అమ్మో.. ఆ ముగ్గురు బాబులు


Sun,October 27, 2013 01:05 AM

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే... భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భరించే శక్తి ఇకలేదు. వీళ్లను తప్పించుకోవడం కోసమన్నా మా తెలంగాణ మాగ్గావాలె... అమ్మో.. ఆ ముగ్గురు.... పాపం సీమాంధ్ర ప్రజలకు వేరే ఏదైనా రూపంలో ఉపశమనం లభించుగాక....

భూదేవికున్నంత ఓపిక ఉంటే తప్ప తట్టుకోలేని స్థితి. తెలంగాణ పరిస్థితి ఎట్లా తయారయ్యిందంటే ఒకవంక ఢిల్లీ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాళ్లు ఒకదాని వెంట ఒకటిగా ఏదో ఒకటి చేస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు. కానీ అదే ఢిల్లీ పీఠం వల్ల ఇక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కిరణ్ కుమార్‌డ్డి ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడుతుంటారు. విలేకరుల సమావేశాలు పెట్టి హేతురహితంగా, తర్క రహితంగా ఊహలకు రెక్కలు తొడిగి, అపోహలను అలంకరించి జనం మీదకు వదులుతూ ఉంటారు. మరోవేపు ఛానళ్ల దాడి. ఏకపక్షం. పత్రికల్లో ప్రొఫెసర్ల పేరిట రాసే కడహీనపు అజ్ఞానపు, వైరుధ్యపు రాతలు.

పత్రికలు చదువుదామంటే గుబులు. ఛానళ్లు చూద్దామంటే దిగులు. ఒక కిరణ్‌ను తట్టుకుని సరేలే! ఆయన అట్లానే మాట్లాడుతాడు. జరిగేది జరగకపోతుందా? అనుకుని సమాధానపడి రక్తపోటు తగ్గించుకుందామనుకునే సరికి చంద్రబాబు తయారవుతాడు. ఆయన బాధ ఏమిటో? ఎవరికీ అర్థం గాదు. లేఖ ఇచ్చినా అంటడు. విభజన పాపం అంటడు. ఇట్లా విభజించకూడదు అంటడు. రాజకీయాల కోసం అంటడు. ఏదో ఒక దాని కోసం విభజన అయితే నీ సొమ్మేం పోయింది? అంటే మాట్లాడడు. ఇంతకూ నువ్వు అటా? ఇటా? అంటే మాట పెగలదు. నీకెందరు పిల్లలు అంటడు. ఆయన ఇబ్బంది ఏమిటో? ఆయన మార్గం ఏమిటో? విధానం ఏమిటో? చివరాఖరుకు ఆ పరమేశ్వరునికి కూడా అర్థం గాదు. నిరాహారదీక్షలు చేసి, ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అతి పురాతన ప్రశ్నలు వేస్తాడు.

విభజన అంటే అదేదో ఘోర నేరమన్నట్టు, మహాపరాధమన్నట్టు, ప్రపంచం మునిగిపోయినట్టు, సమువూదాలు ఉప్పొంగినట్టు, వీళ్లిద్దరూ సృష్టించే భ్రాంతి ఒకటి మనసును కెలుకుతూ ఉంటుంది సీమాంవూధలో. పురుగు మెసిలి, రోడ్ల మీద ఆర్గనైజ్ చేసి, చాలా చక్కగా, యూనిఫామ్‌లతో సహా విద్యార్థులు ఉద్యమం చేసినట్టు ఛానళ్లు ప్రదర్శిస్తాయి. పత్రికలు రాస్తాయి. పుల్లారావులు, సుబ్బారావులు పత్రికల్లో పంచరంగుల వన్నెలతో ఇది స్వాతంత్య్ర ఉద్యమం కన్నా గొప్పదని, చెబుతూ ఉంటారు. నవ్వాల్నా? ఏడువాల్నా? కోప్పడాల్నా? మనసున పట్టదు. వశంగాదు. కానీ తెలంగాణ ఉద్యమం సాధించిన పరిణితి, స్పష్టత, లక్ష్యం పట్ల గురి, ఉద్యమం కొనసాగి నడిచిన అనుభవాల సారంతో ఏర్పడిన అవగాహన మళ్లీ పూర్వస్థితిలో ఆలోచించే చైతన్యాన్ని ఇచ్చినందువల్ల నిమ్మళంగా బతికి ఉంటాం. అంతే.

ఈ ఇద్దరే అనుకుంటే వీళ్లద్దరి కన్నా ఘనుడు, ఫ్రెష్‌గా జైలు నుంచి వచ్చిన జగన్ ఇవ్వాళ్ల మాట్లాడినది విన్న తర్వాత మళ్లీ...పొద్దున్నే ఒక పత్రికలో అసెంబ్లీ తీర్మానం, అసెంబ్లీ అభివూపాయం అన్న వాటికి ఉన్న తేడాతెలియని ఒక ప్రొఫెసర్ రాసిన వ్యాసంతో మొదలైన రక్తపోటు సాయంవూతానికి జగన్ మాటలు విన్నాక పెరిగింది. తగ్గే మార్గాలేవి. తోడు కిరణ్‌కుమార్‌డ్డి తడవలు తడవలుగా రక్తపోటు పెంచే ప్రయత్నాలు. మధ్యలో చంద్రబాబు ఎంతకూ తేలని మీమాంస? చివరాఖరుకు జగన్నాటకం.

‘బుర్గుల రామకృష్ణ, మండపాటి హనుమంతరావు, సూరవరం ప్రతాపడ్డి’ల గురించి తెలుసా? అని కూడా జగన్ ప్రశ్నించారు. అదీ సోనియాగాంధీని. పేర్లు పలకరానివాడి సంస్కృతీ దారిద్య్రం, భావ దారిద్య్రం భవిష్యత్‌లో ఎన్ని చిక్కులు తెస్తుందో? ఊహించడానికే భయం కలుగుతున్నది. సీమాంధ్ర ప్రజల మీద కొంత జాలి కూడా కలుగుతున్నది. ఇంత భావదారిద్య్రం ఉన్నవాళ్లు, ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నవాళ్లు, ఇన్నేసి కల్పిత అపోహలను ప్రచారంలో పెడ్తున్న వారు మాత్రమే సీమాంధ్ర ప్రజలకు, సమైక్య నినాదానికి నాయకులు కావడం తెలుగు ప్రజలు చేసుకున్న పాపం. ఒక చరిత్ర తెలువదు. భాషరాదు. సంస్కృతి అంతకం తెలియదు. మాట్లాడే వాటిలో కనీసం ఇవి అబద్ధాలని తెలిసినా నరంలేని నాలు కలు వాటిని వదిలిపెడితే స్వీకరిస్తున్న జనం పట్ల కూడా జాలి కలుగుతున్నది.

దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సోనియాను ఇటలీకి వెళ్లమనడానికి ఆంధ్రవూపదేశ్‌లో కలిసున్న జనం రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ఉన్న సంబంధం ఏమిటో? ఈ ప్రసంగం రాసిన రచయిత ఎవరో కానీ తన మేధావిత్వాన్ని పాపం జగన్ మీదకు ప్రయోగించారు. జగన్ తరహాకు, వ్యవహారశైలికి, ప్రసంగానికీ కనీస పొంతన కుదరనే లేదు. మధ్యలో ‘వాళ్లు ముందుగా కమ్యూనిస్టుల కోసం వచ్చారు’ అని స్వేచ్ఛ గురించిన ఆ కొటేషన్ జర్మన్ గురించి ఎందుకు మాట్లాడారో? ఒక్క ముక్కా అర్థం కాలేదు. ఈ అసంగతాలు, అసంబద్ధాలు... చివరికి అంతిమంగా ఒక విరోధాభాస. ‘బుర్గుల రామకృష్ణ’ ఆంధ్రవూపదేశ్‌లో విలీనానికి అంగీకరించిన తర్వాత ఒక మాటన్నారు. అది ఇలాంటి అహంకార జ్ఞాన కోవిదులకు తెలిసే అవకాశమే లేదు. ‘నా మరణశాసనం మీద నేనే సంతకం చేసివచ్చాను’ అన్నది ఆ మాట. దాని లోతు ఎంతో తెలుసా? హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే మరణశాసనం రాసుకున్నట్టే అని... ఆయనను సమైక్యవాదిగా కీర్తించారు. సరే బావుంది. అప్పటికది పాక్షికంగా నిజం కూడా. పొట్టిశ్రీరాములుకు ఎందుకింత శాపం. ఆయనను బతికుండగా మద్రాసు కోసం నిలువునా చంపేశారు.

అమరజీవి అయ్యారు. దేశంలో విభజన ఉద్యమాలకు, వేర్పాటువాదం ప్రబలి, ప్రత్యేక రాష్ట్రాల కాంక్షలు బలపడడానికి పొట్టి శ్రీరాములు ఒక ఆదర్శం. ఒక నిరాహారదీక్షతో గాంధీ మార్గంలో, శాంతిని నమ్ముకొని పొట్టిశ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించగలిగారు. సమైక్య సభల్లో వేదికలకు ఆయన పేరు పెట్టడమే పెద్ద విరోధాభాస. ఏం చెబుతాం. చరిత్ర, సంస్కృతి, గతం, ప్రాంతీయ విశిష్టతలు, హైదరాబాద్ ప్రత్యేకతలు వీటన్నింటి మీదా ఇలాంటి వారితో సంభాషించడం ఏమంత ఆరోగ్యకరం. మీరు సంస్కృతి సంగతి మాట్లాడితే వాళ్లు జాతి గురించి మాట్లాడతారు. మీరు జాతి గురించి మాట్లాడితే వాళ్లు నీళ్ల సంగతి మాట్లాడతారు. విడిపోయినాక శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జునసాగర్‌కు నీళ్లెట్లావస్తాయంటారు? దేశంలో ఇది ఇరవైతొమ్మిదో రాష్ట్రం. నీళ్లు ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా వస్తూనే ఉంటాయి. వానలు పడితే శ్రీశైలం వరదపొంగి, నాగార్జునసాగర్ నిండుతుంది. ఆపితే కృష్ణమ్మ ముంచెత్తి చంపుతుంది. కానీ ఈ ప్రశ్న రాయలసీమ రెడ్లిద్దరూ పదేపదే అడుగుతూనే ఉంటారు. మనం చెబుతూనే ఉండాలి.

ఇవేవీ కాదంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటరు. నాలుగేండ్ల కిందట డిసెంబర్ 9న పార్లమెంటులో ప్రకటించి, రోశయ్యతోని చెప్పి, అధిష్ఠానం అసెంబ్లీ తీర్మానం చేసి పంపమంటే, ఖాతరు చెయ్యని అప్పటి స్పీకర్ కిరణ్‌కుమార్‌డ్డి ఇప్పుడు తీర్మానం సంగతి మాట్లాడ్తడు. జూలై 30న ప్రకటించి, ఆగస్టు 8న నోట్ పెడ్తామని కేంద్రం చెప్పి, రెండు నెలలయినంక పెడితే, అదిగో అదీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అన్నింటికీ వ్యతిరేకం, అంతా హడావుడిగా, ‘టేబుల్ ఐటమ్’గా ఎందుకంటడు. పార్లమెంటులో ప్రకటించిన దాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తినీ కాలరాసిన వాళ్ల ప్రజాస్వామ్యం సంగతులు మాట్లాడడం ఏమంటాం. ఎట్లా తట్టుకుంటాం.

చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం ఎక్కడికి వెళతారు. అని అడిగే వాళ్లకు ఏమని సమాధానం చెబుతాం. అయ్యా తెలంగాణ దేశం నుంచి విడిపోవ డం లేదు. హైదరాబాద్, బెంగళూరు లెక్క, చెన్నయ్ లెక్క, పూణె లెక్క, ముంబాయి లెక్క ఈ భారత దేశంలనే ఉండే ఒక మహానగరం. ఎవడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే మళ్లా అదే ప్రశ్న. ఏమి చెయ్యగలం. కోపం రాకుండా ఎట్లా తప్పించుకోవడం. జగన్ ది మరీ విచివూతమైన కథ. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పునీరు తప్ప తాగునీరు ఎక్కడుంది? అంటే దుర్బేధ్యమయిన అజ్ఞానాంధకారానికి ఏమి చెబుతాం. జగన్‌కు ఈ నడమంత్రపు ‘ఘోస్ట్‌రైటర్’ ఎవరో కానీ ఆయనలో చాలా కళలున్నాయి. జాతీయత అంటడు. నీళ్లు అంటడు. ఉప్పునీళ్లంటడు. 30 సీట్లిస్తే ప్రధానిని చేసి సమైక్యం కొనసాగేలా చేస్తానంటడు. మధ్యలో హిట్లర్ అంటడు. జగన్ ఇంతకు సమైక్యవాదియేనా? విప్లవకారుడా? మధ్యలో స్వేచ్ఛ కోసం ప్రసంగాలు ఈ అంతనా పొంతన లేని ప్రసంగాలు విని, మాటలు విని, ఇట్లా ఇంకా నిమ్మళంగా ఉండే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అంచనా వేయడంలో కీలక అంశం. నిజమే.

ఈ మిడిమేళపు ముగ్గురు బాబులతోటి ఉండేకన్నా, వాళ్ల మాటలు వినేకన్నా, వాళ్ల చేష్టలు చూసేకన్నా, వాళ్లు ముఖ్యమంవూతులుగా ఉంటే జీవించి ఉండి, వాళ్ల కింద బతికేకన్నా.... ఈ ముగ్గురు బాబులను వదిలించుకోవడానికి ప్రాణాలకు తెగించయినా పోరాడి తెలంగాణ సాధించుకోవడం తప్ప మార్గంలేదు. వీళ్ల ముగ్గు ర్ని భరించేశక్తి, ఓపిక ఇంక లేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే... భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భరించే శక్తి ఇకలేదు. వీళ్లను తప్పించుకోవడం కోసమన్నా మా తెలంగాణ మాగ్గావాలె... అమ్మో.. ఆ ముగ్గురు.... పాపం సీమాంధ్ర ప్రజలకు వేరే ఏదైనా రూపంలో ఉపశమనం లభించుగాక....

-అల్లం నారాయణ
[email protected]

203

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles