విభజన: మేడ్ డిఫికల్ట్


Sun,September 29, 2013 02:36 AM

సరిగ్గా రెండు నెలలు. జూలై 30 ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్కడున్నది. అక్కడే. నిజాం కాలేజీ మైదానంలో సకల జనభేరి జరగబోతున్నది. లక్ష్యం, సభ లక్షణం సుస్పష్టమే. తెలంగాణ పోరాడుతూనే ఉంటుంది. వచ్చేదాకా. ఈ రెండు నెలల కాలంలో జరిగిన మాటల యుద్ధాలు కాంగ్రెస్ పార్టీ స్వభావాన్ని పూర్తిగా బట్టబయలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకరూపతలో లేదని, ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరిట బహుళ నాయకత్వంలో అనేక కేంద్రాలుగా అది ఇబ్బందులు ఎదుర్కొంటున్నదనేది అర్థమవుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు ముందే కకావికలయిన రూపాన్ని బట్టబయలు చేసుకున్నది. ఇంకెంత మాత్రం కాంగ్రెస్ రాజకీయ రహస్యాలు టెన్‌జన్‌పథ్‌కు మాత్రమే పరిమితమయినవి కావు.

రాజకీయ ఎత్తుగడలు అనేకంటే, ఇప్పుడు టెన్‌జన్‌పథ్ చుట్టూ ఆవరించి ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కుట్రలకు ఆలవాలమై ఉన్నది. ఆ కుట్రల ప్రభావాలు రాష్ట్రాలన్నింటా ప్రతిఫలిస్తున్నవి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చేదిగా, మనం తీసుకునేదిగా తయారయిన తెలంగాణ అంశం మున్నెన్నడూ లేనంత సంక్లిష్టంగా మార్చే ప్రయత్నాలు బలవంతంగా విజయవంతంగా సాగుతూ ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న వైరుధ్యాలు, సోనియాగాంధీ చుట్టూ ఉన్న కోటరీలో ఉన్న ప్రముఖుల మధ్య భేదాలు, పరస్పర హననాలు ప్రతిఫలంగానే తెలంగాణ సమస్య ‘మేడ్ డిఫికల్ట్’గా తయారవుతున్నది. బహుశా ఇది ఎటుదారి తీస్తుందో? ఊహించడం కష్టం కాబోదు.

ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు గానీ, దక్షిణాది నాయకత్వాలకు కానీ దొరికే మన్నన తక్కువే. చక్రాలు తిప్పి నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగిన స్థితిగతులు అరుదైనవే. కానీ ఆంధ్రవూపదేశ్ విభజనకు, అన్ని పార్టీల నిర్ణయం తర్వాత, అన్నిపక్షాల అంగీకారం తర్వాత వేచిచూసీచూసీ చిట్టచివరగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలో తాత్సారం చేసింది. ఈ తాత్సారం, ఈ సాచివేత ఉద్దేశపూర్వకమైనదేనని ఇటీవలి రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయి.

జగన్ విడుదల, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానాన్ని, దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీని ధిక్కరించినట్టుగా చేసిన ప్రకటనలు. ముందూ వెనకా జరిగిన ఈ పరిణామాలన్నింటి అంతస్సూత్రం టెన్‌జన్‌పథ్, దాని చుట్టూ ఆవరించి ఉన్న రాజకీయ కురువృద్ధుల కుట్రలలో దాగివున్నది. అనకూడదు
గానీ రాష్ట్రపతి భవన్ వేపు కూడా వేలు చూపవలసే ఉన్నది. అది కాంగ్రెస్ సంస్కృతి.


కాంగ్రెస్ సీడబ్ల్యూసీ జూలై 30 ప్రకటన నాటికి ఆ పార్టీకి ఒక స్పష్టమైన రాజకీయ ప్రణాళిక ఉన్నది. జగన్ ప్రభావం సీమాంవూధలో, కేసీఆర్ ప్రభావం తెలంగాణలో పాదుకుంటున్న పరిస్థితుల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి గణనీయంగా స్థానాలు సంపాదించడం ఎట్లా అన్నదే.. ఆ ప్రణాళిక. సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉండి, డిసెంబర్ 9న విస్పష్టంగా ప్రకటించీ ముందుకు కదలని తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం. నిజానికి డిసెంబర్ 9 ప్రకటన, సీడబ్ల్యూసీ నిర్ణయం కన్నా ప్రభుత్వ పరంగా, క్యాబినెట్ ద్వారా వచ్చిన ప్రకటన. దానికి చట్టబద్ధత ఉన్నది. రాజ్యాంగబద్ధత ఉన్నది.

పార్లమెంటులో ఆ ప్రకటన వెలువడింది. కానీ సీమాంవూధులు, కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఈ దేశపు ఏలికలకు ఆయువుపట్టుగా ఉన్న కార్పొరేట్లు, పెట్టుబడిదారీ రాజకీయవేత్తలు దాన్ని అడ్డుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నమ్మించి గొంతు కోసింది. ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటునూ అపహాస్యం చేసి తెలంగాణ ప్రజల ముందు అతి పెద్దవూదోహిగా నిలబడింది. చరిత్ర పొడవునా తెలంగాణ పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం ద్రోహ చింతన ప్రదర్శించింది. తెలంగాణకు ఏ వెసులుబాటూ లేకుండా, తెలంగాణ పోరాటాలకు కనీస ఫలితం లేకుండా ఆంధ్రవేపు కాంగ్రెస్ అధిష్ఠానం నిలబడింది. అది లాబీయింగ్ వల్ల కావొచ్చు. ధన ప్రభావాల వల్ల కావొచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఏజెంట్లు ఆంధ్రవూపదేశ్‌లో సహజంగానే సీమాంధ్ర పెట్టుబడిదారులు అయినందువల్ల కావొచ్చు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం వాళ్లతోనే జమిలి కుట్రలు చేస్తున్నది.


కాంగ్రెస్ స్వభావంలో అధిష్ఠానాన్ని ధిక్కరించినవాళ్లు బతికిబట్టకట్టిన ఏ దృష్టాంతమూ లేదు. అది న్యాయమా? అన్యాయమా? హేతువుందా? లేదా? అనేది పక్కనబెడితే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్మాణం, వ్యవహరణ తీరులోనే ఏక నాయకత్వం, దానిచుట్టూ కోటరీలుగా పనిచేస్తుంది. అయితే ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ దాకా అధిష్ఠానాన్ని ధిక్కరించిన వారెవరూ కాంగ్రెస్‌లో ఉండలేరని తేలిపోయింది. కొందరు బతికిబట్టకట్టి స్వతంవూతంగా పార్టీలుగా ఎదిగారు. మళ్లీ కాంగ్రెస్ పంచన చేరారు. మరికొందరు అడ్రస్ గల్లంతయ్యారు. మళ్లీ తన నమూనాలోకి, మళ్లీ తన గుప్పిట్లోకి వస్తే కాదనడానికి కాంగ్రెస్‌కు పెద్దగా అభ్యంతరం ఉండదు. ఇది కూడా చరిత్ర నిరూపితమైన అంశమే. బహుశా జగన్ విడుదలను, బహుశా కిరణ్‌కుమార్‌డ్డి ధిక్కారాన్ని ఈరకంగా చూస్తే తప్ప, ఆఖరుగా బొత్స సత్యనారాయణ రాజీనామా ప్రయత్నాలను కూడా పరిశీలిస్తే తప్ప ఈ విషయం అర్థం కాదు. కానీ సులభంగా, అన్ని రాష్ట్రాల విభజన లాగే సమస్యలు పెద్దవవకుండా, ఇరు ప్రాంతాల సాధారణ ప్రజల మధ్య విద్వేషాలు రగలకుండా తెలంగాణను విడగొట్టడంలో కాంగ్రెస్ విఫలమయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సమస్యను ఒక పద్ధతి ప్రకారంగా పెంచిపోషిస్తూ వస్తున్నది. ముందే చెప్పినట్టుగా మొదటి ప్రణాళికలో తెలంగాణలో కేసీఆర్, సీమాంవూధలో జగన్, మిగతా కాంగ్రెస్‌పార్టీ, రెండు చోట్లా లాభసాటిగా పార్లమెంటుకు గణనీయ స్థానాలు దక్కించుకోవడం అనే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడింది.

విశాలాంధ్ర ఒక విఫల ప్రయోగం. బలవంతపు విలీనం నుంచి తెలంగాణ విముక్తి కోరుకుంటున్నది. హైదరాబాద్‌తో విలీనం అయ్యింది కనుకనే హైదరాబాద్‌తో సహా విడిపోబోతున్నది. కానీ విభజనతో ప్రపంచం మునిగిపోతుందని, భూమి బద్దలవుతుందని, ప్రళయం వస్తుందని అపోహలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలనురెచ్చగొడ్తున్నది. అధిష్ఠానం దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉన్నది.సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత రెండు నెలలకు కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నిన్న ధిక్కార స్వరం వినిపించారు. ఆయన మాట్లాడిన మాటలు వేటికీ వీసమంత విలువలేదు. పచ్చి అబద్ధాలు. చరివూతకు సంబంధించిన అసత్యాలు. విలీనం కాకముందే ప్రతిపాదించిన నాగార్జునసాగర్‌ను, ఇట్లాంటి ప్రాజెక్టు విడిపోతే కట్టుకోగలమా? అన్నప్పుడు, నెహ్రూ, పటేల్‌లను కలిపి, ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు ముడిపెట్టి మాట్లాడినప్పుడు ముఖ్యమంవూతికి ఈ రాష్ట్రానికి సంబంధించి గానీ, నీటి ప్రాజెక్టుల గురించీ కానీ, విలీనం నాటి చరిత్ర, అంశాలు కానీ, విభజనతో ఏర్పడే అపోహలు కాకుండా నిజమైన సమస్యలు కానీ తెలియదని అనుకోవాల్సి వస్తున్నది. లేదా తెలిసి తెలిసీ ఆయన ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి దారుణంగా వ్యవహరిస్తున్నారని అనుకోవాల్సి ఉన్నది. నిజానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంత సగటు ఆంధ్రవాది మనస్తత్వంతో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే.

ఆంధ్ర ప్రాంతాల ప్రజల పట్ల, వాళ్ల కోసం నిలబడుతున్న వారి జ్ఞానస్థాయిని చూసి జాలిపడాల్సిందే. సగటు ఆంధ్రవాదులు, అశోక్‌బాబులు (దురదృష్టవశాత్తు ఆయన సంస్కృతి గురించి కూడా మాట్లాడే సాహసం చేసి ఉన్నారు.) కు మించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఏమి ఊహిస్తాం. మామూలుగా అయితే ఒక సంస్థ బాధ్యుడుగా ఉన్నవాళ్లే వ్యక్తిగత అభివూపాయాలు, ఉద్వేగాలు ఆధారంగా కాకుండా సంస్థ ప్రయోజనాల మేరకు విశాలంగా మాట్లాడతారు. బాధ్యతల బరువు నుంచి, కొంతైనా బాధ్యతగా మాట్లాడతారు. జూలై 30 ప్రకటన తర్వాత రెండు విలేకరుల సమావేశాలు, ఒక రాజ్యసభ టీవీ ఇంటర్వ్యూలలో కిరణ్‌కుమార్‌డ్డి మాట్లాడిన మాటలు ఆయన అర్హతను, స్థాయిని పూర్తి ప్రశ్నార్థకం చేశాయి. పరిణతి ఏమాత్రం లేని ఒక రాజకీయవేత్తలా ఆయన చిత్తం వచ్చిన ప్రతి మాటా మాట్లాడారు.


కాంగ్రెస్ అధిష్ఠానం పాత్ర గురించి, కుట్రల గురించి ఇక్కడే సందేహాలు వాస్తవాలుగా కనబడుతున్నాయి. నిజానికి తాత్సారం తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా సీమాంధ్ర అశోక్‌బాబులను, అపోహల ఆధారంగా రెచ్చగొట్టగలిగారు. విభజన ప్రక్రియను ఒక బ్రహ్మపదార్థంగా రహస్యంలాగా తయారు చేశారు. విభజన తప్ప అన్నీ చర్చలకు, సంప్రదింపులకు, పట్టువిడుపులకు ఆస్కారం ఉన్నవేనని ఒకసారి క్యాబినెట్ నోట్ తర్వాత ప్రభుత్వ ప్రకియలో ఈ అంశాలన్నింటినీ పరిష్కరించవచ్చున్న విషయాన్ని మరుగుపరిచారు.


ఇది ప్రయత్న పూర్వకంగానే జరిగింది. ఎందుకంటే విభజనతో సీమాంవూధులకు కలిగే కష్టనష్టాలు, లేదా సీమాంవూధుల అభ్యంతరాలు, ప్రధానంగా, ఉద్యోగాలు, ఉపాధి, నీరు, విద్యుత్, నిధుల లాంటి ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవచ్చనే ఒక భరోసాను అధిష్ఠానం ఎందుకో కావాలనే ఉద్వేశపూర్వకంగా కల్పించలేదు. పైగా ఒక సగటు ఆంధ్రా, మనస్తత్వం ఉన్న సమైక్యాంధ్ర అంటే, (యునైటెడ్ ఆంధ్ర) ముఖ్యమంవూతిని, తెలంగాణ అంటే తీవ్ర ద్వేషాన్ని ప్రకటించే ముఖ్యమంవూతిని కొనసాగించారు. ఆయన దాన్ని సావకాశంగా తీసుకొని సీమాంధ్ర ఉద్యమాన్ని, అబద్ధపు పునాదుల మీద , ఊహాజనిత కష్టనష్టాల మీద, అపోహలను పెంచి పెద్దచేసి నిప్పురాజేశారు. విభజన ఇక అసా ధ్యం అని, దాన్ని ఎప్పటిలాగానే అడ్డుకోగలమన్న భరోసాను స్వయంగా ముఖ్యమంత్రి కల్పించి, అక్కడ మంట ఎగదోశారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఎట్లా ప్రారంభమై ఎట్లాంటి డిమాండ్లదాకా ఎదిగాడో? ఇప్పుడు ఆయన ఏకంగా ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఒక ప్రతీకయై, ఒక అనైతిక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం కోసం, దౌర్జన్యంగా మంత్రులను, రాజకీయ నేతలను రాజీనామా చేస్తారా? ఛస్తారా! అనేదాకా ఎట్లా ఎదిగాడో చూస్తే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన సావకాశాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారో? ఇప్పుడు అధిష్ఠానానికే సవాళ్లు విసిరేంతగా ఎదిగాడో అర్థమవుతుంది.

నిజానికి సీమాంధ్ర ప్రజలు, అదృష్టవంతులు వాళ్ల ఉద్యమానికి ఒక ముఖ్యమంత్రి, అది కూడా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. నన్ను స్టేట్స్‌మేన్ కాకుం డా కుట్రదారు అంటారేమొనన్న కనీస బెదురులేని సగటు ఆంధ్ర మనస్తత్వం గల ప్రాంతీయ ఫండమెంటలిస్టు’ వారి నాయకుడు. ప్రభుత్వమే నాయకత్వం వహి స్తున్న ఉద్యమాన్ని కూడా బహుశా తెలుగు ప్రజలు మొట్టమొదటిసారి చూస్తూ ఉండడం కూడా తెలుగు వారి పూర్వజన్మసుకృతం. ఆంధ్ర జేఏసీ చైర్మన్‌కు ఏమి అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి కన్నా...ండు ప్రాంతాలు కలెగలిసి విలీనమైన ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతం విలీనం చేదు అనుభవమై, భంగపడి, నష్టపోయి విభజన కోసం ఉద్యమించి ఫలితం సాధిస్తున్న క్షణాన, తెలంగాణ ద్వేషిగా వ్యవహరిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఎంతైనా చేయగలరు. బహుశా కిరణ్‌కుమార్‌డ్డి అదే పనిలో ఉన్నారు. నిజానికి ఆయన మాటలకు ఆవేశపడడం, ఆశ్చర్యపోవడం ఇక ముందు అవసరంలేదు. ఆయన అంతే. అయితే ఇక్కడ విషయం ఏమంటే అదిష్ఠానం ఆయనకు కల్పిస్తున్న వెసులుబాటు వెనక రహస్యం ఏమిటి? ఎందుకోసం? ఈ వెసులుబాటు ఇప్పుడు అయిపోయిందా? జగన్ విడుదల అనంతర పరిణామాల తర్వాత తమకు భవిష్యత్ ఇక లేదని తెలుసుకున్న, తేల్చుకున్న తర్వాతనే కిరణ్‌కుమార్‌డ్డి, ఎంపీలు ధిక్కరించి రాజీనామాల బాట పడుతున్నారా? ఇవీ ఇప్పటి ప్రశ్నలు. రావాల్సిన సమాధానాలు.


విశాలాంధ్ర ఒక విఫల ప్రయోగం. బలవంతపు విలీనం నుంచి తెలంగాణ విముక్తి కోరుకుంటున్నది. హైదరాబాద్‌తో విలీనం అయ్యింది కనుకనే హైదరాబాద్‌తో సహా విడిపోబోతున్నది. కానీ విభజనతో ప్రపంచం మునిగిపోతుందని, భూమి బద్దలవుతుందని, ప్రళయం వస్తుందని అపోహలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడ్తున్నది. అధిష్ఠానం దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉన్నది. ప్రాంతీయ ఫండమెంటలిజం ప్రమాదకరమైనది. తెలంగాణది ప్రాంతీయత సమస్య కాదు. తను కోల్పోయిన స్వేచ్ఛను మళ్లీ పొంద డం. దీనికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రాంతీయ ఫండమెంటలిజాన్ని రెచ్చగొడ్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జఢత వీడి, నిజంగానే సీమాంధ్ర ప్రజల్లో వ్యాపింపజేసిన అపోహలను, అనుమానాలను తొలగించడానికి తక్షణమే పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి విభజన సంప్రదింపులు జరపాలి. అధికారికంగా విభజన సత్వరమే జరిగిపోవాలి. లేదంటే కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందనే విషయం అందరికీ అర్థమవుతుంది. అప్పుడిక ఆ పార్టీ కి ‘నా ఘర్ కా నా ఘాట్‌కా’ రెండుచోట్లా సమాధి కాక తప్పదు.. ప్రజల మధ్య విద్వేషాలకు కారకులయ్యే వారు, ఇప్పటి ప్రపంచంలో తెలుగుజాతికి తీవ్ర నష్టం చేసిన వాళ్లుగా మిగులుతారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ అప్రమత్తతే దానికి రక్ష.

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com;M

105

Allam Narayana

Published: Wed,March 15, 2017 12:20 AM

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వె

Published: Wed,May 18, 2016 03:34 AM

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ము

Published: Sun,June 15, 2014 01:22 AM

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యా

Published: Sun,June 1, 2014 02:25 AM

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని

Published: Sun,May 25, 2014 12:31 AM

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధం

Published: Sun,May 11, 2014 12:32 AM

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్

Published: Sun,May 4, 2014 01:59 AM

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిం

Published: Sun,April 27, 2014 01:41 AM

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన

Published: Sun,April 20, 2014 01:56 AM

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య వ

Published: Thu,April 3, 2014 02:35 AM

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మే

Published: Sun,March 30, 2014 12:51 AM

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య.

Published: Sun,March 23, 2014 04:50 AM

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావ

Published: Sun,March 2, 2014 12:43 AM

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్

Published: Wed,February 19, 2014 12:17 AM

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల

Published: Sun,February 9, 2014 12:32 AM

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చ

Published: Sun,February 2, 2014 01:57 AM

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్

Published: Sun,January 19, 2014 12:27 AM

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే

Published: Sun,January 12, 2014 12:54 AM

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ,

Published: Sat,January 11, 2014 02:32 AM

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే

Published: Sun,December 29, 2013 01:17 AM

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల

Published: Mon,December 9, 2013 02:56 AM

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తె

Published: Sun,October 27, 2013 01:05 AM

అమ్మో.. ఆ ముగ్గురు బాబులు

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే... భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భ

Published: Sun,September 22, 2013 02:15 AM

అమ్మా మీకు దండం.. కలిసుండలేం..

అమ్మా మీరు పెద్దలు. పూజ్యులు. గొప్పవాళ్లు.. సరిగ్గా మీరక్కడ రాష్ట్రపతి భవనం ముందర ‘ఫ్యాషన్ పరేడ్’లాగా పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యా

Published: Sun,September 15, 2013 12:33 AM

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!

లేలే.. మీరుసాబు... లేవవయ్య మీరుసాబు. అలయ్‌ల దుంకి పీరీల గుండంలకెల్లి లేచి రావాలె కులీకుతుబ్‌షాలు, తానీషాలు. నౌబత్ పహాడ్ మీదికెల్లి

Published: Sun,September 8, 2013 12:27 AM

దండయాత్ర.. దాడి.. గుండెగాయం

‘కమాండర్ షుడ్ నాట్ బీ ఎ కానిస్పిరేటర్’ అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. దళాధిపతి కుట్రదారు అయితే ఎట్లా ఉంటుందో? రుచ

Published: Sat,August 24, 2013 11:58 PM

అవును..హైదరాబాద్ తెలంగాణ సొత్తే

కాచిగూడ స్టేషన్‌రోడ్డు. బూర్గుల రామకృష్ణారావు వారి వారసుల ఇల్లొకటి చాపల్‌బజార్‌కు మళ్లే చౌరస్తా మూలమీద పాతబడిపోయి ఉన్నది. జిగేల్‌మ

Published: Sun,August 18, 2013 01:11 AM

చచ్చిన శవం కోసం....

తిరుపతిలో... పుణ్యక్షేవూతంలో..కేవలం విద్వేషంతో,కొంచెం ముదిరిన ఉన్మాదంతో వీ.హనుమంతరావు (హన్మన్న) మీద దాడి చేస్తే సమైక్యాంధ్ర సాధ్

Published: Sun,August 4, 2013 01:39 AM

కాలం చెల్లిన సమైక్యాంధ్ర

మా డానీ నాకు మూడు దశాబ్దాల మిత్రుడు. తత్వశాస్త్రంలో వేళ్లూ కాళ్లూ పెట్టీ ‘నెగేషన్ ఆఫ్ నెగేషన్’నే నెగేట్ చేస్తూ బీఎస్ రాములూ, డాన

Published: Sun,July 28, 2013 12:36 AM

సందేహమూ... సంబురమూ..

డిసెంబర్ 9. తెలంగాణకు చారిత్రక దినం. ఆ ప్రకటనకు ముందు ఉరుములు మెరుపులు ఉద్యమానివి. ఒకవంక కేసీఆర్ దీక్ష. క్షీణించిన ఆరోగ్యం. మరోవంక

Published: Sun,July 21, 2013 01:55 AM

మనం విడిపోయే వున్నాం...

ఇన్ని చరిత్ర పేజీల మీదుగా గడచి వచ్చిన తర్వాత నడచి వచ్చిన తర్వాత ఇన్ని మరణాలనూ మనసు పొరల్లో నింపుకుని మ్రాన్పడి మౌన సంతాపాలూ ప్రక

Published: Sun,July 14, 2013 04:06 AM

కోర్‌కమిటీ అసంబద్ధ నాటకం..

ఒకే అసంబద్ధ నాటకం మరోసారి మీ కోసం * కేతిగాడు మరోసారి తెరతీశాడు నగరం నడిబొడ్డులోని ప్రేత సౌధం వేదికగా పాత్రధారులు గళవిన్యాసం ప్

Published: Sat,July 6, 2013 11:53 PM

ఆ హత్య ప్రజాస్వామ్యానికి హెచ్చరిక

పోరాటమే నా ఊపిరి. పోరు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది’ అని గంటి ప్రసాదం వేరే అర్థంలో మాట్లాడి ఉండవచ్చు కానీ, పోరులేని ప్రాంతంలో వేట

Published: Sun,June 30, 2013 12:11 AM

అబ్బర పులీ....తోక బారెడు

‘అబ్బర పులీ అంటె తోకబాడు’...‘తె’ అంటే తెలంగాణ ఇచ్చినట్టే. తెలంగా ణ అనుభవాల సారం ఏమిటంటే పులి ఉండదు. తోక బారెడూ ఉండదు. తీరా పులి వచ

Published: Sun,June 23, 2013 12:28 AM

ఆత్మీయరథం..స్వేచ్ఛ..సమానత్వం

స్వేచ్ఛ ఒక దుకాణం కాదు ఒక అయ్య మూయడానికి ఒక అయ్య తెరవడానికి... ఇది సచ్చిదానందన్ కవితా పాదం. నాకు ఇష్టమైన కవిత. స్వేచ్ఛ కూడా ప

Published: Thu,June 20, 2013 05:43 PM

ఈ గోడ బీటలు వారింది...

పొద్దున్నే కల. అసెంబ్లీ చుట్టూ గోడ మొలిచినట్టు. అదీ పాత ముషీరాబా ద్ జైలు గోడ కన్నా ఎత్తుగున్నట్టు. పైన అచ్చం జైలు లాగానే కరెంటు తీ

Published: Sat,June 1, 2013 11:56 PM

డెడ్‌లైన్లు.. డెత్‌లైన్లు.. ప్రజాస్వామ్యం

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్లు పెట్టే సాహసం చెయ్యవద్దన్నడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. ఇది పలుకుబట్టిన కిరణ్ సాహసోప

Published: Sun,April 21, 2013 01:54 AM

పరకాల వచ్చె మొదలాడె...

పరకాల ప్రభాకరొచ్చె మొదలాడె.. అంటే ఇదే. రామాయణమంత విని రామునికి సీత ఏమవుతుంది? అని అడగటమంటే కూడా ఇదే. చాలా ఆలస్యంగా మేల్కాంచిన పర

Published: Mon,April 15, 2013 12:55 PM

కొండపల్లి కొన్ని జ్ఞాపకాలు

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక ప్రత్యేకమైన మనిషి కోసం ఎదురుచూస్తున్నాం. అంతా ఇరవై మందిమి. హైదరాబాద్ రాంనగర్ గుండు ప్రాంతం అను

Published: Sun,April 7, 2013 02:09 AM

భ్రమలు.. మైమరపులు

ఉనికిలో లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించడం ఒక భ్రాంతి. మయ సభ తీరు. కానీ ఉన్నదాన్ని లేదనుకోవడం, దాని ఉనికే లేనట్టుగా భ్రమపడి జనాలను భ్

Published: Sun,March 3, 2013 12:01 AM

మొద్దుబారిపోయినాము...

సూడ సక్కంగుండేది నా బిడ్డ. కొచ్చెటి ముక్కు. సదువు అయిదో తరగతే కానీ కొంచెం పెద్ద పిల్లే. వంకీల జుట్టు. నాబిడ్డ సక్కంగుండాలని ముక్

Published: Sat,January 19, 2013 11:55 PM

వీరులారా వందనం...

పోయిన వారం. ఒక పాఠకుడు ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజున మీరెలా ఫీలయ్యారు’ అన్నది ప్రశ్న.

Published: Sun,January 6, 2013 12:21 AM

చరిత్ర చెప్పిన కొన్ని పాఠాలు

ఉద్యమాలు ప్రజాస్వామ్య సంస్కృతిని పాదుకొల్పుతాయి. నిలబెడతా యి. ప్రజల విస్తృత ఆకాంక్షల వెల్లడి ప్రజాస్వామ్య సూత్రాలను విస్తృ తం చేస్

Published: Sat,December 22, 2012 11:48 PM

పాటే ఆయుధం.. ఛలో ధూమ్‌ధామ్

బెంగటిల్లినట్టున్నది. పరిస్థితులేం బాగాలేవు. ఎవరి గొంతు వారే పలుకుతున్న ధ్వని. గొంతు దాటని శబ్ద తరంగాలు. విచ్ఛిన్నమవుతున్న మాటలు

Published: Sun,December 9, 2012 12:38 AM

డిసెంబర్ 9, ఒక నిజం

ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివర

Published: Sat,December 1, 2012 11:23 PM

చంద్రబాబుతో జర జాగ్రత్త!

మంథని నుంచి మహదేవ్‌పూర్ వెళ్లే రోడ్డులో కాటారం ఒక జంక్షన్ లాంటిది. కాటారం నుంచి భూపాల్‌పల్లి దాకా చూడ నిజంగానే చక్కని రోడ్డొకటి ఉం

Published: Sat,November 24, 2012 11:38 PM

హంతకుల భాష.. మోసం

కడుపు దేవినట్టున్నది. వడ్లల్ల పెరుగు కలిపినట్టుగున్నది. ఆగమాగంగున్నది. దుమాల్లం లేసినట్టున్నది. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లా

Published: Sun,November 18, 2012 12:09 AM

మైమరుపు.. మతిమరుపు

జనాలలో పరివ్యాపించి ఉన్న కొంత మైమరపు వల్లనూ మరికొంత మతిమరుపు వల్లనూ చాలామంది ఇంకా, ఇప్పటికీ చెలామణి అవుతుంటారు. అడుగుపెట్టే అర్హత

Published: Sun,October 28, 2012 12:12 AM

రాజిరెడ్డీ.. ఎక్కడికెళ్లినవ్..

‘రెడ్డీ ఎక్కడికెళ్లినవ్’ అని ఏడుస్తున్నది సరస్వతి. ఆమె రాజిడ్డి ప్రేమించి పెళ్లాడిన సహచరి. బెంగటిల్లిన చిన్నపిల్లలు. చిన్నకొడుకుదీ

Published: Sun,October 14, 2012 12:30 AM

జై బోలో తెలంగాణ...శంకర్

ప్రాణహితకు ‘జైబోలో తెలంగాణ’కు పేగు సంబంధం వుంది. ఎందుకంటే శంకర్ ప్రాణహిత ప్రేమికుడు. ప్రేరణ నాకదే అని చెప్పినవాడు. కాలమ్ సంగతి ప

Published: Sat,October 6, 2012 02:36 PM

మార్చ్ మా జన్మహక్కు

ఛలో హైదరాబాద్. బస్సో, రైలో, కారో, సైకిలో, స్కూటరో, కాలినడకో.. ఉసిళ్లపుట్ట పగిలినట్టు పక్షుల గుంపు సాయంకాలం కిలకిల ఆకాశంలో ఎగిరినట్

Published: Sat,September 22, 2012 11:41 PM

తెలంగాణ నిలువెత్తు సంతకం

కోతపెట్టే శీతాకాలపు ఢిల్లీ చలి ఇంకా వణికిస్తూ ఉండగానే... జంతర్‌మంతర్‌లోని ఆ ముసలివాళ్ల శిబిరం బిలబిలా నిండిపోయింది. బాపూ జీ కరస్పర

Published: Tue,September 18, 2012 05:56 PM

తెలంగాణపై కాలకూట విషం..

పటాన్‌చెరు దాటగానే మీ వాహనాలను అడ్డుకునే ఆటంకం ఒకటి ఉంటుంది. అద్దాల గదులతో నిర్మితమై కాలడ్డం పెట్టినట్టు కట్టె అడ్డంపెట్టే ఆ టోల్‌

Published: Sun,September 2, 2012 04:48 AM

ఇంతకీ కనిస్టీబు మారతాడా?

సారాజ్జెమొస్తే మన ఊరి కనిస్టీబు మారతాడా?’ కన్యాశుల్కంలో సామాన్యుడి అనుమానం ఇవ్వాళ్ల తెలంగాణ అశేష ప్రజానీకానికి రావాల్సి ఉన్నది. అ

Published: Sat,August 18, 2012 11:32 PM

కాలమ్ కత్తి మీద సాము

‘కాలమ్’ ఒక కత్తిమీద సాము. వారం వారం పలవరింత. కలవరింత. ప్రాణహిత నది మున్నూటా అరవై ఐదు రోజులు సజీవంగా పారే నది. ఆ నది మీద భ్రమ. ఆ ప

Published: Sun,August 5, 2012 12:33 AM

అవునూ...ఇస్తరా! చస్తరా!

డేట్‌లైన్... రవీంద్రభారతి మిట్ట మధ్యాహ్నం కిక్కిర్సి ఉన్నది. ఇక్కడేదో దారి దొరుకుతున్నది. బహుశా ఇది తెలంగాణకు దగ్గరి దారి భవిష్యత్

Published: Sun,July 15, 2012 01:05 AM

జీవించే స్వేచ్ఛ.. బాసగూడ ఆభాస

హప్కా చోటుకు పన్నెండేళ్లు. కాక సంధ్యకు కూడా పన్నెండేళ్లే. మడకం నగేష్‌కు 13 సంవత్సరాలు. మడకం రాం విలాస్‌కు కూడా అంతే వయసు. కోశ్యా బ

Published: Sun,July 8, 2012 12:46 AM

రాజకీయ బానిసల జాతి

బానిసత్వం కొంచెం సుఖంగా ఉంటుంది. నిశ్చల ప్రపంచంలో నిశ్చలంగా ఉండవచ్చు. కనీసం నిలవ నీళ్లలాగా, యధాతథ స్థితిలో భారం కోల్పోయి గాలిలో

Published: Sun,June 24, 2012 12:27 AM

నిర్బంధం.. ఉదాసీనత.. ఐక్యత

శత్రువు నిన్నెట్లా చూస్తున్నాడన్నదే నీ నిబద్ధతకు, ఆచరణకు గీటురాయి అనేది పాత సూత్రం. ఎంచుకొని నిర్బంధాన్ని ప్రయోగించడం, ఆ నిర్బంధం

Published: Sat,June 16, 2012 11:36 PM

పరకాల పాఠం

పరకాల ప్రమాదం తప్పింది. అదిప్పుడు పోరు పతాకై నిన్నూ నన్ను నిలబెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్ జర్నలిస్టు మిత్రుల ఫోన్ ‘సార

Published: Sun,June 10, 2012 12:21 AM

అమ్మా! జగనన్న రాజ్యం మాకొద్దు

మీరు భర్తను పోగొట్టుకుని దుక్కంతో వచ్చారు. నిజమే.. కొడుకు జైలు పాలయ్యాడు. మనసుపడి కట్టించుకున్న లంకంత క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు

Published: Sun,June 3, 2012 12:23 AM

పదేళ్ల ప్రస్థానం

మే, 31, 2002, ఒకానొక మిట్ట మధ్యాహ్నం. మేం పుట్టాం... అప్పుడు గుప్పెడు మందిమి. ఇప్పుడు గంపెడు మందిమి.నిజమే మేము కవులవలెనే కలాలని

Published: Sun,May 20, 2012 01:14 AM

జర్నలిస్టులు జిందాబాద్..

వైఎస్‌లేనిలోటు రానివ్వొద్దన్నడు వాయలార్ రవి. ఉప ఎన్నికల్లో వైఎస్ లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడ్తుదన్నది ఈ మాట సారాంశం. రవి ఢిల్లీ

Published: Fri,August 31, 2012 05:42 PM

ఏమి నేరము చేసెరా! తెలగాణ

ఒక తండ్లాడే జీవితంలో, జీవన విధానంలో జరిగే పరిణామాలన్నీ తెలంగాణ అనుభవించింది. అది సంక్షుభితమయింది. రాటు తేలింది. అది పోరాడింది. ఓడి

Published: Thu,August 30, 2012 08:31 PM

తెలంగాణకు ఇదే అదను...

తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీకి, సంకీర్ణ భాగస్వాములతో కూడిన యూపీఏ-2 కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన సావకాశం

Published: Sun,April 22, 2012 01:06 AM

తెలంగాణ అస్తిత్వం-సమస్యలు

తెలంగాణ భావనకు ఒక చారివూతక పునాది ఉన్నది. ప్రాంతీయ చైత న్యం, ఉమ్మడి అస్తిత్వం, ఉమ్మడి గతం, ఉనికి, సంస్కృతీ విశిష్ట త, వర్తమానం, పర

Published: Thu,August 30, 2012 02:42 PM

అడవి ఉప్పొంగే రాత్రి...

వందేళ్ల కింద పొందిచ్చిన ఢిల్లీ ఎర్రకోటలకు ఆత్మలేదు. నెనరు కానరాదు. యమునై పారుతున్న సామాన్యుడి దుక్కపు సవ్వడిని అది పట్టించుకోదు. త

Published: Sun,March 25, 2012 03:02 AM

ఉసురు తగిలేరోజు..

కౌరవ ప్రపంంలో కదలిక రాదు. సోనియా గుండె స్థానంలో బండకరగదు. అశాంతిని రెచ్చగొట్టే గ్రీన్‌హంట్ సూత్రదారుల పెదాలమీద శాంతిజపం. తెలంగాణ ఇ

Published: Tue,March 27, 2012 07:51 PM

తెలంగాణ మల్లెమొగ్గకు వందనం

పట్టుమని పదారేళ్లులేని ఆ పిల్ల తెలంగాణ మల్లెమొగ్గ. ఎన్నికలకు ముందే చంద్రబాబును ఓడించిన ఆ పిల్లపేరు కృష్ణవేణి. నాగర్‌కర్నూలు నియోజ

Published: Sun,February 19, 2012 12:06 AM

ఒకే ఒక్క తెలంగాణ...

నిజమే. మేం మందలాంటి వాళ్లం. సంతలాంటి వాళ్లం కూడా. నిజమే తెలంగాణే మాకు అతి పెద్ద సమస్య. జీవన్మరణ సమస్య. బలవన్మరణాలు మాట్లాడుతున్నప్

Published: Sat,February 11, 2012 11:24 PM

బానిసల పగటి రంగుల కలలు

తెలంగాణ రాకపోతే ఏమవుతుంది? మోత్కుపల్లి నరసింహులుకుఏమీ కాదు. ఆ మాటకొస్తే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా ఏమీకాదు. తలసాని శ్రీనివాస్ య

Published: Sat,February 11, 2012 05:08 PM

మారనివారు మార్క్సి స్టులు

సుందరయ్య మా నడిగడ్డ బొడ్రాయైండు/మా రావి తావేదీ గాని ఊర్లల్ల / గాని ఉద్దెమాల్ల మన్నుబడ/ గానికీ గీ మన్నుకూ సమ్మందమేంది? శింగం కిష్టయ

Published: Sun,January 29, 2012 02:44 AM

మట్టిపాదాల కదలిక

వాసనొకటి హాలు నిండుకున్నది. ఆ వాసన మర్యాదస్తులది కాదు. మధ్యతరగతి మందహాసాలదీ కాదు. తెల్లచొక్కాలదీ కాదు. ఒక గుంపు వాసన. మట్టివాసన. చ

Published: Sun,December 25, 2011 12:14 AM

తల్లివేరు తత్వం

ముందు ప్రపంచం. ఆ తర్వాత దేశం. ఆనక రాష్ట్రం. ఈ రాష్ట్రమం సరిపడలేదు కనుక నేను తెలంగాణవాన్ని. మనిషి ఉనికి అంతటితో సరిపోలదు. అస్తిత్వం

Published: Sat,December 17, 2011 11:52 PM

దూద్‌కా దూద్..పానీకా పానీ

చంద్రబాబు మాంఛి ఊపుమీద ఉన్నడు. ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో ఆయన వాహనం మీద పడిన కోడిగుడ్లను ఆయన తూడ్చేసుకుని ఉంటడు. ముఖం మీద పడనందుక

Published: Sat,December 10, 2011 11:57 PM

‘గూగీ గుడియా’ మాట్లాడు...

సోనియాగాంధీకి మాటలు రావా? రెండేళ్ల క్రింద తెలంగాణ ప్రజలకు పుట్టినరోజు కానుక ఇచ్చారామె. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమౌతుందని.. సోనియాగా

Published: Sun,November 27, 2011 12:07 AM

మన కాలం వీరుడు...

శవం కోసం కాదు. ఒక మనిషి కోసం ఎదురు చూసినట్టుగా ఉన్నది. పోలీసులు కూడా అతనొక బతికున్న మనిషిలాగే భావించినట్టున్నది. శంషాబాద్ నుంచి పె

Published: Sun,October 30, 2011 12:18 AM

చలో పోలవరం... సలామ్

‘పోలవరం మాకొద్దు’ గిరిజన జీవితాలను అల్లకల్లోలం చేసే, ఉనికి ధ్వంసం చేసే పోలవరం ప్రాజెక్టుపై ముంపు ప్రాంతాల ఏకవాక్య తీర్మానం ఇది. ఏక

Published: Sun,October 23, 2011 01:47 PM

కొంత చరిత్ర.. కొంత దుఃఖము

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా? శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కో

Published: Sat,October 1, 2011 11:45 PM

సంప్రదింపులకగ్గిదలగ...

పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు.. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహ

Published: Sun,September 18, 2011 12:32 AM

సింగరేణికి జై..

చరిత్ర నిండుగా సింగరేణి నిలబడింది. కావొచ్చు మేము అర్థ రైతులం. అర్థ కార్మికులం.. కానీ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించే ఒక నిప్పురవ్వ మ

Published: Sun,September 4, 2011 12:42 AM

నండూరికి నివాళి

రెండో తరం ప్రథమశ్రేణి సంపాదకుడాయన. బుద్ధిజీవులు, సాహిత్యకారు లు ఆమోదించి అభిమానించిన సంపాదకుడు. జర్నలిస్టుకు సకల పరిజ్ఞానం ఉండాలని

Published: Sat,August 20, 2011 11:29 PM

బానిసకొక బానిసకొక బానిస

-అల్లం నారాయణ ‘పీనుగుల మీద పేలాలు ఏరుకునే జాతి ఏదన్నా ఉన్నదంటే అది మన మంత్రుల జాతే’ ఇటీవల నాకొచ్చిన మెసేజ్ సారాంశం ఇది.

Published: Sat,August 6, 2011 11:54 PM

హంతకుడి జాడ....!

-అల్లం నారాయణ మిస్టర్ చిదంబరం.. హంతకుపూవరో?తెలంగాణ పోల్చుకున్నది. ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుక

Published: Mon,July 18, 2011 05:06 AM

ప్రేమనగరం

-అల్లం నారాయణ మనం తెలుగు వారమే. కానీ పెట్టుబడికి, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ పెట్టుబడికి ప్రాంతం లేదు. అది ఒక ప్రాంతం ఆకాంక్షలను కబ

Published: Sun,July 17, 2011 05:58 AM

ఆకాంక్షల ఆర్తరావం

మీ సున్నితమైన మాటల వెనుక వెక్కిరిస్తున్నది మీ వలస పెత్తనం. మీ సీమాంధ్ర బుద్ధి. మీ నెత్తుటి జాడ. మీ నాయనా అంతే.. తెలంగాణకు మేమెప్

Published: Thu,July 28, 2011 03:20 PM

వెంటాడే తెలంగాణ

మీట్ ది ప్రెస్ ప్రారంభమయినాక ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ న్యాయవాదులు వస్తుంటే మనసేదో శంకించింది. అప్పటికీ సైగలతో అడుగుతూనే ఉన్న. ఏం

Published: Wed,July 27, 2011 09:31 PM

విధ్వంస సార్వభౌముడు

అల్లం నారాయణ ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం

Published: Thu,July 28, 2011 04:42 PM

లగడపాటి బడాయి

-అల్లం నారాయణ జగోపాల్ అంటే ఎవరు? అంటారు? లగడపాటి అనంగానే పూర్తిగా అర్థమయినట్టే ఠక్కున ఓహో జగడపాటి అంటారు. ఎవరు? చిన్నపిల్లలు