డెడ్‌లైన్లు.. డెత్‌లైన్లు.. ప్రజాస్వామ్యం


Sat,June 1, 2013 11:56 PM


తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్లు పెట్టే సాహసం చెయ్యవద్దన్నడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. ఇది పలుకుబట్టిన కిరణ్ సాహసోపేతమైన ప్రకటన. ఒక్క రూపాయి ఇవ్వను ఏమి చేసుకుంటావో చేస్కో, బయ్యా రం ఉక్కు జీవో రద్దు చేయనుగాను చేయను. అనంతరం కిరణ్‌కుమార్‌డ్డి ఈ మాట అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలంగాణ వ్యతిరేకతను ఆయన దాచుకోవ డం లేదు. మధ్యస్థంగా అటూ ఇటు గాని మాటలూ మాట్లాడడం లేదు. తెలంగాణపై నిర్ణయం ఉంటుందని కూడా కనీసం ఆయన మాట్లాడడం లేదు. ఎందుకు? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నారు. ఏ బలం ఆయనను ఇట్లా మాట్లాడిస్తున్నది. ఢిల్లీ జనపథ్‌లు ఆయనకు ఏమి చెబుతున్నారు. ఆయన అలనాటి రాజశేఖర్‌డ్డిలా తెలంగాణను వ్యతిరేకించడంలో ఛాంపియన్‌ను అనే ముద్ర వేయించుకుంటున్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అటకెక్కించిందా? దాని ఫలితమేనా? అంటే సాధారణ రాజకీయ విశ్లేషకులకైనా సులభంగా అర్థమయ్యేది అవుననే. సోనియా మనసులో మాట, మన్‌మోహన్ మౌనం వెనక మాట్లాడని మాట, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే ఆజాద్, చాకో, షిండేల బాధ్యతారహిత వెగటు వెక్కిరింతలు, ఇడ్లీ దోసెలు, చివరికి ఇన్నాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో లేదన్న ప్రకటనల సారాంశం అంతా ఒక్కటే వాటి ప్రతిఫలనమే కిరణ్‌కుమార్‌డ్డి దూకుడు పరమార్థమని తేటతెల్లమవుతున్నది. సోనియాను కలిసి వచ్చిన తర్వాత యాభై ఏళ్ల బంధాన్ని వదులుకొని కేకే ఇన్నాళ్లకు తెలంగాణ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడమూ దీనికి సూచనే. కాంగ్రెస్ పార్టీ కనపడని ఒత్తిడికి తలొగ్గింది. గుప్పెడుమంది ప్రయోజనాలకు తలొగ్గింది. సంపన్న సీమాంధ్ర లాబీయింగ్‌కు తలొగ్గింది. డెడ్‌లైన్‌లు పెట్టే సాహనం చెయ్యొద్దని అది తెలంగాణలో డెత్‌లైన్‌లు తనకు తాను వేసుకోవడానికి కూడా సిద్ధపడింది. కాంగ్రెస్ పార్టీని బలిపెట్టడానికీ సిద్ధమైంది. ఇది అర్థం కానంత జటిలంగా లేదు. విశ్లేషించుకొని, మేధోమథనం చేసి అర్థం చేసుకోవాల్సినంత మార్మికంగా కూడా లేదు. ఖుల్లంఖుల్లా. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు.

ఇద్దరు దళిత ఎంపీలు, సీనియర్ ఎంపీ మంద జగన్నాథం, కురువృద్ధుడైన కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుమారుడు డాక్టర్ వివేకానందలను కూడా అది వదులుకోవడానికి సిద్ధపడింది. కాంగ్రెస్ తెలంగాణలో ఆత్మహత్యకు, అదీ సామూహిక ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నది. కిరణ్‌కుమార్‌డ్డి జుర్రత్ మీద మాట్లాడుతున్న మాట ల నేపథ్యం ఢిల్లీ తెలంగాణ పట్ల అనుసరిస్తున్న యధాలాప, గందరగోళ, కంగాళీ, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిలో ఉన్నది. ఇంతకుమించి అర్థంచేసుకోవడానికేమున్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోర్ కమిటీ పేరిట మరో నాటకానికి తెరలేపింది. తెలంగాణ మీద నిర్ణయం అంటూ, చివరి నిమిషంలో మరో రంగస్థలాన్ని తయారుచేసి, మరో నాటకంలో ప్రథమ అంకానికీ తెరతీసింది. అది కాంగ్రె స్ నైజం. దాని నైజంలో తెలంగాణ ద్రోహ చింతన ఉన్నది. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రజాస్వామ్య వ్యతిరేకత ఉన్నది. సంపన్న, కార్పొరేట్, దళారీ కోస్తాం ధ్ర పెత్తందార్లకు లొంగిపోయే తత్వాన్ని అది ఆది నుంచీ తెలంగాణ పట్ల అనుసరిస్తున్నది. కానీ ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, పదవిలో కొనసాగడం కోసం ప్రభుత్వాలను ఏర్పరుచుకోవడం కోసం, ఉన్న ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం అది తెలంగాణను మోసం చేయడానికి పదే పదే అదే ఎత్తుగడలను అవలంబిస్తున్నది. చిన్న ఆశను కల్పించగలదు. ఆకాంక్షలను గౌరవిస్తామని చెప్పగలదు. ‘తె’ అని తెలంగాణ ఇచ్చినట్టే అని చెప్పగలదు. అధికారంలో లేనప్పుడు స్వయంగా తెలంగాణ సమస్యను తెరమీదికి తేగలదు. అదే తెలంగాణను నెత్తురులో ముంచి ద్రోహమూ చెయ్యగలదు. అంతా నగ్నంగానే. అంతా బహిరంగంగానే... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకున్నది. ఇక్కడి ప్రజల జీవితాలను రెండు సందర్భాల్లోనూ రక్తసిక్తం చేసింది. మొదటిది క్రూరమైన నిర్బంధం, అణచివేత, పోలీసుల కాల్పుల ద్వారా నెత్తురు తాగింది కాంగ్రెస్. ఇక ఇప్పుడు కనిపించని కుట్రలకు, మెత్తని కత్తిలా ఆత్మగౌరవం మీద దాడిచేసి, ఆశపెట్టి, భంగపరచి, ప్రజాస్వామ్యసౌధాల్లో ప్రకటనలు చేసి, ఉల్లంఘించి ప్రజలను వంచించి ఒక మర్నాగిలా వెయ్యిమందిని మింగింది కాంగ్రెస్. ఇది కనపడని హింస. దిగని పిడిబాకు. గుండెలను ఛిద్రం చేసిన ద్రోహం, మోసం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక మృత్యుకుహరం. నిలువునా నిలు సజీవమైన మనుషులను అది మృత్యువులోకి లాగింది.

తెలంగాణ సమస్య జటిలమైంది అంటాడు మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. ఎప్పుడు. ఇప్పుడు. పార్టీ అడుగుజారి ఆయన వేళ్ల సందు నుంచి ఒక జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి ఇద్దరు ఎంపీలు, ఒక సీనియర్ నాయకుడు వెళ్తున్నప్పుడు. అది సరే తెలంగాణ సమస్య ఇప్పుడే ఎట్లా జటిలమైంది. ఇతర రాష్ట్రాల సమస్యలతో తెలంగాణ సమస్య ఎప్పుడు అనుసంధానమైంది. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చే ఎత్తుగడగా 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపినప్పుడు, 2004లో తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లో గెలిచినప్పుడు అది జటిలమైనది కాదా? యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో, రాష్ట్రపతి ప్రసంగంలో కొలువా కుమ్మరియ్య ఇవన్నీ ఎందుకు? చివరికి పార్లమెంటు ఉభయ సభల్లో ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని’ స్పష్టంగా విస్పష్టంగా ప్రకటించినప్పుడు కూడా ఇది జటిలమైనదేనా? కాదా? మీ మాటలు నమ్మి, రాజకీయ ప్రక్రియ అనే ఒక్క బలహీనతతో ప్రజాస్వామ్యాన్ని, దాని స్ఫూర్తిని, గాంధీని,ఆయన శాంతియుత మార్గాన్ని, ఆర్టికల్3ని, అంబేద్కర్ ను, రాజ్యాంగాన్నీ, దాని నియమనిబంధనలు నమ్మి సహాయనిరాకరణలు, సకలజనుల సమ్మెలు, రాస్తారోకోలు, రైలురోకోలు, బాష్పవాయువులు భగ్నమైన కలల మధ్య అల్లకల్లోలంగా దశాబ్దకాలంగా జీవిస్తున్న వన్నీ ఉత్తవేనా? మిమ్మల్ని నమ్మినందుకు, తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్న మీ ద్రోహాన్ని తట్టుకోలేక, నిశ్శబ్దంగా, తమను తాము హింసించుకుని మరణించిన వెయ్యిమంది బలిదానాల తర్వాత తెలంగాణ సమస్య జటిలమైనదేనా? ఇది ప్రజాస్వామ్యమేనా? కాంగ్రెస్ పార్టీ గడ్డకట్టిపోయింది. ఢిల్లీకి ఆత్మలేదు. పార్లమెంటు భవనం పక్కన శాస్త్రి భవన్ ప్రాంగణంలో ఉరిపోసుకున్న యాదిడ్డి ఆత్మ మోగించిన ఆర్తరావం వారి చెవుల పడలేదు. ఒక బధిరాంధ యథాలాప ప్రభుత్వం నడుస్తున్నది. నిజమే తెలంగాణ జటిలమైనదే. అది మీరనుకున్నంత తేలికపాటిది కాదు. అది కాంగ్రెస్ పార్టీని ముంచుతుంది. అది మోసాలకు, భంగపాట్లకు ఒక తిరుగుబాటుగా నిలిచి గెలుస్తుంది. వచ్చేదాకా పోరాడుతుంది. అందుకని జటిలమైంది. జటిలమైన, చిక్కు దారపు ఉండల ముక్కలు, సుడులు తిరిగిన గర్భశోకాల ముందు నిలవవు. ఖుల్లం ఖుల్లా.. ఇది గుర్రం.. ఇది మైదానం. నువ్వు ఇస్తావా? మోసం చేస్తావా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయంగా బతకాలనుకుంటున్నదా? తన మరణ శాసనం తానే రాసుకుంటున్నదా? అదీ ఇప్పటి సమస్య. కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం పలుకులు పలుకుతూ, ఉండవచ్చుగాక, ఢిల్లీ వాతావరణ నివేదికలలో ఆయన ఉరమమంటే ఉరమడం, కరవమంటే కరవడం చేస్తూ ఉండవచ్చుగాక. కానీ ప్రజాస్వామ్యానికి మీరంటున్న ప్రజాస్వామ్యానికి, ప్రజల చేతిలో ఆయుధాలు కోకొల్లలు. నిజమే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జటిలంగానే ఉంటుంది. తుపాను హెచ్చరికలు ఖాతరు చెయ్యకపోతే పెనుతుఫాన్‌లై ముంచెత్తే కాలం ఒకటి ముందున్నది.

భారతదేశంలో ప్రజాస్వామ్య భావనలు పాదుకున్న అరవై మూడు సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం మీద చర్చ జరుగుతున్నది. బస్తర్‌లో పేలిన మందుపాతర సోనియాగాంధీని, మన్‌మోహన్‌సింగ్‌నూ ప్రజాస్వామ్య భాషణలు చేయిస్తున్నది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయి, ప్రజాస్వామ్య భారతం ఎవరి కొమ్ముకాసి, ఏకాకులను కొట్టి గద్దలకు వేస్తున్నదో, అనుభవించి, పలవరించిన వాళ్లు నూతన ప్రజాస్వామ్యం కోసం ఛత్తీస్‌గఢ్‌లో వ్యాపిస్తూ ఉన్నారు. బస్తర్ ఘట న ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదే, విఘాతం కల్పించేదే అంటున్నారు. సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్ జమిలిగా... అదివేరే చర్చ. కానీ సోనియాగాంధీకి ఒక ప్రశ్న. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల వలన, కొరకు, చేత నిర్మితమయ్యే ప్రజాస్వామ్యంలో తెలంగాణ కూడా భాగమేనా? దశాబ్దాల అంగలార్పు, దశాబ్దాల తిరుగుబాట్ల తర్వాత ప్రజాస్వామం గెలిచి, రాజ్యాంగ స్ఫూర్తి నిలిచి, పార్లమెంటు సాక్షిగా వెలువడిన డిసెంబర్9 ప్రకటన ఏమయింది. ఏళ్లు గడిచినా ఓపికకు ఓపిక నేర్పి, శాంతికి శాంతిని నేర్పి, ఆశలకు ఆశను నేర్పి, ప్రజాస్వామ్యం ఆయుధంగా, శాంతిగా, ఉద్యమించిన తెలంగాణకు ప్రజాస్వామ్యం ఏమిచ్చింది? ప్రజాస్వామ్య మహాసౌధమయిన పార్లమెంటు ప్రకటన చరివూతలో ఎందుకు కలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ సమస్య ఎందుకు జటిలమైన సమస్య అయింది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు, సామాజిక భావనల ఆధారంగా రాజకీయ నిర్ణయాలుంటాయనే ఒక ప్రాథమిక సూత్రం ఏమయింది. చివరికి ప్రకటన చేసి, వెనక్కు తీసుకున్న తర్వాత వెయ్యిమంది బలిదానాలను కూడా కనీసం ఖాతరు చెయ్యనిది ప్రజాస్వామ్యమేనా? తెలంగాణ ప్రజలు రాజ్యాంగస్ఫూర్తితో, రాజ్యాం గం కల్పించిన ఆర్టికల్ 3 వెసులుబాటుతో చేసిన పోరాటం ఎందుకు నిరర్ధకమయింది? ప్రజాస్వామ్యమంటే ఏమిటి? గుప్పెడుమంది ప్రయోజనాలా? విశాల జన బాహుళ్యం ఆకాంక్షనా? ప్రశ్నలు ప్రజాస్వామ్య పరిరక్షకులైన, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ ఘటన అనంతరం ప్రజాస్వామ్యం గురించి భాషణలు ఇచ్చిన సోనియా, మన్‌మోహన్‌సింగ్‌లను అడగడం తప్పేమీ కాదనుకుంటా. ఇది ప్రజాస్వామ్యానికి భంగం కూడా కాదనుకుంటా....

ప్రజాస్వామ్యాలు విఫలమయిన చోట నూతన ప్రజాస్వామ్య ఆకాంక్షలు ప్రజ్వరిల్లడమే ఛత్తీస్‌గఢ్ పరిణామాల పరాకాష్ట. అది హింసాపూరితంగా ఉండవచ్చు కాక. గగుర్పాటు కల్పించేదిగా ఉండవచ్చు కాక. తునాతునకలయిన శరీరాల భయ భీతావహం వల్ల ప్రజాస్వామ్యం అనే ఒక విలువను, విధానాన్ని రక్షించుకోవాలని కూడా ఉండవచ్చుగాక.. కానీ తెలంగాణ అనుభవం ఏమి చెబుతున్నది? వెయ్యిమంది మరణాలు ఏమి చెబుతున్నవి. శాంతిగా, మర్యాదగా, మప్పితంగా, ఏ హింసా లేకుండా సాగిన ఉద్యమంలో కాలికూలిపోయిన శరీరాల భయభీతావహ దేహాలు వణుకు పుట్టించే, పీడకలల దృశ్యాలను తెలంగాణ నిత్యం కంటూనే ఉన్న ది. రైలుకు ఎదురేగిన వాడి ముక్కలైన దేహం, బస్సును ఢీ కొట్టినవాడి విరిగి పడిన దేహం, నిలువునా కాలిన మంటల్లో ఊరేగిన వాడి పొరలు విచ్చిన దేహం, ఉరిపోసుకున్న వాడి తెగి పడిన కంఠనాళాల్లో గడ్డకట్టిన నెత్తురు ప్రజాస్వామ్య విఘాతాన్ని, ప్రజాస్వామ్య భంగపాటునే సూచిస్తున్నది. సోనియమ్మ ప్రజాస్వామ్యం భంగపడితేనే ఛత్తీస్‌గఢ్‌లో నూతన ప్రజాస్వామ్యవాది పుడ్తుంటాడు. తెలంగాణ భంగపడింది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని భంగపరిచింది. దురదృష్టవశాత్తూ మీరే. ఇప్పుడు నాలుగున్నరకోట్ల మంది ప్రజల తరఫున అడుగుతున్నాం. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి. లేదంటే.. ప్రజాస్వామ్యం, నూతన ప్రజాస్వామ్యం ఆకాంక్షలవేపు మళ్లీ జంగలు వేస్తే తప్పు తెలంగాణది కాదు. అమ్మా సోనియమ్మ అది కాంగ్రెస్ పార్టీదే. ప్రజాస్వామ్యాలు వర్ధిల్లాలి. తెలంగాణ వర్ధిల్లాలి.

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...