దండయాత్ర.. దాడి.. గుండెగాయం


Sun,September 8, 2013 12:27 AM

‘కమాండర్ షుడ్ నాట్ బీ ఎ కానిస్పిరేటర్’ అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. దళాధిపతి కుట్రదారు అయితే ఎట్లా ఉంటుందో? రుచి చూసింది ఇవ్వాళ హైదరాబాద్. తెలంగాణ మరోసా రి గాయపడింది. దుఃఖపడింది. నిస్సహాయతలోంచే పెనుకేకలు పెట్టింది. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికీ నమ్ముకున్నది. ఆధిపత్యం మీద ఆత్మగౌరవానిదే అంతిమ విజయమని సంయమనంగా ఉన్నది. కానీ ఒక్క డాక్టర్ మిత్రా మాటలు చాలు. హైదరాబాద్ భవిష్యత్తులో ఏమి కాబోతున్నదో చెప్పటానికి. పుచ్చలపల్లి సుందరయ్య కుటుంబ వారసుడు ‘మేం హైదరాబాద్‌లో ముప్ఫై లక్షలమందిని ఉన్నం. చూసుకుంటం’ అని నిండు సభావేదిక నుంచి ప్రకటించి ఉన్నాడు.

ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనిపించలేదు పోలీసులకి. ఎందుకంటే పోలీసులూ చీలిపోయారు. వారి దళాధిపతి మీద సుప్రీంకోర్టులో కేసు నడపమని నిన్ననే తీర్పు చెప్పింది. ఇది కాకతాళీయం కాదు. ఆ మాటకొస్తే కలిసుంటారా! ఛస్తారా! అని పిట్టకథలు చెప్పిన అశోక్‌బాబుదీ అదే చరిత్ర. దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్ కొట్టి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణను హెచ్చరిస్తున్నాడు. ఏపీఎన్జీవో కార్యదర్శిదీ అదే చరిత్ర. చంద్రశేఖర్‌డ్డి నామధేయం గల ఆయన అంతవేదిక మీద ప్రసంగిస్తున్నా పోలీసుల కు మాత్రం కనబడలేదు. హైదరాబాద్‌ను ఛిన్నాభిన్నం చేయ్యడానికి ఇవ్వాళ ఒక దండయాత్ర జరిగింది. కలిసుంటారా! ఛస్తారా! అని ఆ ఆధునిక ఔరంగ జేబులు అంటున్నారు. దాడులూ చేస్తున్నారు. చరివూతను కేవలం ఘటనల సమాహారంగా కాకుండా ఒక తాత్విక, భౌతిక వారసత్వంగా స్వీకరిస్తే చాలా సత్యాలు బోధపడతాయి. చీలిపోయి ఉన్నాం కనుకనో, విడిపోయి ఉన్నాం కనుకనో కాదు. సత్యం కూడా అదే.

1672 నుంచి 1687 దాకా పాలించిన కుతుబ్‌షాహీ అబుల్ హసన్ తానీ షా రాజ్యంపై 1685లో ఔరంగజేబు దాడి చేశాడు. సరిగ్గా ఇవ్వాల్టి ఫతేమైదాన్, ఇవ్వాళ్ల సీమాంధ్ర దురంహంకార, ఆధిపత్య సభ జరిగిన మైదానంలో అలనాడు ఔరంగజేబు సేనలువిడిది చేశాయి. అనంతరం గోల్కొండపై దండయాత్ర జరిగింది. సేనానుల నమ్మక ద్రోహంతో గోల్కొండ కోట ఓడిపోయి తానీషా మొగలులతో సంధి చేసుకున్నాడు. ఆ సంధి తర్వాత ఔరంగజేబు సేనలు అక్కన్న, మాదన్నలను హత్య చేశాయి. సరిగ్గా ఇప్పటి కాలంలో దోపిడీ స్వభావం, ఆధిపత్య స్వభావం, కుట్రల స్వభావం, తడిగుడ్డతో గొంతు లు కోసిన వాళ్లలాగానే ఆనాడూ ఆ కుట్రలకూ పాల్పడ్డాడు ఔరంగజేబు. సరిగ్గా ఇన్నేళ్లకి ఔరంగజేబు వారసులు ఫతేమైదాన్‌లో విడిది చేసి హైదరాబాద్‌ను కొల్లగొట్టే కుట్రలు లేపారు.

ఔరంగజేబు పాలన దక్కనీ సామ్రాజ్యాల్లో పిండారీల పాలన. దేవాలయాలను ధ్వంసం చేసిన పాలన. కానీ ఔరంగజేబు కాలం లో నిర్మించిన రాచబాట (దండుబాట)ద్వారానే ఇవ్వాళ్ల ఆధునిక ‘పిండారీ’లు హైదరాబాద్‌కు వచ్చారు. బందరు దాకా ఉన్న ఆ మార్గంలో ఇప్పటికీ ఉన్న గుమ్మటాలు, మసీదులు, విశ్రాంతి భవనాలు దాటుకొని వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ప్రైవేట్ పెట్టుబడి తెగ బలిసిన ప్రైవేట్ ఏసీ బస్సుల్లో వాళ్లొచ్చారు. ముందు వెనకల పోలీసు వాహనాల రక్షణలో వాళ్లొచ్చారు. ‘కమాండ ర్’ కల్పించిన పూర్తి భద్రతలో వాళ్లొచ్చారు. దండయాత్ర జరిగింది. సరిగ్గా మూడువందల ఏళ్ల తర్వాత.

ముందువాళ్లు నిజామ్ కాలేజీ ముందు హైదరాబాద్ సంస్కృతిని దెబ్బతీశారు. శాంతిని దెబ్బతీశారు. దూదిమెట్ల బాలరాజుయాదవ్. విద్యార్థి నాయకుడు. ఎప్పుడూ టీవీల్లో కనిపించే ముఖం. తెలంగాణ విద్యార్థి జేఏసీ అధికారవూపతినిధి. సౌమ్యుడు. తెలంగాణ కోసం తండ్లాడే వాడు. ఊరికి ఆదర్శంగా నిలిచేవాడు. బాలరాజు మీద దాడి చేశారు. పదిమంది చుట్టూమూగి స్పృహ కోల్పోయేటట్టు కొట్టారు. వై.ఎస్.ఆర్.సీపీ షర్మిలమ్మ పార్టీ నాయకుడు దాడి చేశాడు. షర్మిలమ్మ హైదరాబాద్ పాకిస్తాన్ అవుతుందన్నారు. కానీ; ఆమె పార్టీ వాడు హైదరాబాద్ శాంతిని భంగపరచాలని వచ్చే కసబ్‌లాగా వ్యవహరించాడు. ఒక ‘కమాండర్ కానిస్పిరేటర్’ హయాంలో మరో డీజీపీ పోలీసులకు, వీధిలో వీరంగమేసిన వాళ్లూ కనపడలేదు. పీక కోస్తానని హెచ్చరిస్తూ ఊరేగిన పిండారీ కనపడలేదు. నల్లజెండాలు ఎగరేసి, తమ కాలేజీలో తాము, తమ హద్దుల్లో తాము, తమ మానాన తాము ఉన్న నిజామ్ కాలేజీ విద్యార్థుల మీద ఖాకీ మూకలు దాడి చేశాయి. విద్యార్థుల నెత్తురొలికింది. కాలేజీలోకి ఎట్లా వస్తారన్న ప్రిన్సిపాల్ ఘోష, అరణ్యరోదన అయింది. ఇది హైదరాబాద్‌లో ప్రజాస్వామ్యం. ఇది ఆంధ్రవూపదేశ్‌లో సమైక్యవాదుల ప్రజాస్వామ్యం. ఇది ‘కానిస్పిరేటర్ కమాండర్’ మార్కు ప్రజాస్వామ్యం. నిజమే భావ ప్రకటన స్వేచ్ఛ గురించీ, ప్రజాస్వామ్యం గురించీ చర్చ జరగాల్సే ఉన్నది.

పదహారు సంవత్సరాలు తెలంగాణ సుదీర్ఘంగా పోరాడింది. ప్రజాస్వామ్యా న్ని నమ్ముకున్నది. కాలాన్ని నమ్ముకున్నది. శాంతిని నమ్ముకున్నది. రాజ్యాంగస్ఫూర్తిని నమ్ముకున్నది. అబద్ధాలకు మేనమామలైనా, పెట్టుబడి విష సంతా నం అయినా, తెలంగాణ అన్ని పార్టీలనూ నమ్మింది. నమ్మినానబోస్తే పుచ్చి బుర్రలయినయి. ప్రతిసారీ తెలంగాణ కోసమే అన్నవాడు డిసెంబర్ 9 తర్వా త, జూలై 30 తర్వాతా ఒకే భాష మాట్లాడాడు. ప్రతి రాజకీయవేత్తా రెండుగా చీలిన నాల్కలయ్యాడు. పాము కోరల్లా రెండు విషాలు చిమ్మాడు. ఓట్ల కోసం తెలంగాణ, ఓట్లు దాటినాక సమైక్యాంధ్ర. ఇక ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడుకోవాలి.

ఇచ్చిన తెలంగాణను, వచ్చిన తెలంగాణను, పదహారేళ్ల పోరాట ఫలాన్ని, వెయ్యిమంది బలిదానాల, త్యాగాల ఫలితాన్ని ప్రజాస్వామ్య ఆకాంక్ష గెలుపును భంగపరిచి వాళ్లు ప్రజాస్వామ్యం కోరుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛల గొంతునొక్కి, భౌతికంగా తలెత్తిన ప్రతి తెలంగాణవాడి గొంతునొక్కి వాళ్లు భావ ప్రకటనా స్వేచ్ఛ కోరారు. చివరికి డాక్టర్ మిత్రా ‘యూ టూ బ్రూట స్’ గా తేలాడు. ఎందుకంటే ప్రజారాజ్యంలో ‘సామాజిక తెలంగాణ’ ప్రణాళికలు తయారు చేసిన మిత్రా ఇవ్వాళ్ల ముప్ఫై లక్షలమందిని చూపి, మందబలాన్ని హెచ్చరిస్తున్నారు. అశోక్‌బాబు అంతకుముందే అని ఉన్నారు. ‘ఆత్మహత్యలు జరగవు. హత్యలే ’ అని.. ఇది ప్రజాస్వామ్యం. కుక్కినపేనుల్లా ఉంటే సరేసరి. లేదంటే ఒక బాలరాజు, ఒక కానిస్టేబుల్ శ్రీనివాస్, ఒక కానిస్టేబుల్ శ్రీశైలం, ఒక శంకర్ ఎవడైతేనేం? తెలంగాణ జర్నలిస్టులు క్రాంతి, యుగంధర్ కలిసి ఉంటారా? ఛస్తారా?

కానీ, కానీ కుట్రదారులారా! చరివూతను మళ్లీ గుర్తుచేస్తున్నా. మీరొకటి మరిచారు. తెలంగాణలో మొగలాయిలను మట్టికరిపించడానికి సర్వాయి పాపన్న తెలంగాణలో పుట్టాడు. ‘కల్లు గీసుకుంటే పైసలొస్తయి. యుద్ధం చేస్తే గోల్కొం డ కోట వస్తది’ అని విప్లవించిన వీరుడు పుట్టిన గడ్డ ఇది. మరిచిపోవద్దు.మీ చీకటి కొట్టాల, శిబిరాల, కార్యాలయాల కుట్రలు బద్దలుకొట్టి, సర్వాయిపాపన్న, అదే ఫతేమైదాన్‌లో పుట్టాడివ్వాళ్ల. వాడు మా వీరుడు. అతనొక పోలీస్ కానిస్టేబుల్. బక్కపల్చటివాడు. గాలికి ఊగిపోయే వాడు. మనిషిలా మనసు తో కదిలిపోయాడు. తెలంగాణ గుండె ఉన్నవాడు. సకల సీమాంధ్ర పెత్తందార్ల ఆధిపత్యం మీద గెలిచినాడు. ఒకే ఒక్కడు. మన కాలం తెలంగాణ వీరుడు. కానిస్టేబుల్ శ్రీనివాస్. గుండెల్లో పొద్దుటినుంచీ గూడుకట్టుకున్న దిగులును ఒక్క నినాదంతో ఔరంగజేబ్ వారసులను గడగడలాడించి, పరుగులు పెట్టించిన ఆ ఒక్కడిదే ఇప్పటి తెలంగాణ చరిత్ర. అతను బుష్‌మీద బూటు విసిరిన అల్‌జైదీ. గుండెలు రగిలి పగిలి కౌరవసేన పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయిన శ్రీనివాస్‌కు ముందు సలామ్. నిజాం కాలేజీ ముందు గాయపడిన వీరయోధుడు దూదిమెట్ల బాలరాజ్‌కు దండం. అతను మన విద్యార్థి వీరుడు. ఒక పిండారీ మంద మీదికి చెప్పువిసిరిన పేరు తెలియని వారికీ వంద నం. కానిస్టేబుల్ శ్రీశైలం, గాయపడిన తెలంగాణ జర్నలిస్టు.. వీళ్లు అహంకారాన్ని, అహంభావాన్ని, ఆధిపత్యాన్ని బద్దలు కొట్టారు. తెలంగాణ జేజేలు.

పిండారీ తండాలు నడిపించి , దేవాలయాలను ధ్వంసం చేసిన మొఘల్ సామ్రాజ్యపు మరక, అక్కన్న, మాదన్నల హంతకుడు గోలకొండను కొల్లగొట్టిన ఔరంగజేబ్ వారసుల్లా వారు ఇవ్వాళ్ల హైదరాబాద్ మీద దండయాత్ర చేశారు. పతనం తప్పదు. నిజమే ఇవ్వాళ్ల హైదరాబాద్ మీద యాసిడ్ దాడి జరిగింది. అది బూటు విసిరిన వాడిలాగా చెప్పువిసిరిన వాడి ధైర్యం కావొ చ్చు. అది పోలీస్ డ్రస్‌లో నిలబడి రెండు చేతులూ బారుగా ఆకాశానికేసి జాడించి ‘జై తెలంగాణ’ అని గుండెలోతుల్లోంచి అరచిన కానిస్టేబుల్ శ్రీనివా స్ కావచ్చు. అది ప్రతీకాత్మకమే. దాన్ని మేము స్వీకరించాం. నిజమే దాడులు జరుగుతుంటే శాంతి, సంయమనం, వచ్చిన తెలంగాణను అడ్డుకునే ఉచ్చులోకి పోకుండా నిభాయించుకుని కడుపునిండా దుక్కపు సంద్రాలను దాచుకున్నాం. కానీ ఒక్క ప్రతీకాత్మక చర్య. మా పుట్టెడు దిగులునూ, పుట్టెడు దుక్కా న్నీ ఛేదించింది. ఇప్పుడిక దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ. పోరాడుతూనే ఉంటాం.

తెలంగాణ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదీ కాంగ్రెస్ పార్టీ కమాండరే. నిస్సహాయంగా తెలంగాణ. గాయపడ్తున్న తెలంగాణ. హైదరాబాద్‌కు వచ్చి , దాడిచేసిన వాడు. హైదరాబాద్‌లో సభ జరిపి,రేపు మిలియన్ మార్చ్ ప్రకటించిన వాడు. పచ్చి అబద్దాలు వల్లె వేసినవాడు. అనైతికంగా నైతిక ఉద్యమం మీద దాడికి దిగినవాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తితో జరిగిన ఒక ఉద్యమం సాధించిన ఫలితాన్ని తారుమారు చేయడానికి, మంద బలంతో, ‘కమాండర్’ల బలంతో, కుట్రల బలంతో, ఆధిపత్యంతో, అహంకారంతో విర్రవీగుతున్నవాడు. జనగ ణ మన తెలియనివాడు, ‘సమైఖ్య’ అచ్చుతప్పుతో ఊరేగినవాడు. వీధుల్లో దాడులు చేస్తూ, మైదానంలో బ్రేక్ డ్యాన్స్‌లు చేసేవాడు.

మొత్తం హైదరాబాద్‌ను, మొత్తం తెలంగాణను హెచ్చరించి వెళ్లాడు. ఇప్పుడు మాట్లాడటానికి ఎందుకో ఏ రాజనర్సింహలూ లేరు. సోనియాగాంధీ శాంతి మంత్రం పఠించ మంటున్నది. మంత్రులూ శాంతి మంత్రం పఠించమంటున్నరు. కానీ.., కానీ.. శాంతి బలహీనత అయితే, సమభావన చేతగాని తనమయితే విడిపోయి కలిసుందామనేది ఉత్త ఆర్తనాదంగా మిగిలితే.. మా కేఎం ఏడుస్తున్నడు. కడు పుల రేగిన ఆగ్రహం. ఇక ఇప్పుడు తెలంగాణ సిద్ధపడాల్సి ఉన్నది. అహంకారానికి, మంద (మెజారిటీ) ఆధిపత్యానికి ఔరంగజేబు వారసులకు, అనైతిక ఉద్యమ ఆధిపత్యానికి ప్రతీఘాత శక్తులకు శాశ్వత బానిసలు కావడమా? సర్వాయి పాపన్నలా ధిక్కరించడమా? తెలంగాణ తేల్చుకోవల్సి ఉన్నది. సీమాంధ్ర ఎన్జీవోలు తెలంగాణ భూమిలో, తెలంగాణ ఆత్మగౌరవం మీద చేసి న ఈ గాయం, మాసిపోదు. అది చరిత్ర పొడవునా సలుపుతూనే ఉంటుంది. జాగ్రత్త. జాగ్రత్త. కమాండర్లు కలకాలం కాపాడలేరు.

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

490

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

country oven

Featured Articles