భ్రమలు.. మైమరపులు


Sun,April 7, 2013 02:09 AM

ఉనికిలో లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించడం ఒక భ్రాంతి. మయ సభ తీరు. కానీ ఉన్నదాన్ని లేదనుకోవడం, దాని ఉనికే లేనట్టుగా భ్రమపడి జనాలను భ్రమింపజేయడానికి సాముగరిడీలు చేయ డం ఎలాంటి స్థితి? కపట నాటకం. ప్రజల మతిమరుపు మీద అతి విశ్వా సంతో మైమరపింపచేసే కళ అది. రాజకీయపార్టీలు ఆ కళలో ఆరితేరాయి. హఠాత్తుగా తెలంగాణ వారికి ఒక సమస్యగా కనబడడం మానేసింది. అది నిప్పుగానే ఉన్నా, ఆ నిప్పును చూడ నిరాకరించేంత కపటం వారికి అలవ డింది. కానీ ముట్టుకున్నప్పుడు అనుభవంలోకి వచ్చే మంటను వాళ్లు పసి గట్టలేకపోవడమే ఇప్పటి అవలక్షణం.


కరెంటు ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని మైమరపింపచేయడానికే అంటే కొంత ఇబ్బందిగా తోచవచ్చు. కరెంటు కోతలు, కారు చీకట్లు తోడు చార్జీల పెంపు, సర్ చార్జీల వడ్డింపు ఇవన్నీ సమస్యలే కదా! ప్రజలు కరెంటు కు మించి ఇప్పుడు ఎదుర్కుంటున్నది ఏమున్నది కనుక అని ఈ ఉద్యమ జీవులు భావించవచ్చు కూడా. కానీ మూడు సంవత్సరాలుగా తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం ముందు ఇది తెలంగాణ వారికి ప్రధాన సమస్య అవుతుందా? అనే ప్రశ్నలో నిజాయితీ ఉంది. తెలంగాణ రాకూడదని భావిం చేవాళ్లు, పైకి తెలంగాణ జపం చేస్తూ, తెలంగాణకు మేము వ్యతిరేకులం కాద ని పెదాల మీది మాటలతో ప్రకటించేవాళ్లు, వరుస తప్పకుండా తెలంగాణ మేమే ఇస్తాము అని చెప్పేవాళ్లు అందరూ ఇక ఆ సమస్య అయిపోయిందని భావిస్తున్నట్టున్నారు. అందుకే కరెంటు ఉద్యమం వారికి అందివచ్చిన అవకా శం అయింది.

ఒక సూటి ప్రశ్న. ఇంతకీ ఈ కరెంట్ ఉద్యమంలో విలువల కలగాపులగం గురించి కానీ, కరెంట్ సంక్షోభానికి కారకులైన వారే ఇప్పుడు కరెంట్ ఉద్యమం అర్జంటుగా ఎందుకు చేస్తున్నారని ఆలోచించడానికి గానీ ఎవరూ సిద్ధంగాలేరు. కరెంట్ సంక్షోభం మూలాలు సంస్కరణల్లో ఉన్నాయి. ఆ సంస్కరణలు తెచ్చింది చంద్రబాబునాయుడు. అవే విధానాలను పరాకా ష్టకు చేర్చింది వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. చంద్రబాబు కరెంట్ ఉద్య మం మీద కాల్పులు జరిపితే చనిపోయింది వామపక్ష కార్యకర్తలు. సీపీఎం పార్టీకి చెంది న వారు. కానీ ఆశ్చర్యంగా, దిగ్భ్రాంతిగా ఇప్పుడు కరెంట్ ఉద్యమం తెలుగు దేశం పార్టీ చేస్తున్నది. మరింత ఆశ్చర్యకరంగా వైఎస్‌ఆర్‌సీపీ విజయమ్మ నాయకత్వంలో జరుగుతున్నది.

పరాకాష్టగా బషీర్‌బాగ్ కాల్పుల్లో చనిపోయి న వారి ఫోటోలకు దండలేసిన వామపక్షాలూ, చంద్రబాబు పార్టీ కలిసి చేస్తు న్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. ఇంతకీ ఇప్పటి ఉద్యమంలో ఉన్న వాళ్లకు కరెంట్ సంక్షోభం తీర్చడంపైన కానీ, ఈ విద్యుత్ సంక్షోభం మూలా లపైన కానీ, కార్యకారణాలపై కానీ ఏకీభావం ఉందా? లేదు. చంద్రబాబు దీనికి ఆద్యుడు. ఆయనే ఉద్యమం చేస్తాడు. మనుషులను అందునా స్వంత కార్యకర్తలను కాల్చిచంపిన వారితో కలెగలిసిపోతాయి వామపక్షాలు. సరే! ఉద్యమం కదా! ప్రజా ఉద్యమం కదా! జరగాలి కదా అనుకున్నా.. వామ పక్షాలు, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, బీజేపీ ఒక్కరికొకరు సంఘీభావం తెలు పుకుంటారు కానీ, ఎవరి దీక్షలు వారివే. ఎవరి టెంట్లూ వారివే. ఎందువల్ల? విద్యుత్ సమస్యలు రాష్ట్రానివి వేరు. తెలంగాణకు ప్రత్యేకం. తెలంగాణ వ్యవ సాయం విద్యుత్ లేకపోతే మన్నేగతి. కానీ నేదునూరు రాదు. శంకర్‌పల్లి రాదు. గ్యాస్ కేటాయింపులుండవు. ఇది ప్రత్యేకమే. కానీ ఉద్యమం వద్దనడం లేదు. యవనిక మీద ఈ కపట నాటకాల పట్లనే అభ్యంతరం. అందరూ 2014 మీద వేసిన కన్ను. ఆడుతున్న పాచిక అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. ఈ ఉద్యమం కోరస్‌గా, గంపగుత్తగా తెలంగాణ ఉద్యమాన్ని మైమరపింపజేయడంగా అర్థం చేసుకోవచ్చు.

నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రజాసమస్యలతో మిళితం చేసి, ఉద్యమా న్ని కొనసాగించవలసి ఉన్నది. కానీ అది ఆ చొరవను ప్రదర్శించకపోవడాని కి, ఒక్క తెలంగాణ సాధన ప్రధానం కావడమే కారణం. ఇప్పటికీ తెలంగాణ కు తెలంగాణే అది పెద్ద సమస్య. మూడేళ్ల కాలంలో ఈ ఉద్యమం వెయ్యి మంది బిడ్డలను పోగొట్టుకున్నది. అది బలిదానాలను చవిచూసింది. సమస్య దాటవేయడం కళ్లముందర ఆవిష్కృతమవుతున్నది. అందుకే తెలంగాణ మీద తెగబడిన మాటలు పెరుగుతున్నవి.

టీజీ వెంకటేష్ ఢిల్లీలో తెలంగాణకు అనుకూల వాతావరణం కనిపించి నప్పుడు మాట్లాడిన మాటలను మింగి ఇప్పుడు నాలుక మడతేసి అడ్డం పొడుగూ మాట్లాడుతూనే ఉన్నడు. ఇక లగడపాటి రాజగోపాల్ నాలుకకు నరమే లేదు. ఆయన ఒక ఉన్మాదస్థాయిలో తెలంగాణ రాష్ట్రమే అంతకుముం దు లేదంటాడు. హైదరాబాద్ స్టేట్ అనే ఒక సాంకేతికతను, అంతకుముందరి ప్రాంతాలు వేరు కావడమనే చిన్న అంశాన్ని ఆసరా చేసుకొని అసలు తెలంగా ణ రాష్ట్రమే లేదనే రాజగోపాల్ ఎప్పుడూ విద్వేషం కక్కుతూనే ఉంటాడు. కొత్తగా రేణుకాచౌదరి అమరవీరుల త్యాగాలనూ శంకించి మాట్లాడింది. నిజానికి రేణుకాచౌదరి లాంటి వాళ్ల నుంచి సంస్కారాన్ని ఆశించడం అంత మంచిది కాదేమో.

విలేకరుల సమావేశంలో అధికారికంగా మామూలుగా మాట్లాడి, ఆ తర్వాత పిచ్చాపాటిలో రోగాలతో, రొష్టులతో చనిపోయినారని, నక్సలైట్ కాల్పుల్లో చనిపోయారని తీవ్ర విద్వేషాన్ని, విషాన్ని కక్కింది ఆమె. తెలంగాణ ఆడపడుచునని చెప్పుకునే రేణుకాచౌదరి ఎలాంటి ఆడపడుచో ఇక్కడి తల్లుల గర్భశోకం ఆమెకు ఏమి తెలుసో అర్థం కానిదేమీ లేదు. ఇక్కడ పుట్టిన, ఇక్కడ బతికిన, ఇక్కడ రాజకీయాలు చేస్తున్న వాళ్లెవరైనా ఇంత హీనంగా చనిపోయి నవాళ్లను అవమానిస్తారా! ఎందువల్ల ఇది జరుగుతున్న ది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నిండు అసెంబ్లీలో ప్రకటిం చారు. ‘ఒక్క పైసా ఇవ్వను. ఏం చేస్కుంటావో చేస్కో’ అని. ఇదంతా తెలం గాణ ఉద్యమాన్ని ఇక అయిపోయిందనుకోవడం అనే వ్యతిరేకుల భ్రమ నుంచి చూడాల్సి ఉన్నది. ఈ గొంతులు ఎందుకు లేస్తున్నాయో అర్థం చేసుకో వలసి ఉన్నది. ఇదే సందని ఇక తెలంగాణ కాదు. సమస్యలే ప్రధానమని కలగాపులగంగా జరుగుతున్న విద్యుత్ ఉద్యమాన్ని కూడా చూడాల్సి ఉన్నది.

తెలంగాణలో ఇప్పుడు జరగాల్సింది ఒక్క విద్యుత్ ఉద్యమమే కాదు. ఒక్క రూపాయి ఇవ్వనన్నందుకు మీరు మాకు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారని ఉద్యమం జరగాల్సి ఉన్నది. వడగండ్ల వానలు వడ్డా, భారీగా పంట నష్టం జరిగినా వివక్ష చూపుతున్న సీమాంధ్ర స్వభావంపై ఉద్యమం జరగాల్సి ఉన్న ది. బలిదానాలు చేసుకున్న యువకులను అవమానించి, మొత్తంగా తెలంగా ణ సమాజాన్ని కించపరిచి, అహంకారాన్ని ప్రదర్శించిన వ్యాఖ్యలపై ఉద్య మించాల్సి ఉన్నది. ఓపెన్‌కాస్ట్‌లు, విధ్వంసం, తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్య మంపై జరుగుతున్న అణచివేత, దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించ వలసి ఉన్నది. నిజమే ప్రజా సమస్యలన్నింటి మీదా తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని మిళితంచేసి ఉద్యమాలు జరగాల్సే ఉన్నది. ఆ ఖాళీ పూరించాల్సి ఉన్నది. కానీ నీళ్లకు నీళ్లు పాలకుపాలు వేరు చేయవలసి ఉన్నది.

నిజమేనా తెలంగాణ ఉద్యమం ఆగిపోయిందా? పోతుందా? అవునూ అదెట్లా ఆగుతుంది. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ జరగబోయే ఉద్యమాల సారాంశం జరిగే ప్రచారం ఒక కపట నాటకంగా, ఒక పద్ధతిగా కుట్ర పన్నిన ట్టుగా ఇలాంటి అపసవ్యపు చిత్ర, విచిత్ర కూటములతో జరిగే అవకాశమే ఉంది. తెలంగాణ ఒక సమస్యే కాదు అనడానికి ముఖ్యమంత్రి సహకార ఎన్నికల వాపును బలుపుగా చూపుతారు. పంచాయతీ ఎన్నకలంటారు. దాన్ని ఒక సాకుగా చూపుతారు. ఒక వేపు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకున్నా అదే కాంగ్రెస్ పార్టీలో టీజీ వెంకటేశ్, రేణుకా చౌదరి, లగడ పాటి రాజగోపాల్ పచ్చి తెలంగాణ వ్యతిరేకతతో, ప్రాంతీయ విద్వేషం తో ఆధిపత్య అహంకారంతో మాటలు మాట్లాడుతుంటారు.

నరనరానా విద్వే షం నింపుకొని మాట్లాడుతారు. మరో వేపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు తెలంగాణ వస్తదని ఒకరు, సోనియమ్మ ఇస్తదని ఒక రు, మేలో నిర్ణయిస్తరని మరొకరు, తీపి కబురు వింటరని. ఇట్లా మాట్లాడు తూనే ఉంటారు. లగడపాటిని, టీజీ వెంకటేష్‌ను, రేణుకాచౌదరిని తెలం గా ణ కాంగ్రెస్ నాయకులు తిట్టినట్టు చేస్తే, వాళ్లు కొట్టినట్టు చేస్తుంటరు. డ్రామా రక్తి కడుతుంది. మనం ఏడ్వాల్సిన స్థితి వస్తుంది. మాట్లాడాల్సిన సోనియ మ్మ నోరువిప్పదు.

కరెంట్ ఉద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ధారులెట్లాగైతే లోన ఇక తెలం గాణ సమస్య లేనట్టేనని నమ్మింపచేయడానికి నాటకాలు ఆడతారో, కాంగ్రెస్ అంతకన్నా ధీటు నాటకాన్ని ఆరంభించింది. ఇది పాత కథే. తెలంగాణ తప్ప ప్రపంచం మీది సమస్యలన్నీ పట్టించుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ తెలు గు సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్ని సమస్యలున్నా తెలంగాణ అసలు సమస్య. అది పరిష్కారం కాకుండా ఇక్కడ శాంతి ఏర్పడు తుందని కానీ, అది పరిష్కారం కాకుండా ఇక్కడ జీవితం కుదుట పడ్తుందని కానీ అనుకుంటే అది ఉత్త భ్రమ.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు పచ్చి మోసం చేసింది. చివరికి గందర గోళం సృష్టించి ఏ నిర్ణయమూ తీసుకోలేని ఒక చేతకాని తనాన్ని ప్రదర్శించి, తన యథాతథ స్వభావాన్ని ప్రదర్శించుకున్నది. అలాంటి పార్టీ ఎన్నికల రుతువులో పదహారు నాలుకలతో మాట్లాడుతూ ఉంటుంది. సీమాంధ్రలో ప్రయోజనాల కోసం టీజీ వెంకటేష్‌లు, లగడపాటిలు, ఘనాపాటీలు మాట్లా డ్తారు. తెలంగాణను అడ్డంపొడుగూ తిడ్తారు. తెలంగాణలో నాయకులు కుమ్మక్కు నేతలు, తెలంగాణ వస్తదని సోనియా ఇస్తదని చెప్తూ ఉంటారు. మళ్లీ ఒక ఐదేళ్ల కిందట మోసమే కొనసాగుతూ ఉంటుంది. అదీ అసలు సమస్య.
తెలంగాణ ఉద్యమం ఉన్నది. అది నడుస్తుంది. ఉవ్వెత్తున ఎగుస్తుంది. కప ట నాటకాలకు తెరపడ్తుందన్నదీ ఇప్పటి ఉద్యమం ఆశ్వాస కావాలి. నిజమే తెలంగాణకు తెలంగాణ సాధన సమస్య తప్ప ఏదీ ప్రధానం కాదు. తెలం గాణకు ఆ తెలివిడి ఉంది.అది నెత్తురోడి గాయపడి ఉన్నది. కాలం తెలంగా ణను నెత్తిన పెట్టుకొని ఉన్నది. కావాల్సిందిక కొనసాగింపే వచ్చేదాకా... తెచ్చుకునేదాకా...

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles