కాలం చెల్లిన సమైక్యాంధ్ర


Sun,August 4, 2013 01:39 AM


మా డానీ నాకు మూడు దశాబ్దాల మిత్రుడు. తత్వశాస్త్రంలో వేళ్లూ కాళ్లూ పెట్టీ ‘నెగేషన్ ఆఫ్ నెగేషన్’నే నెగేట్ చేస్తూ బీఎస్ రాములూ, డానీ, ఖాదర్ మొహియొద్దీన్, ఎన్. వేణు, జగన్, త్రిశ్రీ, చారి, అఫ్సర్, వసంత, యువక, దాసు, ఈశ్వరి, కరుణక్క, చుక్కు, చిన్ని, అరుణ అన్నింటికీ మించి కృష్ణక్క. ఆమె ఇల్లు. అవి బెజవాడ రోజులు. నిజమే ఇక విభజన ఖాయమే అనుకున్నప్పుడు ఇవన్నీ ఒకసారి మనసులోకి రాకుండా ఉండవు. కానీ వేరువేరు రాష్ట్రాల్లో ఉంటే ఈ ప్రేమలన్నీ పోతాయా? మా చలసాని ప్రసాదు మీద ప్రేమ ఎట్లా పోతుంది. ఆయన విశా ఖ తీరంలో కాపురముండి, హైదరాబాద్‌కు వస్తే ఇద్దరం కలిసి ఊరేగింపులో తిరగడానికి రెండు రాష్ట్రాలు అడ్డమా? జై తెలంగాణ. జై ఆంధ్ర నినాదాలివ్వడానికి రెండు రాష్ట్రాలు ఆటంకమా? కాదు. ముమ్మాటికీ కాదు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ గన్‌పార్క్‌కు వెళ్లినప్పుడు డానీ వచ్చాడు. గట్టిగా ఇద్దరం అలుముకున్నం. బహుశా మీరొక్కటి సాధించారని డానీ సంబురపడి కౌగలించుకోవచ్చు. నేను నా మిత్రున్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఉండవచ్చు. మా ఇద్దరి మధ్యా కొంత ఉద్వేగం కదలాడి ఉండవచ్చు. ఎట్లా చెప్పగలం. ఆ గన్‌పార్క్ స్తూపం ముందు నిలబడి ఉన్నప్పుడు లోపల కెరలుతున్న గుడగుడ ఒకవేపు.. ఇషాన్‌డ్డి వర్ధంతి రోజునే తెలంగాణ ప్రకటన. యాధృచ్ఛికమే. అయినా స్తూపంలో వేలాది ఆత్మలు. స్తూపం మీద చెక్కని వందలాది పేర్లు. ఇన్నాళ్లకు ఒక కల ఫలించిందా? డిసెంబర్ 9 నాడూ, గన్‌పార్క్ వద్ద కలిసినప్పుడూ వేణు ఒకే ప్రశ్న వేశాడు. ఇంతకీ అయిన నమ్మొచ్ఛా? ఎట్లా తయారయ్యాం మేము. నమ్మనంతగా.. కానీ దాచుకోలేము. నిరామయంగా గడిచే రోజుల్లో, ఉద్యమాలు ఎన్ని చేసినా ఒక్క ఫలితమూ అంతిమంగా చిక్కని, దక్కని దిక్కుతోచని ఆశాభంగపు అనేక నిద్రలేమి రాత్రుల అనంతరం కదా! ఇదేదో విజయం. అయినా సంబురపడనివ్వరు కదా!బర్రెజెనిగెకూ, పెట్టుబడి విస్తరణ, రక్తం పీల్చడానికి మంచి సంబంధం ఉంటుం ది. పెట్టుబడిదారీ విధానం గురించి రాసిన సామాజికవేత్తలు ఎవరూ దాన్ని జెనిగెలతో పోల్చి ఉన్నారో లేదో? తెలియదు కానీ.. జెనిగె ముందు మూతి ఆనించి రక్తం పీల్చేందుకు పీఠం వేస్తుంది. ఆనక క్రమంగా శరీరాన్ని మొత్తం జెనిగె పట్టేస్తుంది. రక్తం పీల్చేస్తుంది. జవసత్వాలను పీల్చేస్తుంది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా అంతా నెత్తురు ఖాళీ అవుతుంది. ఒక చోట రక్తం ఖాళీ అయినాక ముందుగా పట్టుకున్న భాగం నుంచి జెనిగె లేచి ముందుకు ఒక అంగవేసి... గెంతినట్టుగా మరోచోట పాతుకుపోతుంది. పెట్టుబడీ అంతే. తెలంగాణలోకి సీమాంధ్ర అనేకన్నా... ముఖ్యంగా కోస్తాంధ్ర మిగులు పెట్టుబడి ప్రవేశించింది. అది అనేక గెంతులు వేసి సర్వం తెలంగాణ మొత్తాన్ని పీల్చేసింది. హైదరాబాద్‌ను కబ్జా చేసి కేవలం ఆరు దశాబ్దాల్లోనే ప్రైవేట్ పెట్టుబడులు పెంచీ పెంచీ నాలుగువందల ఏళ్లకు పైబడిన మహా చరిత్ర గల హైదరాబాద్ నగరం మాది అంటున్నది. అందుకే ‘బర్రె జెనిగోలోపూపట్టి జిల్లెడమ్మ జిట్ట.. మా బతుకాగం చెయ్యబట్టిరి జిల్లేడమ్మ జిట్టా’ అని తెలంగాణ పాడుతున్నది.

అచ్చం జెనిగ లాగానే కోస్తాంధ్ర మిగులు పెట్టుబడి ఇక్కడి సంస్కృతిని ‘స్క్వీజ్’ చేసింది. ఇక్కడి భాష మీద పెత్తనం చేసింది. ఇక్కడి చరివూతను ధ్వంసం చేసి ట్యాంక్‌బండ్ మీద చరివూతను ప్రతిష్టాపించుకున్నది. ఇక్కడి సచివాలయాన్ని ఆక్రమించి చివరికి ‘వీ వాంట్ హైదరాబాద్’ అంటున్నది. ఇక కాలం వచ్చింది. ఆ జెనిగె రక్తం ఎక్కువై ఉబ్బి ఉన్నది.ఆ జెనిగె రక్తం పీలుస్తున్న స్పృహ తెలంగాణకు వచ్చింది. తెలంగాణ నెత్తురులో నిండి బలుపెక్కి కొట్టుకుంటున్న బర్రె జెనిగెను తీసి పారెయ్యకపోతే తెలంగాణ శరీరం కుళ్లిపోతుంది. ఇప్పటికే ఈ కుళ్లు రక్షణలు కోరుకుంటున్నది. ఇప్పటికే ఈ కుళ్లు దుర్గంధమై వీస్తున్నది. డానీకి నాకు, తెలంగాణకు ఏ పేచీ లేదు. కర్నూలు అరుణ్‌కు నాకూ కించిత్ పేచీ లేదు. ప్రేమలున్నవి.ఆ ప్రేమలు కొనసాగుతవి. తిరుపతిలో ఉన్న మా ఆర్‌ఎం. ఉమామహేశ్వరరావు మీద, విష్ణు మీద నా ప్రేమకు చిరాయువు ఉంటుంది. ఇవి. మా ప్రాపంచిక దృక్పథాలు. గంటి ప్ర సాదం కోసం నా కన్నొకటి ఒలుకుతుంది. కానీ ఆంధ్రవూపదేశ్ విడిపోతే ఇవేవీ పోవు.తెలంగాణ పెట్టుబడుల విస్తరణ కోసం జరిగిన ఆంధ్రవూపదేశ్ బలవంతపు విలీనం మీద పోరాడింది. ఇప్పటికైతే గెలిచింది. మళ్లీ ఓడిపోతే మళ్లీ పోరాడుతుంది. ఎందుకంటే అంతర్గత వలసగా మారిన తెలంగాణపై సీమాంధ్ర దాష్టీకానికి, దాని ఆర్థిక మూలాల స్వభావానికి ప్రజలతో సంబంధం లేదు. సామాన్యులు బాధ పడవలసిందీ ఏమీ లేదు. అపోహ పడవలసిందీ అంతకంటే ఏమీ లేదు. హైదరాబాద్‌కున్న నాలుగు వందల పైబడిన సంవత్సరాల చరివూతలో ఇక్కడ సమభావన సంస్కృతి విలసిల్లింది. అనేక భాషల, జాతుల, మతాల, ప్రాంతాల ప్రజలను దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా మిన్నగా ఇది ఆదరించింది. వ్యవహార విజయాల కన్నా, మానవ సంబంధాలకు తెలంగాణ ప్రాధాన్యమిచ్చింది. లాభనష్టాల చిక్కులకన్నా మనుషుల నవ్వూ, ఏడుపు, ఆగ్రహం, ఉక్రోషం, ఆవేశకావేశాల సమ్మిళిత భావోద్వేగాల వెంట ప్రయాణించింది. పుట్టలోంచి చీమల బారుల్లా వస్తున్న ఉద్యోగులు ముందు హైదరాబాదీలా? కాదా? ఒకవేళ మీరు పక్కా హైదరాబాదీలే అయితే ‘వీ వాంట్’ అంటూ ఎందుకు మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నరు. మీకేం కావాలి? రక్షణ, భద్రత.. ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడు మీమీద ఇప్పటి వరకు ఎవరన్నా ఈగ వాలనిచ్చారా? ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనైనా ఒక్కరినైనా కొట్టిన దాఖలాలున్నాయా? ఎందుకు మీకు భయం అని అడగాల్సే ఉన్నది.

కేసీఆర్ ఏమి మాట్లాడారు? ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికే వెళ్లాల్సిందే? అంత వరకు అది నిజమే. అయితే పద్ధతులు ఉంటాయి కావొచ్చు. కానీ వెళ్లడం చేదు నిజమే. ఈనాడు పత్రికలో అంతకు ముందురోజే లెక్కలు తీసి ఇరవై ఐదువేల మంది వెళ్లాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. అది నిజమైనప్పుడు కేసీఆర్ మీద ముందుగా ఏర్పరచుకున్న అనవసర వ్యతిరేకత లేకుండా ఒక్కసారి ఆలోచించండి. నిజమే ఆ వ్యాఖ్యలకు ఇది సందర్భం కాకపోవచ్చు గాక. కానీ తెలంగాణ ఉద్యోగులు వచ్చినప్పుడు ఆయన తెలంగాణ నేతగా ఏమి మాట్లాడాలి. అది కొంత కఠినమైన మాటగా కనబడినా నిజంగా జరగబోయేది అదే కదా! విభజన తర్వాత ఉద్యోగుల పంపకాలు ఖాయం. కమిటీ వేయడం ఖాయం. కేంద్రం కనుసన్నల్లో కమిటీ ఆధ్వర్యంలో లోకల్, జిల్లా వాసులు, సీనియారిటీలు, ఇతర అంశాల ఆధారంగా పంపించడమూ నిజమే. ఇదొక హార్డ్‌ఫ్యాక్ట్. జీర్ణం కానిదే. కానీ కేసీఆర్ అంటే తప్పు. అపోహ. మొత్తం ఆంధ్రోళ్లను వెళ్లగొడ్తానన్నట్టు మీడియా బిల్డప్, తెలంగాణవాదుల పేరిట కూడా కొందరు మరీ ఆత్మరక్షణలో పడిపోయి మాట్లాడడం. అది అడ్వాం తీసుకుని సచివాలయంలో మరోసారి బలవూపదర్శన. విభజన అనివార్యం అయ్యే సమయంలో, నిర్ణయం వెలువడిన సమయంలో ఏపీఎన్జీవోలు ప్రదర్శనలు జరిపి రెచ్చగొడ్తున్నారా? తెలంగాణ వాళ్లా? ఇది కొంచెం సంయమనంతో ఆలోచిస్తే, ప్రేమతో ఆలోచిస్తే, నిజమే తెలంగాణ నష్టపోయింది. హైదరాబాద్‌లో జీవితమంతా గడిపాం. పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన హైదరాబాదీలు, ఇల్లున్నది, ఫ్లాటున్నది అనుకున్నప్పుడు విభజన సమయంలో రక్షణలు ఆలోచించేవారు. డిమాండ్ చేసేవారు హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేసి ఏమి సందే శం ఇస్తున్నారు. అసలు ఈ విభజనలో కూడా పదేళ్లు ఉమ్మడి రాజధాని. మహా అయితే, ఈ సెక్ర మరో బ్లాక్‌కు వెళ్తారో? బిల్డింగ్ మారతారో! అంతకు మించి ఏమి జరుగుతుంది. లక్షలాది అపార్టుమెంట్లలో, కాలనీల్లో ఇరుగు పొరుగు ఉన్న ఆంధ్ర, తెలంగాణ వాళ్లు ఎక్కడన్నా కొట్టుకున్నారా? కనీసం తిట్టుకున్నారా? కానీ, ఒక ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి. హైదరాబాద్ మాది అనండి. అది వాస్తవం. హైదరాబాద్ మీది కూడా. కానీ మాకు హైదరాబాద్ కావాలి అంటే ఏమి టి మీ ఉద్దేశ్యం. అవును కేసీఆర్ ఏమి తప్పు మాట్లాడారు. 1971లో ఇందిరాగాంధీ కలత చెంది తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చెయ్యడానికి వేసిన బేగ్ కమిషన్ నుంచి 610జీవోలు, గిర్‌గ్లానీలు తేల్చాయి. ఇట్లా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని.... తెలంగాణలో ఫేర్‌షేర్ అమలు జరగలేదు. ఏ సూత్రా లూ; నియమాలూ, అమలు జరగలేదు. ప్రదర్శన జరిగినప్పుడు చీమలపుట్టలా బయటపడిన సీమాంధ్ర ఉద్యోగుల గుంపు ఇందుకు మంచి ఉదాహరణ. స్వయం గా ఎన్.టి.రామారావు అంగీకరించినందువల్లనే 610 జీవో వచ్చింది. మరి ఆయన కూడా సీమాంధ్ర ద్రోహియేనా? కానీ ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్ దాకా ఎందరు తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రులు తిష్ట వేశారని తీర్మానించినా ఒక్కరంటే ఒకరు ఆంధ్రవూపాంతానికి వెళ్లలేదు. అది పరిష్కారం కావాలి. తప్పదు కదా! మాటలు కఠినంగా అనిపిస్తే అనిపించి ఉండవచ్చుగాక. కానీ ఆచరణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా ఆంధ్రులే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రులే ఉద్యోగాలు చేస్తారంటే కుదురుతుందా? అట్లని హైదరాబాద్‌లో నియమనిబంధనల ప్రకారం ఉండే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వెళ్లగొడితే కుదురతుందా? ఇదంతా విభజన వల్ల ఏర్పడిన ఒక శూన్యం నుంచి, విభజన జరగదు అని, ఇప్పుడు తీరా నిజమయ్యే సరికి ఏర్పడిన ఒక భ్రాంతి నుంచి మాట్లాడితే కొన్నాళ్లకు సర్దుకుంటుంది. అది పెద్ద సమస్యకాదు.

చెరువులో చేపలు నిండినట్టు ఈనగరంలో ప్రజలు నిండాలి అని కలగన్న కులీకుతుబ్‌షా ఆకాంక్షతో ఈ నగరం నిండింది. ఇక్కడి ప్రజలను వాళ్లు సీమాంధ్ర అయినా సరే వెళ్లగొ దుష్ట సంస్కృతి తెలంగాణకు లేదు. అది అందరితో కలిసి బతికే ప్రజాస్వామ్య సంస్కృతి వారసత్వం నుంచి వచ్చింది. ఆ వారసత్వం తెలంగాణ చరిత్ర నిండా ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటాల నుంచి రూపుదిద్దుకున్నది. నైజాం నిరంకుశం మీద, రాచరికం మీద ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అయింది. దొరల గడీల మీద దండయాత్ర చేసిన నక్సల్బరీ పోరాటం ప్రజాస్వామ్యం కోసం చేసింది. సమాంతరంగా 1952 నుంచి ఇప్పటిదాకా తడవలు తడవలుగా చేసిన తెలంగాణ ప్రత్యేక పోరాటం ప్రజాస్వామ్య స్ఫూర్తితో చేసింది. అందువల్లే అది కొన్ని విలువలను ఇప్పటికే సమాజానికి అందించింది. ప్రజాస్వామ్య సంస్కారాలను అది ప్రపంచానికి అందించింది. ప్రపంచీకరణ నేపథ్యంలో, ద్రవ ఆధునికతల చపల చర్చలు నడుస్తున్న కాలంలో ఒక దేశంలో కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, పార్లమెంటరీ, చట్టబద్ధ పద్ధతుల ద్వారా, రాజ్యాంగబద్ధంగా పోరాడి సాధించవచ్చుననీ, ప్రజాబలం ముందు కరడుకట్టిన ప్రభుత్వాల మెడలు వంచవచ్చని తెలంగాణ ప్రపంచానికి ఒక విజయాన్ని కానుకగా ఇచ్చింది. తెలుగు సోదరులుగా ఇది మీ విజయం కూడా. కలసి ఉండడం అనేది ఒక భావన మాత్రమే. కలకాలం కలిసి ఉండడం చివరికి ఆదర్శంకూడా. సమైక్యాంధ్ర అనేది ఇక చరిత్ర పెంటకుప్పమీద శవమై మూలుగుతున్న భావన. ఎన్నో చారివూతక ఉద్యమాలు చేసిన తెలుగు సోదరులారా! విభజన అనివార్యం. చివరగా నామివూతుడు ఆంధ్ర జర్నలిస్టు ఫోరమ్ నేత డానీయే చెప్పినట్టుగా విభజనలో మీ హక్కుల కోసం పోరాడండి. న్యాయంగా రావాల్సినవి తీసుకోండి. మీకు మంచిది. మాకూ మంచిది.తెలంగాణ వాదులకు ఒక వినతి. నిజమే మనం ఒక విజయం సాధించాం. సంయమనం పాటించాలి. ఆంధ్రులకు హైదరాబాద్‌లో ఏ నష్టం, కష్టం కలుగకుం డా చూసుకుంటాం.కానీ మనం దోపిడీకి గురయిన వాళ్లం. మనుషులను పోగొట్టుకున్న వాళ్లం. మరీ ఆత్మరక్షణలో పడి మనకు రావాల్సినవి మరిచిపోతే మళ్లీ కష్టాల పాలవుతాం. జాగ్రత్త. అప్రమత్తంగా ఉందాం. సంయమనంగా ఉందాం. ఇప్పటికీ ఉద్యమం మనకు నేర్పిన శాంతిని పాటిద్దాం. కానీ తెచ్చుకున్న నిర్ణయం అమలు కోసం పోరాడుదాం. పోరాట పటిమను కాపాడుకుందాం. భవిష్యత్తు మనదే. జై తెలంగాణ. ‘‘తెలంగాణ ప్రజల ఆగ్రహమంతా తమ ప్రాంతాన్ని కొల్లగొట్టే పాలకవర్గాల పట్ల. తమకు తాము పాలకులుగా భావించి, తెలంగాణ ప్రజలను పాలితులుగా పరిగణించే వలసవాదుల పట్ల. ధనబలం, రాజకీయ బలంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్ని నియంవూతిస్తూ, తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించే దోపిడీ వర్గాల పట్ల. తెలంగాణ భాష, సంస్కృతి, కట్టు బొట్టు, అయిన వలస సమూహాలను అవహేళన చేసే సంస్కార హీనుల పట్ల మాత్రమే’’. ఇది సారు మాట. వచ్చే 6న జయశంకర్‌సార్ వర్ధంతి. ఆయనకు నివాళి.. ఒక్కటే లోటు ఆయన బతికి ఉంటే బాగుండు...

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

235

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...