జంపన్న వారసత్వం...


Sun,February 9, 2014 12:32 AM

జంపన్నా వాగుల్ల అబ్బియా!
జాలారి బండల్ల అబ్బియా!
నాది దయ్యాల మడుగే అబ్బియా!
దండొక్కపొద్దే అబ్బియా

జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు పూనకాలుగా స్వీకరించకపోతే మనిషి కట్టెసరుసుకపోయి తడిలేని యంత్ర మానవుడవుతాడు. జంపన్న వాగును చూసినప్పుడల్లా ఆ వాగు నీళ్లల్లో ఒంటిగా ప్రతాపరువూదు ని సేనలతో పోరాడుతున్న జంపన్న రూపుకట్టకపోతే, గాయపడిన కొలిమిలాంటి ఒక వీరయోధుని చరివూతను ఆవాహన చేసుకోకపోతే, తెలంగాణ లేదు. పడిలేచిన కెరటమై సాగిన తెలంగాణ సర్వావస్థల సకల పోరాటాలు, ధిక్కారాలు లేవు. సమ్మక్క సారలక్కల దగ్గరికి వెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ పురా ఆత్మలు తిరుగాడినట్టే, ఆ నేల మీద మమకారమూ, మమేకమూ కలెగలుపులుగా ఒక ఉద్దీపన అనుభవంలోకి వస్తుంది.

ఇది ప్రతిసారీ అనుభవమే. ఏదో మేల్కాంచినట్టు, ఏదో మతికొచ్చినట్టు, ఏదో కోల్పోయిన పటిమలు మనసులో దూరి మళ్లీ జీవం పోసుకుంటున్నట్టు..ఆ అనుభవంలో ఉప్పొంగిన అడవులను ఆవాహన చేసుకున్నట్టు... శతాబ్దాల క్రిందట ఆ జంపన్న వాగులో శత్రుమూకల వెన్నుపోటుకు ఒరిగిన గాయపడిన వీరయోధుని వారసత్వం అడవుల నిండా పరివ్యాపించినట్టు... ఇదంతా శివసత్తులు పూనకం వంటిదేమీ కాదు. అడవి మీద ఆశ. అడవుల్లో వెలిగే దీపాల మీద ఆశ. ఈ దేశపు మూలవాసులు, ఆదివాసుల మీద ఆశ. ఒక కొమురం భీం దాకా, ‘జల్ జంగిల్ జమీన్’ల కోసం పోరాడిన వాళ్ల అచ్చ పోరాటాల వారసత్వం మీద ఆశ. నిజానికది సంపెంగ వాగు. బయ్యక్కపేట దగ్గర దయ్యాల వాగు. లక్నవరం పునాదుల్లో సర్దిమడుగు. పారినంత మేరా అది ఒక వారసత్వాన్ని మోసుకొచ్చే ఒక జల తరంగిణి. ఆశ్వాసాల మోత. ఇంతకీ జంపన్న మనిషా? మనిషే అయితే తెలంగాణ నేల మీద ఒక వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీక. జంపన్న నీరేనా? నీరే అయితే అదొక ప్రాణధార. ఈ రెండింటి అపురూప వారసత్వ ప్రకృతి పరాక్షికమ రూపమే సమ్మక్క సారక్కల జన జాతర. చిలుకలగుట్టలో దాగున్న రహస్యం. సమ్మక్క సారక్కల, వీరయోధుడు జంపన్న వారసత్వాన్ని స్వీకరించింది తెలంగాణ అస్తిత్వ పోరాటం.

బహుశా ఆ అడవి తల్లుల జాతరక్కడ పున్నమి వెలుగుల్లో కోటిమంది మోకరిల్లి అడవిని ఆవాహన చేసుకుని, శివసత్తులు ఎగురుతున్న వేళ, జంపన్న వాగుల జలాలు ఉప్పొంగుతుండగానే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశిస్తుంది కావొచ్చు. ఆ బిల్లులో ఇదే అడవి బిడ్డల ఉనికిని మింగే, ఇదే అడవి బిడ్డలను నిండు నీళ్లల్లో ముంచే సవరణ ఒకటి ఉన్నది. అదీ సమస్య. మేడా రం నుంచి ఏటూరునాగారం దిగువ నుంచి ప్రవహించే గోదావరి పోలవరం వద్ద ఇదే అడవి బిడ్డల ఊళ్లను ముంచబొయ్యే ప్రణాళికకు బిల్లులో ఆమోద రాజముద్ర పడుతుంది. ఒకవేపు ఏ వారసత్వాన్ని స్వీకరించి, ఏ అడవి బిడ్డలు రాజును ఎదిరించిన చరివూతను స్వీకరించి పోరాడి సాధించుకున్న తెలంగాణ బిల్లుకు ఇదే మూలవాసుల, ఇదే ఆదివాసుల, ఇదే ఉత్పత్తి కులాల నెత్తురంటుకొని ఉన్నది. అదొక త్యాగాల నెత్తుటి మరకలు, కన్నీళ్లూ అంటిన బిల్లు. కానీ ఆ బిల్లులో అనేక చిల్లులున్నవి. అదీ సమస్య.

తెలంగాణ తీర్మానం వచ్చినప్పటి నుంచీ మీడియా ఏకపక్షంగా ఉన్నది. సీమాంధ్ర పెత్తందార్ల ప్రయోజనాల కోసం అది తన సహజ స్వభావాన్ని, మౌలిక విలువలను, నిష్పాక్షికతను వదులుకున్నది. తెలంగాణ బిల్లును అడ్డంకొట్టడానికి అనునిత్యం అది పెత్తందార్లతో, కనిపించని కుట్రలు చేసే కార్పొరేట్లతోని, సంపన్న నయా రాజకీయ నాయకత్వంతో కుమ్మక్కై ప్రతీఘాత సమైక్యాంధ్ర ఉద్యమాలకు బలవంతంగా ప్రాణం పోసేందుకు ప్రయత్నించి విఫలమయింది. వదంతులు వ్యాపింపజేసింది. నిలు అబద్ధాలను అచ్చో సి ఆరబోసింది. కలర్ టీవీల నిండా సంకుచిత విష సర్పాలను నింపింది.

తెలంగాణ వాడు బతకకుండా, చావకుండా, ఓ వేపు తెలంగాణ వస్తుందన్న సంబురం లేకుండా, వస్తున్న తెలంగాణను అడ్డంకొడ్తున్నట్టుగా గందరగోళా న్ని వ్యాపింపజేసింది. అసలు బిల్లే రాదు, రానివ్వం అన్నట్టుగా సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం కలిసి అనుమాన పెనుభూతా ల్ని సృష్టించారు. అసలు తెలంగాణ వస్తుందా? రాదా? అన్న ఒక సందిగ్ధ వాతావరణాన్ని, నిరాశను, నిస్పృహను, భంగపాటును తీర్చిదిద్దింది మీడి యా. మళ్లీ ఆత్మహత్యల్లోకి నెట్టిన ఒక వాతావరణం ఏర్పాటయిన ఈ క్షణాలన్నీ మీడియా పుణ్యమే. నిజానికి ఈ మీడియా రాతలు ఒక్కటీ నిజం కాలే దు. బిల్లు పార్లమెంటుకు చేరుతున్న ఈ తరుణం కూడా ఒక అనుమానం వెంటాడేంత ప్రజల మానసిక ప్రపంచాలని అతలాకుతలం చేసిన ఏకపక్ష, సంక్షుభిత మీడియా రెండు ప్రయోజనాలను ఆశించి ఈ పని చేసింది. అది సీమాంధ్ర ప్రజలతోను లేదు. ప్రజలను ముంచే కార్పొరేట్ల కోస్తా కారిడార్‌ల తో జతకట్టింది.

చివరి క్షణాల్లో సవరణ రూపంలో తెలంగాణపై పూర్తిస్థాయి వివక్ష ప్రదర్శిస్తూ, తెలంగాణ వచ్చినా స్వేచ్ఛలేని, స్వాతంవూత్యంలేని, స్వయం నిర్ణయాధికారంలేని పరోక్ష పెత్తనాలను, పరోక్ష ఆధిపత్యాలను మరో అర్థంలో అదే వలసాధిపత్యం ఇంకో పద్ధతిలో కొనసాగేలా బిల్లులో సవరణలున్నాయి. తెలంగాణ వస్తే విప్లవం రాదని తెలుసు. తెలంగాణ వస్తే నూతన ప్రజాస్వామ్య రాజ్యాలు, సామాజిక రాజ్యాలు రావని తెలుసు. కానీ నాలుగు వేపులా సరిహద్దులు గల ఉత్త భౌగోళిక తెలంగాణ నిజంగానే దేనికి. సమ్మక్క, సారలక్క ల మేడారం జాతరకు మన రాష్ట్ర ఆదివాసులే కాదు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి వేనవేలుగా వస్తారు. కానీ పోలవరం అటు వారినీ, ఇటు ఖమ్మం జిల్లా ఆదివాసులను నిర్వాసితులను చేసి, అడవికి దూరం చేసి, సహజాతమైన వారి బతుకులను ఛిద్రం చేసే ముంచే ప్రాజెక్టు. దీన్ని వ్యతిరేకించకుండా తెలంగాణ వారసత్వం ఏ రూపంలోనూ నిలబడదనేదే సత్యం.

గవర్నర్‌గిరీలతో హైదరాబాద్‌ను ఆక్రమించుకున్న సీమాంవూధుల భూము లు, ఆక్రమించుకున్న గుట్టలు, జూబ్లీ కొండలు, కార్పొరేట్ శక్తులుగా అవతారమెత్తిన ఆంధ్ర సంపన్న వర్గాలు కంపెనీల పేరిట ఆక్రమించుకున్న ఆస్తులు, ఆ కంపెనీలలో కొలువుదీరిన వేలాది ఉద్యోగులు. అంతా ఓకే. గవర్నర్ ఒక్క డే. బహుశా నరసింహన్ కొనసాగితే ఆయనకు ఛత్తీస్‌గఢ్ చరిత్ర కూడా కలుపుకుంటే అణచివేతకు, ఆధిపత్యానికి, ఊరేగుతున్న అహంకారానికి చట్టబద్ధ త. ఇక అవ్వల్ హైదరాబాదీ హక్కులు, తెలంగాణ అంతర్భాగమని విర్రవీగినంత మాత్రాన చెల్లవు. స్వయంపాలన, స్వయం నిర్ణయాధికారాలు ఉత్త మాటే. ఉమ్మడి రాజధానిగా విలసిల్లే హైదరాబాద్‌లో ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన తెలంగాణ గోడు భవిష్యత్తు అరణ్యరోదనే. బిల్లు వస్తుందం ఇంత యాగీ చేసే మీడియా, సీమాంధ్ర పెత్తందార్లు తీరా తెలంగాణ వచ్చినాక బతకనిస్తారా? చావనిస్తారా? ఒక శేష ప్రశ్న.

తెలంగాణ పోరాటతత్వాన్ని నీరుగార్చి, సంపూర్ణ తెలంగాణ డిమాండ్‌పై పోరాటాలు రాకుండా నిలువరించడం సీమాంధ్ర మీడియా ప్రయోజనాల్లో ఒకటైతే... ఈ నిశ్శబ్ద సంధి వాతావరణంలో చివరికి సీమాంవూధకే అన్యాయం జరిగినట్టు ‘ఉల్టాచోర్’ ప్రచారాలు మరో ప్రయోజనం. వెరసి సీమాంధ్ర మీడి యా సంకుచితత్వం ఎంత ద్రోహానికి ఒడిగట్టిందో? తెలంగాణ ప్రజలు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ ఎంత గరళాన్ని పత్రికల రూపంలో మింగుతున్నారో? ఎన్ని దృశ్యాలను పీడ కలలు కంటున్నారో అర్థం చేసుకోవాల్సిన అసలు స్థితి. మరి దారి లేదు.

ఒకవేపు తెలంగాణ సమాజా న్ని బిల్లు రాదన్న గందరగోళంలో ఉంచి, ఏదో ఒకటి తెలంగాణ బిల్లై తే ముందురానివ్వు అన్న నీరసంలోకి నెట్టేసి, మరోవేపు బిల్లులో తెలంగాణ బతుకులకు చిల్లులు పెట్టే సంస్కరణలు ఆమోదింపజేసుకోవడమే ఇప్పటి కపట నాటకాల సారం. కామన్ ఎంట్రెన్స్, ఎక్కడి ఉద్యోగులు అక్కడే, గవర్నర్‌గిరీ, పోలవరం, పదేండ్ల ఉమ్మడి రాజధాని తెలంగాణ వచ్చినట్టు కాదు. లాబీయింగులు, రాజకీయా లు చేస్తున్న నాయకత్వం, పోరాటానికి నాయకత్వం వహించిన జేఏసీలు, ఉద్యమ సంస్థలు బహుపరాక్. మనల్నే కొట్టి, వాళ్లు గాయపడినట్టు నటిస్తున్న ఈ సందర్భం అర్థం కావాల్సే ఉన్నది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకు వస్తున్నది. జంపన్న వాగుకు ఒక వారసత్వం ఉన్నది. ఆదివాసుల తరఫున జంపన్న వారసత్వంతో నిలబడాల్సే ఉన్నది. జనం ఉప్పొంగిన ఒక కల, ఒక మెలకువ ప్రదర్శించాల్సి ఉన్నది. అడవులు మనవే. పోరాడే వీరయోధుల వారసత్వమూ మనదే. అప్పుడే తెలంగాణ పోరాటానికి ఒక అర్థం ఉన్నది. సవరణలను తిప్పికొట్టాలి. సంపూర్ణ తెలంగాణ సాధించాలి.
[email protected]

393

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles