మనం విడిపోయే వున్నాం...


Sun,July 21, 2013 01:55 AM


ఇన్ని చరిత్ర పేజీల మీదుగా గడచి వచ్చిన తర్వాత నడచి వచ్చిన తర్వాత ఇన్ని మరణాలనూ మనసు పొరల్లో నింపుకుని మ్రాన్పడి మౌన సంతాపాలూ ప్రకటించుకున్న తర్వాతా ఇన్ని సంస్కృతులను సానబెట్టుకున్న తర్వాత కూడా నువ్వు నువ్వుగా నేనునేనుగానే ఉన్నాము హద్దులు గీసుకున్న మనం వేర్వేరు ప్రాంతాలుగానే ఉన్నాం విలీనం కాలేని వాళ్లం.. ఇద్దరుగా విడిపోయిన వాళ్లం.. దేన్లోనూ లీనం కానివాళ్లం మనమిద్దరం.. మనం ఒకే భాషకు పూచిన రెండు పరిమళాలం.. విడిపోయే ఉన్నాం.. విడిపోదాం

కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణ ప్రకటించనే లేదు. ప్రకటించిన తెలంగాణ వెన క్కి తీసుకుని కూడా మూడున్నరేళ్లు గడిచిపోయాయి. మధ్యలో ముహూర్తాలన్నీ ముతమైపొయ్యాయి. కొత్తపొద్దులు అనేకం పొడిచి, గ్రుంకాయి. ఆశనిరాశల మధ్య ఊగిసలాడడమూ చివరకు ఒక అనివార్యపు అలవాటు కూడా అయ్యింది. కానీ.. కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో గడువులు, కదలికలు వచ్చిన ప్రతిసారీ ఒకే తంతు. ఏ మాత్రపు మార్పులేని ఒకే రకపు మాటలు. ఒకే రకపు వాదనలు అన్నీ ఎన్నడో క్రితంలోనే విన్నవి. క్రితంలోనే మాట్లాడుకున్నవి. ఒక్కటీ కొత్తగా ఉండదు. సమస్య తేలదు. కాంగ్రెస్ తేల్చదు. కానీ పత్రికల్లో టన్నులకొద్దీ పేరుకుపోయే, అబద్ధాల అక్షరాల కాలుష్యం, చానళ్లలో గంటలకొద్దీ జరిగిన వక్రీకరణ చర్చోపచర్చలు కానీ ఎవరూ అడగరు. ఇంతకీ తెలంగాణ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఈ విషనాగుల పడగలు ఎందుకు? విప్పుకుంటాయి. ఏది పడితే అది నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ దాకా, ఉండవల్లి నుంచి టీజీ వెంక దాకా, గత చరివూతల నుంచి వర్తమానపు ముంజేతి కంకణాల దాకా.. అబద్ధాలు, వక్రీకరణలు. ఈ చర్చల వల్ల, ఈ వికృత పరిహాసాల వల్ల, మలి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటికి, పేరుకైనా సమైక్యమని మాట్లాడుతున్న మాటలకు చివరికి శూన్యవిలువ కూడా లేకుండాపోయింది. సమైక్య వాదన నిజార్థంలో ఒక అంతర్గత వలస ఆధిపత్యాన్ని స్థిరీకరించుకుని, అవును మేము ఏలుతాం.. మీ ప్రాంతాన్ని మేం ఇట్లాగే ఆధీనంలో ఉంచుకుని, పరాధీననను చేసి, కొల్లగొడుతాం. అయినా మీరు నిశ్శబ్దంగా పడి ఉండండి. మారు మాట్లాడవద్దు. ఇదింతే. అనే ఒక ఆధిపత్య అహంకారంతో ఏర్పడిన యంత్రాంగాన్ని స్థిరీకరించుకోవడమనే భావనే ప్రధానమైంది. వాస్తవానికి ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష కోసం, రాజ్యాంగబద్ధమైన డిమాండ్ కోసం జరుగుతున్న పోరాటంపై ఆధిపత్యవాదులు పూర్తి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, సామాన్య తెలంగాణ ప్రజల అభీష్టాలపై రాజ్యాంగ వ్యతిరేకంగా సాగిస్తున్న సమైక్యాంధ్ర ప్రచారా న్ని బద్దలు కొట్టాల్సి ఉంది.

తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఆంధ్రతో పాటు విలీనమై ఆంధ్రవూపదేశ్‌గా ఏర్పడింది. ఈ విలీనం అపనమ్మకాలతో, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరిగింది. విశాలాం ధ్ర భావనలు ఏర్పడిన నాటికే, హైదరాబాద్ స్టేట్ మీద జరిగిన సైనిక చర్య తర్వాతి కాలంలో వెల్లోడి పాలనలో జరిగిన ఇంగ్లీషు తెలిసిన ఉద్యోగుల వరద వచ్చినప్పు డే, ఇక్కడ అనుమాన బీజాలు పడ్డాయి. విశాలాంధ్ర భావనలు అమూర్తంగా తయారై, ముల్కీ నిబంధనల ఉల్లంఘన, క్రమక్షికమంగా హైదరాబాద్ స్టేట్‌లో వచ్చిచేరిన నాన్‌లోకల్ ఉద్యోగులు ప్రత్యక్షంగా తెలంగాణ వారి ఉపాధికి, భవిష్యత్ మనుగడకు ఆటంకంగా తయారయ్యాయి. అవి పరాకాష్టకు చేరినందువల్లనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్‌ముల్కీ గోబ్యాక్ ఉద్యమం 1952లోనే బద్దలై సిటీ కాలేజీ కాల్పులు జరిగాయి. ఇదంతా చరిత్రే. రాష్ట్రం ఏర్పడే నాటికే ఈ నేప థ్యం ఉన్నందువల్లనే వచ్చిన బ్రిటిషాంధ్రులకు సావకాశం, అప్పటికే డెల్టా ప్రాంతపు వ్యవసాయ ఆధునిక, వాణిజ్య పోకడలు వెరసి ఎక్కితొక్కొచ్చిన పెట్టుబడులు, వీటివల్ల హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రలో విలీనం చేయడం అంటే మనం మోసపోవడమే అనే భావన ప్రజల్లో పరివ్యాపించి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా విలీనం చేసినప్పుడు తెలంగాణ ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికే, షరతులు, ఒప్పందాలతో ఆంధ్రవూపదేశ్ ఏర్పడింది. ఆంధ్రవూపదేశ్‌లో సీమాంధ్ర పెట్టుబడిదారీ ఆధిపత్య వర్గాలకు తెలంగాణ అంతర్గత వలస అయింది. ఈ వలసీకరణ వల్ల, దరిదాపు అయిదున్నర దశాబ్దాల చేదు అనుభవాల వల్ల, రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ (3) ప్రకారం తెలంగాణ వేరు కావాలని కోరుకుంటున్నది.అది ఎట్లా తప్పవుతుంది. అది ఎట్లా ఎవరికి అన్యాయం చేసినట్లవుతుంది. అది ఎట్లా ప్రజాస్వామ్య వ్యతిరేకం అవుతుంది. కానీ ఎన్ని వాదనలు. ఎన్ని వక్రీకరణలు, ఎన్ని అబద్ధాలు.

తెలంగాణపై కోర్ కమిటీకి ముందు ఎవరూ మాట్లాడనే లేదు. సీమాంవూధలో ఏ సంస్థా ఉద్యమమూ చెయ్యలేదు. కానీ విశాలాంధ్ర మనమంతా ఒకటి అని పెదవులపై నుంచి మాట్లాడేవాళ్లు ఏకపక్షంగా తెలంగాణ కూడా తామే అయి, తెలంగాణను కూడా తామే అర్థం చేసుకున్నట్టు సభలూ పెడ్తారు. ఎక్కడో మూలన దాక్కు న్న వాడూ ముందుకొస్తాడు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా ఆంధ్రవూపదేశ్ కు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా, సీమాంవూధకు ఏవో ప్రయోజనాలు దెబ్బతింటాయని మాట్లాడతారు. బొత్స సత్యనారాయణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడయి ఉండి ఒకే ప్రాంతం కోసం మాట్లాడతారు. విచివూతంగా ఇటు తెలంగాణ సాధన సభ పెట్టి తెలంగాణ కోసం మాట్లాడేవాళ్లు, అటు అందరికి సంబంధించిన వాళ్లం అని చెప్పుకుంటూనే సంకుచితంగా వ్యవహరించి ఒకే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేవాళ్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అయి ఉంటారు. అదీ తమాషా. కాంగ్రెస్ నిజంగానే ఒక వేయి తలల పాము. ఎక్కడి నుంచి ఏ విషం చిమ్ముతుందో? తెలియదు. ఎక్కడి నుంచి హఠాత్తుగా ఒక తల మొలిచి ఏం మాట్లాడుతుందో? తెలియదు. ఏ వైపు నుంచి కోరకు కన్ను, కొమ్ముకు కన్ను ఉన్న రాక్షస గణం.. నోటికాడి కూడు లాక్కుంటుందో? తెలియదు. ఇదంతా ప్రజాస్వామ్యం కోసం జరగడం మరింత తమాషా. ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందనడం అంతులేని తమాషా.

మీడియా వల్ల, ఈ మీడియా ఒక ప్రాంతం వేపు ఉండి సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నందువల్ల, రాజకీయ నాయకత్వం సీమాంధ్ర కోసం, ప్రజాస్వామ్యాని కి, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడ్తున్నందువల్ల, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బలవంతంగా కలిపి ఉంచాలనే సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఇవ్వాళ్ల బోర విరుచుకుని మాట్లాడ్తున్నది. ఈ సంకుచిత వాదులు ఇప్పుడు విశాల వాదులుగా ఊరేగుతూ గొప్పగొప్ప కబుర్లు చెబుతున్నారు. ఒకరు జాతీయవాదం అంటా రు. ఒకరు ఇందిరా గాంధీ అంటారు. మరొకరు నక్సలైట్లు ఆక్రమించుకుంటారు అంటారు. ఇంకొకరు మతవాదం పెచ్చరిల్లుతుందని అంటారు. నీళ్ల పంచాయతీ జరుగుతుందని మరొకరు అంటారు. ఇక్కడ హైదరాబాద్ విడిపోతే ఆరువేల కిలోమీటర్ల దూరంలో రక్షణ రంగానికి దెబ్బ అని ఇంకొకరు అంటారు. ఇవన్నీ నిజంగానే కలిపి ఉంచడానికి మాట్లాడుతున్న మాటలేనా? ఇవన్నీ నిజంగానే విడిపోతే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం ప్రయోజనాలు కాపాడి, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర వారికి రక్షణలు కల్పించడానికేనా? అంటే.. నిజమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇవన్నీ ఉద్దేశపూరితంగా తెలంగాణను అడ్డుకోవడానికి మాత్ర మే చేస్తున్న కుట్రగా బయటకు కనపడుతూ ఉండవచ్చు. కానీ సీమాంవూధులు, కలిసి ఉండాలి పేరిట తెలంగాణను ఎంత అవమానిస్తున్నారో? ఆలోచించాలి. రాజ్యాం గం ఇచ్చిన ఒక హక్కు మీద కొట్లాడుతున్న ప్రజలకు మతవాదులనుంచి, నక్సలైట్లదాకా ముద్ర వేయాలి. పేచీకోర్లుగా ముద్రవేయాలి. హింసావాదులుగా ముద్ర వేయాలి. అంతిమంగా ఒక చరిత్ర, సంస్కృతి,సంస్కారం లేని నిమ్నజాతిగా ముద్రేయాలి. ఇదే అంతిమంగా ఆధిపత్య భావన. ఒక అంతర్గత వలసలో వలసదారుడు పన్నే కుట్ర. ఇది అర్థం చేసుకోవాలి. తప్పదు.

తెలంగాణ ఇస్తామన్నప్పుడల్లా ఒక లక్ష వాదనలు చేస్తున్న వాళ్లు ఒక విషయం మాత్రం కనీసం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. తేనె పూసిన కత్తుల్లా మాట్లాడే వాళ్లంతా తెలంగాణను ఒక సెంటిమెంట్ అంటారు.ఇది ఉద్వేగాలతో కూడుకున్నది అంటారు. ఈ రకంగా కూడా ఈ ఉద్యమాన్ని చిన్న చేసి చూపడం, కించపరచడంతో పాటు, ఈ ఉద్యమం ఉద్వేగాల మీద ఆధారపడింది కావున ఇక చల్లారుతుంది అని చెప్పడం కూడా వారి ఉద్దేశం. ఇట్లాంటి వాళ్లకు పదహారు సంవత్సరాలుగా, ఆ తర్వాత కేసీఆర్ దీక్ష, విద్యార్థుల కదలికల అనంతర పరిణామాల నుంచి ఇప్పటి దాకా జరిగిన సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, నిత్యం వీధు ల్లో జరిగిన శాంతియుత ప్రజాస్వామ్య నిరసన రూపాలు జరిగేవి కావన్నది వీళ్ల స్ఫురణకు కూడా రాదు.ఇన్నెందుకు సమైక్యాంధ్ర వాదనలు చేసే ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యల గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడరు. నిజమే తెలంగాణ ఆయుధాలు ధరించినప్పుడు అది ఆత్మహత్యలు చేసుకోలేదు. ఆయుధాలు లేని ప్రజాస్వామ్య స్ఫూర్తి, శాంతి పోరాటాల్లో ఆత్మహత్యలనే ఒక ఆయుధం చేసుకున్నది. కేవల ఉద్వేగాల వల్ల వెయ్యి ఆత్మహత్యలు జరగవు. కేవలం ఉద్వేగా ల వల్ల అనేక కష్టనష్టాలలో నిర్మాణ సంక్లిష్టతలతో కూడిన ఇన్నొద్దుల ఉద్యమమూ జరగదు. కానీ ఆత్మహత్యలు సీమాంవూధుల కలలో, మెళకువలో కలవరపెట్టే ఏకైక అంశమే అయినా, సౌలభ్యం కోసం వాళ్లు ఆ ఒక్కటీ విస్మరించి, ఆ ఒక్కటీ మరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీనుంచి, గల్లీ సీమాంధ్ర, నాయకుని దాకా తేనె పూసిన కత్తిలాంటి సమైక్యాంధ్ర మాటలు మాట్లాడేవాళ్లు అత్యంత విషాదమూ అయిన నెత్తురు మరిగే ఈ అమరవీరుల ఆత్మబలిదానాలను కూడా విస్మరిస్తారు.

సీమాంధ్ర, సమైక్యాంధ్ర వాదనలు గొడ్డుబోయినవి. అవి బోలు వాదనలు. ఒక్కటీ నిలబడదు. మీడియా మాయాజాలం, లీకుల మహత్యంతో కంగారుపడి స్వీయరక్షణ కోసం ప్రయత్నించడం తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యం కూడా. ఒక అవగాహనతో పూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అది అసమానతలు, ఆర్థిక వనరుల దోపిడీ, కొలువుల దోపిడీ చరిత్ర, సంస్కృతి భంగపాటు నుంచి, ఒక అంతర్గత వలస ఆధిపత్యం నుంచి విముక్తి పొందడానికి జరుగుతున్న ఉమ్మడి అస్తిత్వ పోరాటం. నక్సలైట్లు పెరుగుతారంటే, అంతకుముందు పెరిగారు, ఇప్పుడు పెరగరని ఎవరికి హామీ ఇస్తున్నరు. ఎందుకివ్వాలి. దేశం అట్లా ఉన్నప్పుడు, దేశం కాకులను కొట్టి గద్దలకు వేసే విధానాలు అవలంబిస్తున్నప్పుడు, అంతరాలు అగాధాలవుతున్నప్పుడు దేశమంతా ఉన్నట్టే తెలంగాణ ఉంటుంది. అంతే. తెలంగాణ అస్తిత్వ పోరాటం పూర్తి ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైనది. సమైక్యాంధ్ర వాదనలు పూర్తి రాజ్యాంగ విరుద్ధమైనవి. జవాబులు అవసరం లేనివి. వాళ్లు విస్మరిస్తున్న వెయ్యిమంది మరణాలే ఈ ఉద్యమ దిక్సూచిలు. అవును ఆత్మహత్యల్లో కాలిపోయినవారు వాళ్ల ఇళ్లల్లో దీపాలు మలుపుకొని, తెలంగాణ దీపాలు వెలిగించడానికి బలిపీఠమెక్కారు. వాళ్ల మరణాలను గౌరవిద్దాం. తెలంగాణ వచ్చేదాకా తెగబడదాం.

-అల్లం నారాయణ
[email protected]

200

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...