తెలంగాణకు కలమొడ్డిన కట్టా


Mon,December 9, 2013 02:56 AM

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తెలంగాణ సమాజం నుంచి స్వీకరించుకున్న గొప్ప జీవన పోరాటాలను, అవి నేర్పిన సంస్కారాలను, భావజాలాలను ఈ వర్గం తమలో లీనం చేసుకొని, ప్రభావితమై, మళ్లీ సమాజానికి భావజాలాలను అందించింది. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ, తెలంగాణ ప్రత్యేక పోరాటం. ఇవి ఒకదాని తర్వాతి ఒకటిగా జరిగినట్టున్నా... ఇవ్వాల్టి తెలంగాణ భావజాల ప్రపంచంలో ఈ మూడింటి ధార కలిసిమెలిసి కనబడ్తాయి. కట్టాశేఖర్‌రెడ్డి మొదటి కోవ వామపక్ష భావజాలంతో ప్రభావితమైనవాడు. నక్సల్బరీపై విమర్శలున్నవాడు. కానీ రెండు పాయలూ తెలంగాణ పోరాటంలో కలెగలిసి ప్రత్యేకంగా తెలంగాణవాదం విస్తృత భావజాలంగా రూపుదిద్దుకున్నది. దానివల్ల తెలంగాణవాదం, వలసపెత్తనం, ఆధిపత్యం ఒక ప్రాంతం ప్రజల ఉనికినీ, అస్తిత్వాన్ని ధ్వంసం చెయ్యడం లాంటి విషయాలన్నింటి మీద ముఖ్యంగా జయశంకర్ తరహా తెలంగాణవాదం ఒకటి పదహారు సంవత్సరాలుగా తెలంగాణను ప్రభావితం చేస్తూ ఉన్నది.

వామపక్ష భావజాలం నిజానికి ఆధునికానంతరం ప్రబలిన అస్తిత్వవాదాలను పూర్తిగా స్వంతం చేసుకోలేదు. గుర్తించింది. కానీ ఒక్క తెలంగాణ సందర్భంలో మాత్రమే ఇక్కడ వామపక్ష వాదులు చెబుతున్న సామ్రాజ్యవాద విస్తరణ, దానికి వ్యతిరేక పోరాటంగా తెలంగాణ పరిస్థితులు ఉండడం భౌతిక, వాస్తవికత ఏర్పడడం వామపక్షాలు తెలంగాణ పోరాటాన్ని స్వంతం చేసుకోవడానికి కారణం అయింది. తెలంగాణను పరిశీలించడం అంత సులభమైందేమీ కాదు. తెలంగాణవాదాన్ని నిర్మించుకొని, దానికి రక్షణగా నిలబడి కాపాడడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఏది ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ప్రభావమో, ఏది వలసవాద ప్రభావమో తెలియనంత సున్నిత విభజన రేఖ ఈ ప్రాంతంలో ఉంది. అంతిమంగా వలస పెత్తందార్లు సామ్రాజ్యవాద దళారీలే అయినప్పటికీ, ప్రత్యేకంగా వలస వల్ల ఏర్పడిన ముప్పుగా పరిణమించిన ఉపరితలాంశాలు చాలా ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన పరిమితులు ఉంటాయి. ఈ కలెగలుపు వ్యవహారాల ఆధారంగానే తెలంగాణవాదం మీద వెయ్యి ప్రశ్నలకు జవాబు చెప్పినా వంద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు.

ఇదొక ప్రత్యేక స్థితి. అందుకే తెలంగాణవాదం ఇచ్చిన ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి చాలా సందర్భాల్లో తెలంగాణవాదాన్ని బలంగా, కోటగోడలా, నిర్మించడానికి ఉపయోగపడిన స్ఫూర్తిస్ఫోరకాలయ్యాయి. శేఖర్‌రెడ్డి ‘కట్టా మీఠా’ మొత్తం, ఆంధ్రజ్యోతిలో రాసిన ‘మాటకు-మాట’ను మినహాయించి తెలంగాణను ఒక కోటగోడలా కాపాడుకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో భావజాల ప్రశ్నలు, ప్రాపంచిక దృక్పథాల ప్రశ్నలతో పాటు రోజువారీ యధాలాప చర్చల దాకా కట్టాశేఖర్‌రెడ్డి తెలంగాణవేపు నిలబడిన కలం వీరుడుగా ఈ కాలమ్ ద్వారా మన ముందు నిలిచాడు.

కట్టాశేఖర్‌రెడ్డికి ఒక ప్రాపంచిక దృక్పథం వుంది. అది ఆయన గ్రామీణ జీవితం నుంచి, పేదరికం, వేదన, వెనుకబాటుతనం, నీళ్లలేమి నుంచి వచ్చినా ఆయన రాజకీయ భావజాల నేపథ్యం అన్నింటినీ అధిగమించే శక్తినిచ్చింది. ప్రపంచంలో కోటానుకోట్ల మందిని అల్లకల్లోలం చేసిన ఒకేఒక్క సిద్ధాంతం మార్క్సిజం. అది మొదటిసారిగా ప్రపంచానికి భాష్యం చెప్పి మార్చడానికి ఉత్ప్రేరకాలను తయారుచేసిన తత్వశాస్త్రం. శేఖర్‌రెడ్డికి ఈ తత్వశాస్త్రం పరిచయం అయిన తర్వాతనే ఆయన వ్యక్తిగత జీవితమూ, ఆయన భౌతిక ప్రపంచమూ పూర్తిగా మారిపోయాయి...మార్క్సిస్టు మూల సూత్రాల ప్రభావశీలత ఎంత శక్తివంతమైనదంటే అది జీవితం పొడవునా సూచ్యంగా, వ్యాచ్యంగా, కొన్నిసార్లు ప్రస్ఫుటంగా, చేతనగా మరికొన్నిసార్లు అంతశ్చేతనగా కొనసాగుతూనే ఉంటుంది. ఒకసారి ప్రపంచాన్ని అట్లా చూడడం ప్రారంభమయినాక ఇక అది వదలదు. మినహాయింపులుంటాయి, పరిమితులుంటాయి. బలహీనతలుంటాయి. నిలబడకపోవడ మూ ఉంటుంది. తూలడమూ ఉంటుంది. విస్మరణ కూడా ఒక్కోసారి ఉంటుంది కానీ...జీవన గమనం పొడవూ ఆ తాత్వికత తాలూకు ప్రభావాలను తట్టుకోలేం. పోగొట్టుకోలేం.


తెలంగాణ ఈ భావజాల వ్యాప్తి మొత్తం క్రమంలోనూ అనేక సంఘర్షణలు పడింది. నమస్తే తెలంగాణ ఆవిర్భావం దాకా సరైన మాధ్యమమూ లేదు. ఇతర పత్రికల్లో ఆడపాదడపా లబ్ద ప్రతిష్టులయిన వారు తప్ప రాసే వారూ లేరు.కానీ ప్రతి సందర్భంలోనూ తెలంగాణ విద్యావంతులు, బుద్ధి జీవులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సామాజిక ఉద్యమకారులు భావజాల వ్యాప్తికి అక్షరాలు అందించారు. ఈ కృషిలో జర్నలిస్టులు అగ్రగామిగా నిలుచున్నారు. అందులో శేఖర్ ఒకరు కాదు ముఖ్యుడు. నిజానికి ఆయన భావజాలానికి ఎన్నికల రాజకీయాలకి, ముఖ్యంగా టీఆర్‌ఎస్ స్వీయ రాజకీయ అస్తిత్వం నినాదానికి అభేదం లేదు. అందువల్ల ఎన్నికల సందర్భంలో ఎలాంటి మీమాంస లేకుండా స్వీయ రాజకీయ అస్తిత్వ నినాదాన్నే నెత్తికెత్తుకొని సమర్థించాడు. కానీ పార్టీ గడ్డుపరిస్థితుల్లో పడబోతున్నప్పుడు, అనవసర స్తబ్ధతకు లోనవుతున్నప్పుడు ఆయన నిర్మొహమాటంగా విమర్శలు కూడా ఎక్కుపెట్టాడు. పర కాల ప్రభాకర్‌తో సహా చాలామంది దాడులను ఎదుర్కొని అలాంటి వారి వాదనల్లో డొల్లతనాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాడు.

తెలంగాణ ఉద్యమం గురించి స్థూలంగా శేఖర్‌ది ఎట్లనన్నా తెలంగాణ సాధించుకోవాలన్నదే. ఐక్య పోరాటాలకు విఘాతం కలగకూడదన్నదే. నిజానికి తెలంగాణ ఉద్యమంలో రెండు ప్రధాన ధోరణులు ముందుకొచ్చాయి. భౌగోళిక తెలంగాణ కాదు, అది సామాజిక తెలంగాణ కావాలని, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్న ధోరణులు. ఇవి అసలు తెలంగాణ సాధనకు అడ్డం కాకూడదన్నదే శేఖర్‌రెడ్డి అసలు లక్ష్యం. దానికోసం ఆయన ప్రధాన డిమాండ్‌కు పరోక్షంగా అడ్డంపడి అవకాశవాదం ప్రదర్శించిన ఉద్యమ విచ్ఛిన్నశక్తులను కూడా వదిలిపెట్టలేదు. భావజాల మూలాలను ప్రశ్నించే శత్రు శిబిరపు సోకాల్డ్ మేధావులను శక్తులను కూడా శేఖర్ ఎండగట్టాడు.

చివరగా ఒక విషయం. ముందే అన్నట్టు శేఖర్‌రెడ్డి భావజాలం మితవామపక్షాల ప్రభావంతో కూడిన తెలంగాణవాదంతో రూపుదిద్దుకున్నది. ‘మన మావోయిస్టులు మావోను చైనాను పట్టుకొని వేలాడుతున్నారు. అటు ‘పందుల దొడ్డికీ ఇటు తుపాకీ గొట్టానికీ మధ్య మరో మంచి ప్రత్యామ్నాయమేది కనిపెట్టలేకపోవడం ఈ దేశ మార్క్సిస్టుల వైఫల్యం’.. ఆయనకు వామపక్ష తీవ్రవాదం మీద భిన్నాభిప్రాయం ఉన్నది. బహుశా ఆయనతో నాకూ ఉన్నభిన్నాభిప్రాయమే అది. తెలంగాణవాదానికి సం బంధించి దాని రాజకీయ నిర్మాణము, స్వరూప, స్వభావాల గురించి, స్వీయ రాజకీయ అస్తిత్వమన్న యాంత్రిక అవగాహన గురించి స్వల్ప భేదాలు తప్ప, స్థూలంగా తెలంగాణవాదానికి సంబంధించి మా ఇద్దరి కలా ఒకటే. తెలంగాణ రావాలి. ఒకే ఒక్క తెలంగాణ.
జైతెలంగాణ
-అల్లం నారాయణ (‘మాటకు మాట’ పుస్తకానికి రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)

172

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...