మైమరుపు.. మతిమరుపు


Sun,November 18, 2012 12:09 AM

జనాలలో పరివ్యాపించి ఉన్న కొంత మైమరపు వల్లనూ మరికొంత మతిమరుపు వల్లనూ చాలామంది ఇంకా, ఇప్పటికీ చెలామణి అవుతుంటారు. అడుగుపెట్టే అర్హత కూడా లేచిచోట పాదయావూతలతో జనం మధ్య అగ్గిపుట్టిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇదంతా సౌలభ్యం వల్ల. వెసులుబాటు వల్ల కూడా. అన్నీ ఎందుకు పాలమూరునే తీసుకుందాం. పాలింకిన నీరు లేని జిల్లా. అధికారంలో ఉండంగ ఆ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు రాజోలిబండ దాటి నడిగడ్డలోకి నడిచివచ్చిండు. పాలమూరులో పాదంమోపి తిరిగిండు. పైగా అభివృద్ధి చేసింది నేనే అని కూడా మాట్లాడిండు. కలలో కలవరించినట్టు పెదాల మీద ‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని ఒక మాట వేలాడదీసుకుని ముక్కుతూ మూల్గుతూ తిరిగి తిరిగి రంగాడ్డికి వచ్చి రంకెల స్థాయికి చేరిండు. కానీ ఒకే ఒక సూటి ప్రశ్న. పాలమూరు జిల్లాతో పాలెగాళ్లు పోటీపడి వేట కొడవళ్లతో కొట్లాడిన ఆర్డీఎస్ విషయంలో అయ్యా చంద్రబాబూ మీరెటువేపు? నూరు ప్రశ్నలున్నా వెయ్యను.

ప్రాంతానికి సంబంధించిన సందర్భం కాన ఒకే ఒక ప్రశ్న రాజోలి సమస్యలో మీరెటు? ఈ విషయం మాట్లాడమంటే గతంలో ఎన్నడో ఒకనాడు ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో ‘కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇదంతా ఉండేదా?’ అని చంద్రబాబు ఉల్టా ప్రశ్న వేస్తాడు. ఇది కేసీఆర్‌కు కాదు. తెలంగాణకే అవమానం. కేసీఆర్ గురించిన చర్చ కాదు ఇది. చంద్రబాబులో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న చిన్నచూపు. అహంకారం. దురహంకారం. అచ్చంగా విశాఖపట్నంలో ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న నాటి తన్నుకొచ్చిన పెత్తనం. కేసీఆర్‌కు మంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చిందా? ఇంతమంది కోటొక్కపరిసె ఇన్నేళ్ల ఉద్యమం మీద ఈ రాజకీయ దురంధురుని ఇంత చిన్నచూపు చాలదా? తెలంగాణకు నేను వ్యతిరేకం కాదంటే ఎట్లా నమ్మాలి. ఇంతమంది వీధుల్లోకొచ్చి, ఇంతమంది బలిదానాలై, ఇన్నేసి ఉద్యమాలు జరిగి, పదహారు సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ఆత్మగౌరవ పోరాటం పై ఇంత విషం చిమ్మిన నాయకుడికి మళ్లీ మనం పట్టం కట్టి పూజించాలంటాడొక బానిసకొక బానిస. ఏం చెయ్యాలి. ఆ బానిసది మైమరపు. టికెట్ ఆశ. ఎన్నికల పెట్టుబడుల ఆశ.

పెత్తందారి దగ్గర ఊడిగం చేసిన ఇలాంటి బానిసల మైమరపు వల్ల చంద్రబాబులు తెలంగాణ వ్యతిరేకత నరనరానా నింపుకున్నా, తెలంగాణ సందర్భం ఆకాశమెత్తున నిలుచున్నా పదం సీ కాలం నాటి చెరిష్మా ఉందని భ్రమ కూడా పడుతుంటారు. తెలంగాణకు సంబంధించి డిసెంబర్ 9ని కూడా వాళ్లు మరిచిపోతుంటారు. వారికి అది గుర్తే. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే అసెంబ్లీని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌నూ, కాంగ్రెస్ పార్టీ కోస్తా గద్దలను, మిన్నూ మన్నూ ఏకంచేసి చంద్రబాబు ఎంత కక్షగా, ఎంత వెర్రెత్తిపోయి తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంవూధను కూడగట్టాడో తాము మరిచిపోయి, ప్రజలను మరిచిపోవాలని కోరుకుంటారు. కానీ ప్రవీణ్ రెడ్డి అనే ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టి చంద్రబాబు కుట్ర బుద్ధిని బట్టబయలు చేస్తాడు. అచ్చంగా వచ్చిన తెలంగాణకు అడ్డంపడ్డ చంద్రబాబులో అక్షరం కూడా అక్కరకురాని ఒక లేఖ రాసిన చంద్రబాబులో కొందరు తెలంగాణ అనుకూలతను కూడా చూసే సాహసం చేస్తారు. ఎందుకంటే ప్రజలదంతా మతిమరపు అని వీరి భావన. అఖిలపక్షం పెట్టుమని అడుగుతారొక అమాయక చక్రవర్తి. ఇది సందర్భం కనుక ‘అన్ని వేదాల్లోనే ఉన్నాయి ష’ అన్నట్టే అఖిలపక్షం అసలు గుట్టు కూడా శ్రీకుట్ర కమిటీ ఎనిమిదవ చాప్టర్‌లో ప్రవచించి ఉంది.

తెలంగాణ ఇయ్యకుండా ఉండడానికి ఎత్తులు, జిత్తు లు, మాయలు, మర్మాలు, కుట్రలు, కుతంవూతాలు, అణచివేతలు, అమ్మడాలు, కొనడాలును ప్రబోధించిన శ్రీకుట్ర కమిటీ 8వ చీకటి అధ్యాయంలో ‘శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాగానే కేంద్రం తెలంగాణ అంశంపై విస్తృతస్థాయిలో చర్చలు జరుపాలనుకుంటున్నదని ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పా లి. కానీ ఈ చర్చలు ఎటువంటి నిర్ణయాత్మక దిశగా సాగకుండా అన్ని రకాల ఎత్తుగడలు అవలంబించాలి. ఉద్యమం అదుపులోకి వచ్చే వరకు ఈ అంశాన్ని ఇట్లాగే సాగదియ్యాలి.’ అని అచ్చుగుద్ది ఉన్నది.

ఇదీ శ్రీకుట్ర గీతసారం. నమస్తే తెలంగాణలో మొత్తం నివేదిక ప్రచురితం అయింది. తెలుగులో మరే పత్రికా ఈ సాహసం చేయలేదు. ఆనివేదికలో ఇంత స్పష్టంగా అఖిల పక్షం పేరిట, మాటున ఎట్లా తెలంగాణను నిర్వీర్యం చెయ్యాలో, సాగదియ్యాలో స్పష్టంగా రాసి ఉంది. అయినా అఖిల పక్షం సంగతులు మాట్లాడేవాళ్లు కూడా తెలంగాణ కోసం మాట్లాడినట్టు జనం అనుకోవాలని పాత కథలు, ద్రోహాలు, కుళ్లూ, కుట్రా మరిచిపోవాలని మళ్లీ మళ్లీ మాట్లాడేవాళ్లను అనడానికి కూడా మాటలు చాలడం లేదు. అసలు భాషలోకి వెళ్తే... ఆక్రోశం కమ్ముకుంటే, ఇంత పచ్చి వంచన అని ఆగ్రహిస్తే...క్షమాపణలు కోరతారు. సామూహికంగా, కూడ బలుక్కున్నట్టుగా.. ఒక క్యాంపెయిన్‌లాగా... తెలంగాణకు అనుకూలంగా ఇదంతా జరుగుతున్నట్టు భ్రమింపజేయడానికి తంటాలు పడ్తున్న ‘థాట్ పోలీసింగ్’ ..మీడియా బహురూపుల వేషాల్లో తెలంగాణ ఒక శాపక్షిగస్థ అపరాధి. అనాథ. కానీ ఇదంతా నిజంగానే చెలామణి అవుతుందా? నిజంగానే ప్రజలది షార్ట్‌మెమొరీయేనా? తెలంగాణ ప్రజలు నిజంగానే గందరగోళ పడతారా! పదహారు సంవత్సరాలుగా ఈ ప్రచారం నడుస్తూ ఉన్నది.

రోసిపోయింది తెలంగాణ. అదేమీ విరమించలేదు. ఏ ఉద్యమమూ ఆగలేదు. మళ్లీ ఒక కదలిక కనబడితే అంతస్సూవూతంగా ఒకదాడి ప్రారంభం అవుతుంది. నిజమే కొన్ని మాట్లాడగూడ దు నిజమే సంయమనంగా ఉండాలి. నిజమే దళితుల పట్ల, స్త్రీలపట్ల, పిల్లల పట్ల, ఇతర అణగారిన వర్గాల పట్ల, వారి గురించి మాట్లాడినప్పుడు సంయమనమూ ఉండాలి. పొరపాటు మాట్లాడినప్పుడు విచారం పశ్చాత్తాపం ప్రకటించడానికి మించి ఏదీ ఉండదు. దానికి వంత రాగాల పొడిగింపు దేనికి.. గీతాడ్డికి క్షమాపణ చెప్తున్నప్పుడు కోదండరాం మొఖంలో విచారం చాలదా కానీ దాడి ఎందుకు పదే పదే జరుగుతుంది. ప్రజలకు అర్థం కాదా? కోదండరామ్ మాట్లాడిన మాట లు తప్పని మనం చెప్పడం కాదు. ఆయనే చెప్తున్నాడు. ఒక పాత విమర్శ చంద్రబాబు నోటి నుంచి మళ్లీ వచ్చినా, ఒక పాత పద్ధతి దాడి కోదండరామ్ మీద పదే పదే జరుగుతుందన్నా, అఖిలపక్షం అనే ఒక చీకటి అధ్యాయపు ఎజెండాను తెలంగాణ వాళ్లే మళ్లీ మళ్లీ జెండా మీదకు తెస్తున్నారన్నా.. చంద్రబాబును, షర్మిలను మాత్రమే అడ్డుకోవడం ఎందుకు? అందరినీ అడ్డుకోవాలని పిలుపిచ్చే అంతస్సూత్రం నిఖార్సయిన తెలంగాణ వాదమేనా? భ్రమ. చాలామంది మైమరపు వల్లనూ, మతిమరుపు వల్లనూ భ్రమలకు లోనవుతుంటారు.

చంద్రబాబు, ఆయన బానిసలందరిదీ ఒక భ్రమాజనిత ఊహా స్వప్నం. అదొక కల. తెలంగాణ రాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాకుండా ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబు మొదలు పెట్టిన అడ్డుకునే యజ్ఞాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిభావంతంగా కొనసాగించాయి. శ్రీకృష్ణను తలచుకొని 8వ అధ్యాయాన్ని పొల్లుపోకుండా మూడేళ్లుగా అమలు చేస్తూనే ఉన్నారు. ఫలితాలూ ఉన్నాయి. ఉద్యమంలో పొడసూపిన అన్యధోరణులు, ఉద్యమంలో వచ్చిన చీలికలు, అనైక్యత, తయారైన నాయకత్వం అంతా కుర్చీల మీద కన్నేసి, సాదాసీదా రాజకీయ నాయకత్వపు అవలక్షణాలను అందిపుచ్చుకున్న తీరు. ఉద్యమ స్వభావంలో ఉండే నిస్వార్థం, ఆశించకపోవడం, లక్ష్యం మీద అచంచల విశ్వాసం, గురికన్నా, తెలంగాణలో ముందే ఎవరి భాగస్వామ్యం ఎంతనే విచ్ఛిన్నత, ఉమ్మడి అస్తిత్వ భావనలకు తూట్లు పొడిచిన స్థితిగతులు ఈ 8వ చాప్టర్ అమలులో భాగమే. మూడేళ్ల కాలం లో తెలంగాణ ఉద్యమం అద్భుతమైన నాయకత్వాన్ని తయారు చేసింది. కానీ ఏ నాయకత్వంలోనైనా, కాని కాలంలో వచ్చే విపరిణామాల ప్రభావం ఉన్నట్టే, కొంత కీర్తి కండూతి, కొంత అధికారలాలస, కొంత ధనవ్యామోహం, కొంత పద వీ వ్యామోహం, ఉద్యమ ఫలితాలు రాకముందే కొంత భాగస్వామ్యం కోరిక ఇవ న్నీ నాయకత్వాలను విచ్ఛిన్నం చేశాయి.

ఒక ఉమ్మడి నాయకత్వం రూపుదిద్దుకోకుండా యూనివర్సిటీలను కమ్మేసిన పోలీసు కోవర్టు విధానాలు విద్యార్థులను విచ్ఛిన్నం చేసిన కనపడని శక్తులు. ఎన్నని ఎన్నని.... కానీ ఉద్యమ సందర్భం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తున, ఉవ్వెత్తున ఎగిసిపడ్తూనే ఉన్నది. అదొక ఆకాంక్ష. శత్రు మిత్రుడెవడో? ఎవడు నిఖార్సయిన తెలంగాణవాది? ఎవడు ద్రోహి, ఎవడు నిలబడ్డవాడు అన్నది తేల్చుకునే సత్తా తెలంగాణ ప్రజలకు ఉంది. ఉమ్మడి ఉద్యమ ప్రయత్నాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ దాడులు తీవ్రమవుతుంటాయి. తెలంగాణకు ద్రోహులైన వారు, తెలంగాణను అడ్డుకున్నవారు, తెలంగాణ కోసం పార్లమెంటులో పక్కలో శత్రువు ప్లకార్డు పట్టుకున్న వాడు కూడా తెలంగాణ గురించి నంగినంగి మాటలుమాట్లాడగలరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మతిమరుపు గలవారు. మోసం చెయ్యవచ్చు. అబద్ధాలు ఆడి చెలామణి కావొచ్చు. ఆశపెట్టవచ్చు. ఆశించిన బానిసలను తయారు చేసుకోవచ్చు. యాభై ఆరేళ్లుగా జరుగుతున్న ద్రోహం. కపటం. మోసం, ఇంకానా.. ఇకవైనా.. ఇక చెల్లె లు షర్మిల కూడా వస్తుంది. ఆహ్వానించండి. తెలంగాణపైన కాంగ్రెస్ తేలిస్తే అభ్యంతరం లేదంటుంది. వెంట పోలీసులుంటారు. కాన్వాయ్ ఉంటుంది.

చెలామణి అవుతుంటుంది. ‘తె’ అంటేనే అగో తెలంగాణ అనుకునే కొత్త బానిసలూ ఉంటా రు. కనుక మరచిపోదాం మూడేళ్ల కింద డిసెంబర్9న తెలంగాణ ప్రక్రియ ప్రకటనను మరచిపోదాం వెయ్యి బలిదానాలను, మరచిపోదాం సకల జనుల సమ్మె మరచిపోదాం బొగ్గుగనుల మీద ఎగరేసిన తెలంగాణ జెండాను. అది వారి ఆశ. అది కొత్త పాత బానిసల ఆశ. భ్రమాజనిత ఊహా స్వర్గం. కానీ కానీ ... ఒకేఒక సూటివూపశ్న. చిత్తూరుకు చెందిన చంద్రబాబు, కడపకు చెందిన జగన్‌రెడ్డి, చిత్తూరు కే చెందిన కిరణ్‌కుమార్‌డ్డిల రాజ్యం కోసం పనిచేసే సకల బానిసలారా! మీలో మీసమున్న వాళ్లెవరూ లేరా? కొంగు నడుముకు చుట్టుగలిగిన వారెవరూ లేరా! తెలంగాణ కోసం తెలంగాణ నాయకుడెవరూ లేరా! ఉంటే ఉలుకెందుకు? బానిస బుద్ధి పదే పదే చాటుకోవడం ఎందుకు? తెలంగాణ కోసం మాట్లాడండి. పొరుగు నాయకత్వాల నుంచి విముక్తం కండి... తెలంగాణ రాజ్యం కోసం మాట్లాడండి. జనానికి మైమరపు, మతిమరుపు తెలంగాణ సందర్భంలో లేదు. పాపాల చిట్టా ఒకటి చాంతాడులా పెరుగుతూ ఉన్నది. జాగ్రత్త..

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...