వసంతగీతం ముందుచూపు


Sat,January 11, 2014 02:32 AM

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది.
‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ దళా లు గోదావరి నది దాటి ఇటు గడ్చిరోలీ, సిరొంచ అడవుల్లోకి.. అటు బస్తర్ అడవుల్లోకి ప్రవేశించిన దండకారణ్య పరస్పెక్టివ్ పాదుకుంటున్న కాలంలో వెలువడిన నవల ‘వసంతగీతం’.

ఇది నిర్దిష్టమైన సమకాలీన చారివూతక నవల. 1985-86 మధ్యకాలం నవ లా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్థిక చారివూతక నవల.రష్యా,చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధకాలపు నవలల వంటి ఒక ప్రామాణిక నవల ఇది. ఆదిలాబాద్ జిల్లా అడవంచు గ్రామాలు,అప్పటికి దండకారణ్యంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లా అడవి, ఈనవలకు స్థలం, కార్యక్షేత్రం. తెలుగులో అరుదైన ప్రజాసైన్య నవల ఇది. ‘పోదామురో జనసేన లో కలిసి, ఎర్రసేనలో కలిసి’ అని 1972-73లో పాడుకున్న పాట లు, ‘ఓరోరి అమీనోడా, ఓరోరి సర్కారోడా’ వంటి పాటలు ప్రజలకు ఎంతో భవిష్యదాశావహ గీతాలుగా, పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గుండె బెదురుగా, కొందరికి అతివాద దుస్సాహసంగా కనిపిస్తున్న కాలం కదిలివచ్చి ఒక దార్శనికతతో స్వీయరక్ష ణ అంటే శత్రువుపై దాడి, రిట్రీట్ అంటే విస్తరణ, ప్రజాపంథా అంటే ప్రజలకు భూములు పంచడమనే విప్లవ కార్యక్షికమం ప్రజ ల్ని సాయుధుల్ని చేసి, ప్రజాసైన్య నిర్మాణంలో ప్రజా రాజకీయాలను అమలుచేసే ప్రత్యామ్నాయం అనే ‘స్పెషల్ గెరిల్లా జోన్ పర్‌స్పెక్టివ్’ అని రుజువు కావడం కళ్లకు కట్టిన కథనం వలె సాగిన నవ ల ఇది. ఇది గ్రీష్మరుతువుతో పాటు వచ్చే ‘వసంతగీతం’.

ఇవ్వాళ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత పెను ప్రమాదంగా మారిన మావోయిస్టు ఉద్యమం ‘ఆదిలాబాద్ కన్నతల్లి’ గా ఎట్లా పురుడుపోసుకున్నదో ఒక ప్రామాణిక చారివూతక నవ లా రూపంలో చదవడం మన మూలాలు ఆవిష్కరించుకోవడానికే కాదుపపంచంలో మిగిలిన ఒకే ఒక్క ప్రత్యామ్నాయ ఆశాజ్యోతి ని మన భవిష్యత్తులో సాకారం చేసుకోవడానికి కూడా చాలా అవసరం. అడవిలోకి విస్తరణ కేవలం బేస్ ఏరియాలు ఏర్పాటు చేసుకోవడానికి కాదు, విముక్తి ప్రాంతంగా అభివృద్ధి చేసే క్రమంలో ఆదివాసుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చి నూతన మానవావిష్కరణ వైపు సాగడం.జీవితంలోని సకల రంగాల్లో ఎటువంటి ప్రత్యామ్నాయ గుణాత్మక పరిణామాలు జరుగుతాయో ఈ నవలలోని (నిజ)పాత్రలన్నీ మన కళ్లకు కడుతాయి. ఒక గట్టయ్య, ఒక రాధక్క వ్యక్తిగత సమస్యల నుంచి పారిపోయివచ్చి విప్లవ జీవితం లో నిలదొక్కుకోవడానికి.., ఊగిసలాటకు, మళ్లీ అంతిమంగా నిలదొక్కుకోవడానికి ఎంత మానసిక, భౌతిక ఘర్షణ అనుభవించారో చదవాల్సిందే.1983-89మధ్య కాలంలో రాష్ట్రంలో అమలయి న నిర్బంధవిధానం, రాజ్యహింసల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, పోలీసు శాఖలో నక్సలైటు బాధితుల సైన్యాన్ని ఏర్పాటు చేయడం, పోలీసుశాఖ పర్యవేక్షణలోకి అటవీ శాఖను తేవడం, పోలీసుశాఖతో సమన్వయంతో రెవెన్యూ, సంక్షేమ శాఖలు పనిచేయడం మొదలుకొని తునికాకు కాంట్రాక్టర్లయిన భూస్వాములను, రాజకీ య పార్టీల నాయకులను కూడా పోలీసు అధికారులు నయానా భయానా తమ సమన్వయంలో ఉంచుకోవడం కథాగమనంలో భాగంగానే ఈ నవలలో చర్చకు వస్తుంది.

విప్లవోద్యమం అడవికి విస్తరించడంతోనే రాజ్య నిర్బంధ విధానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం మొదలైంది-ఇది ఇంకెంత మాత్రం భూ దాహం మాత్రమే కాదని, ఈవిస్తరణలో విముక్తి ప్రాంతాల వ్యూహం ఇమిడి ఉన్నదని, ఇందులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచీ కమ్యూనిస్టు సంప్రదాయంలో భాగంగానే భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, ఊరి నుంచి వెలివేయబడిన వాళ్లు, వెట్టివాళ్లు, అన్ని రకాల వ్యవసాయ, వ్యవసాయేతర క్లిష్టతరమైన, అమానవీయమైన పనుల్లో పాల్గొంటూనే అంటరానివాళ్లుగా చూడబడుతున్న దళితులతోపా టు వెట్టిచాకిరీ రద్దు, వ్యవసాయ కూలీలకు పనికి తగిన కూలీరేట్లు, ‘దున్నేవారికే భూమి’ నినాదంతో తెలంగాణ పోరాట కాలం (1940) నుంచే కమ్యూనిస్టు పార్టీ వీళ్లను సమీకరించి సంఘటిత పరిచింది. ఇవ్వాళిటికీ ప్రతి దళిత కుటుంబానికీ కనీసం మూడు ఎకరాల భూమి అయినా ఆ ఇంటి యజమానురాలైన మహిళ పేర పట్టా చేయాలని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ముందు విప్లవపార్టీలు పెట్టిన భూసంస్కరణల డిమాండు దాకా భూమిని నమ్ముకుని బతుకుతున్న దళితుల జీవితం విప్లవ పార్టీలతోనే ముడిపడి ఉన్న ది. 1980 నుంచి విప్లవంలోకి మరొక మూలవాసీ సమాజం ఆదివాసులు వస్తున్నారనే గ్రహింపు, జాగ్రత్త, భయాందోళనలు కూడా పాలకవర్గాల్లో పాదుకొన్నాయి. ఇది నక్సల్బరీ, శ్రీకాకుళం, వైనాడు పోరాటాలలోనే ఎజెండా మీదికి వచ్చినా, క్షేత్రస్థాయిలో ఇది ఇంద్ర నుంచి ఒక వ్యూహంలో భాగమైన ఎత్తుగడ అయింది. శ్రీకాకుళోద్యమ నేపథ్యంలోనే 1/70 వంటి చట్టాలు వచ్చినా, ఒకవైపు ఆదివాసీకి భూమి మీద హక్కు ఇచ్చినట్లుగానే ఇస్తూ మరొకవైపు అడవిలో జోక్యం చేసుకునే చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది.

రాజనంది గాఁవ్, దల్లీరాజ్‌హరా కేంద్రంగా భిలాయ్ ఉక్కు కర్మాగారం, ఇతర ఉక్కు కర్మాగారాలు, పరిక్షిశమల కారణంగా నిర్వాసితులైన ఆదివాసీల దుర్భర జీవితాలు చూసి శంకర్‌గుహా నియో గి చేపట్టిన ‘జల్ జంగల్ జమీన్’ ఉద్యమం, దండకారణ్యంలో పీపుల్స్‌వార్ ప్రవేశంతో కేవ లం ఒక మిలిటెంట్ సంస్కరణ ఉద్యమ రూపంలోనే ఉండబోవడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి..1987లో రాసిన ఈ నవల1991లో పీవీ ప్రధానిగా నూతన ఆర్థిక విధా నం పేరుతో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ను ప్రవేశపెట్టే రాజనీతి ఎక్కడి నుంచి ఎంత స్పష్టం గా నేర్చుకున్నాడో ఒక ముందుచూపుతో మన ముందుంచింది.‘వసంతగీతం’నవల ఇప్ప టి వరకూ వచ్చిన రాజకీయార్థిక, చారిత్రక నవలలకు ఒక సైనిక కోణాన్ని, అంటే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధిం చడానికి ఒక విప్లవపార్టీ మాత్రమే కాదు, ప్రజాసైన్యం లేకుండా ప్రజలకు మిగిలేదేమీ లేదనే అవగాహనతో జోడించిన పార్శాన్ని కూడా ఎంత వాస్తవం మీద ఆధారపడిన ఊహతో రచించబడిందో గ్రహించవచ్చు. ఈఅర్థంలో ‘వసంతగీతం’ నవలకు తెలుగు సాహి త్యంలో అపూర్వమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు.
(‘వసంతగీతం’ నవలకు వీవీ రాసిన ముందుమాట
నుంచి కొన్ని భాగాలు)
( జనవరి 11,12 తేదీల్లో వరంగల్‌లో జరుగుతున్న విరసం
మహాసభల్లో ‘వసంతగీతం’ ఆవిష్కరణ సందర్భంగా..)

820

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles