ఆగుతుందంటే... మీ ఖర్మ..


Sun,January 12, 2014 12:54 AM

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలకం ఊగినట్టే. రానట్టు. పోనట్టు. అయితే ఆతం.. పోతే జాతం అన్నట్టు తెగిచ్చినట్టూ లేదు. కొత్త విషయమేదీలేదు. చెప్పిందాన్నే నూటొక్కసారి , ఉద్వేగంగా, కడుపులోంచి చెప్పడం. చెప్పడానికి కూడా ఏమీ మిగిలిలేదు. కట్టెకొట్టె తెచ్చె.. ఆంధ్రులు చెబుతున్న అడ్డంకులేవీ హేతువుకు నిలవనివే. ఆకుకు అందవు. పోకకు పొందవు. జూలై 30 నుంచి ఇప్పటి దాకా ఒకే మూస. మాట మార్చి, మార్చి తెలంగాణ రాద నే..అంతకు మించి ఏవాదనాలేదు. 371 డీ అని ఒకనాడంటే, బీజేపీ అడ్డుకుంటదని మరునాడంటరు. వాళ్లిష్టమే రామకిష్టపురం. కొలువా కుమ్మరి య్య. ఆంధ్రులు అన్నదేదీ జరగదు.
పొద్దున టీవీ పెడితే రెండుఛానళ్లు మాత్రమే చూడనేర్చిన జనం.మానసిక ఆరోగ్యరక్షణ అంతస్సూత్రం. తోసెయ్. తోసెయ్. తెలంగాణ సంగతులైతే మరే టీవీలు చూసినా జ్వరం వచ్చినట్టు. అగులుబుగులయినట్టు. అగాధం లో పడ్తున్నట్టు. అసలు తెలంగాణ అనేది ఒకటి ఉనికిలో లేనట్టు. వేలసార్లు చెప్పినా సరే వాడొచ్చె మొదలాడె. కాదు పోదు. నూటా మూడోసారి రాజ్యాంగం మీద చర్చ, ఆర్టికల్ 3 మీద అయిదువందలవ సారి రచ్చ. అరుచుకుంటున్న వాళ్లు ఇంటికెళ్తారు. పొద్దుపొద్దున్నే లేచి ముఖాలకు పౌడర్ రాసుకొని వేదికల మీద కూచొని మాట్లాడ్తున్న వాళ్ల మాటలు వింటే ఇగ జీవితంలో తెలంగాణ వస్తదనీ చెప్పజాలము.. రాదనీ చెప్పజాలము. చివరికి తెలిసిన సంగతులే అయినా మళ్లీ నమ్మజాలము. రక్తపోటు పెరగడమూ, నరాల్లో శెక్కర పరుగు తీయడమూ అదనపు బరువు. ఇక్కడ గందరగోళం సృష్టించబడును. ఏమి రాయడానికీ తోచదు.

ఎన్నోసారి చర్చ చేస్తాం. అయ్యా! ఆర్టికల్ 3 ప్రకారం విడగొట్టవచ్చు. ప్రభుత్వాలను పడగొట్టయినా పార్లమెంటు విడగొట్టవచ్చు. మెజారిటీ అభీష్టానికి వ్యతిరేకంగానైనా మైనారిటీ ప్రాంతాన్ని విడగొట్టవచ్చు. అందుకు అసెంబ్లీ అభివూపాయమే కానీ, ఓటింగ్‌లు పరిగణించరు. తీర్మానం అసెంబ్లీలో ఓడించినా ఫరక్ పడదు. అసలు దీనికి తీర్మానమే అడగరు. నిజంగానే అడగలేదు. పూర్తి రాజ్యాంగబద్ధంగా, పూర్తి ప్రజాస్వామ్య లక్షణాలతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి పంపిన బిల్లు.. అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీకి వచ్చిన బిల్లు ఎప్పటికైనా రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి నుంచి పార్లమెంటుకు వెళ్తుంది. బిల్లు పాసవుతుంది. సింపుల్. నెత్తికొట్టుకున్నా... నిజంగానే మోకాళ్లమీద నడిచినా, నిజంగానే తల్కాయ కిందికి కాళ్లుపైకివెట్టి శీర్షాసనం వేసినా... పార్లమెంటులో అడ్డుకుంటె తప్ప, రాష్ట్రపతి భారతదేశ చరివూతలోనే ఇంతకుముందెప్పుడూ లేన ట్టు బిల్లును తిప్పిపంపితే తప్ప... కాంగ్రెస్ పార్టీ ‘తుప్పోల్’ అని వెన్కకు తిరిగితే తప్ప బిల్లు చల్ మోహన రంగాయే. కానీ...

అట్లున్నదా! బుగులు బుగులే. గుబులు గుబులే.. సత్యమేదో దాక్కున్న ట్టు.. పదారు ఛానళ్లు.. పది పత్రికల అక్షరాల, మాటల మధ్య సత్యమేదో ఇరుక్కున్నట్టు.. బహుశా ఇట్లాంటి పీడ ఇదివరకు ఎవరికీ సంభవించి ఉండ దు. సంబురపడాల్నా! వద్దా! అనే సందేహం రావడమంత బాధాకర, విషా దం మరెవరూ అనుభవించి ఉండరు. ఇన్ని అబద్ధపు వాదనలు ఎవరూ చేసి ఉండరు. అయినా తట్టుకుని ఈటెల రాజేందర్ సభలో చేతులు ఎదకాన్చుకొని.. ఇగో.. ఈ బిల్లుకు మా అమరవీరుల నెత్తురు అంటి ఉన్నది. ఇది మా గుండె చప్పుడు అని ప్రకటిస్తూనే ఉన్నడు. ఉరికొచ్చే రైలును ఎదురేగి ‘అమ్మా’ అనకుండా ‘జై తెలంగాణ’ అన్న వీరుణ్ని ఆ నిండు అసెంబ్లీలో చేతులు ఆకాశానికి సాచి ఈటెల కీర్తిస్తున్నడు. ఆ చల్లటి శీతాకాల సభలో అమరవీరుల ప్రస్తావన ఆకాశాన్నంటింది. వేడి పెరిగింది. నిజంగానే ఎన్న న్నా మాట్లాడండి. ఇంకా ఆంధ్రవూపదేశ్ ఉంటుందా? సాధ్యమేనా? ఎక్కడ న్నా కడుపునిండా మాట్లాడనిచ్చినారా? ఎన్నడన్నా.. మా కడుపులో సుళ్లు తిరిగే దుక్కాన్ని చెప్పుకోనిచ్చినారా? ఇదే సభలో తెలంగాణ అనే పదం వినపడొద్దన్న నిషేధం నుంచి, నిర్బంధం నుంచి, బిక్కుబిక్కుమంటూ మీరేది చెబితే అంతే అనుకున్న బానిసల మందల నుంచి ఇవ్వాళ్ల మా తెలంగాణ, మా జై తెలంగాణ దిక్కులు పిక్కటిల్లుతున్నప్పుడు ఇంకా ఆంధ్రవూపదేశ్ బతుకుతుందని, కనపడని శక్తి ఏదో బిల్లును ఆపుతుందని, చర్చలను రచ్చగ చేసి, వేలికేస్తె కాలుకు, కాలుకేస్తె మెడకు వేసే జిత్తుల ఆటంకాలు బిల్లును ఇక్కడే ‘ఫ్రీజ్’ చేస్తాయని మీరూ, మీ మందలాంటి ఒకే మూస, ఒకే నమూనా గొట్టాలు, పత్రికలు ఎన్ని సందేహాలు, ఎన్ని సంకుచిత కుట్రలు చేస్తే మాత్రం ఆంధ్రవూపదేశ్ బ్రతకడం సాధ్యమేనా?
మా అమరుల నెత్తురంటిన బిల్లు ప్రతులను బోగిమంటల్లో వేసేంత దుండగులు మీరు.

మనుషులకు ఒక ప్రాంతం గురించీ, ఆ ప్రాంతం అనుభవించిన వేదనల గురించీ, ఆ ప్రాంతం ఆయా మనుషులకు ఇచ్చే సంస్కృ తి గురించీ, బతుకుదెరువూ, గుర్తింపు గురించీ ఏర్పడే భావోద్వేగాలు మనుషులకు మాత్రమే అర్థమవుతాయి. బతకడం అనే మానవ సంబంధాల ఉత్కృష్ట అల్లిక మాది. ఒక బంధంగా తెలంగాణ నవ్వింది. ఏడ్చింది. పోరాడింది. కలత పడింది. కలెబారింది. ధిక్కరించింది. నిలబడింది. మానవుడి చుట్టూ ఆవరించిన ఏ సుఖమూ, ఏ వస్తువూ, ఏ సంపదా! ఇవ్వనిది... మానవుడి చుట్టూ ఆవరించిన ధనకనక వస్తువాహనాలేవీ ఇవ్వని భావోద్వేగ బంధం తెలంగాణ. కట్టకట్టుకొని నిలబడింది తెలంగాణ ఒక చెరగని బంధం లా. అదే భావోద్వేగం. ఏదీ సాటిరాని మానవ బంధం. అందుకే కదా! బిల్లు మీకు ఉత్త చిత్తు కాగితం. మాకది అరవై ఏళ్ల ఒక కల. ఒక ఆకాంక్ష. అరవై ఏళ్ల సంది పోరాడిన ఒకే ఒక్క ఆశయం. మా ఆకాంక్షలు ఆ బిల్లులో నిక్షిప్త మై ఉన్నాయి. నిజమే. మీరు లాభనష్టాల బేరీజులో ఉద్వేగాలు కోల్పోయిన వాళ్లు.. మానవ బాంధవ్యాలు కోల్పోయిన వాళ్లు. అందుకే తుగులబెడతామంటారు. ఆగుతదా! ఆగితే ఊకుంటదా! తెలంగాణ.

నిజంగానే తెలంగాణకు నష్టం తెచ్చే బిల్లులో చిల్లులనేకం. మేం మాట్లాడుతూనే ఉన్నాం. ఉంటాం. ఏ రాజధానినైతే, ఏ హైదరాబాద్‌నైతే మీరు కబ్జా పెట్టి ఆ హైదరాబాద్ భూముల మీద అక్రమంగా పీఠం వేసి మాట్లాడుతున్నారో? ఆ హైదరాబాద్‌ను ఆక్రమించుకుని మాట్లాడుతున్నారో? ఆ హైదరాబాద్‌ను పదేళ్లు మీతో పాటు పంచుకోవడమూ, దానికో గవర్నర్‌గిరీ ఉండడమా, ఉద్యోగాలు ఎక్కడికక్కడే ఉండడం, చదువులు అట్లాగే ఉండడమూ, నదీ జలాలు అట్లాగే ఉండడమూ అసలు సమస్యలే. కానీ మేం చర్చిస్తున్నం. ప్రజాస్వామ్యాల్లో, రాజ్యాంగ సూత్రాల్లో చర్చలకు మించిన పరిష్కారాలు లేవు. అయినా చర్చకు భయపడే వాడు సత్యంతో లేనట్టు లెక్క. అసెంబ్లీలో చర్చకు భయపడి అసెంబ్లీ బయటకు వెళ్లినవాళ్లూ, అసెంబ్లీలో ఉండీ చర్చకు అడ్డుపడ్తున్నవారూ... యుద్ధం జరగకముం దే ఓడిపోయిన బీరువులు. తెలంగాణకు ఒక వాదన ఉంది కాబ తెలంగాణ వెంట సత్య మూ, న్యాయమూ, ధర్మమూ ఉన్నవి కాబట్టే బస్తీమే సవాల్ ఎక్కడంటే అక్కడ అది వాదనలు వినిపిస్తూ నే ఉన్నది. విసు గూ విరామమూ లేకుండా చెప్పి న విషయాలను పదేపదే చెబుతూనే ఉన్నది. మరింత ఉద్వేగంతో గొంతు పూడుకుపోయే దాకా.. వింటా రా! అసెంబ్లీ విన్నది.. మరోసారి అసెంబ్లీ ఒక చరివూతను, జరిగిన కాలం కాటేసిన అన్యాయాలనూ, మరోసారి విన్నది. చరిత్ర తనను తాను దర్శించుకున్నది.
అయినా తెలంగాణ ఆగుతుందంటారా! అయినా రాదంటా రా? బిల్లు పోదంటారా! బీజేపీ అడ్డుపడ్తుందంటారా? 371 డీ అడ్డం అంటారా? చింపేసి ఆపుతామంటా రా? మీ ఖర్మ. కానీ.. కానీ యూపీఏ కాకపోతే దాని తాత ఎవడైనా తెలంగాణ ఇవ్వాల్సిందే. ఇప్పుడాపినా ఫరక్ పడేదేమీ లేదు. బీరిపొయ్యేదేమీ లేదు. ఇంత జరిగినాక నువ్వూ నేనూ ‘ఆంవూధవూపదేశ్’లో ఉంటమని కలగనబోకు.. ఇవ్వాళా... రేపా? ఎల్లుండా? తెలంగాణ ఎట్లనైనా ఖాయం. కాదం కలేజా ఉన్నది. కొట్లాడే తత్వమున్నది. కానీ ‘ఆంవూధవూపదేశ్’ ఇక అసాధ్యం. అసాధ్యం. తెలంగాణ తథ్యం.. తథ్యం..
[email protected]

452

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles