తెలంగాణకు ప్రమాదకరం


Sun,April 27, 2014 01:41 AM

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష్టతమై ఉన్న ఆల్విన్ వాచీ అచ్చు హైదరాబాద్ బ్రాండ్‌ను మూసివేశాయని ఆయనకు తెలిసే అవకాశమే లేదు. వైభవోపేతమైన గతం కలిగిన హైదరాబాద్‌ను సీమాంధ్ర పాలకులు బొందలగడ్డగా మార్చి శిథిలం చేశారు.

ఫతేమైదాన్‌లో రెండో దండయాత్ర జరిగింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకముందు స్వయానా కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యోగులతో మొదటి దండయా త్ర జరిపారు. తెలంగాణ మనసు గాయపడిం ది. ఒక రాజకీయ పాలనాదక్షుడిగా కాకుం డా, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫక్తు ఫ్యాక్షనిస్టులాగా ఆ దండయాత్ర నడిపారు. కానీ ఆయన ఓడిపోయారు. చచ్చిన సమైక్యాంధ్ర శవాన్ని బతికించే ప్రయత్నంలో ఇవ్వాళ్ల ఆయనే రాజకీయ రంగం నుంచి కనుమరుగయ్యారు. ఇది ఊహించిందే. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారుల ప్రతినిధులయిన వాళ్లందరూ ఇప్పుడు కకావికలయ్యారు. కాగితపు పులులై తలో గూటికి చేరుకున్న వింతలై మిగిలారు. డాన్‌క్విక్సోట్‌లా భ్రమపడి భంగపడిన జాతిగా మిగిలారు.

ఏకంగా సన్యాసులూ అయ్యారు. కానీ ఈ ఆంధ్ర పెత్తందారులకు ఇప్పుడు కొత్త ప్రతినిధులు దొరికారు. వారి ఆధ్వర్యంలో ఫతేమైదాన్ సాక్షిగా జరిగిన తెలంగాణ అస్తిత్వం మీద దండయాత్రకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించింది. స్వయంగా మోడీ ఒకవైపు చంద్రబాబునాయుడును, మరోవైపు పవన్ కళ్యాణ్ అనే నిలకడలేని, ఒక మాటకూ పొంతనలేని, నిన్నేమి మాట్లాడాడో మతికి లేని సినిమా నటుడినీ కూచోబెట్టుకుని... కాబోయే ప్రధానిగా కీర్తిస్తున్న నరేంద్రమోడీ తెలంగాణ మనసును గాయపరిచాడు.

తెలుగు స్ఫూర్తి అనే మాటను వాడి, తెలుగు స్ఫూర్తి, తెలుగు జాతి పేరిట కోల్పోయిన తెలంగాణ అస్తిత్వానికి మోడీ మరింత లోతైన గాయం చేశాడు. మొదటి దండయాత్రలో డాక్టర్ మిత్రా అనే ఒకప్పటి ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు, హైదరాబాద్‌లో మేము ముప్పది లక్షలమందిమి ఉన్నాం. దేనికైనా రెడీ అనే కాలుదువ్వాడు. మొన్నటి సభలో అదే ప్రజారాజ్యంలో పంచెలూడగొడతామని ప్రగల్భాలు పలికిన తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతల మీద విషం కక్కుతూ, ప్రసంగించాడు. ఇది యాధచ్ఛికం కాదు. డాక్టర్ మిత్రా, పవన్ కళ్యాణ్‌లు ఒకే గూటి పక్షు లు. ప్రజారాజ్యంలో ఉండంగ చిరంజీవితో కలిసి సామాజిక తెలంగాణ అని మాటమార్చిన ఊసరవెల్లులు. చిరంజీవి నయం. ఆయన పార్టీ మార్చడానికి కొన్ని రోజులైనా పట్టింది. పవన్ కళ్యాణ్ జేపీకి మద్దతు ఇచ్చీ మాట మార్చడానికి కొన్ని గంటలు మాత్రమే పట్టింది.

తల్లిని చంపారు... బిడ్డను బతికించారు... అన్నారు మోడీ. ఇంతకీ తల్లి ఎవరు? తెలంగాణ ఉద్యమం తెలుగు తల్లిని, తెలుగు స్ఫూర్తి లేదా తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట రూపొంది, వ్యవస్థితమైన సీమాంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించింది. ఎదిరించింది. తిరస్కరించింది. తెలుగు జాతి చిహ్నంగా ఉన్న తెలుగుతల్లి... ఎవని తల్లిగా ఉద్యమం ప్రశ్నించింది. తెలంగాణ తల్లి ప్రతిష్టితమయింది. తెలుగు తల్లి భావన ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణను పాలితులుగా, బానిసలుగా, అనాగరికులుగా, మోటు మనుషులుగా, నిమ్నులుగా చిత్రించింది కనుకనే తెలంగాణ తల్లి సష్టి జరిగింది.

పాత నమూనాలు, ప్రతీకలు బద్దలుకొట్టింది కనుకనే ఇవ్వాళ్ల తెలంగాణ కల సాకారమయింది. ఇదొక సాంస్కతిక వెల్లువ. కానీ తెలంగాణ విముక్తి కావడానికి ప్రధాన అడ్డంకి అయిన పెత్తందారుల భావజాల తెలుగుతల్లిని చంపారనడం ద్వారా మోడీ సీమాంధ్ర పెట్టుబడిదారులకు కొత్త దేవుడిగా ముందుకు వచ్చాడు. ఇరు పక్క లా ఇద్దరు సీమాంధ్ర చిల్లర దేవుళ్ల మధ్య బండారు దత్తాత్రేయ, వెనుక కిషన్‌రెడ్డిల సాక్షిగా తెలంగాణను నిజంగానే మోడీ అవమానపరిచాడు.

తెలంగాణ తరతరాల అణచివేతల నుంచి అస్తిత్వం కోసం చేసిన పోరాటం విజయవంతమయిందని విజయగానం చేస్తున్న సమయంలో మోడీ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడారో? ఆయన ప్రాధాన్యతల్లో ఏ ప్రాంతం ఉన్నదో? నిజానికి తరతరాలుగా దోపిడీ చేసిన ప్రాంతం, మోడీకి ఎందుకు చచ్చిపోయినట్టుగా కనిపించిందో? కనిపెట్టడానికి పెద్ద తాత్విక పరిశీలనలు అక్కరలేదు. మోడీ వారితో ఉన్నాడు. ఆయన భావనలు దానికి తగినట్టుగానే ఉన్నాయి. ఇద్దరు చిల్లర దేవుళ్లతో వేదిక మీద కూర్చున్నప్పుడే మోడీ కానీ బీజేపీ కానీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో? అర్థం అవుతున్నది. మిగతా సగం మోడీ మాటలతో తేటతెల్లమయింది.

సూరత్ నూలుపోగుల చిక్కుల దారం తెరల సుట్టరికం సిరిసిల్లలో ఉన్నది. తెలంగాణ గుజరాత్ పడమటి సంధ్యారాగంగా అక్కడ మనుగడలో ఉన్నది. కానీ సూరత్‌లో ఉన్న తెలంగాణ సబ్బండవర్ణాలు కార్మికులు. మోడీకి సుట్టరి కం తక్కువ. కానీ సీమాంధ్ర పెత్తందారుల సుట్టరికమే ఆయనను, ఆయన పార్టీని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, నాగార్జున, మోహన్‌బాబు, మురళీమోహన్, పురంధీశ్వరి, జయప్రకాశ్ నారాయణ్‌ల బంధనం చేసింది. గుజరాత్‌లో ఉన్న తెలంగాణ వాళ్లను ప్రేమగా చూసుకుంటానని చెబుతున్న మోడీ, ఇక్కడ మాత్రం ఫతేమైదాన్ క్లబ్‌లో తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని పరభాష వాడారు. తెలంగాణను పరాయిగా చూసి వేరయ్యారు.

అయినా మోడీ మోడల్ కొత్తదేమీ కాదు. తొంభైల నుంచి భారతదేశం అనుభవిస్తున్న ఆర్థిక సంస్కరణల కొనసాగింపు సూత్రాల మీద నిలబడినవాడు మోడీ. కాకులను కొట్టడం గద్దలకు పెట్టడం. అంతస్సూత్రంలో అదానీలకు, కార్పొరేట్లకు నేలను, నీరును, ఆకాశాలనూ అమ్మడం, పేదలను, భూమిని పట్టుకుని వేలాడే మట్టి మనుషులను నిర్వాసితులను, జీవన నిస్సహాయులుగా చెయ్యడం. ఒక్క కార్పొరేట్లకు అనుకూల ఆర్థిక విధానం అయితే మోడీతో ఒకటే ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానాలు అనుసరించింది. అనుసరిస్తున్నది. కానీ గర్భస్థ పిండాలను శూలాలకు వేలాడ దీసిన ఒక నెత్తురు చరిత్ర గుజరాత్ గుండె గాయమయింది. అది మతానికి సంబంధించింది. తొక్కుకుంటూ, తోసుకుంటూ అది ఇప్పటి ఫేస్‌బుక్‌ల డొల్ల సమాజాల్లోకి చొచ్చుకు వచ్చి ఊరేగుతున్నది. కార్పొరేట్‌లు, దళారీలు మతమూ కలిస్తే ఈ భారతదేశానికి విముక్తి ఉండదనే సత్యం అతి ప్రమాదమనే నిష్ఠురనిజం అవగతమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. మోడిత్వ ఒక భ్రమ. అదొక సమ్మతి సాధన. ఈ భ్రమకు కార్పొరేట్ మీడియా మొలిపిస్తున్న రెక్కలు. కానీ తెలంగాణకు మోడీ మిత్రుడు కాడు. తెలంగాణ మోడిత్వపై తేల్చుకోవల్సే ఉన్నది.

తెలంగాణను వేరుగా చూసినవాడు మోడీ. అచ్చం రాజశేఖర్‌రెడ్డి లాగే. ఒక సీమాంధ్ర దురహంకారి లాగే. అయితే మోడీ చరిత్రను కలెబెట్టాడు. ఇంత చేసీ హైదరాబాద్‌కు రావాలంటే వీసా తీసుకోవాలా? అని అయిదేండ్ల కిందటే తెలంగాణ ఎన్నికలు ముగిసిన మరుసటి గంటలోనే మాట్లాడాడు రాజశేఖర్‌రెడ్డి. పూర్తి దురహంకారం ఆయన మాటల్లో ప్రస్ఫుటమయింది. తెలంగాణను కించపరిచిన ఆ మాటలు జీవితకాలం గుర్తుండి పోయే మాటలు. పోలికలు అవసరమే. సరిగ్గా మోడీ కూడా పటేల్ లేకుంటే హైదరాబాద్‌కు వీసాలు తీసుకొని రావాల్సి వచ్చేదని తెలంగాణ పాత గాయాన్ని గెలికాడు. విమోచనా? విలీనమా? విద్రోహమా? అని తెలంగాణ ఏండ్ల తరబడి తన చరిత్రను తాను పునర్మూల్యాంకనం చేసుకున్నది.

హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం మీద పటేల్ సైన్యాల దండయాత్ర జరిగింది. అది తెలంగాణ ఆ తర్వాత పరాధీన కావడానికి బీజాలు వేసింది. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం ద్వారా అది ఇన్నాళ్లూ అంతర్గత వలస ఆధిపత్యంగా మారింది. ఒక స్వతంత్ర రాజ్యం, భారత్‌లో విలీనం కావడానికి జరిగిన హింసకు మూలాలున్నాయి. సరిగ్గా మోడీ ఆ చరిత్రను కెలికి హైదరాబాద్‌ను, తెలంగాణను ఒక పరాయి ప్రాంతంగా సంబోధించి మనసు గాయపరిచాడు. ఒక స్వతంత్ర ప్రాంతంగా, బతికిన తెలంగాణ విశిష్ట సంస్కతి, వైభవోపేత చరిత్రను కాలదన్నాడు మోడీ. పటేల్ సైన్యాలు రాకముందే హైదరాబాద్ స్టేట్ విలీనం కాకముందే గాంధీ స్వయంగా హైదరాబాద్ స్టేట్‌ను గంగ జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. నెహ్రూ స్వయంగా హైదరాబాద్ ది భారతదేశంలో ఒక మేలైన మెట్రోపాలిటీ సంస్క తి అన్నారు. నిజానికి హైదరాబాద్ సాంస్కతిక మూలాలు దక్కన్ పీఠభూమి ఉత్తరాది అనుసంధానంలో ఉన్నాయి. పడమటి సంధ్యారాగాలకు దక్కన్, ఉత్తరాది సంగమాల చరిత్ర తెలిసే అవకాశమే లేదు. మోడీ హైదరాబాద్ చరిత్రనూ గాయపరిచాడు.

ఆమాటకొస్తే... ఢిల్లీ పరాయిలు లేదా, ఢిల్లీ పీఠాల మీద అధిష్టించే ఉత్తర, పడమర శక్తులు లేదా హిందీశక్తులు తెలంగాణను కానీ హైదరాబాద్ స్టేట్‌ను కానీ ఎన్నడూ ప్రేమించలేదు. వారికి తెలం గాణ తెలియదు. రాహుల్‌గాం ధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష్టతమై ఉన్న ఆల్విన్ వాచీ అచ్చు హైదరాబాద్ బ్రాండ్‌ను మూసివేశాయని ఆయనకు తెలిసే అవకాశమే లేదు. వైభవోపేతమైన గతం కలిగిన హైదరాబాద్‌ను సీమాం ధ్ర పాలకులు బొందలగడ్డగా మార్చి శిథిలం చేశారు. ఆల్విన్, ఐడీపీఎల్, డీబీఆర్, ఏపీస్కూటర్స్, రిపబ్లిక్ ఫోర్జ్, ప్రాగాటూల్స్ జాబితా అనంతం. ఈ శిథిలాల మీద నుంచే తెలంగాణ ఫీనిక్స్ పక్షిలా లేచింది. సీమాంధ్ర పెత్తందారీ కాగితపు పులుల మీద జెండా ఎగరేసింది. కాగితపు పులులు ఇప్పుడు కకావికలయ్యాయి. వారికి ప్రాతినిధ్యం వహించే వాళ్లూ చరిత్రలో కకావికలుకాక తప్పదు.

1214

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles