ఆత్మీయరథం..స్వేచ్ఛ..సమానత్వం


Sun,June 23, 2013 12:28 AM


స్వేచ్ఛ ఒక దుకాణం కాదు
ఒక అయ్య మూయడానికి
ఒక అయ్య తెరవడానికి...

ఇది సచ్చిదానందన్ కవితా పాదం. నాకు ఇష్టమైన కవిత. స్వేచ్ఛ కూడా పరమ సత్యం కానట్టే సాపేక్షిక విలువగా తయారుకావడం, స్వేచ్ఛకు ముఖ్యంగా భావవూపకటనా స్వేచ్ఛకు సంబంధించిన పరిమితులు, విశృంఖలతల గురించి చర్చ జరుగుతున్నదం స్వేచ్ఛను ఎటంటే అటు తిప్పుకుంటున్న శక్తులు, స్వేచ్ఛను దుర్వినియో గం చేస్తున్న శక్తులు, స్వేచ్ఛను అణచివేస్తున్న శక్తులు, స్వేచ్ఛను కోల్పోతున్న శక్తుల మధ్య సంఘర్షణ జరుగుతున్న సంక్షుభిత కాలంలో మనం జీవిస్తున్నామని లెక్క. నిజానికి ఫ్రెంచ్ విప్లవ ఫలాలు, సౌభ్రాతృత్వం, సమానత్వం అన్న విలువలను విస్మరించి స్వేచ్ఛను నిర్వచించుకోవడమూ, అన్వయించుకోవడమూ పాక్షిక దృక్పథమే. ఇవ్వాల్టి ఆంధ్రవూపదేశ్ స్థితి, అందునా తెలంగాణ అసమాన అనుభవాల దుస్థితిని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.నిజానికి ఆంధ్రవూపదేశ్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన స్థితిలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛల గురించి మాట్లాడుకోవాల్సే ఉన్నది. పైకి కనిపించినంత సులభంగా వీటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. స్వేచ్ఛ వినియోగం, దుర్వినియో గం, అణచివేత అనేవి ఒక దాని వెంట ఒకటి జరిగే చర్య, ప్రతి చర్యల చట్రంలోకి చేరినప్పుడు వాటిని స్వేచ్ఛకు ముడిపెట్టి మాట్లాడడమూ సబబు కాదు.

నమస్తే తెలంగాణ ఒక విధానం ప్రకారంగా వేరు తెలంగాణ కోరుకుంటున్నది. తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షగానూ, వలస పెత్తనంలో కునారిల్లిన తెలంగాణ సాంస్కృతిక వైభవ చిహ్నంగానూ, ఆత్మగౌరవ పతాకగానూ పత్రిక పుట్టింది. పెరిగింది. నిరాటంకంగా తెలంగాణ ఆత్మ సంభాషణలను రికార్డు చేస్తున్న ది. వేరు తెలంగాణ కోరుకోవడం ఒక రాజ్యాంగ హక్కు. పూర్తి ప్రజాస్వామిక హక్కు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 దీనికి మూలాధారం. డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది’ అని చేసిన ప్రకటనల మేరకే వేరు తెలంగాణ స్ఫూర్తితో నమస్తే తెలంగాణ నడుస్తున్నది. అట్లని సీమాంధ్ర అని ఇవ్వాళ కలిపి వాడుకుంటున్న కోస్తా, రాయలసీమ జిల్లాల సామాన్య ప్రజల పట్ల గానీ, పత్రిక కాబట్టి సామాన్య పాఠకుల పట్ల గానీ పత్రికకు ఎలాంటి విద్వేషం లేదు. తెలంగాణ కు అడ్డుపడ్తున్న గుప్పెడుమంది పెట్టుబడిదారులపై తెలంగాణ ప్రజలందరికీ ఉండే అభివూపాయమే పత్రికకూ ఉంది. నిజానికి విభజన అనివార్యమైంది. విలీనం బలవంతంగా జరిగినప్పటి నుంచీ ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కాదని తెలంగాణను కలుపుకొని ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేసినప్పటి నుంచీ తక్కువ స్థాయిలోనో, తీవ్ర స్థాయిలోనో తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షలు ఉనికిలో ఉంటూ పదేపదే బహిర్గతమవుతున్నాయి. కానీ విలీనం జరిగిన తర్వాతి పరిణామాల్లో తెలంగాణ ఒక అంతర్గత వలస ప్రాంతమయింది. ఆధిపత్యం ఊడలు దిగి స్థిరపడింది. అది చరివూతనూ, సంస్కృతినీ, బతుకు తెరువును, స్వేచ్ఛా భావనలను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వా న్ని దెబ్బతీసింది. తెలంగాణను సీమాంధ్ర పెత్తందారీతనం ఆక్రమించుకున్నది.

ఊపిరి సలపనివ్వని ఆధిపత్యం కింద, తెలంగాణ అంతులేని వివక్షలను ఎదుర్కున్న ది. అయినా ఈ ఆధిపత్యానికి కారకులు, ఆధిపత్యం, అధికారంగా విలసిల్లి, ఆక్రమి త ప్రాంతంగా తెలంగాణ తయారు కావడానికి కారకులు ఆంధ్ర ప్రాంతపు సామాన్య జనులు కాదన్నదే నమస్తే తెలంగాణ అభివూపాయం. అందుకే ఆంధ్ర ప్రాంతపు సామా న్య జనంతో సంభాషించాలన్న లక్ష్యంతో ‘విభజన వికాసానికే’, ‘విడిపోయి కలిసుందాం’ అని అక్కడి సామాన్యులతో సంభాషించడానికి ఒక ప్రయత్నం చెయ్యాలని నమస్తే తెలంగాణ భావించింది.తెలంగాణ విడిపోతే నీళ్లు రావు, పైన నీళ్లను అడ్డుకుంటారు. డెల్టా ఎడారే. హైదరాబాద్‌ను మనం అభివృద్ధి చేసినం, దాన్ని వదులుకొని తెలంగాణ ఇస్తే రాజధాని ఏది? అసలు అభివృద్ధి అంతా అక్కడే జరిగింది, విభజన జరిగితే మన నోట్లో మన్నే గతి అని తెలంగాణ వ్యతిరేక శక్తులు చేస్తున్న వాదనలు ఎక్కువ ఊహలు, అపోహలతో కూడుకున్నవి. తమ స్వార్థపర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, హైదరాబాద్‌ను ఆక్రమించుకుని పెంచుకున్న పెట్టుబడులు, అంతిమంగా సంపాదించుకున్న అధికార పీఠాలు కదిలిపోతాయని భావించిన కొందరు పెత్తందారులే ఈ అపోహలు, అభూత కల్పనలు కల్పిస్తున్నారని నమస్తే తెలంగాణ అర్థం చేసుకున్నది. తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనల్లో డొల్లతనాన్ని గమనించినందు వల్లనే ఈ అపోహలను బద్దలు కొట్టడానికి నమస్తే తెలంగాణ నడుం కట్టింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పడినప్పటి జనాభాకు ఇప్పటికీ పోలికే లేదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలలో పరిపాలనా సౌలభ్యం ఎంత వాస్తవమో చెప్పాలనుకున్నది.

విభజన వికాసానికే అన్న వాదనల్లో ప్రధానంగా తీర ప్రాంతం, రేవులు, నౌకాయానం, సమృద్ధిగా వనరులు, నీళ్లు నిధులు ఉన్న ప్రాంతం. సీమాంధ్ర విడిపోతే ఎంత సుసంపన్నం అవుతుందో? ఒక రాజధాని ఆ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకు అలాగే నీళ్లు ఆపడం ఎంత అబద్ధమో సవివరంగా, గణాంకాల ఆధారంగా, నియమ నిబంధనలు ఆధారంగా సవివరమైన వార్తాకథనాలు తయారుచేసి, అపోహలు తొలగించి ఇప్పటికే ఆ ప్రాంతంలో సామాన్య జనాల్లో ఉన్న జై ఆంధ్ర భావనలు, ముఖ్యంగా దళితులు, ఇతర ప్రగతిశీల శక్తుల్లో ఉన్న వేరు రాష్ట్ర భావనలకు తోడు సామాన్యులకు నిజానిజాలు చెప్పాలని నమస్తే తెలంగాణ శుక్రవారం నాడు ‘ఒక ఆత్మీయ యాత్ర’ను ప్రారంభించింది. రాజ్యాంగబద్ధమైన ఒక డిమాండ్ మీద, సానుకూల వాదనలతో, ఒక్క ముక్కా ‘విద్వేషం’లేని నాలుగు పేజీ ల ప్రత్యేక అనుబంధంతో ఆంధ్ర ప్రాంతానికి నమస్తే తెలంగాణ రథం బయలుదేరింది. కానీ కోదాడ దాటి జగ్గయ్యపేట దాకా వెళ్లగానే ఈ ఆత్మీయ రథానికి ఆంక్షలు అడ్డుతగిలాయి. పోలీసులు అనుమతి అడిగారు. ఈ రథం బయలు దేరేటప్పుడు డీజీపీని సంప్రదిస్తే అనుమతి ఇవ్వలేమని అన్నారు. అనుమతి లేనందువల్ల, ఇక్కడ ఏమైనా జరుగుతుందని పోలీసులు ముందూ వెనకా రక్షణగా విజయవాడకు తీసుకు అక్కడిదాకా ఆత్మీయ రథం పత్రికలు పంచరాదని ఆంక్షలు పెట్టారు. విజయవాడలో కొంత టైమ్ ఇచ్చి పత్రిక పంచుకోమన్నారు. ఇప్పుడు ఆత్మీయరథం విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ‘భవూదం’గా ఉన్నది. స్వేచ్ఛలాగానే? చాలా భద్రంగా. విజయవాడలో ముందు రెండు పోలీసు వాహనాలు, వెనుక రెండు పోలీసు వాహనాల మధ్య ‘నమస్తే తెలంగాణ’ ఆత్మీయత కోసం అల్లాడి, పరిమితుల మధ్య బిక్కు బిక్కుమంటూ పత్రిక పంచుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. ఇక్కడ కొంచెం స్వేచ్ఛ గురించి మాట్లాడు కోవాలి. స్వేచ్ఛ ఒక అయ్య ముయ్యడం, ఒక అయ్య తెరవడం గురించి మాట్లాడుకోవాలి.

సమానత్వం గురించి కూడా.నిజనికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న, అదీ ఉధృతంగా జరుగుతున్న ప్రాంతంలో అందరికంటే స్వేచ్ఛగా అనేక ఆంధ్ర పేరిట పత్రికలు, ఈనాడులు, సాక్షి లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పంచుకోగలిగినప్పుడు, వాటి పంపిణీ వాహనాలు ఏ పోలీసు పరిమితులూ, ఆంక్షలూ, ఒకించుక అవమాన భారాలు లేకుండా స్వేచ్ఛగా తిరుగాడుతున్నప్పుడు.. ఆంధ్రవూపదేశ్‌లో, విశాలాంవూధలో భాగమైన విజయవాడలో నమస్తే తెలంగాణ పత్రిక- పూర్తి సదుద్దేశంతో విభజిస్తే ఆంధ్రవూపాంతం బాగుపడుతుందని రుజువులతో తయారు చేసిన పత్రిక ఎందుకు ఆంక్షలు ఎదుర్కొంటుం ది? ఎందుకు పరిమితులు ఉంటాయి. ఆంధ్రవూపదేశ్‌లో భాగం అయిన తెలంగాణ ప్రాంతం మొత్తం యథేచ్ఛగా ఇతర పత్రికలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆంధ్ర, ఆధిపత్యవాదనలకు డబ్బాకొట్టి వినిపించే పత్రికలు,అంతిమంగా,అన్నిరకాలుగా ఆంధ్ర, ఆధిపత్యాన్ని, ఆంధ్రవూపదేశ్ అనే భావనను, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పూర్తిగా సమర్థించే పత్రికలను తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు. విశాల వాదులు, అభ్యుదయ కాముకులు, ప్రగతిశీలురు, అయిన అభివృద్ధి చెందిన ప్రాం తంలో నమస్తే తెలంగాణ పత్రిక ఎందుకు ఆంక్షల మధ్య పంపిణీ చేయాలి? ఇదీ సమస్య. ఇంతకీ ప్రజాస్వామ్య వాదుపూవరు?

ఆంధ్ర ఆధిపత్యం నిలవడానికి, తొలినాళ్లలో సినీ మీడియా, ఇప్పుడు రకరకాల ఆంధ్ర మీడియా, చానళ్లు ప్రధాన కారణమని ప్రొఫెసర్ జయశంకర్ లక్షసార్లు చెప్పేవారు. అది మనల్ని ధ్వంసం చేసింది. గూండాలను చేసింది. దాదాలను చేసింది. భాష రాని వాళ్లను చేసింది. సంస్కారం లేనివాళ్లను చేసింది. నిమ్నులను చేసింది. చరివూతలను తారుమారు చేసింది. గురువిందలాగా ‘నైస్ నైస్’గా మెత్తని కత్తివలె సర్రున తెగటార్చిన తెలంగాణ బతుకు ఛిద్రాలకు కారకులైన వారిని, విధ్వంసానికి కారకులైన వారిని, చివరికి రెండవ శ్రేణి పౌరులను చేసిన వారిని ఆకాశానికెత్తింది. యాక్టర్లూ వాళ్లే.. డాక్టర్లూ వారే. నేతలూ వాళ్లే. మహానేతలూ వాళ్లే. భూమిని చాపచుట్టగా చుట్టి ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్లను గంపకింద కమ్మి భూమిపువూతుల చిన్న వ్యవహారాలను పతాకశీర్షికలకెక్కించి ఇరికించింది. లుకలుకలను, మహామహా నేరగాళ్లను, నేరగాళ్లైన నేతలను, అంగుష్ట మాత్రులను ఆకాశానికి ఎత్తి, తెలంగాణ నెత్తి మీద రుద్ది, ఇక్కడి నేతలను అంగుష్ట మాత్రులు చేయడానికి అడ్డగో లు బాగోతపు వేషాలు వేసింది.

అయినా తెలంగాణలో ఇదే మీడియా ఏ పోలీసు కాపలా లేకుండా, ఏఆంక్షలూ లేకుండా నడుస్తున్నది. నీతులు చెబుతున్నది. మాట్లా డుతున్నది. ఆధిపత్యాన్ని పెంచి పోషించింది. రాజ్యమేలుతున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు కోవాలి. ఇప్పుడు స్వేచ్ఛ, ముఖ్యంగా భావవూపకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడు కోవాలి. తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతిలో ఉన్నదా? నీ స్వేచ్ఛ కోసం ప్రాణమిస్తున్నదా? స్వేచ్ఛను అణచివేసి, దాడులు చేస్తున్నదా? ఇప్పు డు చెప్పగలగాలి. విద్వేషపు రాతలతో ప్రెస్‌క్లబ్‌లల్లో విషం కక్కిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలి. పిడుక్కీ, బియ్యానికి ఒకే నమూనా అనే సంఘాలూ మాట్లాడాలి. అసమానతల నేపథ్యంలో, విభజన అనివార్యమైన నేపథ్యంలో ఏ ప్రాంతంలో స్వేచ్ఛ పరిఢవిల్లుతున్నదీ? ఏ ప్రాంతం ఆంక్షల్లో ఉన్నదీ.. స్వేచ్ఛకు పోలీసు భద్రత ఏ ప్రాంతంలో అవసరమవుతున్నదీ చెప్పగలగాలి. స్వేచ్ఛ సమభావం కాదు. అది కీలు మార్పిడిలా ఎటు తిప్పితే అటు తిరిగే ఒక పాక్షిక విలువ.

నిజానికి ‘విభజన వికాసానికే’అన్న నాలుగు పేజీల ప్రత్యేక అనుబంధాన్ని చూసి చాలామంది తెలంగాణవాదులు ఈ ప్రయత్నం బాగుంది. ఉభయ ప్రాంతాలూ, సామరస్యంగా ఈ సంక్లిష్టత నుంచి బయటపడాలంటే ఒక సంభాషణ అవసరం. అది మీరు చేస్తున్నారు. అభినందనలు అన్నారు. మా సీఎండీ లక్ష్మీరాజం ఆలోచ నా అదే. విభజన అనివార్యమయినప్పుడు, సామరస్యంగా విడిపోవడం, అందుకు అవతలి ప్రాంతంతో వారి సానుకూల అంశాలను చర్చించడం అవసరమన్నదే ఆయన అభివూపాయం. కానీ స్వేచ్ఛ, ఆంక్షల నేపథ్యంలో పక్కా తెలంగాణవాది దేవులపల్లి ప్రభాకర్‌రావు అభివూపాయాలు ఇక్కడ ప్రస్తావించాలి. ‘నారాయణ గారూ మీరు ఆంధ్రా ప్రాంతం విడిపోతే అద్భుతాలు జరుగుతాయంటున్నారు. ఇది నాకు ఆంధ్రవూపదేశ్ ఏర్పడక ముందు అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి లాంటి వాళ్లు ఆంధ్రతో కలిస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. అక్కడ నదులున్నా యి, నీళ్లున్నాయి, సముద్రం ఉంది అని చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణకు జరిగిన లక్ష అన్యాయాలు గుర్తొస్తున్నాయి.

వాళ్లు కలవడాని కి చెబితే మీరు విడిపోతే వికాసం అని చెబుతున్నారు. ఇదేమి సబబు? అని ప్రశ్నించారు. నిజమేనేమో. అన్నీ ఉన్నందుకే పెట్టుబడి విస్తరణకు, హైదరాబాద్‌కు స్వేచ్ఛ గా వచ్చి, ఎత్తులు, జిత్తులుచేసి విలీనం చేసుకున్న వాళ్లు ఈ మాటలు నమ్ముతారా! నమ్మరు. కానీ... విభజన అనివార్యమే. ఇది ఎప్పటికైనా.. ఎన్నటి కైనా.. ఎట్లాగైనా జరగాల్సిందే. నమస్తే తెలంగాణకు సీమాంధ్ర సామాన్య పాఠకుల మీద, జనం మీద నమ్మకం ఉంది. స్వేచ్ఛను కాపాడుకోవడం, వినియోగించుకోవడం, ఆ పరిధిలో ప్రజాస్వా మ్య పద్ధతుల్లో ఇతర ప్రాంతపు సామాన్య జనంతో సంభాషించడం విభజనకు సానుకూల ప్రతిఫలం ఇస్తుందని నమ్ముతున్నది. ఆంక్షలు ధిక్కరించి కోస్తాంవూధలోఆత్మీయ రథం తిరుగుతుంది. అక్కడి తెలుగు ప్రజలకు వాస్తవాలు వివరిస్తుంది. అంతిమ విజయం నిజమైన స్వేచ్ఛదే. స్వేచ్ఛ అడుక్కుంటే ఇచ్చేది కాదు. తీసుకుంటే గుంజుకుంటే వచ్చేది. ‘నమస్తే తెలంగాణ’ను అడ్డుకుంటే తెలంగాణలో జరిగే విపరిణామాలకు వాళ్లదే బాధ్యత అవుతుంది. ఇదొక సున్నితాంశం. ఆంధ్రులు విజ్ఞతతో ఆలోచిస్తారని ఆశించడంలో తప్పేమీ లేదు. నమస్తే తెలంగాణ. జై తెలంగాణ.. జై ఆంధ్ర..

-అల్లం నారాయణ
[email protected]
(స్వేచ్ఛ కోసం ధిక్కరణ తెలంగాణ ఊపిరి)

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles