మనసంత మానేరు....


Sun,March 30, 2014 12:51 AM

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ మాత్రం ఆసక్తి లేకున్నా... ఈ కాలమ్ చదవకుండా దాటేసే స్వేచ్ఛ మీకు ఉంది. తెలంగాణ నిర్మాణం, వి నిర్మాణం, పునర్నిర్మాణం, రాజకీయా లు, మానిఫెస్టోలు, బయట స్వైరవిహారంలా పేలుతున్న మాటలు. నిన్నటిదాకా ఒక్కటిగా సాగిన తెలంగాణ, వెయ్యి ముక్కలుగా ప్రతిఫలిస్తున్న క్షణాల్లోనే... మా అన్న టీచర్‌గా పదవీ విరమణ కూడా చేశాడు. ఆ సందర్భంగా మా అన్న మీద ప్రేమతో.... కొన్ని ముచ్చట్లు. ఎందుకో నా బాధ్యత కూడా అనిపించింది. అల్లం వీరయ్య సామాన్యుడు. కాడు కూడా. ఆయన ఒక రైతు. సాదాసీదా బడిపంతులు. కానీ నెనరుగల్ల మనిషి. సమాజం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నలభై సంవత్సరాల ప్రవాహ గానంలో ఆయన ఒక నిశ్శబ్ద వీచిక.

చప్పుడు చేయని లోగొంతు వీరన్న. మేము ముగ్గురం అన్నదమ్ములం. అల్లం రాజయ్య పెద్దవాడు. పరిచయం అక్కరలేనివాడు. వీరన్న కూడా. ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో పాట రాసిన వాడు. అదొక విప్లవ శీర్షిక. విప్లవ పాటకు ఒక కొత్త డిక్షన్. దుక్కమూ, కన్నీళ్లూ, నెత్తురూ, వినిర్మాణమూ, పునర్నిర్మాణమూ... విప్లవాన్ని అల్లం వీరయ్య సజనగా చూశాడు. అదొక వెన్నెల కోన. అదొక భూమి స్వప్నం. అదొక ఎలుగు రవ్వ. తూరుపు దిక్కున సూర్యుడు పుడితే, అంతే సహజంగా ప్రజల మధ్యన పుట్టిన వీరులను ఇంత కళాత్మకంగా గానం చేసిన మరొక పాట లేదు. కానీ మంథని ఆ పరిసరాలు, పూర్వీకుల వత్తి చిహ్నంగా తనతో పాటే మిగిలిపోయిన భూమి భవబంధం. వ్యవసాయం మా అన్న జీవన సర్వస్వం. బోధన ఆయన ఏకైక సజనాత్మక వత్తి.

మా పెద్దన్న రాసిన మహదేవుని కల కథలో ఒక బ్రాహ్మణుల పిల్లవాడు, భూమి లో మొలకలేసిన బెండను గురించిన కుతూహలాల నుంచి సజన, అనుసజనల ద్వైతాద్వైతల స్థితిలో వ్యవసాయం ఒక సజన... అనుకుంటాడు. సష్టి సారాం శం ఈ సజనలోనే ఉందనుకుంటాడు. కానీ మా పెద్దన్న పెద్దగా వ్యవసాయ సంబంధ బందీ కాలేదు. ఆయనది కార్మికలోకపు లోహవిహంగపు రెక్కల చప్పుడు మధ్య గడిచిన కాలేరు బతుకు. పల్లెటూరి ఆత్మను కాపాడుకోవడానికి, పతిపదిలంగా తనలో నిక్షిప్తమై ఉన్న మా గాజుల పల్లెను, మా అమ్మ వాళ్ల ఊరు వెన్నంపల్లిని మనసులో ప్రతిష్ఠించుకొని సంచారిలా పలవరించిన మనిషి పెద్దన్న అయితే వీరన్న వ్యవసాయమే ఒక విప్లవమని, అచ్చం మహదేవుడి కలలో లాగే అచ్చం బ్రాహ్మణ పిల్లవాడిలా వ్యవసాయం సజన, అనుసజన సష్టి రహస్యంగా నమ్మినవాడు.

బడిపంతులయి వుండీ వీరన్న ఒక ఆదర్శరైతులా నిలువెత్తు మిరపచెట్లను పెంచి సంబరపడినవాడు. వరంగల్ బీటు లో అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనుభవ సారమై... అన్న రిటైరయినవు కదా! ఇక పూర్తిగా వ్యవసాయమా? అంటే ఇంకేం ఎవుసం అని నిర్వేదంగా మాట్లాడిండు మొన్న. తెలంగాణలో ఎద్దూ ఏడ్చింది.. ఎవుసమూ ఏడ్చింది.. పాలకుల పాపమూ పండి తెలంగాణ కల సాకారమూ అయ్యింది.
వీరన్న నా వల్ల జైలు పాలయినవాడు. నేనప్పటికే ఉద్యమంలో ఉన్న. వీరన్న జమ్మికుంటలో చదువు. సహజంగనే ఒకటి రెండుసార్లు షెల్టర్. ఆ తర్వాత అది బహిర్గతమై, ఎమర్జెన్సీలో ఏడాదిపాటు జైలు కెళ్లిండు మా వీరన్న. అవ్వ, నాయినలను చూసుకుంట. నేను ఇంటి దగ్గరే ఉంటనన్న వీరన్నకు నేను ఇచ్చిన కానుక జైలు అని బహుశా జీవితాంతం అనుకుంట. మేమిద్దరం ఒకే క్లాస్. నేను కొంచెం ఉచ్చిలి. మా వీరన్న మెతక. మా నాయినలా ఇసారం మని షి.

చెప్పొద్దూ మేం ముగ్గురం అన్నదమ్ములం సాదాసీదా మనుషులమే. ఇప్పటికీ ఆడంబరాలు, అట్టహాసాలు ఎరగని వాళ్లమే. మా జీవితం మాకా సౌకర్యం ఇవ్వలేదు. కలిసి వచ్చిన కాలాలూ లేవు. విప్లవాలు, పోరాటాలు... ఆరాటాలు. జైళ్లు.. చిత్రహింసలు. ఇల్లు సోదాలు. పుస్తకాలు ఎత్తుకెళ్లడాలూ... నిత్య నిర్బంధంలో ఒక దశాబ్దమంతా మా అమ్మ నిశ్శబ్దంగా రాత్రిళ్లు ఏడ్చేది. పెద్ద కొడుకు కాలరీలో ఉంటె. చిన్నోళ్లం మేమిద్దరం జైల్లో... మా ఇల్లు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండేది. జైలుకు వెళ్లిందెందుకో తెలియదా? అంటే అర్థం చేసుకోవడమూ కష్టమైన రోజుల్లో బిగ్గరగా ఏడిస్తే ఊరంతా ఏమనుకుంటదో? అని నిశ్శబ్దంగా ఏడిచేది. మా అమ్మ, మా చెల్లె తోడుగా... అక్షరం ముక్కరాని మా నాయిన హైకోర్టు దాకా తిరిగేవాడు. కాలు కాలినట్టు. మా వ్యవసాయం కుంటుపడింది. అప్పుడు మా అన్న విడుదలయినాక మా ఇంటికి ఇల్లును దురస్త్ చేసే ఒక రక్షకుడిలా వెళ్లాడు. వ్యవసాయంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు... ఎవరూ చేయలేదు. బండలాగ కష్టపడిన మా అన్న... మిరప చెట్లకు సర్ఫ్ కొట్టవచ్చా? అని ప్రయోగాలు చేసి ఇల్లు నిలబెట్టిన యోధుడు.

అమరులను దూర తీరం మీరుబోతె ఎర్రమొగ్గలాలి
రెక్కలుంటే లేసిరండి అనే మాటతో పిలవడం ఎవరికి సాధ్యం. మా వీరన్నకే. విద్యార్థి ఉద్యమం పొడవునా వీరన్న రాసిన పాటలను నేను గానం చేసేవాణ్ని. సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారివాన ఉయ్యాలో అనేవాడు కూడా వీరన్నే..

ఆయనది కలం. నాది గళం. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ దాకా ఒకే క్లాస్. పుస్తకాలూ ఒక్కటే.. ఆరు కిలోమీటర్ల నడక. ఆకలి. చీకటి. తెలుసా! చేన్ల దోసకాయలూ, కాలువల్ల, వరి దొయ్యల్ల చేపలు... అహో ఏమి ఆ జిందగీ. నా వల్ల మా అన్న పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలేదనుకుంటా.. ఒకసారి మంథని నుంచి మా ఊరికి నడుస్తున్నాం. సరిగ్గా మా ఊరి దారి మధ్యలో గౌండ్లోల్ల కొట్టాలు. అవిప్పుడు లేవు. కానీ అప్పుడు రోడ్డు లేదు. గౌండ్లోల్ల కొట్టాల నుంచి మంథనికి కంకర రోడ్డు. ఆ దిగువన మా ఊరి దిక్కు మట్టిరోడ్డు. బురద. ఐదారుగురు పిల్లలం కలిసి రోడ్డు దిగుతున్నం. ఒక పోలీసు సైకిలు మీద మా ఊరి దిక్కు నుంచి మంథనికి ఎదురెక్కి వెళ్తున్నడు. సరిగ్గా బురదరోడ్డు దాటి కంకరరోడ్డు ఎక్కినంక.. చెట్టు మీద కొంగ... పోలీసోడు దొంగ అని పాడిన.. ఒకటే ఉరుకుడు. నా ధైర్యం ఏమంటే బురదల సైకిల్ నడవదని... ఇకనేం. అప్పటి నుంచి వీరన్న నా వెంట ఉండడమంటే ఏదో ఒక సమస్య తెస్తడని ఇంట్లో చెప్పేవాడు. మా అవ్వ నాకు బడితె పూజ ప్రాప్తం చేసేది... అట్లా ఇప్పటి దాకా మా అన్న నా వెంటే, నా క్లాస్‌మేట్ లాగే ఉన్నట్టు... నేను ఏదన్నా ఎక్వతక్వ చేస్తే ఆయన అదేందిరా అంటున్నట్టు... లేదా నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టు... నన్నేమీ అనలేక.. మౌనంగా ఉన్నట్టు అనుకుంటా...

అమరులను దూర తీరం మీరుబోతె ఎర్రమొగ్గలాలి రెక్కలుంటే లేసిరండి అనే మాటతో పిలవడం ఎవరికి సాధ్యం. మా వీరన్నకే. విద్యార్థి ఉద్యమం పొడవునా వీరన్న రాసిన పాటలను నేను గానం చేసేవాణ్ని. సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారివాన ఉయ్యాలో అనేవాడు కూడా వీరన్నే.. నేను పెద్ద పాటగాణ్ని కాదు. కానీ జన నాట్యమండలి అనివార్యతల్లో మా అన్న పాటలన్నీ కొత్తవీ... పల్లె పదాలవీ, జానపదుల మాతకలవీ అయినందువల్ల అవి గొప్పగా వ్యాపించేవి... ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో జగిత్యాల జైత్రయాత్ర మహా వేదిక మీద పాడడం ఇప్పటికీ నాకు ఒక గుర్తుగా జీవన సాఫల్యంగా ఘనకార్యంగా... గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అది అన్న పాట. నా పేరున అచ్చయింది. వీరన్న వెలుగులోకి రాలేదు. అల్లం వీరయ్య పాటలు... అనే పుస్త కం వచ్చింది. నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చినా ఆ తర్వాతి కాలంలో...నీవునేను తెలంగాణ... నీలిగగన ప్రాంగణాన అని అద్భుతమైన తెలంగాణ పాట రాశా డు. నేను పాడే స్థితి నుంచి వాగే స్థితిలో ఉన్నా... అన్న పాట ఆ ఒక్కటే కాదు తెలంగాణ ఏ పాటా ప్రాచుర్యంలోకి రాలేదు.

బడిపంతులుగా వీరన్న ప్రస్థానం ఆదిలాబాద్ తిర్యాణి నుంచి మంథని దాకా సాగింది. తొలినాళ్లలో వాగులు వంకలు దాటి, బడికి రాని పిల్లలను ఒప్పించి ఎట్లా పనిచేసిండో... పెంచికలపేటలో వీరయ్య సారు బదిలీ అయితే ఊరంతా వీడ్కోలిచ్చి, పిల్లలు వెక్కిళ్లు పెట్టి ఏడ్చి... నిజానికి మా గురువుల ప్రభావం తర్వాత వీరన్న కూడా మంథనిలో ఒక గురువుగా పెద్ద ప్రభావమే. తన ఇద్దరు పిల్లలనూ ఇంగ్లీషు మీడియం కాకుండా టెన్త్ దాకా తను పనిచేస్తున్న స్కూల్లోనే చదివించినవాడు కూడా అన్నే. అన్న పాటల సష్టికర్త.
వాగ్గేయకారులెవరు? ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? చర్చలు నడుస్తున్న కాలాల్లోనే.. అన్న నిశ్శబ్దం గా విప్లవం కోసం రాశాడు. తెలంగా ణ కోసం రాశాడు.

పిలగాని ఏడు పు.. వాసన లాంటి అద్భుతమైన కథ లూ రాశాడు. మల్లా రాజిరెడ్డి అమ్మ.. రాజవ్వను అందరి అమ్మగా కీర్తిస్తూ రాశాడు. మానవ, స్త్రీ పురుష సంబంధా ల మీద, ఇంటి సున్నితత్వాల మీద కవిత్వమూ రాశాడు. అన్న ఇప్పుడు చేసిన ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు. మనిషి స్థిమితంగా లేడు. కానీ తెలంగాణ వచ్చినందుకు సంబురంగనే ఉన్నడు. ఇంతమంది కవులను, గాయకులను, కీర్తిని, కండూతిని, పలుకుబడి కోసం పడరాని పాట్లు పడడాన్ని చూసిన నాకు గొప్ప పాటలు రాసీ సాదాసీదాగా ఉన్న, ఉంటున్న... బతుకే అతి సామాన్యమైన నడకలా భావిస్తూ ఉన్న మా వీరన్నంటే ఒక గొప్ప ఉత్తేజం. సుదీర్ఘ రాత్రుళ్లూ... మేము విప్లవాల గురించి కలలు కనే వాళ్లం.. ఆదీ అంతంలేని మాటల్లో ముగ్గురన్నదమ్ములం తెల్లవార్లూ మేల్కాంచేవాళ్లం.. మా అసలు కల సాఫల్యం కాలేదు. చాలామంది మిత్రులను పోగొట్టుకున్నాం. చాలామంది మారెక్కల్లో బొక్కల్లో మెలిగిన వాళ్లను కోల్పోయాం.. వీరన్న అతి నున్నితమైన ఒక పుష్పం లాంటి క్రియాశీలి. ఇప్పుడు స్థిమితంగా కవిత్వమూ, పాటలు సజన, అనుసజన రంగాల్లో క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటూ... రిటైర్ అయినందుకు రాయడం ఫ్యూడల్ చిహ్నం అయితే కావొచ్చు కాక. మా అన్న మీద ప్రేమతో... కతజ్ఞతతో...

[email protected]

1056

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles