ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు


Sun,May 4, 2014 01:59 AM

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు.

శేఖర్ చెయ్యి పువ్వు వలె సుతిమెత్తగా ఉన్నది. కరస్పర్శ శీతలంగా ఉన్నది. కార్టూ న్లు వేసిన కరవాలం లాంటి చెయ్యి శేఖర్‌ది. కడుపు క్యాన్సర్ కోతతో ఖాళీ అని చెప్తున్నపుడు నిండా స్పహతోనూ, పూర్తి చైతన్యంతోనూ, కాలం గడుస్తూ ఉన్న కొద్దీ పదునుదేరుతున్నట్టు అతని మనసు మాత్రమే మిగి లి ఉన్నది. అదింకా రంగుల మంకెనపూలను కలగంటూ ఉన్నట్టున్నది. వినీవినపడకుండా ఉన్న లోగొంతు మాటలోనూ శేఖర్ ఒక విషయం మాత్రం సూటిగా చెప్పాడు. ఇట్లా ఒక ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే మంచిగుంటున్నది. పనిచేస్తున్నప్పుడు మాత్రమే దిగులుపోతున్నది. ఆ పని మీదనే మనసు కొట్టుకుంటున్నది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు రెండు మూడు గంటలకన్నా వశపడుతలేదు అన్నడు శేఖర్.

శేఖర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు. అంతకుముందు ప్రజాశక్తి, ఆంధ్రప్రభ కార్టూనిస్టు. అంతకుముందు పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థి. అంతకు ముందు ఒక కులంలో పుట్టినందుకు వివక్షకు గురయినవాడు. జీవితం పొడవునా ఆ వివక్ష మూలాల శోధన కోసం చదివినవాడు. జీర్ణించుకున్నవాడు.

పీజీ తర్వాత చదువుతో వచ్చే ఉద్యోగాలకేసి కన్నెత్తి కూడా చూడకుండా రంగుల కలల లోకంలోకి తేరిపార చూసి రంగుల్లో మునిగినవాడు. జీవితమంటే దుక్కమూ, బీభత్సమూ, రౌద్రమూ, వెటకారమూ, వ్యంగ్యమూ, అంతిమంగా పోరాటమూ అని తెలుసుకున్నవాడు కనుకనే ఒక క్రో క్విల్, ఒక బ్రష్షు, ఒక ఒక కుర్చీ, కింద చెత్తబుట్ట, కొన్ని రంగులు, అన్నింటికి మించిన మనసులో కదలాడే సప్తవర్ణాల కదలికలతో శేఖర్ కార్టూనిస్టు అయ్యాడు. అచ్చం నల్లగొండలో వత్తి కులాల మూలాల నుంచి వచ్చిన పుట్టెడుమంది చిత్రకారుల్లాగా... ఏలె లక్ష్మణ్‌లాగా, శ్రీధర్, నర్సిమ్, శంకర్, మత్యుంజయ్, లింగరాజు, అవినాష్, రవినాగ్‌ల లాగానే కుంచెను ఎత్తిపెట్టి సమాజాన్ని కకావికలుగా కలియబెట్టే పనికి దిగాడు శేఖర్. అతనిప్పుడు అచ్చంగా నలభైవేల కార్టూన్ల పొగరుబోతు. అంతమాత్రమేనా? నల్లగొండ నుంచే ఎదిగివచ్చిన వత్తి కులాల నుంచి ఎగిసిపడి వచ్చిన రంగులు, శోభవర్ణితాలు, సాంచెలు, కలనేతలు, మట్టిని మలిచిన వత్తి కులాల మూలధాతువైన సజనాత్మకతను నిలువెల్లా నింపుకున్నవాడు శేఖర్.
రాజకీయ కార్టూన్ల కాలానికి ప్రతినిధి. ఒక్క మోహన్, ఒక్క సురేంద్రల నుంచి రాజకీయ కార్టూన్ల వరవడిని దిద్దుకుని దినపత్రికల ప్రథమ పుటల ఐ మూలాల్లోకి చేరుకుని ఏండ్ల తరబడి ముద్రలేసినవాడు శేఖర్. అతని చెయ్యిప్పుడు భయం గొలిపేంతగా శీతలం కమ్మినట్టుగా ఉన్నది.

ఇక నేడో రేపో తలుపు తోసుకుని వచ్చే మత్యువు ముందు నిలబడి మాట్లాడే సాహసం చేస్తున్నందువల్ల శేఖర్ మనసు మాత్రం ఉష్ణకాసారంలా రగులుకున్న రగల్‌జెండాల రెపరెపలాడ్తున్నది. ఒక స్టమక్ క్యాన్సర్ పేషంట్ నాలుగోదశలో మత్యువును ధిక్కరించడమొక్కటే సాహసం అనిపించుకోదు. కానీ సర్జరీ, కీమోథెరపీ, రక్తపు వాంతులు, నిద్రపట్టని శీతల సుదీర్ఘ రాత్రుల కవి సమయాల్లో శేఖర్ సమాజ క్యాన్సర్‌ల మీద కత్తి దూస్తున్నాడు. ఇప్పుడతను తన క్యాన్సర్‌పై యుద్ధాన్ని నిలిపి క్యాస్ట్ క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించాడు. దటీజ్ శేఖర్. ఒక నల్లగొండ పిల్లవాడు. చిన్నప్పుడే బ్రాహ్మల పిల్ల సత్తుగ్లాసులో పైనుంచి నీళ్లు పోసినప్పుడు మొట్టమొదటిసారి స్పహలో క్యాస్ట్‌క్యాన్సర్‌ను కనుగొన్న శేఖర్. ఇంత కాలం తర్వాత.

మార్క్స్‌నూ, మావోనూ, అంబేద్కర్‌నూ, ఫూలేనూ, కంచె ఐలయ్యనూ చదువుకొని, విప్లవాలను కలగని, కలగని, చివరికి క్యాస్ట్ క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించాడు. ఇది ద్వంద్వ యుద్ధం. ఎడతెగని పోరు. అంతం లేని పోరు. శరీరంలో దాగున్న క్యాన్సర్ కణాలనన్నా జయించవచ్చునేమో కానీ క్యాస్ట్ క్యాన్సర్‌ను జయించడం సాధ్యమా? ఈ యుద్ధం అనాదిది. ఈ యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధం కొనసాగవలసి ఉన్నది. మత్యువును కాసేపు మంచం ప్రక్కనే నిలేసి శేఖర్ కుల పురాణాలు గానం చేసి నిచ్చెనమెట్ల వ్యవస్థ అంతరాల దొంతరలు, అంతస్తులు, తంతెలు తారుమారయితే ఎలా ఉంటుందని చిలిపి కలలు కంటున్నాడు. కళారూపం కార్టూన్ కనుక అది చిలిపిగానో, వ్యంగ్యంగానో, సరదాగానో కనిపించవచ్చు కానీ అది నిజానికి జీవితంలో కుల నిచ్చెనమెట్ల బీభత్సాన్ని తలకిందులు చేసి బ్రాహ్మణులను కింది తంతెలో, శూద్రులను పై తంతెలో కూచోబెట్టి ప్రకటించిన మర ఫిరంగుల తిరుగుబాటు.

సరదాగా కాదు. అది జరగాల్సి ఉన్నది. కుల వ్యవస్థ తారుమారై. శూద్రులు పై తంతెలో ఉన్నప్పటి ఊహే చాలామందికి జ్వరమానికి చిక్కని జ్వరం తెప్పిస్తుంది. శేఖర్ అది సాధించాడు. అదీ ఆస్పత్రి బెడ్ మీద నుంచి... అచ్చంగా మహాసౌధాలను బద్దలుకొట్టమన్న ఫూలే లాగే నిచ్చెనలను తారుమారు చేసి, పిరమిడ్లను తారుమారు చేసి పైన శూద్రున్ని నిలబెడ్తున్నాడు శేఖర్. ఈ పిరమిడ్లను తలకిందులు చేయడాన్ని ఘంటా చక్రపాణి, సోషియో-హిస్టారికల్ థీమ్ అన్నాడు. ఇదొక అణగారిన కుల ఆక్రందనల నుంచి ఎలుగెత్తిన తిరుగుబాటు ఊహగా నాకు తోస్తున్నది.
శేఖర్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నది. వచ్చే ప్రాణం. పోయే ప్రాణం. ఆంధ్రజ్యోతిలో ఆయన కార్టూన్లు ఆగలేదు. చక్రపాణే అన్నట్టు కులానికీ, క్యాన్సర్‌కూ పైకి కనిపించకుండా మనిషిని తినే లక్షణం ఉన్నది. శేఖర్‌ను క్యాన్సర్ తినేస్తూ ఉన్నది. కానీ కులం క్యాన్సర్‌కు అనివార్యంగా శస్త్ర చికిత్స చేయడానికి, ఒక కీమోథెరపీ చికిత్స ఇవ్వడానికి శేఖర్ కుంచెనే తన ఆయుధంగా ప్రకటించుకున్నాడు.

కులం గాడి మీద అరవై నాలుగు కార్టూన్లు వేశాడు శేఖర్. బతుకులో ఎదురైన అనుభవాలు... చదువు నేర్పిన శాస్త్రీయత. సత్యశోధన. క్యాన్సర్, కులం ఒక్కటేనన్న జమిలి స్పహ. తెలంగాణ అతనికిచ్చిన జీవితం. నల్లగొండ అందించిన రంగుల ఆయుధాలు శేఖర్‌ను స్పహ కోల్పో ని కార్టూనిస్టును చేశాయి. నిజమే తెలంగాణ అంటే ఏడుపులు, శోకాలు, తీవ్ర మథనాలు, ఆగ్రహావేశాలేనా? వెసులుబాటులేని జీవితాలేనా! హాస్యం లేదా? ఎటకారం లేదా? ఉంది. కానీ అది ఆంధ్ర లాంటి వెసులుబాటు వెటకారం కాదు. తీరుపాటు వ్యంగ్యమూ కాదు. అది జీవితంలో ఉన్న దుమారాలు, చెత్తాచెదారాలూ, ఏ మాత్రం సుఖూన్ కాని వాతావరణాల మధ్య ఒక హాస్య, వ్యంగ్య, విషాద, బీభత్స, కరుణ రసాల సమ్మేళనమే కార్టూన్‌గా నమ్మిన తరపు నల్లగొండ తరహా కార్టూనిస్టు శేఖర్. కె. శ్రీనివాస్ అన్నట్టు తెలంగాణ జీవితం నుంచి వచ్చిన కార్టూనిస్టుల ధోరణుల్లో వెటకారం పాలు తక్కువ కావడానికి మూలాలున్నాయి. కారణాలున్నాయి.

దినపత్రికల్లో పనిచేసే అందరు రాజకీయ కార్టూనిస్టుల లాగా కేవలం రోజువారీ తంతు పేలినప్పుడు సరే, పేలనప్పుడు పేలవమైన ఐడియాలతో బండిలాగితే శేఖర్ సామాన్యుడయిన కార్టూనిస్టు మాత్రమే అయ్యేవాడు. అతను పత్రికల్లో ఉంటూ చేయరాని అతి ప్రమాదకరమైన పనులు చేశాడు. ఒకటి గిదీ తెలంగాణ థీమ్‌తో మొత్తం తెలంగాణ సంస్కతి, జీవితము, చరిత్రలతో అలయ్ భలాయ్ తీసుకున్నాడు.

కుంచె చేతబట్టి తెలంగాణ అలయ్‌ల దుంకి అస్సోయ్ ధూలా ఆడాడు. తెలంగాణ సోయిని ప్రదర్శించి, ఇదీ నా తెలంగా ణ సౌరు అని చూపాడు. అది అప్పటి కార్టూను ఊహకు అందని విషయమే. తెలంగాణ వైభవోపేత గతం, విశిష్ట సంస్కతిల నుంచి వర్తమాన పోరాటంలో తలమునకలయి ఉన్నప్పుడు మీడియా రెండుగా చీలి కనబడుతున్నప్పుడు, తెలంగాణ సంగతులు ఎక్వ తక్వ మాట్లాడితే ప్రాంతీయ మౌఢ్యంగా పండితులు ముఖ్యంగా పత్రికా పండితులు ముద్రలు గొడ్తున్నప్పుడు బతుకుదెరువుకు ముప్పు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా శేఖర్ తనకు తెలంగాణ తెలివిడి నుంచి వచ్చిన కొత్త చైతన్యం పురికొల్పిన సాహసం అయి గిదీ తెలంగాణ కార్టూన్లు గీశాడు. ఇది తెలంగాణ ఆత్మచిత్రణ అన్నారు తెలంగాణవాదులందరూ ఒకే గొంతుతో. కానీ శేఖర్ బచాయించిండు. ఆ ప్రమాదం అతన్నేమీ చేయలేదు. బహుశా తెలంగాణ నిలబడి ఉన్నందు వల్ల కూడా కావొచ్చు. కానీ ఆయన క్యాన్సర్ ప్రమాదంలో పడ్డడు.

పత్రికల్లో పనిచేస్తున్నవారు చేయకూడని నిషిద్ధ కార్యం మరొకటి కుల కళా సాధన. కులం పేరెత్తితే కష్టం. కులం లేని మీడియా తెలుగునాట లేదు. ఆ మాటకొస్తే భారతదేశంలోనే లేదు. కానీ శరీరంలో వ్యాపించిన క్యాన్సర్‌లాగే, దేశమంతా వ్యాపించిన కులం క్యాన్సర్ మీద కూడా శేఖర్ యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఆయన మీడియా ప్రమాదాలకు అతీతుడు. అతన్నిప్పుడు ఎవరూ ఏమీ చేయలేని అజేయుడు. క్యాన్సర్ లొంగదీస్తు న్న సమయాల్లోనే శేఖర్ అంతకు మించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను నిలదీసి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యా డు. చుండూరు కేసులో న్యాయం దళితులను వెక్కిరించింది. దేశం అట్లానే ఉన్నది.

కుల మూలాలు దాచుకున్న మనువు లు, మతాలు, మౌఢ్యాలు కొత్తరూపంలో మోడిత్వమై దేశమేలడానికి కమ్ముకుని వస్తున్నాయి. భూస్వామ్యం పడగవిప్పి కారంచే డు, చుండూరులై, లక్షింపేటలై బుసలు కొడ్తున్న సందర్భాల్లో మోడి ప్రభంజనాలు, దానిచుట్టూ గుంపు కడ్తున్న సామాజిక వర్గా లు... అంతా తేటతెల్లమే. ఈ కీలక సందర్భంలో స్పహను ప్రకటించిన శేఖర్‌కు, ఆయన పుస్తకం క్యాస్ట్ క్యాన్సర్‌కు జేజేలు. అనారోగ్య బాధితుణ్నే అయితేనేం యోధుణ్నే అని ప్రకటించుకున్న చెరబండరాజు లాగా... మంచం పక్కన చావును నిలబెట్టి మందితో మాట్లాడుతున్న శేఖర్‌కు జేజేలు. శేఖర్ ఇవ్వాళ్ల తెల్లటి నీ షర్టు.. నల్లటి ప్యాంటు.. నీ కొత్త డ్రెస్ బావున్నది. ఒక కొత్త ప్రాజెక్టుతో జీవితం, పని పొడిగిస్తూ... పొడిగిస్తూ.... ఉంటావని... ఆశపడుతూ... ఆశపడుతూ...

[email protected]

1092

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles