దూరాలు లేవు.. ద్వారాలు లేవు..


Sun,March 2, 2014 12:43 AM

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ
మన మధ్య లేవు నారాయణా...
-ఇష్టంతో ఉమామహేశ్వరరావు
తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకుంటూ ఉన్నా. ఉమతో, విష్ణుతో స్నేహం ఇవ్వాల్టిది కాదు. అట్లాగే తిరుపతి బ్యాచ్ అనదగిన ఉమ, సౌదా, త్రిపురనేని శ్రీనివాస్ (ఒకటే జీవితం మరిలేనివాడు) పరిచయం లేకున్నా వీళ్లు కట్టగట్టుకొని రొమాంటి సైజ్ చేసిన దామూ... అందరికి మిన్న నామిని సుబ్రమణ్యం నాయుడు. అందరూ ఏకకాలంలో గుర్తుకు వస్తూనే ఉన్నారు. వీళ్లే కాకుండా నాకు కేఎస్వీ, భూమన కుటుంబాలతో పరిచయాలున్నాయి. తిరుపతి సాహిత్య వాతావరణం బాగా ఇష్టం. రాయలసీమ మాండలికం అంటే ప్రేమ. ఇష్టం. జీవితాల చిత్రణలో సీమ ప్రాంతం సాహిత్యానిది ఒరవడి. తెలంగాణ లాంటి భాషా వివక్షను అనుభవించిన వాళ్లదే ఈ ప్రపంచం.

పోతిరెడ్డిపాడు సంగతులు మాట్లాడినప్పుడల్లా ఆ తెల్లారే కొట్లాడే చంద్రశేఖర్‌రెడ్డి. కర్నూలు పాణి, అరుణ్ సహా అనేకమంది. పలమనేరు బాలాజీ చైతన్య స్రవంతి. ఇట్లా సీమతో పేగుబంధం లాంటిదేదో? కష్ణా నదిలో పుట్టి మునిగి అకాలమరణం పొందిన కష్ణ (లింగమూర్తి), ఇట్లా తలపోతలు పెరుగుతూపోతున్నవి. నెల్లూరు నా రెండో ఇష్టమైన ఇల్లు లాంటి స్నేహాలు. అజయ్, వసంత్ లాంటి చిరకాల మిత్రత్వాలు. కష్టాలు సుఖాలు కలబోసుకున్న జీవితాలు. ఉత్తరాంధ్రతోనూ అదే బంధం. విశాఖలో చలసాని ప్రసాదూ, కష్ణక్క, కారా... మా బమ్మిడి. సోంపేటలో కదిలిమెదిలిన ఉద్దానం ఉత్తుంగ తరంగం. సోంపేట తెలంగాణ దిక్కు ఆశగా చూసిన తడియారని నెత్తుటి మనాది. ఇవన్నీ ఏమవుతాయా? నిజమే కదా! తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినంత మాత్రానా భౌగోళిక హద్దులు పడినంత మాత్రానా జీవితం పొడవునా నిర్మించుకున్న ఈ భావ వారధులు, ఈ మనిషి మనిషీ కలిపి నిర్మించుకున్న పాత వంతెనలు కూలిపోతాయా? నిజమే ఉమా... కొత్త దూరా లూ లేవు.

కొత్త ద్వారాలూ ఉండవు. మన కోసం మూతపడే తలుపులేవీ ఇంకా ఈ ప్రపంచం తయారు చేయలేదు. అవునూ ఉమకు భరోసా అవసరమా? ఆ మాటకొస్తే ఆంధ్ర, రాయలసీమ సామాన్య ప్రజానీకానికి, సాహితీకారులకు, ఆలోచనాపరులకు, బుద్ధిజీవులకు తెలంగాణ గోస తెలియదా? తెలంగాణ తత్వం తెలియదా? మలి తెలంగాణ ఉద్యమం ఏ పునాదుల మీద నిర్మితమయిందో? అది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగస్ఫూర్తితో, ఒక సానుకూల దక్పథంతో, విద్వేషం దినుసుగా కాకుండా ఎలా నడచిందో? తెలియ దా? విడిపోయి కలిసి ఉండలేనంత విషతుల్యమయిందా? వాతావరణం. ప్రశ్న లు బాగా లేవు.
బెజవాడ ఖాదర్‌మొహియొద్దీన్ ఫోన్. ఖాదర్ బెజవాడ అంటే తెలుస్తడా? లేదు. పుట్టుమచ్చ ఖాదర్. రాజ్యసభలో బిల్లు అయిపోయినంక అభినందిస్తూ ఫోన్ చేశాడు. తెలంగాణకు ఆయనేమీ అనుకూలంగా లేకుండె. కానీ ఆత్మకొట్టుకులాడి ఉంటుంది. ఒక మిత్రుని విజయం ఆయన విజయంగా కూడా స్వీకరించి ఉంటాడు. అస్తిత్వాలు గెలవాలి. అది ఏ అస్తిత్వమైనా సరే. ఎవడి ని వాడు వెదుక్కుంటున్న క్రమాల్లో తెలంగాణ ఒక వెలుగు రేక. ఒక గెలుపు. బెజవాడ గుర్తొస్తున్నది. ఖాదర్ ఇంట్లో ఉన్నరోజులు.

మహాతల్లి ఉష. సున్నపు బట్టీల సెంటర్. వచ్చీపోయే రహస్య అతిథులు. బీఎస్. రాములు. కొంచెం ఇటుగా వస్తే డానీ ఇల్లు. ఆ ఇంటికిప్పుడు తాళాలున్నాయో, తలుపులున్నా యో, ఆ ఇల్లు డానీ, అజితలకు ఉందో? లేదో? తెలియదు కానీ. ఆ ఇల్లు అప్పుడొక స్వయం విముక్తి ప్రాంతం. తలుపులూ తాళాలులేని ఇల్లు. ఇటొస్తే అఫ్సర్. వేణు ఇల్లు. కాస్త దాటితే కరుణక్క. జీవితంలో నా ఎవర్‌గ్రీన్ హీరో కొండపల్లి సీతారామయ్య. చుక్కు చిన్ని. పక్కన అనసూయమ్మ. ఆమె ఇంట్లో హిందూలో (ది లెజెండ్) అని వచ్చిన గద్దర్ బొమ్మతో పోస్టర్ అంటించిన గోడ. నవోదయ రామ్మోహన్‌రావు. బందరు రోడ్డులో వసంత. ఎక్స్‌ప్రెస్‌లో జగన్. ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఉపేంద్ర, నండూరి, కొమ్మూరి రాజా... బాబూరావు, గోపాల్‌రావు, నందకిశోర్, బషీద్‌లలో అల్లం నారాయణ. వాసుదేవరావు మప్పిన బాబాయ్ హోటల్ ఇడ్లీ. సున్నితమైన మొహమూ, కార్యాచరణలో కరుకుగా తేలే రాం ప్రసాద్. హెస్ చచ్చాడు అని పతాక శీర్షిక పెట్టి తిట్లుతిన్న ప్రకాశ్. గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ వచ్చినంత మాత్రాన వేణుగోపాలరావు (లేరు), కష్ణక్కల ఆ అనుబంధాలు చెరిగిపోతాయా?
కష్ణక్కతో నా ఆత్మీయ సంభాషణకు ఆదీ అంతమూ ఉంటుందా? తెలంగాణ వచ్చినంత మాత్రాన అలనాటి జీఎస్‌లూ.. సున్నపు బట్టీల అనంతర మో ఇల్లు జ్ఞాపకం చెరిగిపోతుందా? కెనచారి జ్ఞాపకం. బెజవాడ రోజులు.

కాలం చాలా గడిచింది. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి వీటికీ సంబంధం ఉందా? ఉన్నది. మనం వేరయిపోయినామా? నిజంగానే భద్రత లేదా? హైదరాబాద్‌లో ఉన్న వాళ్లను వెళ్లగొడ్తారా? జరుగుతాయా ఇవన్నీ. ఇప్పుడొక సంభాషణ జరగాల్సి ఉన్నది. ఉమ అదే అంటాడు. ప్రాథమిక రూపంలోనైనా మనమూ మాట్లాడుకోవాల్సే ఉన్నది. మళ్లీ మనను మనం పరిశుభ్రం చేసుకోవాల్సే ఉన్నది. తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో సీమాంధ్ర పౌర సమాజం కూడా అపోహలకు లోనయింది. చిన్న చిన్న మాటలను పట్టించుకుని పెడర్థాలు తీసింది. కారణం ఒక విధంగా మీడియా. మరో రకంగా కావాలని తెలంగాణ అడ్డుపడడానికి పనిగట్టుకొని రెచ్చగొట్టిన రాజకీయ నాయకత్వం.

ఆనాడూ ఈనాడూ కోదండరాం అట్లాగే ఉన్నడు. నిజమే ఆయన రాజకీ య పండితుడు కూడా. హక్కుల కార్యకర్త. ప్రాంతాలకు అతీతుడు. ఇవ్వాల్టి కీ ఆయన తెలంగాణలో ఒక రాజకీయ నేత మాత్రమే కావడానికి ఇష్టంగా లేడు. ఆయన ఎన్నడూ విద్వేషభాష మాట్లాడలేదు. సోంపేటకూ, కాకరాపల్లి కీ, మడ అడవులు అంతరించిపోయే కోస్తా కారిడార్ మీద నిజనిర్ధారణకూ తయారుగానే ఉంటాడు. గద్దర్ ఎప్పుడూ తననాల్క మీద విద్వేష మాట రానివ్వలేదు. ఆయన అతీత గాయకుడు. కేసీఆర్ ఉద్యమం జరిగినప్పుడు ఏమ న్నా... మొన్న జరిగింది జరిగిపోయింది. ఇక మనం కలిసే బతుకుదాం... అని ప్రకటించి ఉన్నాడు. నిజమే తెలంగాణ ఉద్యమం మీద అపోహలు సష్టించా రు.

వక్రీకరణలు చేశారు. అగ్నిగుండం అన్నారు. ఏకపక్షంగా మాట్లాడి విద్వేషాన్ని సష్టించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. 1969కి, 1996 కూ మధ్య తేడా లేదా? మిత్రులారా తెలంగాణను అర్థం చేసుకోలేకపోతే, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తినీ అర్థం చేసుకోకపోతే మీదే వైఫల్యం. జరిగిందా? ఎన్నడన్నా ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైన పోరాటం. ఇంత శాంతిగా, ఇంత రాజ్యాంగ పరిధిలో, ఎదుటి మనుషుల మీద ద్వేషం లేకుండా, జరిగిందా? జరిగినా విజయం వరించిందా? అంతెందుకు! అస్తిత్వం కోసం జరిగిన ఒక పోరాటం రాజ్యాంగ పరిధిలో గెలుస్తుందని నమ్మగలమా? కానీ నిజం అదే. పూర్తిగా న్యాయబద్ధమైన ఒక డిమాండ్ తెలంగాణ. విశాలంధ్ర విఫలం అయినాక తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం తప్ప అన్ని దారులూ మూసివేసింది సీమాం ధ్ర పెత్తందారీ రాజకీయ నాయకత్వం. మనం కవిత్వాలు రాసుకున్నాం.

కావడికుండలుగా కవిత్వాల్లో జీవితాల్నీ పంచుకున్నాం. శ్రీరాములూ, కోయి కోటేశ్వరరావు, కత్తి పద్మారావూ కవిత్వ పూరే కులమై కలిసున్నాం. కానీ మనుషులను ముక్కలుగా నరికిన ఒక పెత్తందారు. తెలంగాణను ఆగం చేసి, హక్కులు హరించి, ఒప్పందాలు ఉల్లంఘించి, రాచిరంపానబెట్టి మరి కలిసి భౌగోళికం గా బతకలేని విద్వేషపు బాటలు వేశారు. వారి భాష వేరు. ప్రజల భాష వేరు. రాజకీయ సంకర నేతలు, కాం ట్రాక్టర్లుగా బలిసి, రాజకీయ పీఠాలెక్కి, అంతర్జాతీయ పెట్టుబడిదారీ వేదికల మీద ఎగిరిన నయా సంపన్న వర్గాల ప్రతినిధులు. వారికి మనుషులతో సం బంధం లేదు. పెట్టుబడులు పెట్టిన పెత్తందారీ ప్రయోజనాల్లో విశాలాంధ్ర ఏకపక్షమైంది. తెలంగాణ పోరాడింది. శాంతిగా పోరాడింది. సహనంలో పోరాడింది. తనను తాను హననం చేసుకొని పోరాడింది. కానీ ఒక్కమాట విద్వేషంగా పలకలేదు. మిత్రులారా విడిపోయాం. కానీ ఏదూరాలూ లేవు. కలిసుందాం. మీరూ మేమూ నడవాల్సిన మార్గాలున్నాయి. మీరూ మేమూ పంచుకోవాల్సిన పలుకులున్నాయి. మీరూమేమూ పాటలమై ప్రవహించవలసి ఉన్నది. కథలు కలబోసుకోవాల్సి ఉన్నది. ఉమ్మడి జీవి తం తాలూకు ఫలాలు.. ఎవరి ప్రాం తంలో వారు ఆత్మగౌరవంతో జీవించే రోజుల్లో వచ్చే కలివిడి తనంతో నిజమే ఉమా... నీకూ నాకూ ఏ దూరాలూ లేవు. ద్వారాలూ లేవు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పొద్దున ఒక సమావేశం జరుగుతున్నది. మహోన్నత పోరాటాల, త్యాగాల, ప్రగతిశీల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలుగా చదువుకొని ప్రయోజకులైన వారు... పూర్వ విద్యార్థులు సామాజిక సంభాషణ కోసం తెలంగాణను రెండు చేతులా ఆహ్వానిస్తూ... విడిపోయి కలిసుందాం అని పిలుపిస్తున్నరు. రాండి. కలిసి కలెబోసుకుందాం. జై తెలంగాణ. తెలంగాణ వర్ధిల్లాలి. సీమాంధ్ర వర్ధిల్లాలి. విడిపోయినం. కలిసుందాం.
[email protected]

860

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles