యాది..మనాది...


Sun,December 29, 2013 01:17 AM

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌నగర్, బోడగుట్ట కన్నాల. బయ్యపు దేవేందర్‌డ్డి. బొట్ల వనపర్తిలో ఎన్‌కౌంటర్. పాతికేళ్లు యవ్వనాన్ని, శక్తినీ, మేధనూ ధారవోసి ఏజెన్సీలను ఎలుగడి మంట చేసిన ఆధునిక అల్లూరి సీతారామరాజు అయిన వడ్కాపూర్ చంద్రమౌళి. కాలం ప్రవహించిన చోటల్లా ఒక మొక్కై మొలిసిన మనాద పెరుగుతది. మల్లోజుల కోటేశ్వరరావు ముఖం ఛిద్రమైన దృశ్యం. చిత్రహింసల కొలిమిలా మారిన కాయం. అమర్ రహే. పెద్దపల్లి చౌరస్తా మీద ఆ పార్థివ దేహపు బండిమీద వీవీని కౌగలించుకుని కన్నీరూ కన్నీరూ కలిపి.. నీ కన్నీరు నా కన్నీరు ఏరులై పారంగా మిత్రులారా! ఘనీభవించిన ఈ కాలం ముందు దిగులుగా నిలబడి దుక్కమూ రాక.. కన్నీటి చుక్కా కంటి పాప నుంచి తెగిపడక.. ఈ దిక్కుమాలిన గాంధీ ఆస్పత్రి మార్చురీ ముంగట... సాయీ మిత్రమా రాంరెడ్డీ, వేణుగోపాలూ మనమంతా పాత వాసనేస్తున్న పెట్టెల్లా భద్రంగా ఒక శోకం మోసుకుంటూ తిరుగుతున్నట్టు... భూమయ్య సార్.. లేరాదు.

ఇప్పుడిక ఈ సందర్భంలో...తెలంగాణ దశాబ్దాల దుక్కానికి ఒక చిన్న విరామంగా.. ఒక గొప్ప విజయంగా.. ఒక కల సాకారమౌతున్నట్టుగా... ఒక వస్తున్నట్టుగా ఉన్న ఈ ఉద్విగ్న, భయవిహ్వల, గుండెల నిండుగా నిండుకొని, ఊపిరి సలపనివ్వని లక్షల అమూర్త ఆకారాలు లేని క్షణాల ముంగిట.. జై తెలంగాణ అనటానికి లేవరాదు. ఒక్కసారి.. నీకు ఇష్టమై బోధించినట్టుగా..పజాస్వామ్య తెలంగాణ. భూమయ్య సార్. కాచాపురం నుంచి వచ్చి నలభై ఏళ్లు ఒక కలను మోసుకుని తిరిగి... తిరిగి చివరికి ఈ దరివూదగొట్టు, ఆత్మలేని నగరం రహదారి మీద పడివుంటివా!.. చెరగదు. చూపు మారదు. ఉత్తగ చచ్చిపోతడా భూమ య్య సార్. ఇటు ప్రెస్‌క్లబ్‌కూ లేక... అటు అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు ఇంటికీ లేక.. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడా? విప్లవకారులకు ఉపాధ్యాయుడా! నల్లబల్లల మీద అక్షరాలు గీసుకునే వేలమంది టీచర్లకు తోవ వేసిన భూమయ్య.. ఏడీ రవీందర్‌డ్డి సార్! ఇద్దరు మిత్రులు.. ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరు ఉద్యమకారులు. కాలంతో కరచాలనం చేసి, కోటేశ్వరరావుతో చెలిమి చేసి, కత్తుల వంతెనలను కలిపి, సమస్యల నదులనూ, సుడిగుండాల నూ, ప్రవాహాలనూ ఎదురీది.. ఏపీటీఎఫ్, డీటీఎఫ్, జనసభ, ఐక్యకార్యాచర ణ కమిటీ, తెలంగాణ ప్రజావూఫంట్.. అడవి ఆశీర్వచనాలు తెలిసిన వాడు భూమయ్య సార్. దాపరికం దేనికి. మరణం తర్వాత.

చివరి చరణంలోనూ ఆయన ప్రజాస్వామ్యం కాదు కాదు. నూతన ప్రజాస్వామ్యాన్ని కలగన్న విప్లవకారుడు. నిజమే. భూమికి అయ్య. ఏ భూమికోసమైతే తెలంగాణ తరతరాలుగా తండ్లాడుతున్నదో? ఏ భూమి కోసమైతే తెలంగాణ చెలకలన్నీ నెత్తురు పొర్లిన ఎర్ర చెలకలయిందో? ఏ భూమి కోసమైతే తెలంగాణ నక్సల్బరీ వసంతమేఘ గర్జననీ, శ్రీకాకుళాన్నీ పంటపొలాల్లోకి తెచ్చుకొని ఎర్రజెండాలు ఎగరేసిందో? ఆ భూమి భుక్తి కోసం పెద్దపల్లి కన్నకలలన్నీ.. జమ్మికుంట ఆదర్శకాలేజీ కరీంనగర్ జిల్లాకు విప్లవకారులనిచ్చింది. త్రీ మస్కటీర్స్‌నిచ్చింది. సాహూనూ, నల్లా ఆదిడ్డినీ, చంద్ర ప్రభాకర్‌నూ, మడిపల్లి సుధాకర్‌డ్డినీ ఇచ్చింది. మొన్ననే నడి జమ్మికుంటలో సాహూనూ, నల్లా ఆదిడ్డినీ తలుచుకుని, నిలు గౌరవం ప్రకటించి వచ్చిన తర్వాత భూమయ్య సార్.. ఇప్పుడొక పేరు కలుపుకొని మాట్లాడాలి.. అవును.. జమ్మికుంట ఆదర్శకాలేజీ.. మంథని ప్రభుత్వ జూనియర్ కాలేజీ.. మల్లా రాజిడ్డి, పోరెడ్డి వెంకన్న, నేనూ, బయ్యపు దేవేందర్‌డ్డి, రమణాడ్డి...వీరుల గన్నది కరీంనగర్ జిల్లా.. అడవులు మోదుగులు పూసినవి.. బొగ్గు గనులు అంటుకొని మండి ఎర్రటి నిప్పుకణికలయినవి.

గోదారి అద్దరి ఇద్దరి ఒడ్లొరుసుకుని పారి.. నలభై ఏళ్లుగా కలలే కలలు. శవాలొస్తుంటాయి. బయట భయం గాలులు వీస్తుంటాయి. సమాచార తంత్రులు విద్వేషం పలికి బెదిరిస్తాయి. ఛస్తావా! నీ నమ్మకాలు వదులుకుంటావా.. భూమయ్య సార్ నడిజాము వేళ కనిపించని భూతాలు తొక్కుకులాడే రహస్త్రంతులేవీ నిన్ను భయపెట్టలేదు. అడవి చుట్టుముట్టినప్పుడూ బయటపడ్డ గట్టి పిండం నీ ప్రాణం.. చివరికి ఈ రోజువారీ నిలబడే తీరిక కూడా లేని నిప్పచ్చి రద్దీ నగరంలో నడివీధిలో నువ్వు... ప్రాణం విలువ ఎంత? తెలుసా? ప్రజాస్వామ్యమంత? తెలుసా! ఈ దేశం నిరాకరించిన కోటొక్క పర్సె, సబ్బం డ వర్ణాల ఆకాంక్షలంత.. అవి తీరవు. అది ఒడువదు. దీపం మలగదు. నీ ప్రాణం లాగే, ప్రెస్‌క్లబ్‌లో భవిష్యత్ చిత్రపటం ఆవిష్కరించి, ఇప్పటి కల తీరినందుకు జై తెలంగాణ చెప్పి, మరో కల కోసం మరో పోరాటాన్ని ప్రకటించి, గంట సేపట్లో.. మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది. సమస్య ఏమి టో? తెలుసా! రోజూ చచ్చేవాళ్లు... దినాం చచ్చి బతికేవాళ్లు... కోట్ల మరణాల మధ్య.. భూమయ్య సార్ మరణించీ..

యాదిల్లో, మనాదిలో, కలలో, మెలకువలో, పోరాటంలో బతికే ఉండేవాళ్లదే సమస్య. ఒక జ్ఞాపకం కాదు సమ స్య. ఒక స్మృతి కాదు సమస్య. భూమయ్య సార్ మరణించినా ఇంకా చుట్టూ తిరుగుతూ ఉండే బతికిన క్షణాలుగా మారే మనుషులే దీపాలుగా వెలగడమే సమస్య. భూమయ్య సార్!
వడ్కాపూర్ భీంరావు కొడుకు. జగన్ కూడా విప్లవం కలగన్నప్పుడు... నేనూ, జగనూ, చందుపట్ల కృష్ణాడ్డీ.. మనమూ.. మనమూ.. లక్ష్మీరాజంను తలుచుకున్నప్పుడు..లచ్చిడ్డీ ఏడున్నవ్. దసర పండుగలు వచ్చిపోతుంట య్. పూలు పూస్తుంటయ్. కట్లపూలు తలలూపుతుంటయి. మనుషుల మధ్య, మానవ సంబంధాల మధ్య, పురావైరాల స్వంత ఆస్తి మూల ధాతువు భూమి రేపిన కల్లోలం తిరుగుతూ ఉంటుంది. ఉపశమనం లేదు. తరతరాల తండ్లాట. మా భూమి మాగ్గావాలె. మా నీళ్లు మాగ్గావాలె. మా కొలువులు మాగ్గావాలె.. మా స్వేచ్ఛ మాగ్గావాలె.
ఇవన్నీ సామాన్య జనం అందుకునే కనీస ప్రజాస్వామ్యం కావాలె. నిజమే. ఆటలాడుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇష్టమొచ్చిన రాజకీయ కార్యకలాపాలు చేసుకోవడానికి, నమ్మిన సంగతులు నలుగురితో పంచుకోవడానికీ, బలవన్మరణాలు, మాయమైపోయే మనుషులు, ఛిద్రమైన శరీరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి సందులేని గాయాలతో భౌతికకాయాల బండి మీదకు చేరే మనుషులు.. తెలంగాణ తండ్లాట ఆగలేదు. చిన్న విరామం. అంతే.

మీరూ మేమూ కలిసి నడిచిన బాటలు పేటలు ఏమంటయ్. శీతాకాలం లో ముడుచుకుని పడుకున్న ఆ పల్లెలిప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాయి. జుట్టు నెరిసిన సమూహం ఒకటి మార్చురీ గేటు ముందు నుంచి కట్టెసరుసుకుపోయిన శవం ముంగట నిలబడి... ఊరేగింపు కదులుతూ ఉంటుంది. గన్‌పార్క్ నిషేధం అయితే, సికింవూదాబాద్ క్లాక్‌టవర్ ఉంది. వచ్చేవాళ్లు.. పోయేవాళ్లు. జీవితం ఒక విరామ చిహ్నం. నిజమే చివరి విందు కాదది.. చివరిదీ సమావేశమే. ఇష్టమైన పోరాటాలను గుర్తుచేసుకోవడానికి. అయినా భూమయ్య రొమాంటిక్ రెవల్యూషనరీ కానేకాదు. అతను కవిత్వాన్ని ప్రే మించి ఉండవచ్చు కానీ.. రాయలేదు కావొచ్చు. కరుడు గట్టిన విప్లవకారుడు. జీవితం పొడవు నా ఒక తెలంగాణ. ఒక ప్రజాస్వామ్యం. జీతాలు లెక్కలేసుకు ని, ఇంటి కోడి వలె పిల్లలని సాదుకుని, వచ్చే ఇంక్రిమెంట్లు, పోయే కటింగ్‌లు పోను జీవితా న్ని కురచ కొలతల్లో బందీ చేసుకునే టీచర్ల మందకు కలలు మప్పింది భూమయ్యే. మంది లో కలిపిందీ భూమయ్యే. అక్క డి నుంచి నలభై ఏళ్ల ప్రస్థానం అడిక్‌మెట్ దారిలో ముగిసిం దా? ఈ తోవకు కొనసాగింపు ఉందా?

భూమయ్య మరణం సహజమేనా? సందర్భం ముఖ్యం. తెలంగాణ వస్తున్నది. కానీ భూమయ్యలు కొత్త తెలంగాణ నిర్మాణం కోసం, ప్రజాస్వా మ్యం కోసం మరో పోరాటానికి పిలుస్తున్న సందర్భం. బీర్‌పూర్ లో పోలీసు కౌన్సెలింగ్‌లు. ఖమ్మం అడవుల్లో కొత్త కూంబింగ్‌లు.. దేశం నిర్వాసితమైపోతున్న కాలంలో భూమయ్య మరణ రహస్యం ఏం చెబుతున్నది. అది కేవలం యాధృచ్ఛికంగా, సహజంగా జరిగిన ప్రమాదమేనా? అయితే రాజ్యం ప్రకటించవలసి ఉన్నది. అంతదాకా.. భూమయ్య మరణం కొత్త సందర్భంలో కొత్త సందేహాలను మిగిలిస్తున్నది. ప్రమాదం ఏమంటే భూమయ్య కాదు. ఇలాంటి కలలు గనే వారందరూ మరణించినా మళ్లీ మళ్లీ బతకడం.. నీ సమాధి మీద కొన్ని విత్తనాలు చల్లుతాం. అవి మొలకెత్తి, పువ్వులు పూస్తాయి. భూమయ్య సార్.. సదా యాది.. ఒక మనాది.
[email protected]

315

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ...

Featured Articles