కొండపల్లి కొన్ని జ్ఞాపకాలు


Mon,April 15, 2013 12:55 PM

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక ప్రత్యేకమైన మనిషి కోసం ఎదురుచూస్తున్నాం. అంతా ఇరవై మందిమి. హైదరాబాద్ రాంనగర్ గుండు ప్రాంతం అనుకుంటా. మాకు ఏ మాత్రం తెలియని ప్రాంతం. భార్యాభర్త లు నెల్లూరు పద్మ, యుగంధర్‌లు మాకు ఆతిథ్యం ఇచ్చే జంట. డెన్‌కీపర్లు. మధ్య లో ఆసుపోసిన కండెలా గోవింద్‌డ్డి కొరియర్. మేమంతా సీపీఐఎంఎల్ సీవోసీ రాజకీయ కార్యకర్తలం. అత్యవసర పరిస్థితుల కాలంలోనే జరగాల్సిన రాజకీయ తరగతులు నిర్బంధం కారణంగా వాయిదాపడ్డాయి. జైళ్లు, చిత్రహింసలు, రాజ్యం మర్యాదలన్నీ అయిపోయి మళ్లీ కార్యరంగంలోకి దూకిన తర్వాత మాకు హైదరాబాద్‌లో రాజకీయ తరగతుల కథ ఇది.

వైట్‌హేర్ మాన్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఐవీ మాకు తత్వశాస్త్రం బోధించాడు. చాలామందికి తెలియదు కానీ ఇవ్వాల్టి మావోయిస్టు ఉద్యమానికి భూమిక అయిన కరీంనగర్ పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని ఒకరకంగా కూడగట్టి నిర్మించినవాడు ఆయనే. అది వేరే కథ. కానీ రాంనగర్ గుండు ప్రాంతంలో ఉన్న ఆ ఇంట్లో పద్మ దంపతుల ఆతిథ్యంలో ఏదో ఒక ఫంక్షన్ జరిగినట్టు వారంరోజులు మా తరగతులు జరిగాయి. అప్పుడు మేము నిజంగానే ప్రేమతో, గౌరవంతో, ఉద్వేగంతో, నిజంగానే కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన వ్యక్తి కె.ఎస్. సంక్షిప్త నామంతోనే అప్పుడు మా రక్తనాళాల్లో ఉద్వేగాలు పోటెత్తే పేరు. కె.ఎస్. ఎస్.ఎం. అంటే అప్పుడు విప్లవకారుల సర్వనామాలు. నాలుకల మీద గొప్పగా నడయాడే పేర్లు. కె.ఎస్. కొండపల్లి సీతారామయ్య. రెండు రోజు ల క్రిందటే ఆయన వర్ధంతి. యాధృచ్ఛికంగా పైలా వాసుదేవరావుది కూడా. చండ్రపుల్లాడ్డి, దేవులపల్లి వెంక తరిమెల నాగిడ్డి, పైలా వాసుదేవరావు. ఇవి ఆవలి శిబిరం పేర్లుగానే ఉన్నా భారతీయ విప్లవకారులందరూ గౌరవించిన పేర్లు.

తెలుగునేలపైన ఎప్పటికీ చెరగని పేర్లవి. వాళ్ల గురించి తలుచుకోవాల్సిన పేర్లు. సహజంగానే కొండపల్లి నాయకత్వంలో సీవోసీ కాలం నుంచి పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడి నిలదొక్కుకునే దాకా పనిచేసి బయటకు వచ్చిన వాడిగా ఆయనంటే గౌర వం. ఈ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలను పరిచయం చేసి, ఆచరించి చూపిన నాయకుల్లో చారుమజుందార్ తర్వాత అంతటి ప్రభావం వేసినవాడు కె.ఎస్. విప్లవ కార్యాచరణకు సంబంధించి, ఆయన వ్యక్తిగత జీవన విశేషాలు, గత కార్యాచరణలు అట్లా పక్కనపెట్టి సీవోసీ ఏర్పాటులో ఆ పార్టీని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తరింపజేసిన కౌశలత ఇప్పుడు కాదు ఎప్పుడూ గుర్తించుకొని స్మరించుకోవాల్సిన అంశమే. నిజంగానే కొండపల్లి కాకుండా ఉంటే, కరీంనగర్, వరంగల్ వాతావరణాల అధ్యయనం, అవగాహన ఆయనకు లేకుండా ఉంటే, కే.జీ. సత్యమూర్తికి కూడా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ల పరిస్థితులు అర్థం కాకుండా ఉంటే ఇవ్వాల్టికి కూడా మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతాల నుంచి వెళ్లిన, వచ్చిన ఇంత పెద్దమొత్తం క్యాడర్ ఉండేదే కాదు. దీనికోసం సైద్ధాంతికతలు, పార్టీ నిర్మాణం, భౌతిక పరిస్థితులు లాంటి చర్చల జోలికి వెళ్లడం నా ఉద్దేశం కూడా కాదు. కానీ కొండపల్లి జ్ఞాపకాల ను పంచుకోవాలని...

మేము ఎదురుచూస్తున్న మనిషి రానే వచ్చాడు. కొండపల్లి సీతారామయ్య. అప్పటికి కథలు, కల్పితాలు, గొప్పలు, అజ్ఞాత జీవితంలో కే.ఎస్. అట్లా ఇట్లా అని, పోలీసులకు ఆయన ఎట్లా జెల్ల కొడతాడో అని కథలు కథలుగా విని ఊహల్లోనే ఆయనను అంచనా వేసుకునేవాళ్లం. ముందు గోవింద్‌డ్డి ఆ తర్వాత కుదిమవూటం గా కొంచెం వంగి నడుస్తూ కె.ఎస్. కనపడ్డారు. చెప్పొద్దూ. ఊహలు వేరని తేలిపోయింది. ఆయన నేననుకున్నట్టు లేడు. విశాలమైన నుదురు, పెరిగీ పెరగని వెండి తీగల్లాంటి మెరిసే అల్లిబిల్లి వెంట్రుకల గడ్డం. దువ్వని తల కొప్పుపెట్టినట్టు పైకి రేగి దుబ్బులా ఉంది. ఆ నుదురు మీద రూపాయి వెడల్పు కంత (మచ్చ). మనిషి ప్రత్యేకంగా ఉన్నాడు. సాదాసీదాగా ఉన్నాడు. కానీ డ్రెస్ అదిరింది. లేత ఎరుపురంగు ఫుల్‌హ్యాండ్స్ టీషర్ట్.

ప్యాంటు. ఒక విప్లవ నాయకుణ్ణి ఊహల్లో చారు మజుందార్‌నూ, లెనిన్‌నూ, సవాలక్షమంది విప్లవకారుల ఫోటోలను ఊహించుకుని ఉంటే ఈయన ఇట్లా కుదిమవూటంగా ఉన్నడు. కొంచెం ఊబ శరీరం. దృఢంగానే కనపడ్తున్నాడు. కానీ టిప్‌టాప్‌గానే ఉన్నడు. మొదట కె.ఎస్‌ను చూసిన ఆ జ్ఞాపకం ఇప్పటికీ చెరగకుండానే ఉంది. ఆ క్లాసులోకల్లా చిన్న పిల్లవాణ్ని నేనే పందొమ్మిదేళ్లు. మీసాలు కూడా మొలవని లేత ముఖం. రెడ్‌శాల్యూట్‌తో తరగతి గది ఆహ్వానం పలికింది. తొడతొక్కిడిగా, ఆయన చుట్టూ గుంపుకట్టి, కరచాలనాలు చేశాం. పేర్లు, పరిచయాలు. ఛాయ్. అప్పుడు ప్రారంభమయింది క్లాస్. రాజకీయ ఆర్థిక తత్వం మీద ఆయన బోధన.

పొలిటికల్ ఎకానమీ, భారతీయ పరిస్థితులు, అర్ధవలస, అర్ధ భూస్వామ్యం, వ్యవసాయ విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్గం, భారతీయ వర్గీకరణ, గ్రామీణ ప్రాంతాలు, తరగతుల వర్గీకరణ, భారతీయ ఆర్థిక వ్యవస్థల సారాంశం, స్థానికీయ పరిస్థితులు. రెండు రోజులు ఆయన బోధించిన పాఠం. ఇప్పటికీ చెవుల్లో మార్మోగినట్టుగానే ఉన్నది (అర్ధవలస, అర్ధ భూస్వామ్యం గురించి విరసం వరలక్ష్మి ఇటీవలే ఏదో ఒక పేపర్ రాసినట్టున్నది చూశాను). అయితే పొలిటికల్ ఎకానమీ పాఠం అన్నింటికన్నా క్లిష్టమైనది. భావ, భౌతికవాదాల చర్చకు సంబంధించిన గతి తార్కిక తత్వశాస్త్రం తొలి పాఠమే. అవి విశ్వజనీన సిద్ధాంతం. మౌలికమైనది. కానీ పొలిటికల్ ఎకానమీ అన్వ య శాస్త్రం. సిద్ధాంతాలను అన్వయించుకోవడమే ఇప్పటికీ ఒక అతి పెద్ద సమస్య. కానీ అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు ఆయన భారతీయ ఆర్థిక వ్యవస్థ, స్థానికీయ పరిస్థితులు వీటి సారాన్ని వడగట్టి చెప్పిన పాఠం. కొండపల్లి నా దృష్టిలో మహాపర్వతమైపోయాడు. బాలుని మానసిక స్థితి కావొచ్చు. ఆరాధనే కావొచ్చు. ఆయనప్పుడు నాకు కథానాయకుడు అయ్యాడు.

రాజకీయాలను అట్లా పక్కనబెడితే ఆ నాలుగయిదురోజులు మాతో ఆయన చేసిన చెలిమి, పంచుకున్న అభివూపాయాలు, ముచ్చట్లు. ఎంతగా కలిసిపోయామం కొండపల్లి చుట్టూ మేము. ఆయన దృష్టి మళ్లించుకోవడం కోసం తాపవూతయపడ్డాం. పాకులాడాం. అన్నింటికి కన్నా కొండపల్లి మరో విశేషణం. ఆయన నవ్వు. కడుపునిండా నవ్వినట్టుండేది. సకులం ముకలం పెట్టుకొని కూచుంటే లేచేవాడు కాదు. పొద్దంతా క్లాసు. కూచొని కూచొని మా కాళ్లు రిల్లలు పట్టేవి. మేము అనేక సార్లు తిరిగేవాళ్లం. కానీ ఆయన అట్లా పాఠం అయ్యేదాకా కూచొని ఉండేవాడు.

సీవోసీ పార్టీలో అప్పటికే అంతర్మథనం మొదలైంది. అప్పటి మా నాయకుడు కొల్లూరి చిరంజీవి పార్టీలో జరుగుతున్న సిద్ధాంత చర్చలు, డాక్యుమెంట్ తయారవుతున్నదని చెప్పేవాడు. ఆ నేపథ్యంపై మాకూ అవగాహన ఉన్నది. వర్గశత్రు నిర్మూలన ఏకైక మార్గం నుంచి పార్టీ విస్తృతి కోసం, ప్రజల్లోకి వెళ్లి, జన బాహుళ్యాలను నిర్మాణం చెయ్యడం కోసం ఏమి చెయ్యాలనే పెద్ద చర్చ జరుగుతున్న కాలం. ఈ రాజకీయ తరగతుల్లో వాటి స్వరూప స్వభావాలు పొడసూపాయి. వర్గ శత్రు నిర్మూలన పోరాట రూపాన్ని అట్లా ఉంచుకుంటూనే, ప్రజా సంఘాల నిర్మాణాలు చేయాలని, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించాలన్న మొదటి సూచనలు అక్కడే పసిగట్టాము.

నిజానికి ఆ రాజకీయ తరగతుల తర్వాతే ఐవీ నాయకత్వంలో చెల్లాచెదురైన విప్లవ కార్యకర్తలందరినీ కూడగట్టి, అంతకుముందరి అవగాహనల్నింటిపైనా కొత్త అవగాహనలు కల్పించి ‘గోటు విలేజ్’ క్యాంపెయిన్. ప్రధానంగా విద్యార్థి ఆర్గనైజర్లు గ్రామాలపై అవగాహన పెంచుకోవడానికి, గ్రామ ప్రాంతాలను ఆర్గనైజ్ చెయ్యడానికి ఆ రకంగా పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పాటుకు పునాదిగా పనిచేసింది. మావో-హూనాన్ అప్పటి మా నినాదం ఆ మధ్యకాలంలో సాయుధ పోరాట పాక్షిక విరామం పార్టీలో మరోసారి సిద్ధాంత చ్చకు దారితీసింది. రివిజనిజమే అని కొందరు. కాదు ‘రోడ్ టు రెవల్యూషన్’కు ఇదే మార్గమని మొత్తానికి మామూలు విద్యార్థి ఉద్యమకారులు, పూర్తిస్థాయి రాజకీయ కార్యకర్తలు తయారు కావడానికి రోడ్ టు రెవల్యూషన్ మీద పార్టీ క్యాడర్‌లో జరిగిన పూర్తిస్థాయి చర్చలు, ఆ తర్వాత సాయుధ పోరాట పాక్షిక విరమణపై జరిగిన చర్చలు బాగా ఉపయోగపడ్డాయి. అవే అనంతరం జగిత్యాల జైత్రయావూతకు నేపథ్యం కార్యాచరణ అయింది. జగిత్యాల జైత్రయాత్ర ఇప్పటి మావోయిస్టు ఉద్యమానికి మూలస్తంభం అయింది. ఇదంతా కొండపల్లి సీతారామయ్య ఈ దేశ విప్లవానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్‌గానే అర్థం చేసుకోవాలి. కె.ఎస్ ఆనాడు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత కార్యాచరణకు సంబంధించిన మార్గదర్శకాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఇవ్వాల్టి విప్లవానికి అతిపెద్ద కాంట్రిబ్యూషన్. ఆయన ఈ దేశ నిజమైన ప్రజాపంథా నిర్మించిన గొప్ప విప్లవకారుడు. ఆచరణాత్మకవాది.

కె.ఎస్‌తో విడివిడిగా మాట్లాడడం ఒక అద్భుతమైన అనుభవం. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేది ఆయన సూక్ష్మంగా కూడా ఎట్లా చెప్పేవాడో ఇప్పటికీ గుర్తే. కొమురంభీమ్‌ను మొదట విన్నది ఆయన ద్వారానే. కొమురంభీమ్ చరివూతను వెలికి తీయాలని, ప్రజల సాంస్కృతిక, కళా వారసత్వాలను, పోరాట వారసత్వాలను ఎట్లా వర్తమానంలోకి తేవాలో ఆయన మాట్లాడారు. పాముల రాంచందర్ కూడా నా వయస్కుడే. కె.ఎస్.కు అప్పటికి రాంచందర్ అంటే ముద్దు. కానీ నేను కూడా ఆ తరగ తుల్లో కె.ఎస్ దగ్గర మార్కులు కొట్టేశాను. పాటలు మనమే రాసి ప్రజల పరం చెయ్యాలి. గద్దర్‌లా జనంలోకి పాటను పార్టీ కార్యకర్తలు కూడా తీసుకు వెళ్ళాలి అని ఆయన ఆనాడు అన్న మాటలకు స్పందనగా నేను ‘జంబాయిరే పాట రాశాను. తెలంగాణ వ్యాప్తంగా ఆనాటికి ఉన్న పోరాటాలన్నింటినీ తీసుకొని రాసిన ఆ పాట ను కె.ఎస్ తన డైరీలో రాయించుకున్నాడు. ఆ సాయంత్రం నేను పాడిన పాటకు ఆయన కోరస్ ఇచ్చాడు. నిజానికి పిలుపులో ఆయన రాసిన అనేక అంశాల మీద ఆయన బోధించిన విషయాలన్నీ మాకు తెలిసేవే. కానీ ఆ రాజకీయ తరగతులు, నేను పాట రాయడం, అది ఆయన డైరీలో రాసుకోవడం గొప్పగా ఉండేది. బహుశా ఇప్పటికి కూడా.

నాకు ఒక చింత, ఒక సంతృప్తి. కేవీఆర్ చనిపోయినప్పుడు అంత్యక్షికియలకు వెళ్లలేదు. అది జీవితకాలం చింత. కె.ఎస్.అంత్యక్షికియలకు బెజవాడ వెళ్లాను. అది సంతృప్తి. కె.ఎస్.ను అనేకసార్లు కలిశాను. చివరికి శిథిలమైన దశలో విజయవాడ లో చుక్కు, చిన్నల ‘కరుణ గృహం’లో కలిశాను. సౌదా ఇంటర్వ్యూ తర్వాత, ఆయ న బయటికి వచ్చిన అనంతర పరిణామాల్లో ఆయన పట్ల అభిమానం ఉండేది. కానీ..అంగీకారం తక్కువే. అనంతర కాలం నాకు ఇప్పుడు అక్కర్లేనిది. కొండపల్లి ఈ దేశ విప్లవానికి ఒక దిక్సూచి. చారుమంజుదార్ లాగే ఆచరణలో విప్లవాన్ని అడవులను రగిలించిన విప్లవకారుడు. నాకు సంబంధించి ఆయన అలనాటి జ్ఞాపకాలు పదిలమే. కొండపల్లికి నివాళి. ఆయన అప్పటి నా కలల విప్లవం. ఇప్పటికీ సజీవ జ్ఞాపకం.

(గోవింద్‌డ్డి అనంతర కాలంలో ద్రోహిగా మారి నల్ల ఆదిడ్డి, సంతోష్‌డ్డి, శీలం నరేష్‌ల జాడ చెప్పినవాడు. ఐ.వీ.ఇప్పుడు అమరుడయ్యారు. పద్మ, యుగం ధర్‌లు, కొల్లూరి చిరంజీవి, రాంచందర్ సాధారణ జీవితంలో ఉన్నారు.)

-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...