ఇప్పుడిక నరేందరూ లేడు....


Thu,April 3, 2014 02:35 AM

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గారింట్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న రేవెల్లి నరేందర్ (ఆరెన్నార్) పార్థివ దేహం ముందు సుళ్లు తిరిగే కన్నీటిని దాచుకుని ఒకరినొకరం పట్టుకుని నిశ్చలంగా నిలబడిపోయినప్పుడు మిగిలింది ఇద్దరం.

ఘంటా చక్రపాణి. నేను. మాది జీవగడ్డ బంధం. మూడు దశాబ్దాల కిందటి ముచ్చట. కూలిపోతూ మానేసిన ఒక పాత ఇంట్లో జీవగడ్డ కార్యాలయం. గుంగురెంటికలతో పసిపిల్లగాని మొఖం తో ఒక ఇరవై ఏళ్ల యువకుడు ఆ పాతబడిపోయిన ఆఫీసులోకి వచ్చా డు. నేను. చారి. మా తోడు ఆనాడే మాతో కలిసి రిపోర్టింగ్ ఔత్సాహికుడయిన ఘంటా చక్రపాణి. జీవగడ్డ మార్కెటింగ్ కోసం వచ్చాడీ బీకాం పిల్లగాడు. మరుసటి రోజనుకుంటా. బోరిస్‌బెకర్ పదిహేడేళ్లకే వింబుల్డన్ గెలిచాడు. మార్కెటింగ్ కోసం వచ్చిన ఆ పిల్లగాడే రేవెల్లి నరేందర్. అతను బోరిస్ బెకర్ గెలుపును రాసుకొచ్చాడు. అప్పటికి అతడు అడవిని జయించాడు కేశవరెడ్డి నవల ప్రకంపనలు రేపుతున్న కాలం.

Narender ఇకనేం నరేందర్ ఐటమ్‌కు జీవగడ్డ బెకర్ వింబుల్డన్ జయించాడు అని శీర్షిక ఇచ్చి ఆనాటి నుంచి క్రీడాపేజీని ప్రత్యేకంగా రూపొందించింది. అట్లా మా జీవగడ్డ టీమ్‌లో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రిందట మాతో పాటే కొనసాగాడు. అనంతర కాలంలో నరేందర్ ప్రముఖ క్రీడా పాత్రికేయుడయ్యాడు. విశ్లేషకుడయ్యాడు. కానీ అతనివ్వాళ్ల గాజుపెట్టెలో శీతలంగా పడుకొని ఉన్నాడు. మరి లేడు.

ఉష అంటున్నది. పలవరిస్తున్నది.నానీ... పలుకు... ఎట్లా పోతావ్. మాట్లాడు. ఇదిగో అందరూ వచ్చారు. పలకరించకుంటే ఏమనుకుంటారు..! ఆమె శోకం అచ్చం పల్లెల్లోలాగా ప్రాకతికంగానూ, సహజాతంగానూ ఉన్నది. తలుచుకొని, తలుచుకొని ఏడుస్తున్నది ఉష. ది బెస్ట్ మ్యాన్. బ్రైట్ మ్యాన్. ఎట్లా సాధ్యం. నలభై తొమ్మిదేళ్లకే నరేందర్ ప్రస్థానం ముగిసింది. జీవగడ్డ ఎనభయవ దశకంలో కరీంనగర్ జిల్లాలో చాలామందికి అనధికార పాత్రికేయ పాఠశాల. చారి, చక్రపాణి, నరేందర్, నేనే కాదు. పిట్టల రవీందర్, అన్నవరం దేవేందర్, మందా భీమ్‌రెడ్డి, వై.ఎస్.శర్మ ఇవ్వాళ ప్రముఖులైన చాలామంది జీవగడ్డ బందమే.

మా గురువు భాగ్యనగరి విజయ్‌కుమార్. నక్సల్బరీ పోరాట ప్రేరితుడు. కరీంనగర్ ప్రింటింగ్ ప్రెస్‌పెట్టి చిత్రహింసల పాలయినవాడు. బద్‌లా, విద్యుల్లతలు మెరిపించినవాడు. చివరకు జీవగడ్డ అనే దినపత్రిక నడిపించినవాడు. ఒక దినపత్రిక ఎన్ని ప్రయోగాలు చేసేదో? అన్ని ప్రయోగాలు చేసిన జీవగడ్డ బందం అప్పట్లో చిన్న పత్రికల సంచలనం. ఆర్థిక ఇబ్బందులతో అది నడవలేదు కానీ జీవగడ్డ నుంచి ప్రధాన స్రవంతి పత్రికల్లో చోటే కాదు ప్రాముఖ్యత సంపాదించిన నరేందర్ ఆటల మనిషి. విజయకుమార్ ఇప్పుడు మందిలో లేడు. మనాదలో అస్వస్థుడయి ఉన్నాడు.

జీవితమంతా ఆటకోయిల తనంగా బతికినవాడు నరేందర్. బ్రైట్ మ్యాన్. ఆకళింపు, ఏదైనా చిటికెలో గ్రహింపు, వేగంగా స్పందించడం, క్రీడలపైన, క్రీడా రాజకీయాలపైన, క్రికెట్‌పైన స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. క్రీడా నిపుణులకు అవసరమయ్యే సాంకేతిక అంశాలే కాదు. ప్రత్యేకంగా అభిరుచి మాత్రమే కాదు. స్వయంగా గల్లీ క్రికెట్ నుంచి టీమ్, క్లబ్ క్రికెట్ ఆడినవాడు. రాంమోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు. నిజమే చిన్నపిల్లవాని నుంచి నరేందర్ ఆయనకు తెలుసు.

కరీంనగర్ వాతావరణం, అక్కడి రాజకీయ వాతావరణం, సిద్ధాంతాలు ఏవీ నరేందర్‌కు పట్టనివే. జీవగడ్డ అప్పుడొక ఉద్యమవాద వివాదాల కేంద్రం. ఆ పాత కూలిపోయే ఇంట్లో చర్చోప చర్చలు జరిగేవి. క్రీమ్ ఆఫ్ కరీంనగర్ కమాల్ కరీంనగరి, జాప లకా్ష్మరెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, గోపు లింగారెడ్డి, నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్, నవత చుక్కారెడ్డి ఇట్లా ఎందరి పేర్లని.. ఏదో ఒక సమయంలో ఆఫీసుకు వచ్చిపొయ్యే వాళ్లు. ఎడతెగని చర్చల నడుమ నరేందర్ విడిగానే ఉండేవాడు.

ఊఁ అనేవాడు కాదు, ఉప్పురాయనే వాడు కాడు. భిన్నంగా ఉండేవాడు. మేమంతా ఒకే రకం మనుషులం. చక్రపాణి అతి తొందరగా మాలో కలిసిపోతే, నరేందర్ మాలో ఒకడిగానే ఉన్నా... ఎన్నడూ రాజకీయాల జోలికి వచ్చేవాడు కాడు. బహుశా ఇది జీవితం పొడవునా నరేందర్ పాటించాడునుకుంటా. కుటుంబం నుంచి తొందరగానే స్వతంత్రుడయి, చిన్నప్పటి నుంచీ తనకు తానుగా బతికి మహా మహా జర్నలిస్టులను బాబాయ్ అనగలిగి... నరేందర్ జర్నలిస్టు సర్కిల్స్‌లో ముఖ్యమైన స్నేహితుడయ్యాడు. గుంపులో అతనొక మెరుపు.
జీవగడ్డ నుంచి నేను ఆంధ్రప్రభకు, నరేందర్ ఆంధ్రజ్యోతికి, జాప లకా్ష్మరెడ్డి హత్య తర్వాత చక్రపాణి ఉస్మానియా యూనివర్సిటీకి, చారి ఏదో పత్రికకు అందరం చెల్లాచెదురయ్యాం.

ఎక్కడికక్కడ పక్షుల్లా ఎగిరిపోయాం. స్థిరపడ్డాం. మళ్లా ఆంధ్రజ్యోతిలో నరేందర్. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నాకు నరేందర్ గది ఆశ్రయం. ఆ తర్వాత నరేందర్ మా ఇంట్లో మా కొడుకులాగే ఉన్నాడు. పద్మ తెలు సు కనుక. ఇంట్లో ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు వెళ్లినా అన్నం సొంతం గా పెట్టుకుని తినేవాడు. కొడుకులు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినట్టుగానే పెట్టేవాడు. ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉంటే మా ఇంట్లో నిద్దర్లు తక్కువే. మూడు గంటలకు టెస్ట్ మ్యాచ్ మొదలయ్యేది. నరేందర్ అది చూడాల్సిందే. పద్మ, నేనూ మా పిల్లలు, టీవీ రూమ్ నుంచి మరో రూమ్‌లో సర్దుకుంటే సారు దర్జాగా, ఎలాంటి మొహమాటం లేకుం డా, పరాగత్‌గ టెస్ట్ మ్యాచ్ చూసెటోడు. మా కిరణ్ వచ్చినాక అనుకుంట నరేందర్ రూమ్ మార్చాడు. ఇది వ్యక్తిగత బంధం. అయితే...

ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ కూడా ఉదయం వలె, వార్త వలె. ఒక కొత్త ఒరవడి. అప్పటి టీమ్ గొప్పది. మురళి, కే శ్రీనివాస్, గారపాటి నర్సింహారావు, సురేంద్రరాజు, వీ. శ్రీనివాస్, రాంమోహన్‌నాయుడు ఇట్లా జాబితా చేంతాడంత. ఇది హైదరాబాద్ బ్యాచ్. విజయవాడ నుంచి నేను, గోపాల్‌రావు, కట్టా శేఖర్‌రెడ్డి, కష్ణప్రసాద్, బాబూరావులం దిగినప్పుడు బెజవాడ రెనగేడ్స్ దళంలా ఫీలయ్యే వాళ్లంతా. నరేందర్ అప్పటికి హైదరాబాద్‌లో ఉన్నాడు. ఆంధ్రజ్యోతిలో స్పోర్ట్స్ డెస్క్ ఒక స్పెషల్.

వెంకటేశ్ అప్పటికే చీఫ్ సబ్ ఎడిటర్. ఆయన ఆధ్వర్యంలో క్రీడా జర్నలిజంలో లబ్ద ప్రతిష్టులయిన చంద్రమోహన్, జెస్సీ, నరేందర్‌లు ఉండేవాళ్లు. వెంకటేశ్ మాటల్లోనే ఆ టీమ్ గొప్పది. ఆ గొప్ప టీమ్‌లో ఉన్నవాడే నరేందర్. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇంగ్లీషు పత్రికలు నానా రకాల పనిచేశాడు నరేందర్. ఆంధ్రజ్యోతిలో ఉండగానే తురగా జానకీరాణి కుమార్తె ఉషతో పెళ్లి. ఆ పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు నరేందర్ ఎలాంటి వాడని నాతో కూడా ఎంక్వైరీ చేసినట్టు గుర్తు.

దేనికీ చెందకుండా, దేన్నీ సీరియస్‌గా తీసుకోకుండా, జీవితం ఎట్లా వస్తే అట్లా, ఎట్లా ఉంటే అట్లా జీవించినవాడు నరేందర్. టీవీ చానళ్ల వ్యాఖ్యాత అయినాక నరేందర్ ప్రముఖుడు అయ్యాడు. ఒక సామాన్యుడిగా, అనివార్యంగా స్వంత కాళ్ల మీద నిలబడడానికి జీవగడ్డకొచ్చి, జర్నలిజంలో ఖ్యాతి మూటకట్టుకుని, ఇప్పుడు నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు నరేందర్. తురగా జానకీరాణి గారింట్లో ఇది రెండో అతి పెద్ద విషాదం.

కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రారంభం నాడు అలనాడు కృష్ణమోహన్ రావును, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం... ఇవ్వాళ్ల నరేందర్‌నూ అర్ధంతరంగా కోల్పోయింది. ఉష ఆడుగుతూనే ఉన్నది. ఎట్లా వెళ్తావ్ నానీ అని.. ఉష దుక్కానికి అంతం లేదు. యాధచ్ఛికమే కావచ్చు, నరేందర్‌ను కడసారి చూసుకోవడానికి వచ్చిన మిత్రులందరం దశాబ్దం పాటు అదే వీధిలో, ఆ మూలన ఆంధ్రజ్యోతి ఆఫీసులో పనిచేసిన జ్ఞాపకాలు ముప్పిరి గొంటుండంగా.... ఇప్పుడిక ఆంధ్రజ్యోతి కార్యాలయమూ లేదు. చివరికి నరేందరూ లేడు. ఎవరితో పేచీ లేకుండా నిష్పూగా తానొవ్వక, నొప్పించక నిశ్శబ్దంగా వెళ్లిపోయినవాడు నరేందర్.
-అల్లం నారాయణ
[email protected]

454

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles