తెలంగాణ ఒక వెలుగుచుక్క...


Wed,February 19, 2014 12:17 AM

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ముందు పూలుంచి, శిరసు వంచుకొని నిలబడినప్పుడు ఆత్మల సవ్వడి జై తెలంగాణ అని వినపడినప్పుడు. ఇగ వశమా! పిలువరాదు లేచిరమ్మని శ్రీకాంత్‌ను... పిలవరాదు యాదయ్యను... కేకేసి పలికించరాదు ఇషాన్‌డ్డిని... తెలంగాణ గెలిచింది. రమ్మనరాదు జయశంకర్ సారుని.. కాళోజీని పిలగండ్లు పచ్చటికల నిజమైంది.
అనేక కలల తెలంగాణ. ఒక కల నెరవేరింది. నిలిచింది. గెలిచింది తెలంగాణ. రాజ్యతంవూతము నడిపింది తెలంగాణ. కొట్లాడింది. వీధుల్లో పోరాడింది. ఒక మంకెనపువ్వై వికసించింది. విద్యుత్తేజం వలె విస్తరించింది. కొమ్మలు నరికిన చెట్టువలె కుమిలిపోయింది. కూలిపోయింది. తేరుకున్నది. పడినా లేచిన కెరటం వలె హోరెత్తింది. దిగులు కమ్మినప్పుడు చుట్టూ చేతులు కమ్ముకుని ఒక్కటిగా తన దుక్కం తానే అయింది. గాయపడింది. తల్లడిల్లింది. హఠాత్తుగా ఎగసిన ఒక తారాజువ్వవలె పతాకస్థాయి పోరాటం నడిపింది. రోదించినప్పుడు... కదుములు కట్టిన ఎదగాయాలు సలిపినప్పుడు తండ్లాడింది తెలంగాణ. కడవల కొద్దీ కన్నీటి సమువూదాలు. రైలుకు ఎదురేగి జై తెలంగాణ అన్నవాడి అవయవాలు ముక్కలై కూడా తెలంగాణతో ముడివడి కొట్టుకుంటున్నప్పుడు... బస్సుకు, మోటర్ సైకిల్ మీద ఎదురేగి ఢీకొని మృత్యువును ఆహ్వానించినప్పుడు... పచ్చని చెట్టుకు ప్రాణం ఉరిపోసుకుని త్యాగం వాయులీనమైనప్పుడు... నిలువునా మంటల్లో జ్వాలై నిండు తెలంగాణ మండినప్పుడు.... ఒకటా... రెండా? ఎన్ని త్యాగాలని పాడాలి.. ఏమని పాడాలి మీ పాట.. ఎదగాయాలను మీట.... కరుణలేని ఖాకీ వనాలు గాయపరిచినప్పుడు... నెత్తరోడిన ఎన్ని శరీరాలు... బుల్లెట్లను మింగినవాడి ఆత్మలో ఎగజిమ్మిన లావా తెలంగాణ.. స్తూపాల ముందు ప్రతినలు.. రోడ్ల మీద కవాతులు... మిలియన్ మార్చ్‌లో చక్రబంధాలను ఎడమకాలితో తన్ని... బారికేడ్లను బద్దలుకొట్టిన యవ్వనోత్సాహం. ట్యాంక్‌బండ్ మీదుగా ఖండఖండాలకూ వ్యాపించిన కానికాలంలో కదన కుతూహలపు సాహసాలు. సాగరహారంలో దండుకట్టిన దండోరా! సకల జనుల సమ్మెలో ఊరూ వాడా ఏకమై వినిపించిన సాగరఘోష. అనంతమైనదీ పోరాటం. ఎవరి గురించి మాట్లాడాలి. ఎవరి గురించి పాడాలి.. ఏ కల కన్నదో తెలంగాణ. తోవలేసుకుని, దారుల వెంట, కదం తొక్కిన తిరుగుబాటు బావుటాలు. ఏ జెండా పేరు చెప్పాలి. ఏ పార్టీ పేరు పెట్టాలి. ఏ మనిషికి మొక్కాలి. ఏ ఆత్మను మునివేళ్లతో ముట్టుకోవాలి.

ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలిచింది. రాజ్యాంగస్ఫూర్తి నిలబడింది. ప్రపంచమంతా స్తబ్దుగా ఉన్న ప్రపంచీకరణ యుగంలో ఉత్తచేతులతో, ఆయుధాలు లేని పోరాటం నడిపింది తెలంగాణ. సాయుధ కవాతుల చరిత్ర మీదుగా వర్తమానంలో ప్రజా యుద్ధం ఎట్లా ఉంటుందో నేర్చుకున్నది తెలంగాణ. తెలంగాణ కోసమే ఒక పార్టీ. తెలంగాణ కోసమే ఒక సంఘం. తెలంగాణ కోసమే ఒక జేఏసీ. తెలంగాణ కోసమే ఒక ఫ్రంట్. ప్రతిదీ విభజన జరగాల్సిందే. ప్రతిదీ తెలంగాణే. రాజకీయ ప్రక్రియ పార్లమెంటులో ఉంది. ఆ పార్లమెంటుపైన ఒక ఒత్తిడి పతాకై ఎగిరింది. ఇవ్వక తప్పదు తెలంగాణ. నాలుగున్నర కోట్ల మంది ఊపిరి ఒక ఆమరణ నిరాహారదీక్షలో ఉంది. ఆ ఒంటి ఊపిరి ప్రాణం నిలబడి సాధించిన డిసెంబర్ 9 ప్రకటన. కేసీఆర్ నీ జన్మధన్యమయింది. నీ వెంట కవాతు కట్టిన ఉద్యమం విజయవంతమైంది. తెలంగాణ ఊపిరి విద్యార్థుల ముట్టడిలో ఉంది. విద్యార్థులారా వందనాలు. ధూమ్‌ధామ్ పాటలో ఎగిరింది తెలంగాణ జెండా. కవులు కవిత్వం రాశారు. గాయకులు పాటలు పాడారు. వాగ్గేయకారులు తెలంగాణ దండోరాలయ్యారు. కవులు, కళాకారులారా మీకు దండం.

జర్నలిస్టులు కలాలు కత్తులుగా దూశారు. ప్రొఫెసర్లు కార్యకారకాల సంబంధాలను విశ్లేషించారు. రచయితలు పుస్తకాలు రాశారు. టీచర్లు పాఠాలు బోధించారు. ఎన్జీవోలు, ఉద్యోగులు, ఆఫీసర్లు సకల జనుల సమ్మెకట్టారు. నల్లకోటు న్యాయవాదులు న్యాయం కోసం నిలబడ్డారు. సబ్బండవర్ణాలు, మతాలు లేవు, కులాలు లేవు. ఆకాంక్షపూన్నున్నా ఒకే ఆకాంక్ష తెలంగాణ. అస్తిత్వాపూన్నున్నా ఒకే ఉమ్మడి అస్తిత్వం తెలంగాణ. అమ్మలు యూనివర్సిటీకి సద్దులు మోశారు. తల్లులు కన్న కడుపు కోతల్లో కుమిలిపోయినా తెలంగాణే మార్గమన్నారు. బుల్లెట్లు మింగిన విద్యార్థులు. గాయపడిన విద్యార్థులు. లాఠీచార్జీలు, ముళ్లకంచెలు, ఉక్కు శిరస్త్రాణాలు, క్యాంపులయిన యూనివర్సిటీలు, ఏడాది పొడవూ నిత్య నిర్బంధంలో వికసించిన విద్యార్థి తరంగాలు. మోదుగుపూల వనం ముట్టడించిన అసెంబ్లీ. చలో హైదరాబాద్‌లో గాయపడిన వీరయోధుడు... మీ యవ్వన తేజంతో నడిచిన పోరు తెలంగాణ.

తరాల వివక్ష.. తరాల అణచివేత. తరాల దోపిడీ. నీళ్లు... నిధులు.. నియామకాలు.. మా బతుకమ్మ మా రాష్ట్రం. మా సంస్కృతి మా భాష. మా యాస. మాదే ఒక ప్రపంచం. మీరు మా ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేశారు. పెట్టుబడి రేచుకుక్క తెలంగాణను వేటాడింది. వెంటాడింది. మీడియా తోడయింది. మీ అబద్ధాల మీద విజయం. మీ చరిత్ర వక్రీకరణల మీద విజయం. మీ ఆధిపత్యపు అహంకారం మీద విజయం. మీ అప్రజాస్వామ్యం మీద మా ప్రజాస్వామ్య స్ఫూర్తి విజయం. మీ ఆగడాల మీద, అపసవ్యపు ప్రతీఘాత భావనల మీద, మీ అహంకారాల మీద, సర్వ వ్యవస్థలనూ విధ్వంసం చేసే మీ మూర్ఖత్వాల పైన తెలంగాణ ఒక విజయం. న్యాయం గెలిచింది. ధర్మం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. ఎన్ని ముళ్లు.. ఎన్ని చిక్కులు.. ఎన్ని ప్రచారాలు. ఎన్ని ఆటంకాలు.. ఎన్ని అబద్ధాలు. రంపరాకాసుల్లాంటి మీ నుంచి ఒక విముక్తి. పెట్టుబడి అహంకారంతో తలపడిన చీమలదండు లాంటి ప్రజల గుంపు విజయం సాధించింది. మా చరివూతను మేము, మా సంస్కృతిని మేము. మా అస్తిత్వాన్ని మేము. మా హైదరాబాద్‌ను మేము నిలుపుకున్నాం.

మలుపుకున్నాం. సీమాంధ్ర ప్రజలతో కలిసుంటాం. సామాన్య ప్రజలను ప్రేమిస్తాం. మీ దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎదిరిస్తాం... విడిపోయినం. కానీ కలిసి కొట్లాడుతాం. ఇక నుంచి కలిసికట్టుగా మీ దౌష్ట్యాలపై.. ఇప్పుడిక ఆంధ్రవూపదేశ్ ఒక మలిగిన దీపం. తెలుగుజాతి ఐక్యత ఒక తేలిన పచ్చి అబద్ధం. విశాలాంధ్ర ఒక అచ్చిరాని ఆదర్శం. సమైక్యాంధ్ర ఒక పీనుగు. తెలంగాణ భారతదేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం.. ఇది మాత్రమే నిజం. రాబోయే ప్రపంచం తెలంగాణది. నిప్పుల గుండంల దునికి పునీతమై తేలిన బలిదానాల ఆత్మరావాల తెలంగాణది. ప్రపంచంలో దుక్కం ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు, అస్తిత్వాలున్నంత వరకు, అణచివేతలు ఉన్నంతవరకు ఒక వేగుచుక్కై నిలుస్తుంది తెలంగాణ పోరాటం. అది రేపటి ప్రపంచపు వెలుగుచుక్క. జయహో తెలంగాణ.

486

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles