చరిత్ర చెప్పిన కొన్ని పాఠాలు


Sun,January 6, 2013 12:21 AM

ఉద్యమాలు ప్రజాస్వామ్య సంస్కృతిని పాదుకొల్పుతాయి. నిలబెడతా యి. ప్రజల విస్తృత ఆకాంక్షల వెల్లడి ప్రజాస్వామ్య సూత్రాలను విస్తృ తం చేస్తాయి. మనిషిని సామూహికం చేస్తాయి. కానీ ఉద్యమాలు నిలవనీరులా కొయ్యగుర్రం మీద కదమ్‌తాల్ చేస్తే.... ఒకే అంశం మీద సుదీర్ఘంగా కొనసాగితే కార్యాచరణకు, ఆకాంnక్షల వెల్లడి రూపాలకు పదును పెట్టకపోతే అవి పునశ్చరణ లా చేసిందే చేసినట్టుగా, చివరికి ఏమీ తోచనట్టుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉద్యమాలకు సజీవ లక్షణాలుంటాయి. సమూహాలు విరివిగా పాల్గొనే ఉద్యమాల్లో సృజనాత్మకత పురులు విప్పుకొంటుంది. కొత్త కొత్త పోరాట రూపాలను అందిస్తా యి. చలనంలేని ప్రపంచాన్ని రేసు గుర్రంలా పరిగెత్తించి జీవితాలను వేగవంతం చేస్తాయి. చీదరగా ఉండే బతుకుల్లో అవి ఆశల దీపాలు వెలిగిస్తాయి.

తెలంగాణ ఉద్యమ గమనం మొత్తం పరిశీలించినప్పుడు సాధారణీకరించి చెప్పుకునే ఈ అన్ని అంశాలూ వాస్తవంలో నిరూపణ అయ్యాయి. తెలంగాణ ప్రకటన వచ్చి వెనక్కి మళ్లిన మూడేళ్ల కాలం తెలంగాణ ఉద్యమానికి పరీక్షగా మారింది. ఈ పరీక్షలో తెలంగాణ లేచి నిలబడి, ఉద్యమ స్వరూప స్వభావాలు, క్రియాశీలత, ప్రజాస్వా మ్య సంప్రదాయాల వెలుగులో సృజనాత్మక, సజీవ లక్షణాలను పాదుకొల్పింది. వెలిగిన ఉద్యమంలో సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సాగరహారం, ఉస్మానియా క్యాంపస్‌లో మొలిచిన విద్యార్థి ఉద్యమాలు. ఉద్యమ జీవులకు కొత్త పాఠాలు, క్రొంగొత్త అనుభవాలను ఇచ్చాయి.

తెలుగు ప్రజలు గతం లో ఎన్నడూ చవిచూడని కొత్త రూపాలు, సంస్కృతీ వైభవాలు, చరిత్ర వారసత్వా ల మేలు కలయిక ఉద్యమం రూపొందింది. బతుకమ్మ, బోనాలు ఉద్యమ రూపా లు కావడం, ధూమ్‌ధామై తెలంగాణ అన్ని ఉద్యమాల్లోలాగే సాంస్కృతిక నిరసన రూపం వేగుచుక్కై నడిపించడం, సకల జనుల సమ్మెలో మొత్తం ప్రజానీకం ఒక్కటి కావడం, సహస్ర వృత్తులు, చిహ్నాలు వీధులకెక్కిన జెండాలు కావడం, అంతరించి న, పరాయీకరణ పొందిన మనిషి అస్తిత్వ గతపురా సంస్కృతీ సంబరాలు పోరాట పతాకాలు కావడం, మిలియన్‌మార్చ్ వివక్ష మీద, వలసాంధ్ర పెత్తనాల మీద ఒక ఉక్రోశంలా, ఆక్రోశంలా ధర్మాక్షిగహం పెల్లుబికి విగ్రహాలు కూలిపోవడం, సాగరహా రం అపూర్వ ప్రజా కావడం లాంటివన్నీ కొత్త రూపాలే.

అంతకుముందరి జైత్రయావూతలు, ప్రదర్శనల్లా కాకుండా ఇవన్నీ దరిదాపు, సంస్కృతీ వైభవం, చారి త్రిక వారసత్వం మూలకాలుగా రూపొందడం ఈ ఉద్యమం ప్రత్యేకత. విద్యార్థు లు కూడా బాష్పవాయు గోళాలకు పాఠాలు నేర్పి, లాఠీచార్జిలు, అణచివేతలు క్యాంపస్‌ను సంవత్సరాలుగా ఒక ముళ్లకంచె బంధించి ఉంచినా అనేక విలక్షణ రూపాల్లో ప్రతిఘటించారు. ఇవన్నీ రికార్డులకెక్కిన చరిత్ర మాత్రమే కాదు. ఇప్పటి కీ ఇవన్నీ ఎక్కడో ఒకచోట అనుభవంలోకి వస్తున్నవో... రాజకీయ ద్రోహులకు అడ్డంపడడం, ఉద్రిక్తలు నిత్యరూపాలే. తెలంగాణ ఈ మూడేళ్ల కాలాన్ని వెలిగించి న కాగడా అయింది. ఉద్యమాల చరివూతకు కొత్తకొత్త పాఠాలు నేర్పింది తెలంగాణ. ఇదంతా నాణేనికి ఒకవేపే.

కానీ వేయి పూలు వికసించినట్టుగానే.. ప్రజలు ఉద్యమాల్లోకి వెల్లువయ్యారు. నాయకత్వమూ అభివృద్ధి అయ్యింది. ప్రజలతో నిత్య సంభాషణా సాధ్యమయింది. అన్ని మాధ్యమాల ద్వారా తెలంగాణ మంత్ర జపం దశదిశలా వ్యాపించింది. ప్రజ లిప్పటికీ విద్వంతంగా, ప్రజలిప్పటికీ జాగరూకంగా, ప్రజలిప్పటికీ స్తబ్దతను బద్దలు కొట్టే శబ్ద తరంగంలా ఒకేలా ఉన్నారు. కానీ ఒకే తెలంగాణ నుంచి వేర్వేరు అభిప్రా యాలుగా ఉన్నవాళ్లు క్రమక్షికమంగా గిడసబారి పోవడం అనేది ఒక సమస్యగా మారుతుండడం ఇవ్వాల్టి నిజం.

తెలంగాణ సమాజాన్ని ఉద్యమం ఏకోన్ముఖం చేసింది. అప్పటిదాకా రెండు మూడు పాయలుగా ఉన్న సిద్ధాంత భేదాలతో కూడిన తెలంగాణ ఉద్యమం విద్యార్థి ఉద్యమం, కేసీఆర్ నిరాహారదీక్ష అనంతర పరిణామాలతో తెలంగాణ సమాజం మొత్తం, ఉద్యమం మొత్తం, రాజకీయాలు మొత్తం ఏకోన్ముఖమయ్యాయి. తెలంగా ణ అందరికీ ఒకే ఒక్క తెలంగాణ ఎజెండా అయ్యింది.

ఊరువాడను అస్తిత్వం ఏకం చేసింది. ఉద్యమ తీవ్రత భిన్న సిద్ధాంత రాద్ధాంతాలు కలిగిన, భిన్న అభివూపాయాలు, మార్గాలు కలిగిన వారందరూ అన్నీ పక్కనపెట్టి ముందు ఏకోన్ముఖమై తెలంగాణ సాధించడం అన్న స్పృహలోకి వచ్చారు. ఒక దశలో అందరూ ఒక యుటోపియా లేదా ఆదర్శవాదంగా భావించిన ఏ’జెండా’లు లేవు ఒకే ఎజెండా, ఒకే జెండా అన్న భావనకూ వచ్చి కలెగలిసిపోయినట్టు తెలంగాణ సమాజం కనబడింది. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ, ఇతరేతర డిమాండ్లతో కూడిన తెలంగాణ అన్న ఉద్యమ సంస్థలు, పార్టీలు ఒక్కటైన పురితాడయ్యాయి.

ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన ఈ సమయాలన్నీ ఐక్యతలో సాధ్యమయినవే. ఎవరు ఏ పిలుపు ఇచ్చినా, విద్యార్థుల చుట్టూ, కేసీఆర్ దీక్ష చుట్టూ మోహరించిన ఈ ఐక్యత, డిసెంబ ర్-9 ప్రకటన దాకా ఒక ధోరణిలో, అనంతర సమయాల్లో మరింత విస్తృతంగా మరింత చలనశీలంగా క్రియాత్మక సృజనశీలనతో ఉచ్ఛదశను చవిచూశాయి. ఈ మొత్తం ఉచ్ఛదశ కాలమంతా పోరాటాలు ఉవ్వెత్తున లేచిన కాలమంతా కూడా సమాంతర ఉద్యమాలతో భిన్న రూపాల్లో, నిర్మాణాల్లో, భిన్న అభివూపాయాలతో ఉన్న సంస్థలు, సమాజమంతా కూడా, ఉమ్మడి కార్యకలాపాల సందర్భాల్లో సకల జనుల సమ్మె, సహాయనిరాకరణ, మిలియన్ మార్చ్, ఇటీవల కాలపు సాగరహారం సందర్భాల్లో ఒక్కటిగానే కనబడ్డాయి. చరివూతకు పాఠాలు నేర్పాయి. కానీ...

అనంతర కాలంలోనే.. శ్రీకృష్ణ కమిటీ నియామకం, 8వ రహస్య అధ్యాయం, ఉద్యమాలను మేనేజ్ చేసే కాలం ఒకటి ప్రవేశించింది. పదమూడు సంఘాలుగా ఉండి ఉద్యమ సందర్భంలో ఒకే జాక్ అయిన విద్యార్థులు మళ్లీ పదమూడు సంఘాలయ్యాయి. ఎవరి ధోరణి వారిదయింది.

కారణాలు కనిపించేవి, కనిపించని వీ చాలా ఉండొచ్చు. కోవర్టులు క్యాంపస్‌లలో మర్నాగి వేషాలతో దిగడమూ చాలామందికి తెలుసు. సరిగ్గా ఈ స్తబ్ద సమయాల్లోనే, సరిగ్గా సంక్షుభిత, ఆటుపోట్ల సందర్భాల్లోనే ఉద్యమ సంస్థలు ఐక్యతా సూత్రాలను, ఉమ్మడి విస్తృత అంశాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి. కొన్ని ఉద్దేశ్య పూర్వకంగా కూడా. ఎవరి అభివూపాయాలను వారు ఉంచుకుంటూనే, ఎవరి భావాలను వారు కాపాడుకుంటూ నే, ఎవరి మార్గాల్లో వారు ఉద్యమ ప్రయత్నాలు చేస్తూనే ఐక్యతా ఉద్యమం చెయ్యాల్సిన స్థితిని నెలకొల్పడంలో అవి విఫలమయ్యాయి. వేలాదిమంది కొత్త తరం నాయకత్వం ఉద్యమ విలువలైన ఐచ్ఛికత, స్వచ్ఛందత, త్యాగనిరతి, ఉద్య మ స్వభావంలో స్వార్థ రాహిత్యం లాంటి ఆదర్శ విలువలను వదులుకున్నారు. ఫలితం సుష్ఫష్టమే. ఆదర్శాలు బద్ధలయ్యాయి. అనైక్యతల తయారీకి యంత్రాంగా లు పనిచేశాయి. ఈ అనైక్యత ప్రస్ఫుటమవుతున్న క్రమంలోనే పార్టీల నిజస్వరూ పం నగ్నంగా బయటపడింది.

డిసెంబర్9 కి ముందు, ప్రకటన వచ్చి, వెనుకకుపోయిన సమయాల్లో ప్రదర్శిం చిన రాజకీయ పార్టీల తెలంగాణ అంశంతో కూడిన ఐక్యత భళ్ళున పగిలిపోయి ముక్కలయ్యింది. ప్రజల ఉద్యమం అనివార్యంగా రాజకీయ పార్టీలను ఐక్యం చేసింది. లేదంటే ప్రజా జీవితానికి నూకలు చెల్లిన విషయం అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఉద్యమ సంస్థల్లో మళ్లీ ఉమ్మడి అస్తిత్వపు పోకడలు అంతరించి, భిన్న ధోరణులదే, భిన్న ఆలోచనలు, భావాలది పైచేయి అయి, అది కేవలం నిలవ నీరులా దిక్కుతోచక ఎవరికి వారు కార్యక్షికమాలు చేయకుండా పరిణమించిందా? అప్పుడు మళ్లీ తెలంగాణ రాజకీయ పార్టీలు తమ అసలు సిసలు స్వభావమైన పచ్చి అవకాశవాద రాజకీయ క్రీడలకు తెరతీశాయి.

తెలంగాణ కోసం రాజకీయ శక్తియుక్తులు ఉపయోగించడం బదులుగా, రాజకీయ ప్రయోజనాలు, ఎజెండాలకన్నా తెలంగాణే ముఖ్యమన్న ఐక్యతా భావన బదులుగా, తమ రాజకీయ స్వభావాలు, ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం తెలంగా ణ ఎంతవరకు ఉపయోగపడ్తుందన్నదే అసలు సమస్య అయింది. ‘ఉ’ అంటే ఉసిళ్ల పాపయ్య అన్నట్టు ‘తె’ అంటే చాలు తాము తెలంగాణ సంగతులు మాట్లాడినట్టే అనే స్థాయిదాకా రాజకీయ పార్టీలు దిగజారాయి.

తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్‌ఎస్, స్పష్టంగా బిల్లుకు మద్దతిస్తానన్న బీజేపీ, సహానుభూతి నుంచి తెలంగాణ కోసం ఉద్యమించే దాకా విధానం మార్చుకున్న సీపీఐ, తెలంగాణ కోసం పోరాట పంథా ఎంచుకున్న న్యూడెమోక్షికసీ తప్ప కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీలు ఈ రకమైనవే. అవి ఉమ్మడి కార్యాచరణ నుంచి పూర్తిగా దూరమై తమ పార్టీ, ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు, రాబోయే ఎన్నికలు, తమ భవిష్యత్తు ప్రధాన ప్రాతిపదికగా తెలంగాణ కోసం పెదాల మీది మాటలు దొర్లించడం ప్రారంభించాయి. అవి డబ్బాలో వేసిన ఉత్త గులకరాళ్లు.

ఇదీ ఇప్పటి స్థితి కానీ... తెలంగాణకు మళ్లీ ఒక గెట్టుపెట్టారు. గీతగీశారు. అఖిలపక్షం తర్వాత నెలలో ఏదైనా నిర్ణయం అన్నారు. అది తెలంగాణ వస్తుందా? రాదా? ఇస్తారా! చస్తారా అదికాదు సమస్య. నెలరోజులు గడువులోపు మళ్లీ ఒకసారి ఇంకా స్పష్టంగా నిత్య చైతన్యంలో ఉన్న నాలుగున్నర కోట్లమంది ప్రజలు ఆశిస్తున్న ఐక్య ఉద్యమం ఇప్పటి ఆవశ్యకత. ఇప్పుడిక తెలంగాణ మాత్రమే సమస్య. కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసే ఉన్నది. ఉద్యమ సంస్థలు గిడసబారిన తనాన్ని ఒదులకొని అన్నీ ‘ఒకే ఒక తెలంగాణ’గా మళ్లీ వీధుల్లోకి రావాల్సి ఉన్నది. ‘ఓ కాగితం పారేశాం తన్నుకు చావండి’ అంటున్న తెలుగుదేశం తెలంగాణ నాయకులు తెలంగాణ కోసం ఏ ఉద్యమం చేస్తారో? జరుగుతున్న ఉద్యమంలో ఎట్లా మమేకం అవుతారో చెప్పాల్సి ఉన్నది. చంద్రబాబు జై తెలంగాణ అంటే ఎంత అనకుంటే ఎంత? ఆయన ఎట్లాగూ తెలంగాణలో నాయకత్వానికి పనికిరాని పరాయివాడు.

ఆంధ్రుడు. మరి తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఏ ఉద్యమాలు చేస్తారో? చెప్పాల్సి ఉన్నది. జగన్ ఎట్లపోతే మనకేం గానీ ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నా రో? కూడా తెలియనతనం ఉన్న తెలంగాణ నాయకులు తామేం చేస్తారో చెప్పాల్సి ఉన్నది. మళ్లీ ఒకసారి ఉద్యమ సంస్థలు, రాజకీయ పక్షాలు, ఏకోన్ముఖంగా ఈ ఇరవై రోజులు ధూంతడాఖా చూపాల్సి ఉన్నది. ఇస్తే మంచింది. కాదంటే కాంగ్రెస్ ఖర్మ. కానీ తెలంగాణ సమాజం ఇప్పుడు జెండాలు, సిద్ధాంత రాద్ధాంతాలు వీడి మరొక్కసారి ‘ఒకే ఒక్క తెలంగాణ’ కోసం ఒక్కటి కమ్మంటున్నది. కాదంటే ఇక చివరి అవకాశం కూడా పోయిన తర్వాత చరివూతలో ద్రోహులు, డబ్బాలో గులకరా ళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు. అదీ ఉద్యమాల చరిత్ర చెప్పిన సత్యమే. పాఠమే.

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...