విధ్వంస సార్వభౌముడు


Wed,July 27, 2011 09:31 PM

అల్లం నారాయణ


a-narayanaఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్‌షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ప్రోత్సహించినారన్న విషయమూ తెలియదు. సురవరం ప్రతాప్‌డ్డి అన్నట్టు ‘మనమూ చరివూతకు ఎక్కదగినవారమే’ అనీ తెలియదు. ఎందువల్ల. మనం చరివూతకు ఎక్కలేదు కను క. ట్యాంక్‌బండ్ మీద మనది కాని మన చరిత్ర పీఠమేసుకొని కూచున్నది కనుక. ఈ పీఠాలన్నీ వేసి మరీ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు సంస్కృతిని ఎన్.టి.రామారావు నిలబెట్టారు కనుక. అవును ఇబురాముడును తెలియని తెలంగాణకు ఎన్టీఆర్ మాత్రమే ఎందుకు తెలిసినట్టు? మా కరీంనగర్‌కు వెళ్తున్నప్పుడు అలుగునూరు వంతెన దాటినాక తన వేలుతో దారి చూపుతూ ఎన్టీఆర్ ఎందుకు? నిలబడినట్టు? అంతదాకా అయితే ఎన్టీఆర్ సీఎం కానీ కరీంనగర్‌లో పుట్టిన పీవీ ప్రధాని కదా? నాకేమీ ప్రేమ లేదు కానీ జిల్లావాడు కదా! ఆయన ఏమైపోయినట్టు? ఊహాచివూతాలు గానీ, రూప విశేషాలు గానీ లేని కవుపూవరో సమూహంలాగా కొలువుదీరి ఉన్న ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల సంగతి సరే.

ఎన్టీఆర్ హైదరాబాద్ వాడవాడనా ఎందుకున్నట్టు? ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మార్గ్, ఎటుచూస్తే అటు ఎన్టీఆర్ ఎందుకు? పరివ్యాప్తమైనట్టు? ఉత్తగనే జరిగిందా? తెలుగుదేశం పరాధీన, బానిస నాయకత్వం మాట్లాడ్తున్నది. ఏం చేసిం డు ఎన్టీఆర్. ధవళేశ్వరం ఆనకట్ట కట్టి ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఎటు కాకుండా చేసిన సర్ ఆర్ధర్ కాటన్ తెలంగాణకు వెలుగెందుకయ్యిండు? అయినా సరే, మన పాఖాల, మన రామప్ప, మన ధర్మసాగరం, అద్భుతమైన తటాకాలు నిర్మించిన కేతమ నాయకుడు కనీసం ఎందుకు తెలియడు? ఎన్టీఆర్ ఏం మంత్రమేసి ఉంటారు? దేవేందర్‌గౌడ్! ఏం మాయ చేసి ఉంటారు. కడియం శ్రీహరి, ఏం మత్తు చల్లి ఉంటారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. తెలంగాణ గురించి మీకూ ఎందుకు? తెలియకుండా పోయినట్టు? తెలుగు వైభవాన్ని పునరుద్ధరించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాల క్రింద నలిగి నీలిగిన ఆత్మల ఘోష. అది తెలంగాణ చరిత్ర గోస.


ఎన్టీఆర్ వచ్చినంక కదా! ‘తెలుగు జాతి మనది’ వచ్చింది. తెలుగు జాతి మనది అనుకున్నంక కదా! ఇవ్వాళ్ల తెలంగాణ ఇల్లలికిన ఈగ అయింది. పేరు తెల్వని, ఊరు తెల్వని ఒక మైమరపు. చరివూతను ఎవరు ధ్వంసం చేశారు. నిజాంసాగర్‌కు నిజాం ఫర్మానతో విచ్చేసిన పాత తరపు బైతు కాదు ఆంధ్ర వలసవాది. అతనిప్పుడు ఒక వ్యవస్థీకృత ప్రపంచపెట్టుబడిదారు. లగడపాటి, రాయపాటి, కావూరి, జీఎంఆర్, జీవీకే, రామోజీ, రామలింగరాజు, అంజిడ్డి, అరబిందోలు ఎక్కడివని? ఏ కంపెనీలు పోతే ఈ కంపెనీలు మొలిసినయని వీటి పుణ్యం మీ రెండు కళ్ల చంద్రబాబు ఆయన మామ పుణ్యం కాదా? నిజాంసాగర్ ప్రాజెక్టు కింద పంటలు పండించుకోవడానికి వచ్చిన వాడు కాదు. ఇవ్వా ళ్టి వ్యవస్థీకృత దోపిడీదారు. హైదరాబాద్‌ను చాపచుట్టలా చుట్టి రాజ్యమేలుతున్న వలసవాది. అమెరికాకు కన్నుగీట గలవాడు. జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని కలెగలిపి సరుకుగా అమ్ముకోగలిగినవాడు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ కొనగలడు. నడిబజార్లో అమ్మగలడు. ఢిల్లీని ఒక్కరోజులో తారుమారు చేసి ఆటాడించి ఆడిన మాటను తప్పేలా చెయ్యగలడు. నిజాం అవసరాల కోసమో, హైదరాబాద్‌పై దండయాత్ర చేసిన యూనియన్ సైన్యాల ప్రతినిధి వెల్లోడి కోసమో వచ్చిన ఇంగ్లీషు అంధ్ర ఉద్యోగి కాదు ఇప్పటి వలసవాది. అతనిప్పుడు నడమంవూతపు సిరిలో, కన్సార్షియాలు, పర్పస్ వెహికిల్‌లూ రాచబాటలుగా, ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన ధనమదాం ధ్ర దురహంకారి. ఇదంతా కేవలం ఒక నాలుగు దశాబ్దాల చరిత్ర. మూడు దశాబ్దాల క్రింద గదా తెలుగుదేశం మిత్రులారా! ఎన్టీఆర్ ఈ నయా కార్పొరేట్ దోపిడీగాళ్ల రూపురేఖలను పిండస్థ దశలో నిర్మాణం చేసింది.

ఇంతకీ ఎన్టీఆర్ మనవాడా? పరాయివాడా? ఆవేశంగానో, నామమావూతంగానో ఉన్న ఆ ఒక్క ప్రాంతీయ మండలిని చెక్‌లు వద్దు, కౌంటర్ చెక్‌లు వద్దని పీకి పారేసిన ఘనత వహించిన తెలంగాణ అభివృద్ధి కాముకుడు, తెలుగు జాతి వల్లభుడు. అప్పట్నించి కదా! ధాతు, ఫిర్యాదు కూడా నమోదుకాని ఒక అరాచకం రాజ్యమేలింది. సర్ఫెకాస్‌లు, సబ్బండవర్ణాల భూములు అప్పుడు కదా! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ అవడానికి బీజాలుపడింది. తెలంగాణ అభివృద్ధి నిధుల కోతలు, కోస్తాంవూధకు నిధుల తరలింపులు అప్పుడు కదా! రాచనడకన తరలిపోయినయి! నో చెక్. నిజమే తెలుగు వారమందర మూ ఒక్కరమే. కానీ ఒక్కటి చెప్పండి.

నా తెలంగాణ తెలుగుదేశం మిత్రులారా! కన్నొంకర, కాలొంకర, నల్లగొండ బతుకులే వంకర చేసిన ఫ్లోరైడ్ భూతం వెంటాడిన నల్లగొండ ఎడమ కాలువ ఎందుకు కునారిల్లింది. కుడి కాలువ ఎందుకు విశాలమై తెలుగుగంగ, హంద్రినీవా, గాలేరు, నగరి మున్నూటాయాభై టీఎంసీలు పారే జల ప్రవాహమైంది? ఎన్టీఆర్ అనే ఒక మహానుభావుడి వల్ల కదా! మిత్రులారా ! అసలు ఎడమ కాలువ ఒకటి ఉందా? ఎలిమినేటి మాధవడ్డి కాలువ ఎంత? ఎవరి వ్యూహం ఇది. ఎన్ని చెప్పమంటారు. ఎన్టీఆర్ పుణ్యాలు. నిజాం చక్కెర ఫ్యాక్టరీకి ఏమయింంది. ఇప్పుడది ఏ కోస్తాంధ్ర గుత్తపెట్టుబడి దారీ బడా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంది. తెలంగాణలో 12 పాల శీతలీకరణ కేంద్రాలు , పాల ధార ఏమయింది. మామ మూసేసిండు. అల్లు డు హెరి దుక్నం తెరిచిండు.

రియల్ ఎస్టేట్ , సంస్కరణలు, అన్ని గడపలకన్నా మా గడపమేలన్న సాంస్కృతిక పెత్తనపు మీడి యా, సినీమాయ దరుహంకారం. బ్రహ్మానందడ్డి బ్రహ్మాండం గా అభివృద్ధి చేస్తానన్నా రాని సినిమా రంగం, ఎన్టీఆర్ వచ్చినంక కదా! ఇక్కడ ఇక మనం రాజ్యమేలవచ్చునని దూసుకొచ్చింది. వాళ్లొచ్చినంక గదా! మనం నర్సింగ్‌లుగా, శకుంతలలుగా దిగజారింది. రౌడీలకూ, గూండాలకూ, అనాగరికులకూ, అజ్ఞానుల కూ ప్రతిరూపం అయింది. సంస్కృతమో, ఆంగ్లమో కలిసిన ఆంధ్రము విరాజిల్లి సొబగులద్దిన తెలంగాణ భాష తనను తాను దాచుకున్నది అన్న వచ్చినంకనే కదా! ఎన్ని చెప్పమంటారు? ఓపెన్ యూనివర్సిటీ నల్లగొండ నుంచి హైదరాబాద్ రాష్ట్ర విశ్వవిద్యాలయం అయి ఎందుకు వచ్చింది? హెల్త్ యూనివర్సిటీ మాత్రం విజయవాడకు ఎందుకు తరలింది? పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ఎందుకుంది? జవాబు చెప్పగల రా? ఎన్టీఆర్ భక్తులారా! ఆరేసుకోబోయి, పారేసుకున్న అద్భుత నట శిఖామణి తెలుగు జాతి వైభవంలో మంట కలిసింది కదా! తెలంగాణ.

ఏం మిగిలింది? తెలంగాణకు. మామ తెలంగాణను ఆక్రమిత ప్రాంతంగా చేసుకుని, కులీ కుతుబ్ షా కట్టిచ్చిన హైదరాబాద్‌ను అమ్మేసుకుని ట్యాంక్‌బండ్ కట్టను కట్టిన ‘హుస్సేన్ షా వలీ’ ఆత్మను మలిన పరిచి ట్యాంక్ బండ్ మీద ఊరేగించిన అన్ని విగ్రహాల మతలబు తెలియదా? హఠాత్తుగా ఎన్టీఆర్ జాతి గౌర వం వల్ల కాదా! ట్యాంక్‌బండ్ మీద పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి తెలుగు జాతి నివాళులు ప్రారంభం అయింది నవంబర్ 1 కదా! తెలంగాణకు విద్రోహ దినం నవంబర్ ఒకటి కదా! ఒక స్వతంత్ర రాష్ట్రాన్ని కుట్రలూ కుహకాలతో ఆంధ్రప్రదేశ్ చేసింది. తెలంగాణ కు విద్రోహం అయిన నవంబర్ ఒకటిని ఎన్టీఆర్ పండుగ ఎందుకు చేసినట్టు?అంతా తేటతెల్లమే. ఎన్టీఆర్ తెలంగాణకు శత్రువే. తెలంగాణ అరిగోసలకు ఆద్యుడు ఎన్టీఆర్ అయి తే, ఆయన అల్లుడు అసలు తెలంగాణ పదమే ఉచ్ఛరించనివ్వని నాయకుడు. ఎందుకు ఇంకా ‘కొలువా... కుమ్మరియ్యా’.

స్వయంపాలన కోసం జరిగే పోరాటంలో బానిస లు పనికిరారు. బానిస జాతి బానిసత్వం మూలాలు తెలుసుకోకుండా విముక్తి కాలేదు. నా తెలంగాణ తెలుగుదేశం మిత్రులారా! తేల్చుకోండి. ఇంతకీ రెండు కళ్ళ చంద్రబాబు. చిత్తూరు మనిషి. తెలంగాణ తెచ్చుకున్నంక ఆయనే మీ ముఖ్యమంత్రా.. అప్పుడు స్వీయ అస్తి త్వ రాజకీయం ఎక్కడ? ఎందుకీ బాంచెతనం. ఇక చాలదా! ఎన్టీఆర్ ఆగమనమే ఒకప్పటి వలసాధిపత్యాన్ని పతాక స్థాయికి చేర్చే బాటలు వేసింది. తెలంగాణ చరివూతను, భాషను, సంస్కృతిని ధ్వంసం చేసింది. విగ్ర హ విధ్వంసం జరిగింది. ఇక చాలు. ఎటో ఒక దిక్కు న్యాయం ఉంటుంది. మనుషుల విధ్వంసం జరగకముందే మేల్కొందాం.

39

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...