ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ


Sun,March 23, 2014 04:50 AM

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది.

ఐచ్ఛికత ఒక ప్రమాణం. ఒక విలువ . ఉద్యమాల వెంట నడిచిన పాత తరం ఐచ్ఛికంగానే ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు. కోటలు, పేటలు నడిచారు. చిత్రహింసలు అనుభవించారు. చట్టసభలు పందులదొడ్లుగా ప్రచారం చేశారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం, నక్సల్బరీ ప్రవాహంలో ఏటి కి ఎదురీదిన తరంలో ఉద్యమాలన్నీ ఎలాంటి స్వీయ ప్రయోజనాలు కోరుకోని త్యాగం ఒక అత్యున్నత విలువగా ఎదిగినవాళ్లే.
ప్రజల కోసం ప్రాణమివ్వడం హిమాలయాలకన్నా ఉన్నతమైనదనే విలువ వేలాది యువకుల ను ఎర్రెర్ర దారుల్లో నడిపించింది. విప్లవం విందు భోజనం కాదనేది ఒక నినాదం కాదు. ఆచరణ సూత్రం. సైద్ధాంతిక నిబద్ధత, నిమగ్నతలు యువకులను అగ్నిగుండాల్లో దూకే సాహసాలకు పురికొల్పింది. వారెవరికీ చట్టసభల యావలేదు. విప్లవ పార్టీలే కాదు, ఆ పార్టీలకు, వాటి భావజాలాలతో కొనసాగిన ప్రజాసంఘాలకు, సంస్థలకు కూడా ఇవే ప్రమాణాలు.దూసుడు ముడుసుడు నుంచి వేషధారణ దాకా చాదస్తం స్థాయిలో కొనసాగేవి.

udyamamపట్టుచీర కట్టుకోవడమనేది కలలోని మాట. అమెరికా వెళ్లడమంటే, పిల్లల్ని చదివించడమం ద్రోహులను చూసినట్టు.. కిన్లే బాటిల్‌కున్న రేపర్‌ను తీసేసి సభల్లో పెట్టడం స్వయంగా అనుభవం. ఏది తినాలి. ఏది తాగాలి. ఎట్లా సర్వసంగ పరిత్యాగిగా ఉండాలి. అతి సామాన్యంగా ప్రజలతో ఎట్లా మమేకం కావాలి. జీవించాలి. పోటీపడి ఇట్లాంటి కొన్ని విలువలు ఎవరూ చెప్పకుండానే పాతుకుపోయేవి. తాగడం అయితే ఊహించే విషయమేకాదు.
బాలగోపాల్ ఒకప్పుడు స్మోకర్. ఎందుకు మానేశారంటే డబ్బులు ఖర్చవుతవని. సిగరెట్లకు ఖర్చు పెట్టడం వథా అని.. సమాధానం. ఇవన్నీ పాత విలువలు, చాదస్తాలుగా మారుతున్నట్టు కళ్లముందు కనపడ్తున్నది. కనుమరుగవుతున్నదా? విప్లవ రాజకీయాల ప్రభావాల్లో నుంచి తెలుగు సమాజం బయటపడుతున్నదా? ప్రపంచీకరణ తర్వాత చాలామంది మాట్లాడుతున్నట్టు, ఆధునికానంతర ధోరణుల్లో వ్యక్తి కేంద్రకంగా కేరీర్, పలుకుబడి, ప్రతిష్ట, అధికారకాంక్ష, లాభచింతన మనుషుల్లో వచ్చిన పోరాట తత్వాలను, త్యాగనిరతిని, సమాజానికి అంకితమయ్యి పనిచేసే తత్వాన్ని, తను కాకుండా, సామాజికమయ్యే ఒక చైతన్యవెల్లువ అంతరిస్తున్నదా? ఇన్ని ప్రశ్నలు.
మాయమైపోయిన మనిషి నిజంగానే ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన శక్తులు, ముఖ్యంగా మాజీ మావోయిస్టు వాద శక్తులు, వామపక్ష ప్రభావితులైన వాళ్లు రెండు విధాలా చైతన్యం పొందారు. ఒక దశలో రాష్ట్రంలో కనీసమైన ప్రజాస్వామ్య స్వేచ్ఛలు లేని, మాట్లాడే స్థితిలేని ఆట పాట బందయిన తీవ్ర అణచివేత కొనసాగింది. ప్రగతిశీలశక్తులు, పౌరహక్కుల ఉద్యమకారులు, నానా విధ వామపక్ష భావ ప్రభావితులు స్తబ్దంగా, మాట్లాడలేని స్థితి.
కనీస కార్యాచరణ లేని కాలంలో నూ ఎప్పుడూ ఒకే తీరుగ నిలబడిన వాళ్ల మాటవేరు. కానీ తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ స్వేచ్ఛ వెసులుబాటును తెచ్చింది. మనుషులు మా యం అవుతున్న రోజుల్లో క్రూరమైన చంద్రబాబు పాలన, ఆ తర్వాతి కాలం లో కూడా రాజ్యహింస వెర్రితలలు వేసింది. కానీ ఏమీ మాట్లాడలేని స్థితిని, కాలు కదల్చలేని స్థితిని, ముఖ్యంగా వామపక్ష ఉద్యమాలతోమమేకమై ముద్రపడిన వారు మాట్లాడాలంటేనే ఒక్కొక్కప్పుడు ప్రాణాలకు తెగించాల్సి ఉన్న స్థితిని, ఆ ఉక్కు సంకెలను బద్దలు కొట్టింది తెలంగాణ ఉద్యమం.
కేవలం ప్రజాస్వామ్య లక్ష్యాలతో, శాంతియుత పోరాటంగా జరగడం దానికదిగా ఒక విలువగా అప్పటిదాకా ఉన్న రాజ్యాంగ ధిక్కరణ, వ్యతిరేక పోరాటాల స్థానంలో రాజ్యాంగస్ఫూర్తితో జరిగిన పోరాటంగా తెలంగాణ పోరాటం పూర్తి అస్తిత్వ పోరాటంగా విశాల ప్రాతిపదిక సంతరించుకున్నది. బుద్ధిజీవులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు ప్రారంభించిన మలిపోరు ఒక రూపం దిద్దుకుంటున్న క్రమంలోనే స్వయంగా అప్పటి పీపుల్స్‌వార్, వీరన్నలు కూడా మద్దతు ప్రకటించినప్పటికీ కనీసం పౌరహక్కుల సభలను కూడా అనుమతించని పోలీసులు, తెలంగాణ సభలను అనుమతించారు.
ఈ సభల్లో విశాల ప్రాతిపదికన సమూహాలు ఏకీకరణ కావడం, సమాజంలోని భిన్న వర్గాలు అప్పటికే గౌరవాన్ని సంతరించుకున్న తెలంగాణ సెలబ్రిటీస్ కూడా పాత్రదారులు కావడం కలిసొచ్చింది. ఆ తర్వాత ఈ సేచ్ఛా వాతావరణం పాదుకోవడానికి, క్రమక్రమంగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమం పుంజుకొని నిలబడి ఆ ఉద్యమంతో పాటు అప్పటి అణచివేతలను కూడా ప్రశ్నించే వెసులుబాటు, స్వేచ్ఛలకు సావకాశం వచ్చింది అనేకన్నా తెచ్చింది మాత్రం కేసీఆర్ తరహా రాజకీయ పోరాటమే.
తెలంగాణ కోసం ఒక పార్టీ ఏర్పాటు చేయడం, ఆపార్టీలో పూర్వపు అన్నిరకాల మార్క్సిస్టు భావజాలాల వారిని ఆహ్వానించడం, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా ఒక నినాదం కావడం అట్లాగే కచ్చితంగా తెలంగాణ రాజకీయ ప్రక్రియద్వారానే సాధ్యమని, అందుకు సాయుధ పోరాటాలు అసాధ్యమని, ఒకేఒక్క మార్గం ఢిల్లీలో రాజకీయ ప్రక్రియ, తెలంగాణలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల్లో, పూర్తి శాంతియుత ఒత్తిడి అనే టీఆర్‌ఎస్ రెండంచెల విధానం కారణంగా తెలంగాణ సమాజం ఒక రాజకీయ పరిమిత పోరాటాన్ని విజయవంతంగా నడిపించింది.
ఈ పోరాటంలో పాల్గొన్న చాలా మంది వారసత్వం ఐచ్చికతసామాజిక స్పహ, సమాజం కోసం పనిచేయడం అనే విలువలు కలిగిన వారే. కానీ తీరా తెలంగాణ వచ్చినాక ప్రతి వాళ్లూ ఏదో ఒకటి కోరుకోవడం, ఇలాంటి విలువలు, రాజకీయాల నుంచి వచ్చిన వాళ్లను కూడా స్వీయప్రయోజనాలు, కీర్తి కండూతి అనేవి ఆవహించడం ఎందుకో జీర్ణం కావడంలేదు.
రెండవది స్తబ్దుగా సామాజిక సంబంధం లేకుండా, ఎవరి కలుగుల్లో వారు దూరిన ఎలుకల్లాగా ఉన్న వాళ్లను మళ్ళీ తెలంగాణ ఉద్యమం చైతన్యవంతులను చేసింది. అర్థం పర్థం, పరమార్థం లేని చాలా మంది మాజీ ఉద్యమకారుల ను తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి వేదికల మీద నిలబెట్టింది. జీవం నింపింది. వ్యక్తిగతంగా మరోసారి సామాజిక, ప్రజల సంబంధాలలోకి తెచ్చింది. కానీ ఏ వారసత్వం నుంచి ప్రజా ఉద్యమాలలో ఐచ్ఛిక భాగస్వా మ్యం అనే విలువను తాజా మాజీ ఉద్యమకారులు అది మరిచి సీట్ల కోసం దస్తీలు పరవడం షాకింగ్‌గా ఉన్నది.
మరోవైపు ఆ తరపు ఉద్యమాలు, ఆ తరపు విద్యార్థుల త్యాగనిరతి, నిబద్ధత, నిమగ్నతల వారసత్వం కూడా కొనసాగడం ప్రశ్నార్థకమే. ఏ ప్రజలైతే చైతన్యం ఇస్తారో, ఏ సమాజం అయితే చైతన్యవంతం చేస్తుందో, ఆ ప్రజలకు మళ్ళీ ఉపయోగపడడం అనే విలువ తారుమారై ప్రజలతో, ఉద్యమాలతో వచ్చిన పలుకుబడిని చట్టసభలకు మెట్లు గా, స్వీయ ప్రయోజనాలకు ఊతంగా ఉపయోగించుకునే విలువ పెరిగింది. ఇది పతనం కాదా! అస్తిత్వ ఉద్యమాలంటే స్వంత అస్తిత్వ ఉద్యమమేనా?
టీవీలో ముగ్గురు విద్యార్థి నాయకులు మూడు పార్టీల తరఫున తీవ్రంగా ఘర్షణ పడడం చూసినప్పుడు, ఈ ఉద్యమం ఇచ్చిన చైతన్యం ఏమిటి? అది కొనసాగుతుందా? ఒక సందేహమే. జర్నలిస్టు ఫోరమ్‌లో ఈ విలువ గురించి పదే పదే మాట్లాడే వాడిని. తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం చేద్దాం. కానీ ఈ ఉద్యమం చట్టసభలకు మెట్లుగా ఉంటే మనం ఉద్యమ కారులం కాబోము అని పదేపదే అంటున్నప్పుడు విభేదించిన వాళ్లూ ఉన్నారు.
కానీ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు విప్లవకారులుగా ఉండాలని కోరుకోవడం, అంత కఠినంగా ఉండాలని ఆశించడం ఆదర్శం అవుతుందేమో కానీ, సామాజిక జీవితంలో ఉన్న వాళ్ళు ఉద్యమాని కి ఉపయోగపడాలి కానీ, ఉద్యమా న్ని ఉపయోగించుకోకూడదు అనే కనీస విలువ పాటించాలనే చిన్న ఆశ ఉండడం తప్పు కాదనుకుం టా. ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. మరొకవైపు ఆధిప త్యం తొలగిపోదు.
అంత సులభంగా అంతరించదు. పరోక్ష ఆధిపత్యం వ్యవస్థితమయ్యే అవకాశాలు ఎక్కు వ. ప్రపంచ అభివద్ధి నమూనాలు రాజ్యమేలుతున్న వేళ తెలంగాణ మినహాయింపు కాదు. అందుకన్నా మనం మిగిలే ఉండాలి. మనం వాచ్‌డాగ్‌లమే కావాలి. ఇది తెలంగాణ పోరాటాల వారసత్వం ఇచ్చిన కనీస విలువ. ఐచ్ఛికత ఒక కనీస విలువ. కాపాడుకుందామా?
(కోదండరాం, ఘంటా చక్రపాణిలకు అభినందనలతో..)
[email protected]

235

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...