కోర్‌కమిటీ అసంబద్ధ నాటకం..


Sun,July 14, 2013 04:06 AM

ఒకే అసంబద్ధ నాటకం
మరోసారి మీ కోసం
* కేతిగాడు మరోసారి తెరతీశాడు
నగరం నడిబొడ్డులోని ప్రేత సౌధం వేదికగా
పాత్రధారులు గళవిన్యాసం ప్రదర్శించారు
మేకప్ మడతనలగని చీరలతో
ఒకరిద్దరు నటీమణులు కాస్త గ్లామరద్దారు
ప్రజలకు పట్టకపోయినా నాటకం రసవత్తరంగా సాగిందని
పాత్రధారులే కాసేపు వేదిక దిగి
చప్పట్లు కొట్టుకున్నారు
నాటకాన్ని పదే పదే తిలకించిన అమరులు మాత్రం
సిగ్గుతో మరోసారి చావుకు సిద్ధమయ్యారు.
(* కేతిగాడు అంటే బుడ్డరఖాన్)

ఇది కవి దేశరాజు కవిత. నెట్‌లో విశేషంగా ప్రచారమవుతున్న సమకాలీన వ్యాఖ్యాన కవిత. బహుశా కాంగ్రెస్‌లో ఉన్న బుడ్డరఖాన్‌లు, నిజాం కాలేజీలో బహిరంగసభ ప్రతిస్పందనే కావొచ్చు ఇది. అయినా కాకున్నా ఈ నాటకాన్ని పదే పదే తిలకించిన అమరులు మాత్రం సిగ్గుతో మరోసారి చావుకు సిద్ధమయ్యారు. ఇవి లోతైన దుక్కపు తెరలకు, నిస్సహాయతకు అద్దంపట్టే పదాలు. కోర్‌కమిటీ తర్వాతి పరిణామాల్లో ఈ కవిత మరింత లోతుగా అర్థమవుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో మోసం ఇది.
ఇవ్వాల్టి నుంచీ కాదు. తెలంగాణతో ఇంత క్రూరమైన పరిహాసాలాడడం, తమాషాలు చెయ్యడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారం లాక్కోవడానికి పదమూడేళ్ల కిందనే ప్రారంభించింది. అది ఇవ్వాల్టికి కూడా అవిచ్ఛిన్నంగా, అజేయంగా కొనసాగుతూ వస్తున్నది. ప్రతిసారీ నమ్మి నానబొయ్యడం. పుచ్చి బుర్రలవడం. ఈ అంతంలేని నాటకానికి ఇకనన్నా తెరదించా ల్సి వున్నది.

ఈ నాటకం హింసాభరితమైంది. బీభత్స రస ప్రధానమయింది. అది మనుషులను అమాంతంగా మింగెయ్యగలది. చివరికి ఆ మనుషుల శవాలను ఊరేగిస్తూ బోలుపేలాలు చల్లి ఊరేగగలది. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఉద్వేగాలతో చెలగాటమాడింది. మనుషుల ఆత్మాభిమానంతో, ఒక ప్రాంతం ఆత్మగౌరవ భావనలతో విదూషక దుర్మార్గాలను ప్రయోగించింది. ప్రతిసారీ ఒక ఆశను నాటడం, ఆ ఆశను రేకెత్తించి సజీవంగా ఉంచడం, ప్రతిసారీ ఇక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తుందన్న ఆశ కొడిగట్టిన దీపంలా అంతమై మలిగిపోతున్నప్పుడు బత్తి ఎగదోయడం, మళ్లీ ఒక కమిటీ వేసి వాయిదా వేయడం, అక్కర తీరేదాకా కేతిగాళ్ల తైతక్కలు ప్రదర్శించి పబ్బం గడుపుకోవడం. నిజానికి కాంగ్రెస్‌కు సంబంధించిన చరిత్ర అంతా ఇదే. తెలంగాణపై కాంగ్రెస్ వేసినన్ని కమిటీలు పడావుపడిన ఫైళ్లలో, ఉబ్బిన శవా ల్లా పేరుకుపోయాయి. అవి ప్రతిసారీ తెలంగాణను రేపడం, ఆ తర్వాత వెటకారమాడి ప్రజల ప్రాణాలు తీయడం ఒక క్రమబద్ధమైన ఆనవాయితీ అయింది. ప్రణబ్ కమిటీ, రోశయ్య కమిటీ, శ్రీకృష్ణకమిటీ (ఎనిమిదవ రహస్య అధ్యాయంతో సహా), కోర్‌కమిటీ, ఇప్పటి దాకా ఈ కమిటీలలో కాలయాపన చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత యూపీఏ సమస్వయ కమిటీ, ఆ తర్వాత అఖిలపక్ష కమిటీ, మధ్యలో వర్కింగ్ కమిటీ ఒకటి ఇప్పటి బుడ్డరఖాన్‌ల ఆశల దీపం. నమ్మినావా! నాశనమౌతావ్ అన్నట్టే.

డిగ్గీరాజా ఆంధ్రవూపదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన తర్వాత తెలంగాణను పరిష్కరించాలని ఆయనను ఎవరూ అడగలేదు. కేకే లాంటి సీనియర్ కాంగ్రెస్ వాది, వెంకటస్వామి లాంటి కురువృద్ధ కాంగ్రెస్ కుటుంబ నేత కుమారుడు ఎంపీ వివేక్, సీనియర్ ఎంపీ మందా జగన్నాథంలు ఇక బుడ్డరఖాన్‌ల బతుకు చాలు. మన మాటలు నమ్మి చనిపోయిన వాళ్ల సంఖ్య చాలు అని కాంగ్రెస్ నాటకాలు బట్టబయలు చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉలుకూ పలుకూలేని కాంగ్రెస్‌లోకాక పుట్టింది. నెలంటే నెలకాదన్న వాళ్లు, ఇడ్లీ, ఉప్మ, దోసె, అన్నవాళ్లు ఉలిక్కిపడ్డారు.

రానున్నది ఎన్నికల కాలం. తెలంగాణలో కాంగ్రెస్ నేతలంటే ఊర్లల్ల సాఫీగా, రాజకీయ నాయకుల్లా ఠీవిగా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఎన్నడో అంతరించిపోయాయి. పంచాయతీ ఎన్నికలు. మునిసిపల్ ఎన్నికలు. కాలం ముందే కలిసొస్తే నవంబర్‌లో లేదా ఆ తర్వాత అయిదారు నెలల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు. ఒకవేపు కాంగ్రెస్ ఖాళీ అయ్యే సంకేతాలు, మరోవేపు మోసం గుట్టురట్టయిన, అది సామాన్యుడికీ అర్థమయిన ద్రోహ చింతన. కాంగ్రెస్ నేతలు తిరిగే పరిస్థితే లేదు. ఎన్నికపూక్కడ? అందుకే డిగ్గీరాజా ఎవరూ అడగకుండానే పదమూడో కృష్ణుడిలా తెలంగాణను మరోసారి ఓపెన్ చేశాడు. మరోసారి బత్తీ వెలిగింది. బుడ్డరఖాన్‌లు నిజాం కాలేజీలో సభ పెట్టారు. మీసాలు తిప్పారు. తొడలు కొట్టారు. దిగ్విజయ్‌సింగ్‌లో కొందరికి విముక్తి ప్రదాత కనిపించారు. బారులు తీరాయి ఖద్దరులు. చల్ల ని లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ మాట్లాడింది. సరే! అన్నరు.

సమైక్యాంధ్ర చర్చించింది. సరే అన్నరు. ఆ తర్వాత కవిలికట్టెలు తీసుకుని కోర్‌కమిటీ బత్తీ వెలిగింది. రంగస్థలం మీది నాటకానికి తీన్‌మార్ కొట్టిండ్రు. ఒకటే ప్రచారం. చెవులు చిల్లుల మధ్య, తెలంగాణ కలవరింత మధ్య, వచ్చీపోయి, మిఠాయిలు తిన్న జేఏసీల మధ్య సోయి తప్పినవాళ్లు.. సంబురపడ్డారు. పదమూడోసారి మోసపు వధ్యశిల మీద తల ఉంచారు. ఇంగ తెలంగాణ వచ్చుడే. ద్రోహం సమస్యే లేదు. నాన్చు డు లేదు, తేల్చుడే అని డిగ్గీరాజా తాజా మాటలకు చప్పట్లు మోగినయ్. కోర్‌కమిటీ అయిపోయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆశను సరఫరా చేశారు. ఆశ సజీవం. కనీసం పంచాయతీ ఎన్నికల దాకా. ఆశ సజీవం కనీసం మరచిపోయి గాయం కెలుక్కునేదాకా. సోయి తప్పిన వాళ్లు మేల్కొనేదాకా. ఆ తర్వాత ఈ ఆశల దీపం వెలుగుతుంది. అదొక డేంజర్ లైట్. ముద్దుపెట్టుకున్నప్పుడల్లా శలభాలౌతారు మనుషులు. బహుశా వర్కింగ్ కమిటీ మునిసిపల్ ఎన్నికల దాకా దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆనక సమన్వయ కమిటీ. ఆనక ఇంకో కమిటీ ఇంతకీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు. ఇక మీ ఇష్టం. ఇది గుర్రం ఇది మైదానం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు. ఇచ్చేది లేదు. సచ్చేదుందా? లేదా? సచ్చేది ముఖ్యం. ఇవ్వని వాడు సావాలి. ప్రజలు కాదు. ఇవ్వని వాడు వీధుల్లో దోషిలా తిరగాలి ప్రజ లు కాదు. ఇవ్వనివాడు కుంగిపోవాలి. ప్రజలు కాదు. తెలంగాణకు ఒక వారస త్వం ఉంది. తరతరాలు పోరాటంలో గెలుచుకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది. అది తెలంగాణ తెచ్చుకునే దాకా కొనసాగాలి. బస్. అంతే మరేమీ లేదు.

సీడబ్ల్యూసీకి తెలంగాణను కాంగ్రెస్ తొమ్మిదేండ్ల కిందనే పంపింది. మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ, రెండవ ఎస్సార్సీ అని, పీసీసీ దాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టిం ది. తేట తెల్లం. కోర్‌కమిటీ ఆహార భద్రత బిల్లును ఒక్కరోజులో ఫైసలా చేసింది. ఆర్డినెన్స్ అయింది. కోర్‌కమిటీ ఎఫ్‌డీఐలను ఒక్కరోజులో ఖరారు చేసింది. అది అయిపోయింది. కోర్‌కమిటీ తెలంగాణను తేల్చేస్తమని చెప్పీ తేల్చలేకపోయింది. వర్కింగ్ కమిటీకి పంపడమంటే గుడుగుడుగుంచం మళ్లీ మొదటికి... నలభై ఒక్క మంది, బెంగాల్, మహారాష్ట్రల సభ్యుల చిన్న రాష్ట్రాల వ్యతిరేకత, చివరకు తెలంగాణ గడ్డ మీద పుట్టినా బానిస బుద్ధి పోనిచ్చుకోని ప్రత్యేక ఆహ్వానితుడు సంజీవడ్డి వర్కింగ్ కమిటీ ఏమి చెబుతుంది? తెలంగాణ ఎట్లా వస్తుంది. ఇవన్నీ పోని ద్దాం. సోనియాగాంధీ మాట్లాడదు. మౌనముని మన్మోహన్‌సింగూ మాట్లాడడు. రాహుల్‌గాంధీ మాట్లాడడు. ఎట్లా తేలుతుంది.

సరే తేలుతుంది. డిసెంబర్9 గురిం చి అనివార్యంగా ఇప్పుడే మాట్లాడుకోవాలి. అది ప్రభుత్వం కార్యాచరణ. యూపీ ఏ హోంమంత్రి చిదంబరం స్వయంగా ప్రభుత్వం తరఫున చేసిన ప్రకటన. అదే ప్రభుత్వం తరుఫున పార్లమెంటు ఉభయసభల్లో చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ చేసిన ప్రకటన. చట్ట సభలకు గౌరవం ఉంటే ప్రభుత్వ నిర్ణయాలు అమలయ్యే దేశమే అయితే, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమై ఇవ్వాళ్టికి తెలంగాణ రావాల్సి ఉండే. మన మహా ప్రజాస్వామ్య దేశంలో అదే దిక్కులేని దయింది. అదే ఆత్మహత్యలను ప్రేరేపించి, వెయ్యి మందిని బలి తీసుకున్నది. కోర్‌కమిటీయో, వర్కింగ్ కమిటీయో, సమన్వయ కమిటీయో, ఏదో ఒక కమిటీ ఇప్పుడు పబ్బం గడుపుకోవడానికి, తెలంగాణలో తిరగడానికి, పంచాయతీ, మున్సిపల్, సాధారణ ఎన్నికలకు వెళ్లడానికి వీరాడే ఈ భయ భీభత్స రస ప్రధాన నాటకంలో మాత్రం ఏమొస్తుంది. మహా అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది. అని పార్టీ తరఫున ప్రకటిస్తే ఏమి ఒరుగుతుంది. దానికి చిత్తు కాగితం విలువ ఉంటుందా? పార్లమెంటులో ప్రకటనకు, సాక్షాత్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు విలువ లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ప్రకటిస్తే ఎంత? ప్రకటించకపోతే ఎంత? అయి నా దిగ్విజయ్‌సింగ్ స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేసింది. ఎన్నికల సభల్లో మాట్లాడింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చింది. రాష్ట్రపతి ప్రసంగంలో కూర్చింది. అంతకన్నా మించి ఏమి చెబుతారు? ఇంకేమి ఆశను వెలిగిస్తారు.

అయినా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వక పోవడానికి మరే కారణం లేదు. సీమాంవూధులు బలమైన వారు. వాళ్ల పెట్టుబడి బలమైంది. వాళ్ల లాబీయింగ్ బలమైంది. ఎందుకంటే వాళ్లు తెలంగాణను ఆక్రమించి కబ్జాచేసి బకాసురుల్లా బలిసి ఉన్నారు. యూపీఏ ప్రాపంచిక దృక్పథం, యూపీఏ అభివృద్ధి నమూనా తెలంగాణకు అడ్డం గా ఉన్నది. దశాబ్దాల తరబడి పోరాడిన తెలంగాణ సంప్రదాయం యూపీఏకు తెలుసు. అందుకే అది తెలంగాణలో మళ్లీ నక్సల్బరీ పునరుత్థానాలను పసిగడ్తుంది. అణచివేతకు, అన్యాయానికి డైనమెట్ రుచి చూపిన తెలంగాణను తొక్కిపట్టడంలో యూపీఏకు, సీమాంధ్ర పెత్తందారీ ఆధిపత్య అంతర్గత వలసవాదులకు చుట్టరికం కుదిరింది. ఇదే తెలంగాణను అడ్డుకుంటున్నది. ఇదే మన్మోహన్‌సింగ్‌ను మాట్లాడనివ్వకున్నది. దేశంలోనే ప్రజా కంటక విధానాలు, కాకులను కొట్టి గద్దలకు వేసే సరళీకరణ, ప్రైవేటీకరణ , కార్పోరేటీకరణ అమలు పరిచి కోట్ల మంది సామాన్యులను బలివితర్దిల మీదకు ఎక్కిస్తున్న అభివృద్ధి నమూనాలో ఉన్నది. తెలంగాణ అంటే గజ్జుమని వణుకు పుట్టేది అందుకే.

తెలంగాణ ఏ పోరాట లక్షణమైతే వాళ్లను భయపెడ్తున్నదో? అదే పోరాటం కొనసాగవలసి ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చేదేంది? తెలంగాణ కోసం ఢిల్లీ వీధుల్లో దేవిరించుడేంది? ఆశల చుట్టూ మిణుగురులా మాడి పోవుడేంది? ఎట్లాగూ తెగిం చాం. పోరాటంలో ఉన్నాం. అది కొనసాగడం ఒక్కటే మార్గం. లక్షగొంతులు ఒక్క టి కావడమే ఇప్పుడు అవశ్యం. నువ్వు నేను తెలంగాణ నీలిగగన ప్రాంగణాన... కోర్ కమిటీ మోసం తర్వాత నా మనసునిండా ఒక దృశ్యం ఆవరించింది. సుందరయ్య విజ్ఞానకేంవూదంలో అమరుల బంధువుల నీళ్లు నిండిన కళ్లు. అవి నన్ను చూస్తున్నాయి. ఆ కన్నీళ్లకు అర్థం ఉండాలి. పరమార్థం ఉండాలి. తెలంగాణ పోరా టం వచ్చేదాకా కొనసాగాలి.

గమనిక: ఆంధ్ర జేఏసీ విద్యార్థి నాయకుడు ఆడారి కిశోర్ సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ఆత్మహత్యలకు సిద్ధం అన్నాడు. తప్పు కిశోర్. ఆత్మహత్యలు వద్దే వద్దు. అవి తెలంగాణను శోక సంద్రంలో ముంచాయి. అయినా మీ కోసం సోనియాగాంధీ ఉన్నది. రాహుల్‌గాంధీ ఉన్నడు. మన్మోహన్‌సింగ్ ఉన్నడు. దిగ్విజయ్‌సింగ్ ఉన్నడు. కిరణ్‌కుమార్‌డ్డీ, బొత్స సత్యనారాయణ, కేవీపీ, లగడపాటి,రాయపాటి, ఆపాటి, ఈ పాటి ఘనాపాటీలు ఎందరో ఉన్నరు. మా కెవరున్నరు. బుడ్డరఖాన్‌లు తప్ప. వీళ్లంతా చంపే స్థితిలో ఉన్నరు. మీరు మమ్మల్ని అదుపుచేసే స్థితిలో ఉన్నరు. అయినా ఆత్మహత్యలొద్దు. కిశోర్. అందునా సమైక్యాంధ్ర అనే ఒక తప్పు డు భావన కోసం చావు వద్దే వద్దు.

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...