మా రాష్ట్రంలో మాదే రాజ్యం..


Sun,January 19, 2014 12:27 AM

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్మాణం అంటే నీళ్ల పారకం, కరెంటు సాధన కాదు. తెలంగాణ ‘అసర్షన్’ తెలంగాణ స్వాభిమాన, ఆధిపత్య ప్రకటన. మేము తెలంగాణ వారం మా రాష్ట్రంలో మాదే రాజ్యం.

రెండు అసమ సమాజాల పొత్తు ఆంధ్రవూపదేశ్. భిన్నమైన సాంస్కృతిక, చారివూతక నేపథ్యం ఉన్న రెండు ప్రాంతాలుగా స్వతంవూతంగా విలసిల్లిన తెలంగాణ (హైదరాబాద్ స్టేట్), ఆంధ్ర ప్రాంతాల విలీనం సంగతులు మాట్లాడేవాళ్లు ఈ భిన్నత గుర్తించకపోతే అచ్చం శైలజానాథ్‌లా మాట్లాడతారు. తెలంగాణ ప్రాంతానికి జాతి లక్షణాలు విడి గా ఉన్నాయా? తెలుగుజాతి మాత్రమే కదా! అన్న వాదవివాదం అక్కరలేనిది కానీ, ఒకే జాతి అయినప్పటికీ, రెండు ప్రాంతాల, అదీ అసమ ప్రాంతాల కలయిక విపరిణామమే ఆంధ్రవూపదేశ్ వైఫల్యం కూడా. అభివృద్ధి చెందిన ఒక ప్రాంతం, అప్పటి దాకా బ్రిటన్ పాలనలో ఉండి, ప్రజాస్వా మ్య స్వేచ్ఛకు పోరాడిన ప్రాంతం, కాన్వెంట్లు, చర్చీలు, రైలు మార్గం ద్వారా సంక్రమించిన భావజాలాలు, అన్నింటికి మించిన కాల్వల వ్యవసా యం, కాటన్‌దొర ప్రాజెక్టు సౌలభ్యం, వ్యవసాయంలో ఆధునికత తెచ్చిన మిగులు పెట్టుబడుల ఆంధ్ర ప్రాంతం రెసిడెన్సీ పాలనలో ఉన్న ప్రాంతం. మదరాసు ప్రావిన్స్‌లో భాగంగా ఆధునికత తెలిసిన ప్రాంతం.

భారత దేశం లో బ్రిటన్‌ల కాలంలోనే వచ్చిన సంస్కరణల ఉద్యమాల ప్రభావాలు ఉన్న ప్రాంతం. భాష గురించీ, దాని ఆధునీకరణ గురించి కూడా మాట్లాడుకోగలిగిన ప్రాంతం. కానీ, నైజాం స్టేట్ పరిస్థితి వేరు. కొద్ది సంవత్సరాలు మినహాయిస్తే ఇదొక దక్కన్ పీఠభూమిగా, ఒంటరి సమాజంగా, భారత దేశానికి ఆవ ల ఉన్న ఒక ఒంటరి ద్వీపంగా ఉన్నది. తెలుగు సమాజం ప్రభావాల కన్నా, ఈ ఒంటరి దక్కన్ పీఠభూమి సంపర్కాలు, భాష ఆదాన ప్రదానాలు, సంస్కృతీ సమ్మేళనాలు, అన్నీ ఉత్తరాదికి సంబంధించినవే. ముస్లిం పరిపాలకులు ఉన్నందువల్ల, రాజు సహజంగానే నిరంకుశుడైనందు వల్ల, భూస్వా మ్య వ్యవస్థ స్వభావంలో ఉండే ప్రగతి నిరోధకత, మార్పుకు తనకు తానే ఒక ప్రతిబంధకమయ్యే జఢస్థితిలో ఉన్న ఒక సమాజంగా తెలంగాణ ఒక వెనుకబాటు ప్రాంతంగానే మనుగడలో ఉన్నది. ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం, మరో వెనుకబడిన ప్రాంతం విలీనమయినప్పుడు జరిగే సహజ పరిణామమే ఆంధ్ర, తెలంగాణ విలీన ఫలితమైన ఆంధ్రవూపదేశ్‌లో జరిగింది. వెనుకబడిన ప్రాంతం ఒక వలస ప్రాంతంగా, అభివృద్ధి చెందిన వ్యవహర్తల, చదువరుల ప్రాంతంగా ఉన్న ఆధిపత్యం సాధించి, ఆధిపత్య వ్యవస్థలను ఏర్పరచుకొని తెలంగాణను ఒక అంతర్గత వలసగా మార్చుకున్నది.

సరిగ్గా ఈ భయం అంబేద్కర్ రచనల్లో ఆయన అనేకసార్లు ప్రస్తావించారు. ఒకే జాతికి, భాషకు సంబంధించిన వారైనా, మైనారిటీ ప్రాంతం, మెరుగైన మెజారిటీ ప్రాంతాలు విలీనం అయి ఒక యూనిట్‌గా ఏర్పడినప్పుడు మెజారిటీ ప్రాంతపు ఆధిపత్యమే స్థాపితమవుతుందని ఆయన వాదించారు. ఆర్టికల్ 3 అంతిమ సారాంశంలో రాజ్యాంగసభ కోసం జరిగిన చర్చోపచర్చల్లో, భవిష్యత్తులో భారతదేశంలో వికేంవూదీకరణ కోసం కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం కానీ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒక భావనగా రాష్ట్రాలు రూపుదిద్దుకోవడం గానీ జరిగినా, ఒక రాష్ట్రం నుంచి, మరో రాష్ట్రం విడిపోయినప్పుడు, మెజార్టీ అభివూపాయానికి విలువ ఇచ్చారు కానీ, మైనారిటీ ప్రాంతాన్ని ఆ అభివూపాయాలు ప్రభావితం చేయకూడదని, అందుకే ఓటింగ్‌లు, తీర్మానాల లాంటివి కుదరదని తేల్చి చెప్పారు.

ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం నెహ్రూ ఇదే ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం ఆధిపత్యం ఏర్పడుతుందన్న భావనలోనే, మిగులు పెట్టుబడులు, మెరుగైన విద్య గల ప్రాంతాల విస్తరణ ఆకాంక్షగా, సామ్రాజ్యవాద బీజాలు ఇలాంటి విలీన ప్రతిపాదనల్లో ఉన్నాయని వ్యాఖ్యానించడం కూడా ఇందులో భాగమే. తెలంగాణ, ఆంధ్రల విలీనం తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో అది రుజువయింది. నిరూపితమయింది. విలీనానికి ముందు ఫజల్ అలీ కమిషన్ కూడా ఆంధ్ర, తెలంగాణ ఏర్పడితే, తెలంగాణ ఒక ‘కాలనీ’గా అంతర్గత వలస ప్రాంతం అయ్యే అవకాశం ఉందని అభివూపాయపడింది అందుకే. ఈ భయా లు ఆనాటి తెలంగాణకు ఉన్నాయి కనుకనే 1948లో హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో భాగమైన తర్వాతనే తెలుగు భాష అణచివేత, ఉర్దూ భాష రాజభాషగా ఉండడం, ఇంగ్లీషు సంపర్కలేమి వల్ల ఏమి కోల్పోయిందో తెలుసుకోగలిగింది.

వెల్లోడి పాలనలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా వచ్చిపడిన ఉద్యోగులు, ఆ తర్వాత గైర్‌ముల్కీ నినాదం అయింది. అది ‘ఇడ్లీ సాంబార్’ గోబ్యాక్, (మవూదాసు నుంచి వచ్చిన ఇంగ్లీషు తెలిసిన వారి గురించి) ఉద్యమం వచ్చింది. అది ఆరుగురు విద్యార్థుల త్యాగా ల చాలు పోసిన తొలి ప్రత్యేక భావన. ఆ తర్వాత తెలంగాణ నిజంగానే వాస్తవ పరిస్థితుల్లో ఆంధ్రలో విలీనం కావాలని తహతహలాడిన దాఖలాలు ఏవీ లేవు. అసెంబ్లీలో తీర్మానం జరిగిందని ఒక అబద్ధం ప్రచారం అయింది. గ్రామసభలు తీర్మానం చేశారన్నది పెంచి పెద్దది చేసి చూపేవాళ్లు, విలీనానికి వ్యతిరేకంగా వంద సంఘాలు అలనాడు వ్యతిరేకిస్తూ ఆందోళనలో ఉన్న విషయం విస్మరణకు గురయింది. బలవంతపు విలీనం కనుకనే, ఇష్టంలేని పెళ్లి కనుకనే హైదరాబాద్ మీద కన్నేసిన ‘కర్నూలు రాజధానిగా గల ఆంధ్ర రాష్ట్రపు పెద్దలు, ‘ఇప్పుడు కాకపోతే ఇక హైదరాబాద్ వెళ్లడం శాశ్వతంగా కుదరదు’ అని దుగ్ధతో, ఆందోళనలతో మట్లాడిన మాటలు రికార్డులూ ఉన్నాయి. అందువల్ల తెలుగు వాళ్లంతా కోరుకుని, ముఖ్యంగా తెలంగాణ వాళ్లు ఎక్కువ అడిగితేనే వచ్చామని శైలజనాథ్‌లు ఎందరు మాట్లాడినా అది ఆధిపత్య అహంకారం అవుతుందే తప్ప చారివూతక వాస్తవం ఎంత మాత్రం కాబోదు. పైగా అది వక్రీకరణ కూడా....

తెలంగాణ అనుమానాలు, భయాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత, విలీనమైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత, ఆంధ్రులు విశాల దృక్పథంతో ప్రవర్తించాల్సిన ఆవశ్యకతల గురించి రాష్ట్ర ప్రకటన సమయంలో నెహ్రూ ప్రసంగంలో దాఖలాలు రికార్డుల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆంధ్ర పెద్దల మాటల్లో ఉన్నాయి. అందువల్లనే ఆంధ్ర, తెలంగాణ విలీనం షరతులతో కూడినది. అందువల్లనే పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. అందువల్లనే ప్రత్యేక బోర్డులు, తెలంగాణ భూముల అమ్మకాలపై నిషేధం, తెలంగాణ విద్యా సంస్థల్లో స్థానికత, ఇక్కడి సంస్థల్లో స్థానికులకే అవకాశం, చొరబాటు లేకుండా జాగ్రత్తపడడం లాంటివన్నీ విలీనానికి ముందు షరతులుగా చేరాయి. ఇది ఎంతో గతం కాదు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఈ బలవంతపు విలీనం యాభై ఏడు సంవత్సరాల్లో వికృత ఫలాలను ఇచ్చింది. అనుకున్నట్టే తెలంగాణ ఒక కాలనీ అయింది. అనుకున్నట్టే ఆంధ్రుల విస్తరణ ఆకాంక్ష, పెట్టుబడుల ప్రవాహం, షరతుల ఉల్లంఘన, సర్వ ఒప్పందాల ఉల్లంఘన, వనరులు, కొలువులు, నీళ్లు, నిధుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. అంతేనా?
కాదు. తెలంగాణ అచ్చంగా ఒక కాలనీలో లాగానే అణచివేతకు, సాంస్కృతిక న్యూనతకు, చారివూతక విస్మరణకు, తన ప్రాంతంలో తనే పరాయిగా మారింది. ఇల్లలికిన ఈగ పేరు మరచిపోయింది.

పెత్తనం వ్యవస్థితమైంది. ఆధిపత్యం విస్తరించి తన యంత్రాంగాలను పటిష్టం చేసుకున్నది. ఈ పెత్తనాలను కూల్చడం, ఈ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టడం, తనను తాను కనుక్కోవడం, తనను తాను తెలుసుకోవడం ఒక అస్తిత్వంగా తనను తాను పునరుద్ధరించుకొని నిలబడడం కోసమే తెలంగాణ పోరాడింది. అందుకే ఇవ్వాళ్ల అంతస్సారంలో తెలంగాణ తన బతుకుదెరువు కోసం, ఉనికి కోసం, అంతరించి పోకుండా తన చారివూతక, సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడింది. పోరాటం తెలంగాణ స్వభావంలో ఉన్నది.

సమ్మక్క సారక్కల నుంచి ఇవ్వాల్టి దాకా తెలంగాణకు అణచివేత, నిరంకుశ పెత్తనాలకు వ్యతిరేకంగా, స్వాభిమానం కోసం నిలబడిన చరిత్ర ఉన్న ది. అది దొరలు, దేశ్‌ముఖ్‌లు, నైజాం నిరంకుశ భూస్వామ్య పెత్తనంపైన దండయాత్ర చేసింది. గోచిగుడ్డ రైతు తుపాకి పట్టాడు. ముల్కీ అమలుకోసం పోరాడింది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడింది. నక్సల్బరీని ఆవాహన చేసుకొని , నైజాం అనంతర దొరతనంపై ఎకె47 ఎత్తింది. మళ్లీ ఆంధ్రుల వలస ఆధిపత్యంపై పదహారు సంవత్సరాలుగా పోరాడింది. ఈ పోరాట వారసత్వమే తెలంగాణను ఒక క్రమబద్ధమైన తిరుగుబాటు ఆత్మగా అవతరింపజేసింది. అందువల్లే ఇవ్వాళ ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు ఎన్ని పిట్టకథలు చెప్పి, వక్రీకరణలు చేసినా తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర - తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్మాణం అంటే నీళ్ల పారకం, కరెంటు సాధన కాదు. తెలంగాణ ‘అసర్షన్’ తెలంగాణ స్వాభిమాన, ఆధిపత్య ప్రకటన. మేము తెలంగాణ వారం మా రాష్ట్రంలో మాదే రాజ్యం.
[email protected]

265

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles