస్యలు చాలా ఉన్నాయి. పూర్తి విముక్తికి అవరోధాలు ఉన్నాయి. కానీ నిలబడడానికి ఇంకా ఉద్యమమూ ఉన్నది.

తెలంగాణ పొద్దుపొడవడానికి దశాబ్దాల ఎదురుచూపుల్లో తరతరాల అగులుబుగులు ఉన్నది. మనసున పట్టని సుదీర్ఘ రాత్రు లూ... నిరీక్షణలో ప్రాణంలా ఆశ, నిరాశల ఊగిసలాటలో తరాలే తల్లడిల్లినవి. బలిదానాలు, ఆత్మత్యాగాలే కాదు. గుండ్లకు గుండెలనొడ్డిన ధీరోదాత్త ఉద్రిక్త కాలాల గుండా తెలంగాణ సమాజం పయనించింది. తరాలు వశపడని క్షోభను, క్రోధాన్ని, దుక్కాన్నీ, ఉద్వేగాలను అనుభవించాయి. తెలంగాణ తూర్పు తెల్లారింది. కానీ... కానీ.. దశాబ్దాలుగా ఎదురుచూసిన తర్వాత ఆ కలను కనుల నిండుగా నింపుకుని కరువుదీరా ముచ్చట్లాడుకునే సమయమే దొరకలేదు. కలబోసుకుని కలకల నవ్వుకునే క్షణాలూ లభించలేదు. ఏ పట్టుదలలు, ఏ అంకితభావాలు, ఏ కార్యాచరణలూ, ఏ పథకాలు ఏ నిర్మాణాలు ఈ తెలంగాణ సాధించాయో! ఏ చైతన్య స్థాయి వికసించి, గతం నుంచి నిర్మించుకున్న వర్తమానం సుదీర్ఘ స్వప్నాలను నిజం చేసిందో? ఆ చైతన్యం భవిష్యత్ తెలంగాణకు ఎట్లా భరోసా అవుతుందో? ఆలోచించుకునే ఉద్యమ మథనాలూ జరగలేదు. ఇప్పుడు తెలంగాణ అతి సాదాసీదాగా, ప్రతి ఐదేండ్లకూ వచ్చే ఎన్నికల రుతువు కోసం ఏండ్ల తరబడి ఎప్పటికీ ఒక్కలాగే జరిగే ఓట్ల ఫలితాలను గురించి ఎదురు చూడవలసి రావడం ఒకింత కష్టమైనదీ... క్లిష్టమైనది కూడా...

దశాబ్దాలు ఎదురుచూసిన తెలంగాణ కల సాకారమైన అనంతరం స్వల్ప విరామం కూడా ఇవ్వని ఎన్నికల కాలం ఇవ్వాళ్ల మరి అయిదు రోజుల్లో వెలువడే ఫలితాల గురించి ఎదురుచూడడంలా పరిణమించడమే ఇప్పటి సమస్య. చాలామంది ఇట్లా ఆలోచించినవారే. కారణం ఒక్కటే ఉద్యమ సంస్కతి వేరు సగటు ప్రధాన స్రవంతిగా చెలామణి చేసుకుంటున్న రాజకీయ సంస్క తి వేరు కావడమే అసలు కారణం.

ఉద్యమం ఒడిసిపోయి ఫలితం వచ్చిన వెంటనే, పార్లమెంటులో బిల్లు పాసయిన మరుక్షణమే కేసీఆర్ ఒక కీలకమైన మాట అన్నారు. విజయోత్సవంగా మీడియాతో అన్ని విషయాలూ మాట్లాడి న కేసీఆర్ మధ్యలో ఇక నుంచి టీఆర్‌ఎస్ ఉద్యమపార్టీ కాదు. ఫక్తు రాజకీ య పార్టీ అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ క్షణాన దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. కానీ అది యధాలాపంగా అన్నమాట కాదు. టీఆర్‌ఎస్ పార్టీ ఆ తర్వాత వ్యవహరించిన తీరు, కేసీఆర్ ఆ తర్వాత ఎన్నికల పోరాటానికి తన పార్టీని సమాయత్తపరిచి, మళ్లించి అమలు చేసిన ప్రణాళికలు, వేసిన ఎత్తుగడలు, బిల్లు పాస్ కాకముందే ఈ రాజకీయ ప్రచారం కోసం చేసుకున్న తయారీలు, వ్యూహాలు, చివరికి ఏ పథకాలూ బాగుంటాయో? ముందే నిర్ణయించుకున్న తీరు ఇవన్నీ పరిశీలిస్తే కేసీఆర్‌కు అప్పటికే ఒక స్పష్టత ఉన్న ది. ఆ స్పష్టతతోనే ఆయన మాట్లాడారు. ఉద్యమపార్టీకి కొన్ని పరిమితులుంటాయి.

నైతికత, విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు, వ్యవహరణ, ప్రజలతో సంభాషణ అంతా వేరుగా ఉంటుంది. ఉద్యమ అవసరాలరీత్యా ఇతర ప్రజాసంఘాలు, జేఏసీలు, చివరికి తెలంగాణ కోసం కలిసివచ్చే పార్టీల పట్ల వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. ఉద్యమ లక్ష్యాల మేరకు పని విధానం ఉంటుంది. ఉద్యమ లక్ష్యాలు సహజంగానే విశాలంగా, ఉత్కష్టంగా ఉంటా యి. కానీ ఒకపరి ఉద్యమం కాదు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నాక ఇవ్వాల్టి సగటు రాజకీయాల్లో ఉన్న చెత్త, ఇవ్వాల్టి సగటు రాజకీయ సంస్కతిలో పరివ్యాపించి ఉన్న దుర్గంధం, డబ్బు పాత్ర, అన్నీ ఉంటాయి. ఆ సగటు రాజకీయ సంస్కతికి ఒక సమ్మతి సాధన కోసమే కేసీఆర్ ముందుగానే మాదిక ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. అంటే బారాఖూన్ మాఫ్ అనే అర్థంలోనే దీన్ని చూడాలి. అంటే టీఆర్‌ఎస్‌ను ఉద్యమ ప్రమాణాలతో చూస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ రాజకీయ పార్టీలాగా, ఇవ్వాల్టి రాజకీయ సంస్కతిలో భాగంగా చూస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిపైనా ఒక స్పష్టత ఏర్పడుతుంది.

మ్యానిఫెస్టో తయారీలో భాగంగా కేసీఆర్ ప్రతికా సంపాదకులతో ఘంటా చక్రపాణి ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశం విలువైనది. పైన నేను చర్చించిన విషయాల చర్చ కొంత అప్పుడు జరిగింది కూడా. కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి లాంటి వాళ్ల చేరిక, ఉద్యమంలో ఏర్పడిన, స్థిరపడిన విలువల పతనం, ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్‌కు ఉన్న పలుకుబడిని తగ్గించిందా? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీతో విలీనం అటుంచి కనీసం పొత్తు కూడా పెట్టుకోకుండా ఉండడం అనైతికం కాదా? ఈ నైతికత, విలువల తీర్పు పార్టీ ఎన్నికల ప్రభావాన్ని తగ్గించదా? ఇట్లా అనివార్యమైనప్పుడు, ఎవరినైనా చేర్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఇట్లాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు బయటి విమర్శలను తగ్గించుకోవచ్చు కదా! అని సంపాదక మిత్రులు సరిగ్గా నే అడిగారు. కానీ ఈ మీమాంసలు, విలువలు అన్నీ ఉద్యమాలకు సంబంధించినవి.

లేదా ఉద్యమాలతో సహవాసం చేసి, శాశ్వతంగా వీధుల్లో నిలబడి, జీవితకాలపు ప్రతిపక్షంగా, ఉద్యమాలకు, ప్రత్యామ్నాయ పోరాటాలకు ప్రతీకలయిన వారివి. టీఆర్‌ఎస్ ఏర్పాటుకు ముందుకానీ, అనంతరం కాలంలో కానీ కేసీఆర్ వ్యవహరించిన తీరు, నిజంగానే ఈ ఉద్యమంలో కలిసి పనిచేసినవారు అంతకు ముందరి వామపక్ష మేధోజీవుల భావజాలాల ప్రతినిధుల తీరుకు మధ్యలో ఒక అంతరం ఎప్పుడూ ఉన్నది. కానీ ఉద్యమం ముందుకుపోవడానికి ఒక రాజకీయవేత్తగా రాజకీయ ప్రయోజనాల పట్ల కూడా క్షణక్షణం అప్రమత్తత ప్రకటించే కేసీఆర్ ఉద్యమంతో కలిసి నడిచారు. అట్లానే ఉద్యమం కూడా... రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ ఎట్లున్నప్పటికీ, దాని బలహీనతలు దానికి ఉన్నప్పటికీ ఉద్యమ సంస్థలు కూడా ఆ పార్టీని తెలంగాణ ఏకైక పార్టీగానే భావించాయి.

అదేక్రమంలో ఆ పార్టీ ఫక్తు రాజకీయపార్టీగా మాత్ర మే ఉండదని, ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించింది కనుక ఆ చైతన్యాన్ని కొనసాగించడానికి అందరితో కలిసే ఉంటుందని, ఉద్యమాన్ని అందులోంచి ఎదిగివచ్చిన నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకుని ప్రత్యామ్నాయ రాజకీయపార్టీగా ఎదుగుతుందని ఆశపడిన వారు, భంగపడినవారూ ఉన్నా రు. టికెట్ల కోసం పడిగాపులు పడినవారు, అవి రాక ఆశాభంగం చెంది, కాంగ్రెస్ వద్ద క్యూలు కట్టినవారు, అదీ కాదనుకుంటే భారతీయ జనతాపార్టీ అయినా సై అనుకున్నవాళ్లు ఇలాంటి వాళ్లే.

వాళ్లకు టీఆర్‌ఎస్ పార్టీగా అది సగటు రాజకీయ సంస్కతినే పాటిస్తుందని, ఎన్నికల పోరాటానికి రోమ్‌లో రోమన్ గానే వ్యవహరిస్తుందని అర్థం చేసుకోకపోవడం టీఆర్‌ఎస్ తప్పు ఎంత మాత్రంకాదు. నిర్బంధ శిబిరం లాంటి తెలంగాణలో ఉద్యమం రావ డం అంత సులభంగా లేని కాలంలో, టీఆర్‌ఎస్ పార్టీ నిశ్చయంగా పరిమితులతో కూడిన కార్యాచరణ ద్వారానే, రాజకీయ ప్రక్రియ లాబీయింగ్‌ల ను, ఒత్తిడి రాజకీయాలను ప్రచారంచేస్తూనే తెలంగాణలో మళ్లీ కొంతమేర కైనా ప్రజాస్వామ్యం పాదుకోవడానికి ఒక ప్రేరణ అయ్యింది. అణచివేతల తెలంగాణలో క్రమక్రమంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛలు పరిమితంగా అమలు కావడానికి టీఆర్‌ఎస్ ఒక బలమైన సాధన అయింది. ఆ పార్టీ ఏర్పడకుండా ఉంటే తెలంగాణలో అనంతర కాలంలో ఉద్యమం జరిగినప్పుడు నిర్బంధం వేరేగా ఉండేది. అది మనుషులను మింగేసేంత, మాయం చేసేంత క్రూరంగా, తీవ్రంగా ఉండేది. అది ఒప్పుకోవలసిన వాస్తవం.

చాన్నాళ్లుగా కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలు వేస్తుండడంలో భాగంగానే ఈ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొన్నారు. దేశంలో మొత్తం దొరికిన డబ్బు, మద్యంలో మన రాష్ట్రంలో దొరికింది 56 శాతం. డబ్బు ప్రభావం ఈ ఎన్నికల్లో వీరంగం వేసి అతి ముఖ్యమైన అంశం అయింది. డబ్బున్నోళ్లు, ఉద్యమానికి చెరుపు చేసినవాళ్లు లేదా వ్యతిరేకులయినా సరే టీఆర్‌ఎస్ చేర్చుకుని చివరి నిమిషాల్లో టికెట్లిచ్చింది.

కానీ ఉద్యమకారులని కాకుండా గెలుపు గుర్రాలనే ఎన్నుకోవడం కానీ, అన్ని సగటు రాజకీయ పార్టీల్లాగే ఎలక్షనీరింగ్ అంతా అదే పద్ధతుల్లో జరపడం కానీ సంక్షేమం ఎరవేసి ప్రజలను ఆకర్షించడం కానీ ఈ ఫక్తు రాజకీయ సంస్కతిలో భాగంగానే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ స్వయంకతాపరాధాలు, కోల్పోయిన చొరవ, యుద్ధానికి ముందే జబ్బలు జారేసి ఓటమిని కోరితెచ్చుకున్న తీరు కానీ, ముతక పద్ధతులు కానీ, కేసీఆర్ చాతు ర్యం, శ్రమ ముందు నిలవలేకపోవడం కానీ టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ స్వభావం వల్ల ఏర్పడినవే. ఇప్పుడు 60 కాదు డ్బ్భై, తొంభై వచ్చినా రావచ్చ ని ఇప్పటికే ఫలితాలు ప్రకటి స్తూ టీఆర్‌ఎస్ ప్రకటి స్తున్న ధీమాకూ అదే కారణం. ఎవరి ది విజయమో, ఎవరిది వీరస్వర్గమో ఎదురు చూపులక్కరలేదు. తెలుస్తూనే ఉన్నది.

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసు ల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటే స్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సాధ్య మా? అన్నది భవిష్యత్ ప్రశ్న. సమస్యలు చాలా ఉన్నాయి. పూర్తి విముక్తికి అవరోధాలు ఉన్నాయి. కానీ నిలబడడాని కి ఇంకా ఉద్యమమూ ఉన్నది. ఆ ఉద్యమమూ కొనసాగాలి. భవిష్యత్ ఉద్యమం వచ్చే ప్రభుత్వాలకు ఒక చెక్‌గా ఉండాలి. ప్రతిపక్షంగా ఉండాలి. అప్పుడే దశాబ్దాలు ఎదురుచూసిన తెల్లవారి వెలుగు నిలుస్తుంది. లేదంటే ఉద్యమమే మిగులుతుంది. తప్పదు. ఉద్యమ చైతన్యం ఊరికే పోదు. అది గతి క్రమానికి వ్యతిరేకం.

[email protected]

1223

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...