ఆ హత్య ప్రజాస్వామ్యానికి హెచ్చరిక


Sat,July 6, 2013 11:53 PM


పోరాటమే నా ఊపిరి. పోరు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది’ అని గంటి ప్రసాదం వేరే అర్థంలో మాట్లాడి ఉండవచ్చు కానీ, పోరులేని ప్రాంతంలో వేట కొడవళ్లకు, తపంచా తూటాలకు ఆయన ఊపిరి ఆగిపోయింది. ‘ఉద్యమం కోసం నన్ను బతికించండి. నేను బతికేటట్టున్నా’ అని కూడా ప్రసాదం వైద్యులను అడిగినట్టు వార్తలొచ్చాయి. జీవితమంతా విప్లవం కోసం బతికినవాడు గంటి ప్రసాదం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఒకే విశ్వాసంతో జీవించాడాయన. మామిడి అప్పలసూరి, ఇంతా రమణాడ్డి, రవూఫ్ గ్రూపులుగా అప్పుడు పీపుల్స్‌వార్ బయట ఉన్న నక్సల్బరీ గ్రూపుల్లో గంటి ప్రసాదం పేరు అందరికీ సుపరిచితమైనదే. ఆ తర్వాత కాలక్షికమేణా నిమ్మలూరి భాస్కర్‌రావు (అజ్ఞాత సూరీ డు), గంటి ప్రసాదంలు కూడా పీపుల్స్‌వార్‌తో కలిసిపోయారు. క్షణాలను ఎలాస్టిక్‌లా సాగదీస్తానని ఆత్మలను ముట్టిచ్చి వెలిగించే విప్లవాచరణ కవి సంప్రదాయంలో అజ్ఞాతసూరీడు కవిత్వం రాసినవాడు. అంతిమంగా ‘హలో బ్రదర్’ వస్త్ర దుకాణం పెట్టాడని ప్రచారం అయింది. ఆయన లేరు. ఆయన కాగడాల్లా వెలిగించిన క్షణాలూ కాలిపోయాయి. నిమ్మలూరి భాస్కర్‌రావు అనారోగ్యంతో మరణించారు.గంటి ప్రసాదం వేరు. మృత్యుముఖంలో నిలబడి కూడా, చావును ధిక్కరించి వచ్చి విప్లవం కోసం పనిచేయాలని కలతల్లో కలలు గన్న ధీశాలి. పుట్టిబుద్దెరిగిన తర్వాత ఒకే శ్వాస, ఒకే జీవితం.

మావోయిస్టు ఉద్యమం లేనిచోట, కేవలం అప్పు డో ఇప్పుడో పౌరహక్కుల సంఘాలో, విప్లవ రచయితల సంఘమో మాత్రమే తలె త్తి కార్యకలాపాలు నిర్వహించే చోట, విప్లవోద్యమం పుంజుకొని ప్రమాదం ఏర్పడుతుందని కూడా భావించడానికే వీలులేని చోట నెల్లూరులో గంటి ప్రసాదాన్ని క్రూరంగా హత్య చేశారు. ఈ హత్యకు ఆనవాళ్లున్నాయి. ఈ హత్యకు ముందు జరిగిన క్రూరహత్యల చిరునామాలున్నాయి. గద్దర్ మీద జరిగిన దాడి ఉంది. విప్లవోద్యమం ఉధృతంగా సాగిన తెలంగాణలో 1985 సెప్టెంబర్‌లో పిల్లల వైద్యుడు, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు రామనాథం హత్యతో అది ప్రారంభమయింది. ముఖాలు లేనివాళ్లు చేసే ఈ చీకటి హత్యల అధ్యాయం ఎన్టీ రామారావు హయం లో ప్రారంభం అయింది. ఆంధ్రవూపదేశ్ అప్పటిదాకా ఎన్‌కౌంటర్లు, తుపాకులు దొరకడం, పుస్తకాలు దొరకడం, కాల్పుల్లో కేవలం నక్సలైట్లే చనిపోవడం లాంటి అనేక సంఘటనలు అవి ఇక ఉత్త కట్టు కథనాలే అనేస్థాయికి చేరా యి. ఆ తర్వాత ప్రారంభమైన నిర్బంధానికే ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంది. తీవ్రవాదాన్ని నిర్మూలించడం పేరిట ముఖ్యంగా శ్రీలంకలో జనతా విముక్తి పెరమునను అణచివేసిన అనుభవాలు, లాటిన్ అమెరికా దేశాల్లో స్వేచ్ఛా పిపాస కోసం జరిగిన తీవ్రవాద ఉద్యమాలను అణచడంలో అనుసరించిన పద్ధతుల్లో భాగంగా కొత్తకొత్త పద్ధతులు పుట్టుకొచ్చినవి. అవి మిస్సింగ్‌లుగా, మనుషులు హఠాత్తుగా కిడ్నాపయి, మాయమయిపోవడంగా, చివరికి నగ్నంగా, క్రూరంగా, రాజ్యం స్వయంగా తన పోలీసు యంత్రాంగంతో దారుణ హత్యలు చేయడం ఒక పద్ధతిగా ఎదిగింది. అదే పద్ధతి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది.

నిజానికి గంటి ప్రసాదం ఎన్నోవాడు. పదవవాడు. వైద్యుడు రామనాథం, జగిత్యాల వకీలు గోపిరాజన్న, అలుగునూరు స్వాతంత్య్ర సమరయోధుడు, కరీంనగర్ బాపూ జాప లకా్ష్మడ్డి, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్రా ప్రభాకర్‌డ్డి, ఇవన్నీ పోలీసులు చేసిన హత్యలే. కానీ ఏ కేసులోనూ ఎవరికీ శిక్ష పడలేదు. దీనికన్నా విప్లవోద్యమాన్ని అణచడంలో పోలీసులు ప్రత్యక్షంగా చీకటి మాటున చంపడం నుంచి, ఎస్.ఐ.బీలు గ్రేహౌండ్స్ లాంటి పకడ్బందీ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత కోవర్టులు, ఈ కోవర్టులతో మరికొన్ని హత్యలు, అన్నింటికన్నా దారుణంగా దిల్‌సుఖ్‌నగర్‌లో పురుషోత్తంను నరికి చంపిన తీరు, ఆ తర్వాత అత్యంత విషాదంగా పురుషోత్తం సంస్మరణ సభలో పాల్గొన్న ఆజం ఆలీని వేటకొడవళ్లతో నరికి చంపడం, కనకాచారిని నల్లమల కోబ్రాల పేరుతో చంపడం, మహదేవ్‌పూర్‌లో కళింగరావు హత్య ఇవన్నీ అణచివేత పద్ధతులను ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసి, కొత్తకొత్త పథకాలు పన్ని విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించడానికి వ్యక్తులను నిర్మూలించడం ఒక పద్ధతిగా సాగుతున్నది.చాలా సందర్భాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. మావోయిస్టులతో పోలీసు లు, పారామిలటరీ బలగాలు తలపడడం వేరు. అది ఒక యుద్ధం. సమానస్థాయి లో యుద్ధ నియమాల్లో జరిగినంత కాలం అది తప్పెట్లా అవుతుందని చర్చ జరు గుతూ ఉంటుంది.

కానీ విప్లవోద్యమానికి సహకరించినారనే పేరిట పౌరహక్కుల కార్యకర్తలను, బహిరంగ జీవితంలో ఉంటూ ప్రజాసంఘాలను నిర్మించి, ప్రజాస్వామ్య పరిధిలో పోరాడే వాళ్లను దారుణంగా హత్య చేయడం మీదనే జరగాల్సిన చర్చంతా... నిరసనను, భిన్నాభివూపాయాన్ని, ప్రత్యామ్నాయ రాజకీయాలను సహించని ఒక పేరుకుపోయిన అసహనం నుంచి, ఫాసిస్టు పోకడల నుంచి ఇది జరుగుతున్నది. నిజంగానే పౌర సమాజంలో భాగమైన ఇలాంటి వాళ్లను చంపడంతోనే విప్లవోద్యమం ఆగిపోతుందా....28 సంవత్సరాల చరిత్ర ఇది సరికాదని నిరూపించింది.గంటి ప్రసాదం మావోయిస్టు రహస్య జీవితం నుంచి బయటకు వచ్చి, బహిరంగ జీవితంలో కూడా తన అభివూపాయాలను వెల్లడించే, ఆ మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా కార్యాచరణ చేసే హక్కు ఉంటుందా? ఉండదా? నిజానికి మావోయిస్టు పార్టీలో నుంచి బహిరంగ జీవితానికి వచ్చిన తర్వాత అంతకుముందరి తన రాజకీయ చైతన్యాన్ని కొనసాగించుకునే హక్కు ఉంటుందా? ఉండదా? అనేదే కీలక ప్రశ్న. గంటి ప్రసాదం అడవిలో భద్రంగా ఉన్నాడు. అనేకసార్లు మృత్యు ముఖంలోంచి తప్పించుకుని కూడా ఉండవచ్చు. కానీ జనారణ్యంలో ఆయన దారుణంగా హత్యకు గురయ్యాడు. జనారణ్యంలో నిస్సహాయంగా, నిరాయుధుడుగా ఉన్నందుకు ఆయనపై దాడి జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

మావోయిస్టు నిబద్ధత ఉన్నప్పటికీ గంటి ప్రసాదం ఆచరణంతా చట్టపరిధిలోనే ఉంది. మావోయిస్టులు చనిపోయినప్పుడు, చనిపోయిన వారి గౌరవం కోసం ఆయన పనిచేశారు. ఒకసారి చనిపోయిన తర్వాత మనిషి మరెవరికీ శత్రువు కాదు అన్న మామూలు మానవ విలువ, సంప్రదాయంగా మనిషి పుట్టుకను, చావును గౌరవించే ఆలోచన ధార ఉన్న మానవ సమాజం మీద నమ్మకంతో అమరుల బంధుమివూతుల కమిటీలో ఆయన పనిచేశారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే చేశా రు. నిరాయుధంగా చేశారు. మావోయిస్టు ఆలోచనలున్నంత మాత్రాన, ప్రాపంచిక దృక్పథం, భావనలు ఉన్నంత మాత్రాన ఎవరూ నేరస్తులు కాదని స్వయంగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ మేరకు జైళ్లల్లో ఎన్నాళ్లుగా మూలుగుతున్న మావోయిస్టు ఖైదీలకు రాజకీయ ఖైదీలుగా అన్ని హక్కులూ ఉండాలని ఆయన పోరాడారు. అది కూడా మావోయిస్టులకు మెరుగైన భోజనం, ఏ క్లాస్ ప్రపం చం కావాలని కాదు? మౌలికంగానే మావోయిస్టుల ఆలోచనలను, ఆ ఆచరణలో ఉండి బందీలైన వారికి రాజకీయ గుర్తింపు ఇవ్వాలన్నది ఆయన పోరాటం, విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. ఇవేవీ నిషేధిత పనులు కాదు. ఇవన్నీ కాకుండా పీపుల్స్‌వార్‌లో చేరకముందే గంటి ప్రసాదం బొబ్బిలిలో ట్రేడ్ యూనియన్ నాయకుడు.. ఆయన తాత వల్ల ఆయనకు ఆ వారసత్వం వచ్చింది. కుటుంబంలో నుంచి ఆయన సోదరుడు రాజన్న ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారు. మావోయిస్టు పార్టీ అజ్ఞాత ఆచరణకు, బయట ప్రజాస్వామిక వాతావరణంలో పనిచేయడానికి మధ్య ఉన్న విభజన రేఖను గంటి ప్రసాదం లాంటి వాళ్లు అర్థం చేసుకోగలరు. కానీ ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఉండవు.

ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు, ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులకు ముప్పు వచ్చినప్పుడు, ఈ ప్రైవేటు వ్యక్తుల కీలుబొమ్మలు, దళారీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం,దాని స్ఫూర్తి, సూత్రాలు ప్రభుత్వాధినేతలకు కంటగింపుగా కనిపించడమే ఫాసిజం. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామంలో ఉండే హక్కులు, చట్టబద్ధ ఆచరణలు కూడా అసహనం మితిమీరినప్పుడు, కనీస స్వేచ్ఛలను కూడా అనుమతించజాలని సంక్షోభంలో ప్రజాస్వామ్య సౌధాలు కూరుకుపోయినప్పుడు ఫాసిజం తలెత్తి క్రూరమైన రక్తపాతాలు సృష్టిస్తాయి. నిజానికి గంటి ప్రసాదం హత్య ను విడిగా ఒక మావోయిస్టుపార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కార్యాచరణలో ఉన్న కార్యకర్తను చంపడంగా మాత్రమే అర్థం చేసుకోలేము. అది ఒక విడిచర్య కాదు. గంటి ప్రసాదం గ్రీన్‌హంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆర్డీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతున్నారు. అది ప్రమాదం. బహుశా సాయుధులైన మావోయిస్టుల కార్యాచరణకన్న ఈ కార్యాచరణ ప్రమాదకరమైంది అని రాజ్యం భావించి నందువల్లనే ఈ హత్య జరిగింది.

కానీ, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్న వాళ్లకు గంటి ప్రసాదం దారుణ హత్య ఒక హెచ్చరికా? ప్రజాసంఘాల్లో పనిచేసేవారికి ఇది ఏమి సందేశం ఇస్తున్నది. చట్టాల ను, ప్రజాస్వామ్యాన్ని ఆచరించే బాధ్యత ప్రభుత్వాలది. పౌరులు తరచుగా వాటిని ధిక్కరిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు పకడ్బందీగా చేస్తున్న ఇలాంటి హత్యలు వాటి క్రూర ఫాసిస్టు లక్షణాలను పదే పదే వెల్లడిస్తున్నాయి. మధ్య భారతంలో వేలాది ఎంవోయులు కుదుర్చుకుని, దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసి, ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో, ప్రపంచబ్యాంకు, అమెరికా పెద్దన్న విధానాలు బలవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు భారతదేశాన్ని, ఈదేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టి, స్వయంగాసంక్షోభాల్లో కూరుకుపోతున్నాయి. గంటి ప్రసాదం వారికి మింగుడు పడడు అందుకే చీకటి హత్య.సాంబశివుడు అడవిలో భద్రంగా ఉన్నాడు. బయటికొచ్చి వేటకుక్కల కొడవళ్లకు బలయ్యాడు. గంటి ప్రసాదమూ అంతే. అడవిలో భద్రంగా ఉన్నాడు. ఆయన కూడా తోడేళ్లకు బలయ్యాడు. గంటి ప్రసాదం వ్యక్తిగత స్వార్థాన్ని, ప్రయోజనాలను జయించిన సామూహిక మానవుడు.

ఆయనకు వ్యక్తిగత శత్రువులు ఉండే అవకా శమే లేదు. ఇక ఆయనను చంపిన వాళ్లు ఎవరై ఉంటారనే మీమాంసే అక్కరలేదు. చూపుడు వేళ్లు రాజ్యంవైపే చూపిస్తున్నాయి. ఏ బస్టాండులోనో, ఏ సమావేశ మందిరం దగ్గరో, ఏ గుంపులోనో, ఏ హోటల్‌లోనో, ఏ రైల్వే స్టేషన్‌లోనో, ఆస్పవూతిలోనో, ఒంటరిగా, నిరాయుధంగా జాగరూకత లేకుండా, ఉండే ప్రజాసంఘాల, పౌరహక్కుల కార్యకర్తలను చంపితే వెన్నులో భయం వ్యాపిస్తుంటుంది. నిస్సహాయంగా, దిక్కుతోచనట్టుగా అనిపిస్తుంటుంది. ప్రజాస్వామ్యం మీద లక్షల సందేహాలూ పుడ్తాయి. ఉద్యమం లేని ప్రాంతంలో, రాష్ట్రంలో విప్లవోద్యమం వెనుకంజ వేసిన కాలంలో, కిరణ్‌కుమార్‌డ్డికి ఇటువంటి ఏ మరకా ఇంతకు ముందు అంట ని కాలంలో జరిగిన గంటి ప్రసాదం హత్య భయపెడ్తున్నది. ఇది యాధృచ్ఛికమా? కానే కాదు. నడుస్తున్న ఉద్యమాలకు ఇది ఒక హెచ్చరిక. ఏ సంఘటనా విడిగా ఉండదు. విడిగా జరగదు. గంటి ప్రసాదం హత్యను నిరసించి, నిలబడకపోతే రేపు ఎవరూ, ఏ హక్కునూ, ఏ అస్తిత్వాన్ని అడగలేరు. మాట్లాడలేరు. బహుపరాక్.

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...