మనమూ-వారూ...విభజన రేఖ


Sun,April 20, 2014 01:56 AM

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప లా కాపాడుకోవడం అతి ముఖ్యమైన విష యం. తెలంగాణ అస్తిత్వం కోల్పోయిన పరాధీన అయింది. ప్రత్యేకతలు, విశిష్టతలు, చరిత్ర, సంస్కతికి సంబంధించి ఆరు దశాబ్దాల పోరాటంలో తెలంగాణ తనను తాను వెతుక్కున్నది. దేవులాడుకున్నది. అంతర్గత వలస ఆధిపత్యం తెలంగాణ మూలాలను దెబ్బతీసింది. ఒక నిమ్న సమాజంగా, వెనుకబాటు సమాజంగా తెలంగాణను చిత్రించి, ఉద్ధారకులుగా వలస ఆధిపత్యవాదులు పాదుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక దోపిడీ తీవ్రతరమై తెలంగాణ వైభవాలు ధ్వంసమై ఇక ఎంత మాత్రం సామాజిక సంబంధాలు కొనసాగని స్థితిలోనే తెలంగాణ ఉద్యమం అనివార్యమయింది.

అది పుంజుకున్నది. నిరంతరంగా కొనసాగింది. చివరికి బిల్లు రూపం లో తెలంగాణ కల సాకారమయింది. కానీ ఏ పునాదుల మీద వలస ఆధిపత్యం పాదుకున్నదో, ఏ యంత్రాంగాలు, సాధనాలు, చోదకశక్తుల మీద వలసవాదం నిలబడిందో? అవన్నీ ఎప్పటిలాగానే ఉన్నాయి. అదీ ఇప్పటి తెలంగాణ అసలు సమస్య.
గుర్తింపులూ... అస్తిత్వాలు చరిత్ర మీదనే ఆధారపడి ఉంటాయి. అందువల్లనే వలసవాదులు తెలంగాణ చరిత్రను అయోమయం చేశారు. సమకాలీన సమస్యలపై స్పందనగా అస్తిత్వ ఉద్యమం పొడసూపి, పాదుకున్న ప్రతి సమయంలోనూ అమ్ముల పొది నుంచి వాళ్లు అబద్ధపు లేదా వక్రీకరణల, లేదా అర్ధ సత్యాల చరిత్ర ఖడ్గాన్ని ఝలిపించారు. తెలంగాణ తనకు తాను నిలబడడానికి ఆధారభూతమైన చరిత్రను గందరగోళంగా తయారుచేశారు. వర్తమానంలో తెలుగువాళ్లందరూ కలిసి ఉండాలని కోరుకున్నందునే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న పచ్చి అబద్ధాన్ని చూడండి. ఫజల్ అలీ కమిషన్ చెప్పిన విషయాలు కానీ, విలీనానికి ముందు తెలంగాణ సమాజపు వ్యతిరేక ప్రతి స్పందనలు కానీ చివరకు కేవలం హైదరాబాద్ అనే రెడీమేడ్ రాజధాని కోసం ఆంధ్ర నాయకత్వం వేసిన కుప్పిగంతులు మాట్లాడిన మాటలు గానీ గమనిస్తే తెలంగాణ వారు విలీనాన్ని కోరుకోకపోగా తీవ్రంగా వ్యతిరేకించారనే విషయం తేటతెల్లంగా కనబడ్తూనే ఉంటుంది.

కానీ వక్రీకరణలే సత్యంగా చెలామణి చేసి చరిత్రను గందరగోళపరచడం ఆధిపత్యవాదుల అసలు లక్ష్యం. ఆధిపత్యం నిలవడానికి అత్యవ సరం. షరతులు, ఒప్పందాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం కూడా వలసవాదులు చెప్పిన చరిత్రను పూర్తిగా తిరస్కరించే కఠిన వాస్తవమే. కానీ తెలంగాణ తనను తాను నిర్మించుకున్నది. చరిత్రను నిర్మించుకుంటున్న ఒక క్రమాన్నీ కలిగి ఉన్నది. సంస్కతినీ కాపాడుకున్నది. అయితే ఇది భవిష్యత్తులో కొనసాగవలసి ఉన్నది. ఎన్నికల సందర్భం ఈ చారిత్రక క్రమాన్ని కొంత గందరగోళంలోకి నెట్టేసి భవిష్యత్తు అంటే కేవలం ఓట్లు తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేసే నిర్మాణ, వినిర్మాణాల చర్చగా దిగజారింది. అందువల్లనే ఉద్యమం కోసం, తెలంగాణ విముక్తి కోసం నిలబడిన ఉద్యమశక్తులు భవిష్యత్ లక్ష్యాలపైన ఏం చెయ్యాలి? అన్న సందిగ్ధతలకు లోనవుతున్నది.

తెలంగాణ భౌగోళికంగా సిద్ధించింది. కేసీఆర్ గానీ ఇతర రాజకీయపార్టీలు కానీ చెబుతున్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు భౌతికాంశాల ట్యాగ్‌లైన్ పైనే ఉద్యమం జరిగితే వాటిని సరిదిద్దుకుంటే తెలంగాణ సంపూర్ణమయినట్టే అనే భ్రమ కలుగుతుంది. రాజకీయ పార్టీల ప్రచారం, వ్యాసంగం, కార్యకలాపాల పరిధి అంతకు మించదు. అందుకే ఈ మూడింటిని, సరిదిద్ది బంగారుదో, వెండిదో ఒక తెలంగాణ నిర్మిస్తామనే కార్యాచరణ ప్రకటిస్తున్నారు. అది వారి ఎజెండా. పరిమితి కూడా. కానీ తెలంగాణ ఉద్యమం డీకాలనైజేషన్ కోసం జరిగిన, జరగాల్సిన ఉద్యమం కూడా. ఆధునికానంతర వలసలు ప్రధానంగా వనరుల దోపిడీ మాత్రమే కొనసాగించలేదు. అవి ముందు చరిత్రను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత సంస్కతి మీద దాడి చేశాయి. చివరకు ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా, దక్కన్ పీఠభూమిగా ఉన్న ప్రాంతపు బతుకుదెరువునూ, జీవన విధానాన్నీ ధ్వంసం చేశాయి. హైదరాబాద్ తెహజీబ్‌ను ధ్వంసం చేసి, భూకబ్జాల నిలయంగా, అతిపెద్ద రియల్ ఎస్టేట్ దందాగా మార్చాయి.

ఇవన్నీ కూడా కనిపించే విషయాలే నిజానికి అస్తిత్వ వేదనలో భౌతిక వనరుల దోపిడీ కన్నా...నిమ్నులన్న భావనలకు కారణమైన సాంస్కతిక ఆధిపత్యం ఒక్కొక్కప్పుడు ప్రధాన భూమిక వహిస్తుంది. మనుషులు తమను తాము కోల్పోయే స్థితి కలిగినప్పుడు, అవతల నుంచి చొచ్చుకొచ్చిన ఆధిపత్య సంస్కతులు కమ్మేస్తున్నప్పుడు ప్రతిఘటిస్తారు. తెలంగాణది సాంస్కతిక ప్రతిఘటనగా కూడా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడే. ఆర్థిక వనరుల దోపిడీని మించి మనము అనే భావనలను, ఉమ్మడి అస్తిత్వాన్ని రూపొందించేదీ ఇదే. అందుకే తెలంగాణ ఉద్యమం ఒక సాంస్కతిక వెల్లువను సష్టించింది. ధూమ్‌ధామ్‌లను సష్టించింది. పాట పోరాట పతాక అయింది. సాహిత్యం సోయి తెచ్చుకున్నది. తెలంగాణ సాంస్కతిక వెల్లువ తన చరిత్రను తాను, తన వైభవాన్ని తాను, గతం అప్పుడప్పుడు ముతకగా ఉన్నా సరే తన సంస్కతిని తాను, పురాణాలను, ఇతిహాసాలను, గుళ్లను గోపురాలను, కట్టుబొట్టు ను, తిండి తిప్పలను, ఆటపాటలను, బతుకమ్మలను, బోనాలను వర్తమానంలోకి తెచ్చుకున్నది. ఇది సాంస్కతిక వెల్లడి. ఇది గుర్తింపు. బహుశా ఇది కొనసాగకుండా, ఈ క్రమం విస్తరించకుండా సంపూర్ణ తెలంగాణ సాధ్యం కాదు. అంటే వలస ఆధిపత్యం నుంచి విముక్తి కావాల్సే ఉన్నది.
ఏ భావన కానీ, ప్రతీక కానీ దానంతట అది పుట్టుకురాదు. ఆంధ్రప్రదేశ్‌లో చెలామణిలో ఉన్న భావనలు, ప్రతీకలు అరణ్యాల్లాగా విస్తరించిన ఆధిపత్య చిహ్నాలు అంత సులభంగా పాదుకున్నవి కావు.

తెలంగాణను కబళించిన అంశాలు, ఆ అంశాలను పాదుకొలిపి స్థిరపరిచిన ఆధిపత్య భావనలు, ప్రతీకలు అంత సులభంగా వదిలేవి కావు. యాభై ఎనిమిదేళ్లు కలిసి ఉన్న చేదు అనుభవాలతో పాటు ఈ క్రమంలో విస్తరించినవన్నీ వలస యంత్రాంగాలు సష్టించిన భావనల ఫలితమే. ఉమ్మడి రాజధాని ఉండడం, వలసల్లో భాగంగా ఇక్కడ స్థిరపడినవారి పట్ల వహించాల్సిన సహిష్ణుతలు అనే సున్నితాంశాల వల్ల, యంత్రాంగాలు ప్రత్యక్ష పద్ధతిలో ఆధిపత్యం సాగనప్పుడు వెదికే పరోక్ష పద్ధతుల వల్ల ఈ భావనలు, ప్రతీకలు అంతరించి, వలసవాద మనస్తత్వాలు విముక్తి కావడం అంత సులభం కాదు. చంద్రబాబునాయుడు ఒక రాజకీయపార్టీగా దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ తెలంగాణలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి ఆరుగురికి టికెట్లు దక్కడం దేనికి సంకేతం? అదీ సరే! ప్రజాస్వామ్యం.

కానీ ఆయన ఒకప్పుడు తెలంగాణను మభ్యపెట్టి బీసీ కులాల పేరిట, మొత్తం బీసీ వత్తి కులాల జీవన రీతులను, సమస్త వత్తులను ధ్వంసం చేసినవాడు. మళ్లీ బీసీలకు సీఎం ఇస్తాననడం దేనికి సూచన. తెలంగాణ పోరాటం ఆర్థిక వనరుల దోపిడీపైన కొట్లాడింది. ఈ దోపిడీ అంతం కావాలంటే స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కోరుకున్నది. చంద్రబాబు చక్రం తిప్పితే ఇక తెలంగాణకు గానీ, స్వీయ అస్తిత్వానికి కానీ అర్థమే ఉండదు. అంతేకాదు. హైదరాబాద్‌ను తాను అభివద్ధి చేసినా అని చెప్పుకుంటున్న చంద్రబాబు, హైదరాబాద్‌ను మళ్లీ అభివద్ధి చేస్తానని ప్రకటించడం అసలు ప్రమాద సంకేతం. ఏ భావనలు, ప్రతీకలయితే తెలంగాణ జీవితాన్ని, ఉనికిని, అస్తిత్వాన్ని హైదరాబాద్ తెహజీబ్‌ను ధ్వంసం చేశాయో! అవన్నీ మళ్లీ అమలు చేస్తానంటున్న చంద్రబాబు వెంట ఇప్పటికీ పోటీ చేసేవాళ్లు ఉండడం, వాళ్లు తెలంగాణ స్వీయ రాజకీయ శక్తులను, ఉద్యమ శక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం అసలు ప్రమాద సంకేతం.
తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన వారికి, తెలుగుజాతి అనే ఒక అమూర్త భావనను పరికల్పించి, తెలంగాణ స్పహను కూడా చంపేసిన ఎన్టీఆర్ లాంటి వారికి ఇప్పటికీ తెలంగాణలో పార్టీ ఉండడం, అది కొనసాగుతుండడమూ, దాని వెంట మనుషులు ఉండడం, అది పనిచేస్తూ ఉండడం అతి పెద్ద ప్రమాదం.

చంద్రబాబుది నిజానికి ఒక సగటు సినిమా కథలాంటి కుటుంబ, సామాజిక వర్గ రాజకీయం. కొన్ని పాలి పగలు, కొన్ని కన్నీళ్లు, కొన్ని కుటుంబ ద్రోహాలు, కొన్ని వెన్నుపోట్లు, పెళ్లి సంబంధాలు, కొన్ని అలకలు, చివరికి నైతిక, అనైతికతల చర్చ దాకా వెళ్లిన మానవ సంబంధాలు, అపారంగా కూడబెట్టుకున్న ఆస్తుల కొట్లాట విశ్వరూపమే తెలుగుదేశం సినిమా కథ. ఎన్నో మలుపులు ఉండే ఈ సినిమా కథను రక్తి కట్టించే ప్రధాన మీడియా వనరులు పుష్కలంగా ఉండడంతో ఆ మీడియా తెలంగాణపై ఆధిపత్యం కోసమే ప్రచార బాకాలుగా ఉండడంతో ఇది సాధ్యమయింది. చంద్రబాబును ఇప్పటికీ మీడియా తెలంగాణలో ఒక ప్రధాన పోటీదారుగా ప్రొజెక్ట్ చేస్తున్నది అది భావజాల పరంగా ఇంకా ప్రమాదకరం. వదినకు టిక్కెట్ ఇస్తే బీజేపీతో పొత్తు తెంచుకుందామనుకున్న అతిసాధారణ కుటుంబ నాయకుడు చంద్రబాబు.

ఆయనకో కొడుకు. ఆయనకో మామ. ఇంకొక మామకు టికెట్ రాదు. ఆ మామ కొడుకు పోయిన ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్ ఇప్పుడు పరాయి. చంద్రబాబు ఒక్కడే కాదు. ఇప్పుడు ఆయనకు అదే సామాజికవర్గం బీజేపీ నేత వెంకయ్యనాయుడు తోడు. మోడీ దగ్గరకు క్యూకట్టిన నాగార్జున, మోహన్‌బాబులు, మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు డెడ్లీ కాంబినేషన్‌లకు తోడు మతం తెస్తున్న సామాజిక అల్లికల్లో పవన్ కళ్యాణ్ పరాకాష్ట. తెలంగాణలో సీమాంధ్ర ఆధిపత్యానికి సమ్మతి సాధించి, కొయ్య గుర్రాలను మహా వీరులుగా చిత్రించిన మీడియా అట్లానే బతికి ఉండడం ఆధిపత్యం చెలాయించడం కూడా పొంచి ఉన్న అసలు ప్రమాదం.

అందువల్ల కేసీఆర్ చెబుతున్న మాటల్లో సత్యమే ఉన్నది. గీటు రాయి కావాలి. మనము-వారు వేరుగానే ఆలోచించాలి. మన భావనలు, ప్రతీకలు, వారి భావనలు, ప్రతీకలు వేర్వేరుగానే ఉండాలి. ఆప్షన్‌లు, సీమాంధ్రులు సమస్యలు, ఉద్యోగుల సమస్యలపైన తెలంగాణ దష్టికోణం తిరుగుబాటుగానే ఉండాలి. భవిష్యత్తులో న్యూనపరిచిన తెలంగాణ మెదళ్లు విముక్తి కావాలి. తలెత్తుకోవాలి. అందుకు చాలా పని ఉంది. జేఏసీలకు, ఉద్యమ సంస్థలకు, ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, బుద్ధిజీవులకు, ప్రొఫెసర్లకు, మొత్తంగా తెలంగాణ పౌర సమాజానికి తెలంగాణ మెదళ్ల విముక్తికార్యం మిగిలే ఉన్నది. అందుకు సాంస్కతిక విప్లవం కొనసాగాల్సే ఉన్నది. ఏదైనా భావన, ఏదైనా ప్రతీక, ఏదైనా విగ్రహం ఎందుకు ఉన్నదో? అది అరణ్యంలా ఎట్లా వ్యాపించిందో? ఆ భావనలు ప్రతీకలు ఎవరి ఆధిపత్యం కోసం రూపొందాయో, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయో తెలిస్తే... ఆ భావనలను, ప్రతీకలను ధ్వంసం చెయ్యడం కొత్త ప్రతీకలు, భావనలు రూపొందించడం మాత్రమే పరిష్కారం. అస్తిత్వ వేదనల నుంచి అదే అంతిమ విముక్తి.

755

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles