సందేహమూ... సంబురమూ..


Sun,July 28, 2013 12:36 AM

డిసెంబర్ 9. తెలంగాణకు చారిత్రక దినం. ఆ ప్రకటనకు ముందు ఉరుములు మెరుపులు ఉద్యమానివి. ఒకవంక కేసీఆర్ దీక్ష. క్షీణించిన ఆరోగ్యం. మరోవంక పదకొండవ తేదీ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి. కేసీఆర్ దీక్షతో తెలంగాణ అంతటా ఆవరించిన చెలరేగిన ఉద్యమ వాతావరణం. నిప్పుల కొలిమిలో మండిన కొన్ని బలిదానాలు. డిసెంబర్ 9 ప్రకటనను ఉద్యమం సాధించింది. ఒక అనివార్యస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తరఫున ఆ ప్రకటన. రాత్రి పదకొండున్నరకు చిదంబరం ప్రకటన చేశారు. తెలంగాణ మొత్తం రాత్రంతా వేడుకలు చేసుకున్నది. ధూమ్‌ధామైంది. బతుకుల్లో ఎన్నడూ అనుభవంలోకి రాని సంబురాన్ని ఉత్సవంలా మలుచుకున్నది. ఎగిరింది. దుంకింది. ఈ పోరాట క్రమమంతా తలచుకొని కన్నీరు పెట్టుకున్నది. నిప్పచ్చి జీవితాల్లో ఒక విజయంగా ఆర్ట్స్ కాలేజీ రాత్రంతా ఒక కాగడాలా వెలిగింది.

మూడున్నరేళ్లు. ఎడతెగని పోరాటం. వచ్చిన ప్రకటన వెనక్కిమళ్లిన భంగపాటు. కళ్లముందరే కలను చిదిమేసిన ఆవేదన. ఆక్రోశం. ఉక్రోశం. కాంగ్రెస్ పార్టీని ఇక నమ్మకూడదని, అది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కోట్లమంది కోర్కెలను తోసిపుచ్చి, గుప్పెడుమంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు కట్టుబానిస అయిందని తీర్మానించుకున్నది తెలంగాణ. పట్టుదల పెరిగింది. వీధులు పోటెత్తినయి. జేఏసీలు పుట్టినయి. ప్రజాస్వామ్య ఉద్యమంలో కొంగొత్త రూపాలు మొలిచినయి. తెలంగాణ ఒక ఉద్యమశక్తిగా విశ్వరూపం చూపింది. అది కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ ఇవ్వడం తప్ప మరి దారిలేని స్థితికి పరిస్థితులు ఎదిగినయి. తెలంగాణ ఒక ఆత్మగా అవతారమెత్తింది. కులం లేదు. మతం లేదు. ఒక దశలో ఏ రాజకీయమూ లేదు.

ఒక్క తెలంగాణ. స్వీయ రాజకీయ అస్తిత్వం ఎదుగుదల, క్రమక్షికమంగా కాంగ్రెస్‌కు, తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్‌సీపీకి ఇక్కడ పుట్టగతులు లేని పరిస్థితులు తెచ్చింది. ఒకసారి మాట తప్పిన కాంగ్రెస్‌కు రాజకీయ భవిష్యత్ తెలంగాణపై నిర్ణయంలోనే ఉండే అనివార్యత ఏర్పడింది. ఇక్కడిదాకా గతం. కానీ వర్తమానంలో ఏం జరగబోతున్నది.ఢిల్లీలో ఆరు నెలల క్రిందటే మరోసారి తెలంగాణ మరిగింది. షిండే వచ్చె మొదలాడిన తర్వాత మళ్లీ తెలంగాణకు తీరని అవమానమే మిగిలింది. ఎవరిష్టమొచ్చినట్టు వారు ఆ‘జాదు’ చేశారు. అవమానాల్ని దిగమింగుకున్నది తెలంగాణ. అయినా పోరు ఆగలేదు. ఆకాంక్ష చుట్టూమూగిన ఉద్యమమూ చెదరలేదు. తెలంగాణ రానేలేదు. ఆ రాత్రి ఇంకా తెల్లవారలేదు.

కాంగ్రెస్‌పైన తెలంగాణ నమ్మకం కోల్పోయింది. నిజానికి వర్తమానంలో ‘డిగ్గీ వచ్చె మొదలాడిన’ తర్వాత చాలా జరిగాయి. తెలంగాణ జ్వాలను మళ్లీ ఆయన ఎగదోశారు. తెలంగాణవాదులు అయినా అనుమానంగానే చూశారు. కోర్ కమిటీ పేరు చెప్పి ఇదివరకూ ఎన్నడూ లేనంత ‘హైప్’ సృష్టించారు. ఇక తాడోపేడో అన్నా రు. నిజమే కావచ్చు అనుకున్నవాళ్లు భంగపడ్డారు. చివరికి తేలిందేమిటి? నిర్ణయం సీడబ్ల్యూసీలో అన్నారు. మొదటి అంకానికి తెరలేచినప్పుడు ఎన్నికల ‘పంచాయతి’ మొదటి విడత కాలం. మళ్లీ రెండవ విడతకు ముందూ అదే జరిగింది. వార్ రూమ్, కోర్ కమిటీ, అటునుంచి, దిగ్విజయ్ సింగ్ రెండు మాటలు ‘వేచి చూడం డి’. నిజానికి ఈ మొత్తం క్రమమంతా ఇంతేకాదు. చాలానే కథ నడిచి ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం తీసుకున్నదంటున్నారు. సోనియాగాంధీ చివరకు తెలంగాణపైన రాష్ట్ర త్రిమూర్తులకు సంకేతాలు ఇచ్చారనీ అంటున్నారు. ఒకరు రాయల తెలంగాణ అంటే, మరొకరు హైదరాబాద్‌ను గవర్నర్ పాలనలో పెడ్తారంటున్నారు. విభజన తథ్యం అంటే, సోనియా సై అంటున్నారు.

ముఖ్యమం త్రి ముఖం మాడ్చుకుని తిరుగుతున్నందువల్ల, సరిగ్గా తెలంగాణకు కాస్త అనుకూలంగా గాలి వీచినప్పుడు మాత్రమే పులితోలు కప్పుకొని బయలుదేరే నాయకమ్మణ్యులు ఢిల్లీలో నాటకాలు సాగిస్తున్నందువల్లా, ఎన్నడూ లేనిది, ఆరామ్‌గా ఎవరి పని వారు చేసుకుంటున్న సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలు మరోసారి అచ్చుతప్పులతో కూడిన ‘సమైఖ్యాంధ్ర’ జెండాలతో పలుచగానైనా ఊరేగుతున్నందువల్లా, హైదరాబాద్‌లో ఎన్నడూ మాట్లాడని కొత్త ఉద్యమకారులు ఏపీ ఎన్జీవోల పేరిట మైకుల ముందు ప్రగల్భాలు పలుకుతున్నందువల్లా, అబద్ధాలు వల్లెవేస్తున్నందువల్లా, ఎన్నడూలేనిది, స్వంత ప్రాంతంగా ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి నుంచి సోనియాగాంధీ దాకా చూస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో మాత్రమే బలగాలను మోహరించినందువల్లా, వార్ రూమ్ సందేశాల తర్వాత సీమాంధ్ర మంత్రులు గాయి గాయి అయినందువల్ల నిజంగానే విభజన సంకేతాలున్నాయని అనిపించింది. కానీ....

సంబరమేది? డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన ఆరంభడి ఏది? ఆ ధూమ్‌ధామ్ ఏది? అసలు నమ్మకం ఏది? నిజానికి తెలంగాణవాదులు మరీ ఇంత అపనమ్మకవాదులుగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం నవ్వవచ్చు. కొంచెం అనుకోవచ్చు. ఒక ఆశను వెలిగించుకోవచ్చు. ఎవరికీ లేదు. ఢిల్లీలో అంత హడావుడి జరిగిన తర్వాత, టీవీల నిండా తథ్యం తథ్యం, తెలంగాణ తథ్యం అని వచ్చిన తర్వాత కూడా ఏ సంబరమూ జరగలేదు. పైగా అవునన్నా ఇస్తారంటావా? ఏం జరుగుతున్నది. అయినా కాంగ్రెస్‌ను నమ్మడం ఎట్లా? ఇలాంటి ప్రశ్నలు అనేకం. విశ్లేషకులకు, బుద్ధిజీవులకు, భవిష్యత్తును సాధికారికంగా వ్యాఖ్యానించే రాజకీయ పండితులు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి, తెలంగాణ వచ్చేసింది అని చెప్పిన వాళ్లు లేరు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉధృత ఉద్యమం అనంతర పరిణామాలు కాకపోవడం వల్ల కావొచ్చు. ప్రజల ఒత్తిడి ప్రభావం వల్ల జరుగుతున్న పరిణామాలు కాదన్న ఉదాసీనత కావొచ్చు. వీటన్నింటికి మించి చర్చలన్నీ నిజమైన భాగస్వాములైన (STAKE HOLDERS) తెలంగాణ ఉద్యమ ప్రతినిధులు ప్రభుత్వం లేదా ఇతర రాజకీయపక్షాల పాత్ర లేకపోవడం వల్ల కావొచ్చు. ఒక అపనమ్మకం. ఒక ఉదాశీనత సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వ్యవహారాన్ని స్వంత వ్యవహారంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ సాధన కోసం వాళ్లే. తెలంగాణను మోసం చెయ్యడానికి సమైక్య వాదనలు చేసేది వాళ్లే.

ఈ ద్విపావూతాభినయం తెలంగాణవాదుల్లో సందేహాలను నివృత్తి చేసే బదులు పెంచాయి. నిజానికి కాంగ్రెస్ కోర్ కమిటీలు ప్రత్యేకంగా తెలంగాణ మీద జరగడం తెలంగాణకు సంబంధించి ఒక ముందడుగే. కోర్ కమిటీల తర్వాత, వార్ రూమ్‌లో సంభాషణలు ఒక్క తెలంగాణ మీద జరగడమూ శుభపరిణామమే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు జరగడమూ మంచిదే. కానీ సందేహాలు, అనుమానాలు మాత్రం పోవు. ఎవ్వరూ సంబరపడరు. కాంగ్రెస్ అంటేనే ఒక ఆక్టోపస్. అది అన్ని ఆకాంక్షలను మింగుతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎజెండాలన్నీ కాకుల చావుకు, గద్దల బలుపునకు కారణమవుతున్నవే. ఆ అండ చూసుకునే సమైక్యం పేరిట, కృత్రిమంగా, సంకుచితంగా ‘ఉల్టా కొత్వాల్ కో డాంటే’లాగా ఒక ఆధిపత్య భావన సీమాంధ్ర ప్రభుత్వాధి నేతల్లో, మంత్రుల్లో, ఎంపీలలో కనబడింది. అందుకే లగడపాటీలు, టీజీలు, కావూరిలు, రాయపాటిలు, చివరకు, అడ్డం పొడుగూ మాట్లాడారు. నిన్నటిదాకా ఇదే జరిగింది. కాంగ్రెస్ ఒక మేకవన్నె పులి. అది గాయపరుస్తుంది.

తెలంగాణను అనేకసార్లు గాయపరిచింది. తెలంగాణ నిండు ప్రాణాలను మింగింది. అదీ సమస్య. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించినా నిజమైన తెలంగాణవాదులు నమ్మకపోవడానికి బలమైన ప్రాతిపదకలు అవే. కానీ విషాదంగా తెలంగాణ ప్రకటించే శక్తి రెండు పార్టీలకే ఉన్నది. అది కాంగ్రెస్ లేదా బీజేపీ. అందువల్ల కూడా కావొచ్చు. తెలంగాణ జిల్లాల్లో కనీసం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కాలత్తుకుని తిరగలేని పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికల ప్రతిస్పందనలు సానుకూలంగా ఉన్నాయి.మొదటి విడతకు ఒక కోర్‌కమిటీ ఒక మంత్రమైతే, రెండవ విడతకు రెండో మంత్రం వార్ రూమ్ లీకులు. సంకేతాలు. మూడవ విడతకు బహుశా యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఉంటుందేమో చూడాలి. ఇట్లా ఆలోచించడం ప్రతికూలత మనసంతా నిండిన వాళ్ల ఆలోచన అని అనుకోవడానికి లేదు. కాంగ్రెస్ తెలంగాణను దశాబ్దాలుగా అట్లా మోసం చేసింది. అట్లా దగా చేసింది. అయినా సంబురం ఎట్లా? తెలంగాణ మనసులో కాంగ్రెస్ తన విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్నది. భవిష్యత్ ఏమిటి?

తెలంగాణ సానుకూల సంకేతాలు అని అట్లా టీవీల్లో వార్తలొస్తున్నాయో లేదో? సీమాంధ్ర మంత్రులు, పెట్టుబడిదారీ రాజకీయవేత్తలు ఢిల్లీలో మళ్లీ కొత్త నాటకాల కు తెరలేపారు. ఒకరు నక్సలైట్లంటరు. ఒకరు నోటికి తోచింది మాట్లాడ్తరు. తమ మాటలు తమకే దుర్వాసన వచ్చేంత స్థాయిలో పాతబడి, పాచిపట్టిన ఈ వాదనలు విన్నప్పుడల్లా భయం సహజం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానంలో నే ప్రజల వ్యతిరేకత ఉన్నది. ఉద్యమాల వ్యతిరేకత ఉన్నది. గుప్పెడు మంది పెట్టుబడిదారుల కు అంతిమంగా లొంగిపోవడం ఉన్నది. వాళ్లు ఇప్పటికీ బలిదానాల గురించి మాట్లాడటం లేదు. దాన్ని ఖాతరు కూడా చేయడం లేదు. అదీ సందేహం. అదీ సమస్య.

కొత్తగా రాయల తెలంగాణ అంటున్నరు. తెలంగాణ దశాబ్దాల ఉద్యమమంతా తెలంగాణ కోసం మాత్రమే. అదీ 1956లో అంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిన పాత హైదరాబాద్ స్టేట్. పది జిల్లాల హైదరాబాద్ రాజధానిగా గల తెలంగాణ. ఇదొక అస్తిత్వ పోరాటం. ఇదొక ఆత్మగౌరవ పోరాటం. ఒక ప్రాంతాన్ని, అంతర్గత వలసగా చేసుకొని, ఆక్రమించుకొని, ఆధిపత్యం స్థాపించుకున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటం. కానీ రాయలసీమకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇతర అస్తిత్వాలనూ గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఏ అస్తిత్వాన్ని కోల్పోయి అవమానాల పాలైనామో, మరో అస్తిత్వంనుంచి ఒక భాగాన్ని విడదీసి తెలంగాణలో కలపడం అనేది రాయలసీమకు అన్యాయం చెయ్యడమే. తెలంగాణ పోరాటం సంకుచితమైనది కాదు. ప్రాంతీయ తత్వంతో మాత్రమే జరుగుతున్నదీ కాదు. ఇది ఇతర అస్తిత్వాలను కలుపుకోవడానికీ కాదు. కాంగ్రెస్‌పార్టీ అనివార్యంగా తెలంగాణ ప్రజలపైన ప్రేమతో తెలంగాణను ఇవ్వదని అందరికీ తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసమే అయినా రాష్ట్రాన్ని నిజంగానే విభజించ దలుచుకుంటే అంతవరకూ సబబే. కానీ కొత్త కొట్లాటలు పెట్టడం, కొత్త చిచ్చులు తయారు చేయడం , కొత్త తకరార్లకు బీజం వేయడం ఎందువల్ల?

ఒకవేళ కోర్‌కమిటీలు, వార్‌రూమ్‌లు నిజమే అయితే, కాంగ్రెస్ పార్టీ ఒకటడిగితే మరొకటి ఇస్తాననడంలో మతలబు ఏమిటి? అంతిమంగా రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్‌పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించదు. వాళ్లు ఊహిస్తున్నట్టు ఇక్కడ టీఆర్‌ఎస్ దెబ్బతినడం, అక్కడ వైఎస్సార్ పార్టీ కునారిల్లడం, తెలుగుదేశం పుంజుకోకపోవడం అని కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనాలూ నెరవేరవు.

సమస్య ఏమిటంటే తెలంగాణపైన ఏ వార్ రూమ్‌లు ప్రకటనలు చేసినా, చివరికి సోనియాగాంధీ స్వయంగా తెలంగాణ ఇస్తామని ప్రకటించినా నమ్మే స్థితి లేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వెళ్లడం, ఆ తర్వాత అది ఇతర బిల్లులలాగా మగ్గిపోకుండా పాస్ కావడం తప్ప తెలంగాణకు విశ్వాసం ఇచ్చే మరో ప్రత్యామ్నాయం లేదు. రాయల తెలంగాణను కాంగ్రెస్ మరో మహా మోసానికి పావుగా వాడుకునే అవకాశమే ఉంది. రాయల తెలంగాణకు బీజేపీ ఒప్పుకోదు. బిల్లు పాస్ కాదు. తెలంగాణకు మాత్రమే ఏది మంచిదో, చెడ్డదో ఓ కాయిదం ఇచ్చిన తెలుగుదేశం ఒక రాజకీయ సావకాశంగా తీసుకొని ఒప్పుకోదు. ఇక బిల్లెట్లా? అంతిమంగా రాయల తెలంగాణను తెలంగాణ ఒప్పుకోదు. అందువల్ల రాయల తెలంగాణ మళ్లీ మొదటికి తెచ్చే మహా మోసమా? కాంగ్రెస్ నిజంగానే తెలంగాణ ఇస్తుందా? అనే మీమాంస ఉన్నంత వరకు కాంగ్రెస్‌ను నమ్మలేరు. తెలంగాణవాదులు సంబురాలు జరుపుకోలేరు. కాంగ్రెస్ మాత్రమే తేల్చుకోవాల్సిన ఒక అనివార్యత సృష్టి ఇప్పటికీ ఉద్యమ విజయమే. వేచి చూద్దాం. అయితే ఓకే. కాదంటే మన కోసం వీధులు ఖాళీగా అట్లాగే ఎదురుచూస్తున్నాయి. మా కోసం ఎదురుచూడు...

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

139

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...