జై బోలో తెలంగాణ...శంకర్


Sun,October 14, 2012 12:30 AM


ప్రాణహితకు ‘జైబోలో తెలంగాణ’కు పేగు సంబంధం వుంది. ఎందుకంటే శంకర్ ప్రాణహిత ప్రేమికుడు. ప్రేరణ నాకదే అని చెప్పినవాడు. కాలమ్ సంగతి పక్కనబెట్టినా శంకర్ ఆ కాని రంగుల ప్రపంచంలో కూడా తెలంగాణ నదులను, ప్రాణహితలను, పువ్వులను, పల్లెలను, బతుకమ్మలను, బోనాలను ప్రేమించినవాడు. సినిమా మనం ఊహించిన దానికన్నా బలమైన ప్రసార సాధనం. తెలంగాణ తనను తాను మరచి ఆధిపత్య సంస్కృతినే తన సంస్కృతిగా, ఎన్టీఆర్‌నూ, ఏ ఎన్నార్‌ను, శోభన్‌బాబును తమ ఇంట్లో దేవుడిగా, కథానాయకుడిగా ప్రేమించింది ఈ ప్రసార సాధనం వల్లనే. కోస్తాంధ్ర పెత్తందారీ వలస, ఎక్కి తొక్కొచ్చిన పెట్టుబడులు ప్రజానాట్యమండలి వాహికగా అభ్యుదయమై ఊరేగుతూ ముందు మద్రాసుకు, ఆ తర్వాత విశాలాంధ్ర ‘ప్రగతిశీల’ భావనయై హైదరాబాద్‌కు చేరిన క్రమమంతా పెట్టుబడుల ప్రవాహ క్రమమే. ఆ పెట్టుబడుల పరిరక్షణ, వలస పెత్తందారీ ఆధిపత్యపు పరిరక్షణ, భావనల సమర్థన పాత్రను ముందు పోషించింది ఈ బలమైన ప్రసార సాధనయే. అందుకే కనపడవు గానీ, పెద్దగా పట్టించుకోము కానీ ఈ హైదరాబాద్‌ను అడ్డగోలుగా దోస్తున్నదీ, ప్రభావితం చేస్తున్నదీ ఇప్పటికీ సినిమాయే. అలాంటి సినిమా ప్రపంచంలో జైబోలో తెలంగాణ అంటూ ఏటికి ఎదురీదిన వాడుగా, ఒకే ఒక్కడుగా సినిమా ప్రసార సాధనాన్ని దారిమళ్లించి, తెలంగాణ మార్గం పట్టించడానికి తన దారి లో తాను పనిచేసినవాడుగా శంకర్ నిజంగా సంచలనమే. శంకర్‌లో ప్రవహించే తెలంగాణ పోటెత్తిన నెత్తురు ఆయనతో జైబోలో తెలంగాణ అని ఆర్సి కేకలు పెట్టించింది. ఆ విధంగా శంకర్ సినీరంగంలో ఒక మంకెన పువ్వు.

సకల జనుల సమ్మె జరుగుతుండంగ, అది తెలంగాణ జీవన్మరణ సమస్యగా సబ్బండవర్ణాలు, సకల జనులు తొక్కిడితొక్కిడిగా వీధుల వెంట నడుస్తుండగా ‘దూకుడు’ నైజామ్‌లో కలెక్షన్లు దూకించుకున్నది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని. పెద్దగా గమనించం కానీ ఇవ్వాళ్ల హైదరాబాద్‌లో కానీ, శివార్లలో కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్లు ప్లాట్లు గా విస్తరించిన క్రమంలో రాజకీయవేత్తలు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల కన్నా ఎక్కువ భూములను గుప్పిట్లో పెట్టుకున్నదీ ఈ సినీ మాయగాళ్లే. నాలుగు సామ్రాజ్యాల పడగ నీడన, నాలుగు కుటుంబాల పడగ నీడన హైదరాబాద్‌తో సహా మొత్తం సినిమా రంగమంతా ఒక వ్యవస్థీకృతమైన ఆధిపత్య భావజాల ప్రసారకర్త, సంధానకర్త పాత్ర పోషిస్తున్నది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, నరనరానా నిలు తెలంగాణ పట్ల వివక్షను, గుడ్డి వ్యతిరేకతను, అల్పభావనను నింపుకొని ప్రచారం చేసేదీ ఈ సినిమా రంగమే. పైగా సినిమాల సాధనానికున్న మంత్రముగ్ధ సానుకూలత వల్ల ఒక్క తెలంగాణ మైమరుపే కాదు, సినిమా ఇండస్ట్రీ చుట్టూ జరిగే వ్యాపారమంతా నాలుగు కుటుంబాలను కార్పొరేట్లకు దీటుగా కోట్లాది ఆస్తులకు పడగపూత్తించి గుత్త సామ్రాజ్యాలను తయారు చేసిందీ ఈ సినిమా రంగం. సినిమాలో దేవుళ్ల వేషాలు వేసి, స్టాలిన్ వేషాలు వేసి, ఉద్ధారకుల వేషాలు వేసి, చాపకింద నీరులా అటు ఎన్టీ రామారావు, ఇటు చిరంజీవి దాకా తెలుగుజాతి పేరిట ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో ఒక సమ్మతిని సాధించి తెలంగాణ భావనలను మరింత ధ్వంసం చేసిందీ వీళ్లే. 1969 వైఫల్యం అనంతరం తెలంగాణ కనీసం ఎనిమిదవ దశకంలో కానీ తొమ్మిదవ దశకంలో కానీ పూర్తి విధ్వంసం అయినా పల్లెత్తు మాట మాట్లాడని స్థితిని, మైకాన్ని కల్పించిందీ ఈ సినీ మాయామోహమే. ఆ సినీ మాయామోహమే ‘తెలుగు జాతి మనది’ గొప్ప జాతి ఒక్కటిగా ఉందాం. కలిసి ఉంటే కలదు సుఖం, తెలుగు జాతి ఆత్మగౌరవం లాంటి భావనలను ప్రచా రం చేసి తెలంగాణ ఆత్మగౌరవ భావనలను పాతాళంలోకి నెట్టిందీ ఈ సినిమా రంగమే. అదిగో అలాంటి సినిమారంగంలో శంకర్ భిన్నంగా నిలిచినవాడు. తను తెలంగాణ సినిమా తీస్తే ఆ రంగంలో నూకలు చెల్లినట్టే అని తెలుసు. అంతకు ముందు ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా! లాంటి సినిమాలు తీసి సక్సెస్ సాధించినా జైబోలో తెలంగాణ అంటే సినిమా రంగం ఎట్లా మెత్తని కత్తితో మెడ తెగటారుస్తుందో తెలుసు. అయినా ఈ నేల మీద ప్రేమ, ఈ నేల ఆయనకు నేర్పిన రాజకీయ, సామాజిక విశ్వాసాలు, బాల్యం, యవ్వనం ఆయనకు అందించిన అనుభవాలు, గద్దరన్న మీద ప్రేమ, తను గడిచివచ్చిన నల్లగొండ నేల మీద ప్రేమ, శంకర్‌ను నిటారుగా ఒక లక్ష్యం వేపు నిలబెట్టిన అంశాలు. అవును శంకర్ నిలబడ్డాడు. తన నేల కోసం

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తీరు, ఆ ఉద్యమం పట్ల అవగాహన, సినిమా రంగంలో ఉన్నప్పటికీ, చుట్టూ జిలుగు మాయామోహపు ప్రపంచం ఉన్నప్పటికీ, ఒక ఉన్మాద ఆవరణలో జీవిస్తున్నప్పటికీ శంకర్‌కు తను ఏమిటో? ఏ నేల మీద మొలకెత్తిన విత్తనమో తెలుసు. అందుకే అతను ఆత్మబలిదానాలకు కన్నీరు కార్చాడు. కావొచ్చు ఒక సినిమా దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ ప్రఖ్యాతి పొందే, ఆదరణ ఉండే విషయమున్న స్పృహ ఉండి ఉండవచ్చు. కానీ ఒక శ్రీకాంత్‌చారి మర ణం ఆయనను కుంగదీసి ఉండవచ్చు. భద్రంగా ఉన్న ఈ సినిమా ప్రపచంలో ఒక బలిదానం ఆయన కన్నీటి నిండుగా నిండుకొని ఉండవచ్చు. అందుకే శంకర్ దిక్కులు పిక్కటిల్లేలా ‘జై బోలో తెలంగాణ’ అని నినదించాడు. చాలామందికి లాగే శంకర్‌కు నేనంటే ఎంత ప్రేమో అన్ని ఫిర్యాదులూ ఉన్నాయి. నా గురించి రాయలేదన్నా అనేవాడు. నారాయణమూర్తికీ అంతే. నేను తార్కోవ్‌స్కీ సినిమాలను ఇష్టపడిన వాణ్ని. రో మన్ పొలాన్ స్కీ ‘ది పియానిస్ట్’ను అకిరా కురసోవా ‘రోష్ మాన్’ను ఇట్లా పెద్దలిస్టే. సత్యజిత్‌రేను, మృణాల్‌సేన్‌ను, శ్యామ్‌బెనెగల్‌ను, గౌతమ్ ఘోష్‌ను, బుద్ధదేవ్ భట్టాచార్య ‘ఆంధీ గలీ’ని తెలిసిన వాణ్ని. తెలుగు సినిమాల్లో మా భూమి, ఒక ఊరికథ తప్ప మినహాయింపులు లేకుండా తరతమ భేదాలతో అస్సలే ఇష్టపడని వాణ్ని. ఆ రంగం జోలికి పోబుద్ధి కాదు. పైగా తెలంగాణ స్పృహ, మీడియా ప్రభావాల స్పృహ, నాకు తెలుగు సినిమాల మీద ఏవగింపు కలిగించి, ఇదొక సినిమా రంగం అని గుర్తించని వాణ్ని. అటు నారాయణమూర్తి, ఇటు శంకర్ నా నుంచి ఏమైనా రాస్తే బాగుంటుంది అన్నవాళ్లే. అనుకున్నవాళ్లే కానీ మనసొప్పదు. నారాయణమూర్తి భిన్నమైన వాడు ఒప్పుకుంటాం. ఆయన సినిమాల థీమ్‌లూ గొప్పవే. కానీ ఆ సినిమాలు తీసిన తీరు మీద అభ్యంతరం. అది ఆయనతో చెబితే మీకు మేధావిత్వం వల్ల సినిమా పల్స్ తెలియదని ఇద్దరం వాదులాడుకునేవాళ్లం. శంకర్‌తో అంతే. ప్రధాన స్రవంతి సినిమాల్లో రాయడానికి ‘మేకింగ్’లో తెలివితేటలు, కాపీ జ్ఞానం తప్ప ఏమీ వుండదన్నది నా నిశ్చితాభివూపాయం. అందుకే శంకర్ మీద నేనేమీ రాయలేదు.కానీ, అలాంటి నాతో శంకర్ కథచెప్పి కళ్లనీళ్లు పెట్టించాడు. జీవితంలో ఎన్నడూ ఊహించని తీరుగా ఒక్కరోజు షూటింగ్‌తో అయిపోతదన్నా అని చెప్పి మూడు నెలలు నన్ను జైబోలో తెలంగాణ చుట్టూ నటింపజేశాడు. జీవితంలో నటన తెలియదు. బహుశా ఆ సినిమాలో నేను నటించింది కూడా ఏమీలేదు. కానీ ఆ సినిమా అవసరం బాగా తెలిసివచ్చేలా చేశాడు శంకర్. షూటింగంతా బంజారాహిల్స్‌లో పాడుబడ్డ హోటల్‌లో వేసిన సెట్టింగ్‌లోనే ఒకరోజు. చారి కాలిపోయి ఆస్పవూతిలో ఉన్న సీన్. నిజంగా అంతా కృతకంగా ఉంటుంది. సినిమాయే ఒక కల్పన. ఆ కల్పనకున్న మాంత్రిక మార్మికత వల్ల ఆకర్షణ. ఆకృతకత్వంలో చారి పాత్రధారి బెడ్ మీద దూదిచుట్టి రక్తపురంగులద్ది బెడ్ మీద. చుట్టూ మల్లేపల్లి లక్ష్మయ్య, జూలూరు గౌరీశంకర్, దేశపతి శ్రీనివాస్, వేదకుమార్ ఇంకా అనేక మందిమి. ఏడుపు సీన్ అన్నా ఏడ్చినట్టుండాలె అంటడు శంకర్. నిజంగానే ఏడుపు నటించడం వచ్చా. ఆసీన్ తయారీలు, రిహార్సల్స్ ఆషామాషీగా తీసుకున్న మాకు.. అది దృశ్యమానమవుతున్న క్రమంలో ఏడుపు తన్నుకొని వచ్చింది. గ్లిసరిన్ అవసరం లేని కల్మషం లేని కంటినీరు.. ఆ సీన్ మమ్మల్ని ఏడిపించింది. నిజానికి అది కల్పన అని తెలుసు. అక్కడ నటిస్తున్నామనీ తెలుసు. కానీ మా మనసులో నూ శ్రీకాంతాచారి ఉన్నాడు. మా మనసులో అప్పటికే యాదయ్య ఉన్నాడు. అప్పటికే మా మనసులోనూ నిస్సహాయత ఉంది. బహుశా అట్లా ఏడుస్తామని మేమెవరం ఊహించలేదు. ఆ దృశ్యం అయిపోయినంక ఒక గంభీర వాతావరణం. ఎవది దుఃఖం లో వాళ్ళున్నంత నిశ్శబ్దం. బహుశా శంకర్ ఊహించిన విజయం అదే కావచ్చు.

దేవుళ్లకు వజ్ర వైడూర్యాలు పెట్టి, అల్లూరి సీతారామరాజు కూడగట్టిన గిరిజన యువతులకు పట్టురవికెలు తొడిగి, పురాణాల, చరివూతను అష్టకష్టాలు పడి భ్రష్టు పట్టించేంత కాల్పనిక జగత్తు సినిమా అందువల్ల నాకు ఆవగింజంత సదభివూపాయం లేదు. శంకర్ నా ప్రాణహిత చదువుతుంటే సినిమా ప్రారంభం అవుతుందని మొహమాటపెట్టి ఈ సినిమాలోకి లాగాడు. కానీ ఆతర్వాత శంకర్‌తో ఆ మూడు నెలలూ ఒక ఉద్యమంలాగా నడిచింది. ఒక బండమీద కాలుపెట్టి జగపతిబాబు వెనుక నిలుచోబెట్టి రోజంతా ఒకే దృశ్యాన్ని చిత్రీకరించినా, ఎర్రటెండలో ఒక్క సెకన్ సీన్ కోసం నల్లగొండలో వేలాదిమంది ముందు మమ్మల్ని నిమిత్తమావూతులను చేసి సినిమా తీసి నా, వరంగల్ ఖిల్లాలో అమరవీరుల స్తూపాల ముందు పత్రిజ్ఞలు చేయించినప్పుడు ఈ జగపతిబాబు ఏంది బాబూ అని అనిపించినా, చివరికి నిజంగానే ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఏంది సార్ మీరు ఇట్లా, అవసరమా? ఆ జగపతిబాబేంది. ఆయన వెనుక మీరు నిలుచుండుడేంది? అన్నప్పుడు పిచ్చినవ్వునవ్వి మొహమాటంతో మాట రాకుండా నిలబడినా శంకర్‌తో ఉన్న ప్రేమపూర్వక సంబంధమే. మనిషిగా శంకర్ మంచితనమే. ఎన్‌కౌంటర్ సినిమా తీస్తున్నప్పుడు అప్పుడే సినిమా కలలుకంటున్న శంకర్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, అన్నా! ఎన్‌కౌంటర్ డైలాగులు రాసి పెట్టమని ఎంత బతిమాలినా పైమనస్యం వల్ల ఆయనకు ఏదీ రాసివ్వలేదు. కానీ శంకర్ ఒక మానవ సంబంధాన్ని, అందునా తాను ఇష్టపడి, ప్రేమించే మానవ సంబంధాన్ని, ఎన్నడో యవ్వనంలో ఎత్తిన ఎర్రపతాక సంబంధాన్ని వదులుకోడు అనేది నా జై బోలో తెలంగాణ నటనా మొహమాటంలో రుజువయింది. శంకర్ ప్రేమించదగినవాడు.

పూర్తి ప్రతికూల రంగంలో, తాను అనుకున్నది సాధించిన శంకర్‌కు ఉత్తమ దర్శకు డు అవార్డు ఒక వన్నె. ఒక చరివూతను సినిమా తీయడం కష్టమేమీ కాదు. అది నిశ్చల చిత్రం. కానీ ఒక నడుస్తున్న చరివూతను, నడుస్తూ నడుస్తూ సినిమా తీయడం సాహసమే. జైబోలో తెలంగాణ ఒక నడుస్తున్న చరివూతను ఒడిసిపట్టిన సినిమా. జాతీయ సమక్షిగతా అవార్డు ‘జైబోలో తెలంగాణ’ లాంటి విభజనోద్యమ సినిమాకు ఇవ్వడం మిలీనియం జోక్ అని నాకు మెసేజ్‌లు పెట్టారు. ఆయన సినిమాకు ఉత్తమ సినిమా ఇవ్వాల్సి ఉండే. ఇదెందుకిచ్చారని, ఆ మెసేజ్‌లో కొనమెరుపులూ ఉన్నాయి. కానీ విడిపోయి కలిసుందాం. తెలుగు వాళ్లమే కనుక విద్వేషాలు వద్దు అని చెప్పినందుకు ఈ సినిమాకు ఆ తరహా అవార్డు ఇచ్చి ఉంటారు. ముగింపు తెలియని ఒక సినిమా తీసిన గొప్ప కళాకారుడు శంకర్. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. సినిమా నడుస్తున్నప్పుడే కృష్ణ కమిటీ వచ్చింది. నివేదిక వచ్చింది. ఏం జరుగుతుందో? తెలియదు. ఎలా ముగించాలో తెలియదు. ఇదంతా ఒక పకడ్బందీ ప్రణాళికతో నడిచేది కాదు. నడుస్తున్న చరిత్ర నడుస్తూ తీయాలి. అందుకే డైలాగ్‌ల నుంచి శుభం దాకా శంకర్ మా మీద కూడా అంతో ఇంతో ఆధారపడ్డాడు. కానీ.. మేం చెప్పింది విన్నట్టే ఉండేవాడు. తలూపేవాడు. సినిమా తీయడం మాత్రం ఎక్కడా రాజీపడేవాడు కాదు. సినిమాటిక్ కళకు, మేం చెప్పే విషయాలకు మధ్య ఉండే అంతరం అతనికి తెలుసు. అయి తే ఈ సినిమా గొప్పదా? గొప్ప మేకింగా? కళాఖండమా? తెలంగాణ సినిమాను ఇట్లాగేనా తీసేది? అంటే నా వద్ద సమాధానాలు లేవు కానీ.. ఒక ప్రతికూల వాతావరణంలో ఏటికి ఎదురీది, తెలంగాణ సినిమాను ఎడారిలో నీటి చెలిమెను పుట్టించినట్టు పుట్టించి విజయవంతమైన శంకర్‌కు నా హృదయపూర్వక నమస్తే.గద్దరన్న చాలాకాలం తర్వాత ఒక దృశ్యమానంగా మార్చింగ్ సాంగ్‌ను కలగన్నాడు. ఆ కల మార్మోగింది. అది మలి తెలంగాణ ఉద్యమ మకుటమయింది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమైన మా అన్న గద్దరన్నకు అవార్డు రావడం కొత్తగాదు. ఏ అవార్డూ గద్దర్ గళానికి సాటిరాదు. ఆ కంఠస్వరం ఒక అంతర్జాతీయ గీతిక. ఆ పాటకు వందనం. మిట్టపల్లి సురేందర్ గీతానికి వందనం. పోరు తెలంగాణ సినిమా తీసిన రసమయిబాలకిషన్‌కి ‘ఇంకెన్నాళ్లు’ సినిమాతో ఒక అవార్డు సాధించిన రఫీకి మొత్తంగా తెలంగాణ సినిమాకు అభినందనలు.హెచ్చరిక: అవార్డులిచ్చి సినీ మాయా రంగం తెలంగాణనూ తనలో కలిపేసుకుంటున్నదన్నదీ సత్యమే. అవార్డులిచ్చారు. స్వీకరణలు, వివాదాలు, వ్యక్తిగతాలే. ఈ ఉద్య మ పరిధి విస్తృతమైంది. ప్రజాస్వామ్యమయినది. ఎల్లలు లేనిది. లొంగిపోనిది అని విశ్వసిస్తూ... మైమరపు వద్దని హెచ్చరిస్తూ...

-అల్లం నారాయణ
allamnarayana@yahoo.co.in

35

Allam Narayana

Published: Wed,March 15, 2017 12:20 AM

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వె

Published: Wed,May 18, 2016 03:34 AM

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ము

Published: Sun,June 15, 2014 01:22 AM

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యా

Published: Sun,June 1, 2014 02:25 AM

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని

Published: Sun,May 25, 2014 12:31 AM

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధం

Published: Sun,May 11, 2014 12:32 AM

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్

Published: Sun,May 4, 2014 01:59 AM

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిం

Published: Sun,April 27, 2014 01:41 AM

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన

Published: Sun,April 20, 2014 01:56 AM

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య వ

Published: Thu,April 3, 2014 02:35 AM

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మే

Published: Sun,March 30, 2014 12:51 AM

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య.

Published: Sun,March 23, 2014 04:50 AM

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావ

Published: Sun,March 2, 2014 12:43 AM

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్

Published: Wed,February 19, 2014 12:17 AM

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల

Published: Sun,February 9, 2014 12:32 AM

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చ

Published: Sun,February 2, 2014 01:57 AM

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్

Published: Sun,January 19, 2014 12:27 AM

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే

Published: Sun,January 12, 2014 12:54 AM

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ,

Published: Sat,January 11, 2014 02:32 AM

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే

Published: Sun,December 29, 2013 01:17 AM

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల

Published: Mon,December 9, 2013 02:56 AM

తెలంగాణకు కలమొడ్డిన కట్టా

తెలంగాణ ఇటీవల చరిత్రలో మూడు ఉద్యమ సందర్భాల్లో బుద్ధిజీవులను, చదువరులను, విద్యావంతులను, కవులను, రచయితలను కళాకారులను కదిలించింది. తె

Published: Sun,October 27, 2013 01:05 AM

అమ్మో.. ఆ ముగ్గురు బాబులు

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే... భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భ

Published: Sun,September 29, 2013 02:36 AM

విభజన: మేడ్ డిఫికల్ట్

సరిగ్గా రెండు నెలలు. జూలై 30 ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్కడున్నది. అక్కడే. నిజాం కాలేజీ మైదానంలో సకల జనభేరి జరగబోతున్నది. లక్ష

Published: Sun,September 22, 2013 02:15 AM

అమ్మా మీకు దండం.. కలిసుండలేం..

అమ్మా మీరు పెద్దలు. పూజ్యులు. గొప్పవాళ్లు.. సరిగ్గా మీరక్కడ రాష్ట్రపతి భవనం ముందర ‘ఫ్యాషన్ పరేడ్’లాగా పట్టువస్త్రాలు, వజ్రవైఢూర్యా

Published: Sun,September 15, 2013 12:33 AM

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!

లేలే.. మీరుసాబు... లేవవయ్య మీరుసాబు. అలయ్‌ల దుంకి పీరీల గుండంలకెల్లి లేచి రావాలె కులీకుతుబ్‌షాలు, తానీషాలు. నౌబత్ పహాడ్ మీదికెల్లి

Published: Sun,September 8, 2013 12:27 AM

దండయాత్ర.. దాడి.. గుండెగాయం

‘కమాండర్ షుడ్ నాట్ బీ ఎ కానిస్పిరేటర్’ అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. దళాధిపతి కుట్రదారు అయితే ఎట్లా ఉంటుందో? రుచ

Published: Sat,August 24, 2013 11:58 PM

అవును..హైదరాబాద్ తెలంగాణ సొత్తే

కాచిగూడ స్టేషన్‌రోడ్డు. బూర్గుల రామకృష్ణారావు వారి వారసుల ఇల్లొకటి చాపల్‌బజార్‌కు మళ్లే చౌరస్తా మూలమీద పాతబడిపోయి ఉన్నది. జిగేల్‌మ

Published: Sun,August 18, 2013 01:11 AM

చచ్చిన శవం కోసం....

తిరుపతిలో... పుణ్యక్షేవూతంలో..కేవలం విద్వేషంతో,కొంచెం ముదిరిన ఉన్మాదంతో వీ.హనుమంతరావు (హన్మన్న) మీద దాడి చేస్తే సమైక్యాంధ్ర సాధ్

Published: Sun,August 4, 2013 01:39 AM

కాలం చెల్లిన సమైక్యాంధ్ర

మా డానీ నాకు మూడు దశాబ్దాల మిత్రుడు. తత్వశాస్త్రంలో వేళ్లూ కాళ్లూ పెట్టీ ‘నెగేషన్ ఆఫ్ నెగేషన్’నే నెగేట్ చేస్తూ బీఎస్ రాములూ, డాన

Published: Sun,July 28, 2013 12:36 AM

సందేహమూ... సంబురమూ..

డిసెంబర్ 9. తెలంగాణకు చారిత్రక దినం. ఆ ప్రకటనకు ముందు ఉరుములు మెరుపులు ఉద్యమానివి. ఒకవంక కేసీఆర్ దీక్ష. క్షీణించిన ఆరోగ్యం. మరోవంక

Published: Sun,July 21, 2013 01:55 AM

మనం విడిపోయే వున్నాం...

ఇన్ని చరిత్ర పేజీల మీదుగా గడచి వచ్చిన తర్వాత నడచి వచ్చిన తర్వాత ఇన్ని మరణాలనూ మనసు పొరల్లో నింపుకుని మ్రాన్పడి మౌన సంతాపాలూ ప్రక

Published: Sun,July 14, 2013 04:06 AM

కోర్‌కమిటీ అసంబద్ధ నాటకం..

ఒకే అసంబద్ధ నాటకం మరోసారి మీ కోసం * కేతిగాడు మరోసారి తెరతీశాడు నగరం నడిబొడ్డులోని ప్రేత సౌధం వేదికగా పాత్రధారులు గళవిన్యాసం ప్

Published: Sat,July 6, 2013 11:53 PM

ఆ హత్య ప్రజాస్వామ్యానికి హెచ్చరిక

పోరాటమే నా ఊపిరి. పోరు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది’ అని గంటి ప్రసాదం వేరే అర్థంలో మాట్లాడి ఉండవచ్చు కానీ, పోరులేని ప్రాంతంలో వేట

Published: Sun,June 30, 2013 12:11 AM

అబ్బర పులీ....తోక బారెడు

‘అబ్బర పులీ అంటె తోకబాడు’...‘తె’ అంటే తెలంగాణ ఇచ్చినట్టే. తెలంగా ణ అనుభవాల సారం ఏమిటంటే పులి ఉండదు. తోక బారెడూ ఉండదు. తీరా పులి వచ

Published: Sun,June 23, 2013 12:28 AM

ఆత్మీయరథం..స్వేచ్ఛ..సమానత్వం

స్వేచ్ఛ ఒక దుకాణం కాదు ఒక అయ్య మూయడానికి ఒక అయ్య తెరవడానికి... ఇది సచ్చిదానందన్ కవితా పాదం. నాకు ఇష్టమైన కవిత. స్వేచ్ఛ కూడా ప

Published: Thu,June 20, 2013 05:43 PM

ఈ గోడ బీటలు వారింది...

పొద్దున్నే కల. అసెంబ్లీ చుట్టూ గోడ మొలిచినట్టు. అదీ పాత ముషీరాబా ద్ జైలు గోడ కన్నా ఎత్తుగున్నట్టు. పైన అచ్చం జైలు లాగానే కరెంటు తీ

Published: Sat,June 1, 2013 11:56 PM

డెడ్‌లైన్లు.. డెత్‌లైన్లు.. ప్రజాస్వామ్యం

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్లు పెట్టే సాహసం చెయ్యవద్దన్నడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. ఇది పలుకుబట్టిన కిరణ్ సాహసోప

Published: Sun,April 21, 2013 01:54 AM

పరకాల వచ్చె మొదలాడె...

పరకాల ప్రభాకరొచ్చె మొదలాడె.. అంటే ఇదే. రామాయణమంత విని రామునికి సీత ఏమవుతుంది? అని అడగటమంటే కూడా ఇదే. చాలా ఆలస్యంగా మేల్కాంచిన పర

Published: Mon,April 15, 2013 12:55 PM

కొండపల్లి కొన్ని జ్ఞాపకాలు

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక ప్రత్యేకమైన మనిషి కోసం ఎదురుచూస్తున్నాం. అంతా ఇరవై మందిమి. హైదరాబాద్ రాంనగర్ గుండు ప్రాంతం అను

Published: Sun,April 7, 2013 02:09 AM

భ్రమలు.. మైమరపులు

ఉనికిలో లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించడం ఒక భ్రాంతి. మయ సభ తీరు. కానీ ఉన్నదాన్ని లేదనుకోవడం, దాని ఉనికే లేనట్టుగా భ్రమపడి జనాలను భ్

Published: Sun,March 3, 2013 12:01 AM

మొద్దుబారిపోయినాము...

సూడ సక్కంగుండేది నా బిడ్డ. కొచ్చెటి ముక్కు. సదువు అయిదో తరగతే కానీ కొంచెం పెద్ద పిల్లే. వంకీల జుట్టు. నాబిడ్డ సక్కంగుండాలని ముక్

Published: Sat,January 19, 2013 11:55 PM

వీరులారా వందనం...

పోయిన వారం. ఒక పాఠకుడు ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజున మీరెలా ఫీలయ్యారు’ అన్నది ప్రశ్న.

Published: Sun,January 6, 2013 12:21 AM

చరిత్ర చెప్పిన కొన్ని పాఠాలు

ఉద్యమాలు ప్రజాస్వామ్య సంస్కృతిని పాదుకొల్పుతాయి. నిలబెడతా యి. ప్రజల విస్తృత ఆకాంక్షల వెల్లడి ప్రజాస్వామ్య సూత్రాలను విస్తృ తం చేస్

Published: Sat,December 22, 2012 11:48 PM

పాటే ఆయుధం.. ఛలో ధూమ్‌ధామ్

బెంగటిల్లినట్టున్నది. పరిస్థితులేం బాగాలేవు. ఎవరి గొంతు వారే పలుకుతున్న ధ్వని. గొంతు దాటని శబ్ద తరంగాలు. విచ్ఛిన్నమవుతున్న మాటలు

Published: Sun,December 9, 2012 12:38 AM

డిసెంబర్ 9, ఒక నిజం

ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివర

Published: Sat,December 1, 2012 11:23 PM

చంద్రబాబుతో జర జాగ్రత్త!

మంథని నుంచి మహదేవ్‌పూర్ వెళ్లే రోడ్డులో కాటారం ఒక జంక్షన్ లాంటిది. కాటారం నుంచి భూపాల్‌పల్లి దాకా చూడ నిజంగానే చక్కని రోడ్డొకటి ఉం

Published: Sat,November 24, 2012 11:38 PM

హంతకుల భాష.. మోసం

కడుపు దేవినట్టున్నది. వడ్లల్ల పెరుగు కలిపినట్టుగున్నది. ఆగమాగంగున్నది. దుమాల్లం లేసినట్టున్నది. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లా

Published: Sun,November 18, 2012 12:09 AM

మైమరుపు.. మతిమరుపు

జనాలలో పరివ్యాపించి ఉన్న కొంత మైమరపు వల్లనూ మరికొంత మతిమరుపు వల్లనూ చాలామంది ఇంకా, ఇప్పటికీ చెలామణి అవుతుంటారు. అడుగుపెట్టే అర్హత

Published: Sun,October 28, 2012 12:12 AM

రాజిరెడ్డీ.. ఎక్కడికెళ్లినవ్..

‘రెడ్డీ ఎక్కడికెళ్లినవ్’ అని ఏడుస్తున్నది సరస్వతి. ఆమె రాజిడ్డి ప్రేమించి పెళ్లాడిన సహచరి. బెంగటిల్లిన చిన్నపిల్లలు. చిన్నకొడుకుదీ

Published: Sat,October 6, 2012 02:36 PM

మార్చ్ మా జన్మహక్కు

ఛలో హైదరాబాద్. బస్సో, రైలో, కారో, సైకిలో, స్కూటరో, కాలినడకో.. ఉసిళ్లపుట్ట పగిలినట్టు పక్షుల గుంపు సాయంకాలం కిలకిల ఆకాశంలో ఎగిరినట్

Published: Sat,September 22, 2012 11:41 PM

తెలంగాణ నిలువెత్తు సంతకం

కోతపెట్టే శీతాకాలపు ఢిల్లీ చలి ఇంకా వణికిస్తూ ఉండగానే... జంతర్‌మంతర్‌లోని ఆ ముసలివాళ్ల శిబిరం బిలబిలా నిండిపోయింది. బాపూ జీ కరస్పర

Published: Tue,September 18, 2012 05:56 PM

తెలంగాణపై కాలకూట విషం..

పటాన్‌చెరు దాటగానే మీ వాహనాలను అడ్డుకునే ఆటంకం ఒకటి ఉంటుంది. అద్దాల గదులతో నిర్మితమై కాలడ్డం పెట్టినట్టు కట్టె అడ్డంపెట్టే ఆ టోల్‌

Published: Sun,September 2, 2012 04:48 AM

ఇంతకీ కనిస్టీబు మారతాడా?

సారాజ్జెమొస్తే మన ఊరి కనిస్టీబు మారతాడా?’ కన్యాశుల్కంలో సామాన్యుడి అనుమానం ఇవ్వాళ్ల తెలంగాణ అశేష ప్రజానీకానికి రావాల్సి ఉన్నది. అ

Published: Sat,August 18, 2012 11:32 PM

కాలమ్ కత్తి మీద సాము

‘కాలమ్’ ఒక కత్తిమీద సాము. వారం వారం పలవరింత. కలవరింత. ప్రాణహిత నది మున్నూటా అరవై ఐదు రోజులు సజీవంగా పారే నది. ఆ నది మీద భ్రమ. ఆ ప

Published: Sun,August 5, 2012 12:33 AM

అవునూ...ఇస్తరా! చస్తరా!

డేట్‌లైన్... రవీంద్రభారతి మిట్ట మధ్యాహ్నం కిక్కిర్సి ఉన్నది. ఇక్కడేదో దారి దొరుకుతున్నది. బహుశా ఇది తెలంగాణకు దగ్గరి దారి భవిష్యత్

Published: Sun,July 15, 2012 01:05 AM

జీవించే స్వేచ్ఛ.. బాసగూడ ఆభాస

హప్కా చోటుకు పన్నెండేళ్లు. కాక సంధ్యకు కూడా పన్నెండేళ్లే. మడకం నగేష్‌కు 13 సంవత్సరాలు. మడకం రాం విలాస్‌కు కూడా అంతే వయసు. కోశ్యా బ

Published: Sun,July 8, 2012 12:46 AM

రాజకీయ బానిసల జాతి

బానిసత్వం కొంచెం సుఖంగా ఉంటుంది. నిశ్చల ప్రపంచంలో నిశ్చలంగా ఉండవచ్చు. కనీసం నిలవ నీళ్లలాగా, యధాతథ స్థితిలో భారం కోల్పోయి గాలిలో

Published: Sun,June 24, 2012 12:27 AM

నిర్బంధం.. ఉదాసీనత.. ఐక్యత

శత్రువు నిన్నెట్లా చూస్తున్నాడన్నదే నీ నిబద్ధతకు, ఆచరణకు గీటురాయి అనేది పాత సూత్రం. ఎంచుకొని నిర్బంధాన్ని ప్రయోగించడం, ఆ నిర్బంధం

Published: Sat,June 16, 2012 11:36 PM

పరకాల పాఠం

పరకాల ప్రమాదం తప్పింది. అదిప్పుడు పోరు పతాకై నిన్నూ నన్ను నిలబెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్ జర్నలిస్టు మిత్రుల ఫోన్ ‘సార

Published: Sun,June 10, 2012 12:21 AM

అమ్మా! జగనన్న రాజ్యం మాకొద్దు

మీరు భర్తను పోగొట్టుకుని దుక్కంతో వచ్చారు. నిజమే.. కొడుకు జైలు పాలయ్యాడు. మనసుపడి కట్టించుకున్న లంకంత క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు

Published: Sun,June 3, 2012 12:23 AM

పదేళ్ల ప్రస్థానం

మే, 31, 2002, ఒకానొక మిట్ట మధ్యాహ్నం. మేం పుట్టాం... అప్పుడు గుప్పెడు మందిమి. ఇప్పుడు గంపెడు మందిమి.నిజమే మేము కవులవలెనే కలాలని

Published: Sun,May 20, 2012 01:14 AM

జర్నలిస్టులు జిందాబాద్..

వైఎస్‌లేనిలోటు రానివ్వొద్దన్నడు వాయలార్ రవి. ఉప ఎన్నికల్లో వైఎస్ లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడ్తుదన్నది ఈ మాట సారాంశం. రవి ఢిల్లీ

Published: Fri,August 31, 2012 05:42 PM

ఏమి నేరము చేసెరా! తెలగాణ

ఒక తండ్లాడే జీవితంలో, జీవన విధానంలో జరిగే పరిణామాలన్నీ తెలంగాణ అనుభవించింది. అది సంక్షుభితమయింది. రాటు తేలింది. అది పోరాడింది. ఓడి

Published: Thu,August 30, 2012 08:31 PM

తెలంగాణకు ఇదే అదను...

తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీకి, సంకీర్ణ భాగస్వాములతో కూడిన యూపీఏ-2 కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన సావకాశం

Published: Sun,April 22, 2012 01:06 AM

తెలంగాణ అస్తిత్వం-సమస్యలు

తెలంగాణ భావనకు ఒక చారివూతక పునాది ఉన్నది. ప్రాంతీయ చైత న్యం, ఉమ్మడి అస్తిత్వం, ఉమ్మడి గతం, ఉనికి, సంస్కృతీ విశిష్ట త, వర్తమానం, పర

Published: Thu,August 30, 2012 02:42 PM

అడవి ఉప్పొంగే రాత్రి...

వందేళ్ల కింద పొందిచ్చిన ఢిల్లీ ఎర్రకోటలకు ఆత్మలేదు. నెనరు కానరాదు. యమునై పారుతున్న సామాన్యుడి దుక్కపు సవ్వడిని అది పట్టించుకోదు. త

Published: Sun,March 25, 2012 03:02 AM

ఉసురు తగిలేరోజు..

కౌరవ ప్రపంంలో కదలిక రాదు. సోనియా గుండె స్థానంలో బండకరగదు. అశాంతిని రెచ్చగొట్టే గ్రీన్‌హంట్ సూత్రదారుల పెదాలమీద శాంతిజపం. తెలంగాణ ఇ

Published: Tue,March 27, 2012 07:51 PM

తెలంగాణ మల్లెమొగ్గకు వందనం

పట్టుమని పదారేళ్లులేని ఆ పిల్ల తెలంగాణ మల్లెమొగ్గ. ఎన్నికలకు ముందే చంద్రబాబును ఓడించిన ఆ పిల్లపేరు కృష్ణవేణి. నాగర్‌కర్నూలు నియోజ

Published: Sun,February 19, 2012 12:06 AM

ఒకే ఒక్క తెలంగాణ...

నిజమే. మేం మందలాంటి వాళ్లం. సంతలాంటి వాళ్లం కూడా. నిజమే తెలంగాణే మాకు అతి పెద్ద సమస్య. జీవన్మరణ సమస్య. బలవన్మరణాలు మాట్లాడుతున్నప్

Published: Sat,February 11, 2012 11:24 PM

బానిసల పగటి రంగుల కలలు

తెలంగాణ రాకపోతే ఏమవుతుంది? మోత్కుపల్లి నరసింహులుకుఏమీ కాదు. ఆ మాటకొస్తే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా ఏమీకాదు. తలసాని శ్రీనివాస్ య

Published: Sat,February 11, 2012 05:08 PM

మారనివారు మార్క్సి స్టులు

సుందరయ్య మా నడిగడ్డ బొడ్రాయైండు/మా రావి తావేదీ గాని ఊర్లల్ల / గాని ఉద్దెమాల్ల మన్నుబడ/ గానికీ గీ మన్నుకూ సమ్మందమేంది? శింగం కిష్టయ

Published: Sun,January 29, 2012 02:44 AM

మట్టిపాదాల కదలిక

వాసనొకటి హాలు నిండుకున్నది. ఆ వాసన మర్యాదస్తులది కాదు. మధ్యతరగతి మందహాసాలదీ కాదు. తెల్లచొక్కాలదీ కాదు. ఒక గుంపు వాసన. మట్టివాసన. చ

Published: Sun,December 25, 2011 12:14 AM

తల్లివేరు తత్వం

ముందు ప్రపంచం. ఆ తర్వాత దేశం. ఆనక రాష్ట్రం. ఈ రాష్ట్రమం సరిపడలేదు కనుక నేను తెలంగాణవాన్ని. మనిషి ఉనికి అంతటితో సరిపోలదు. అస్తిత్వం

Published: Sat,December 17, 2011 11:52 PM

దూద్‌కా దూద్..పానీకా పానీ

చంద్రబాబు మాంఛి ఊపుమీద ఉన్నడు. ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో ఆయన వాహనం మీద పడిన కోడిగుడ్లను ఆయన తూడ్చేసుకుని ఉంటడు. ముఖం మీద పడనందుక

Published: Sat,December 10, 2011 11:57 PM

‘గూగీ గుడియా’ మాట్లాడు...

సోనియాగాంధీకి మాటలు రావా? రెండేళ్ల క్రింద తెలంగాణ ప్రజలకు పుట్టినరోజు కానుక ఇచ్చారామె. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమౌతుందని.. సోనియాగా

Published: Sun,November 27, 2011 12:07 AM

మన కాలం వీరుడు...

శవం కోసం కాదు. ఒక మనిషి కోసం ఎదురు చూసినట్టుగా ఉన్నది. పోలీసులు కూడా అతనొక బతికున్న మనిషిలాగే భావించినట్టున్నది. శంషాబాద్ నుంచి పె

Published: Sun,October 30, 2011 12:18 AM

చలో పోలవరం... సలామ్

‘పోలవరం మాకొద్దు’ గిరిజన జీవితాలను అల్లకల్లోలం చేసే, ఉనికి ధ్వంసం చేసే పోలవరం ప్రాజెక్టుపై ముంపు ప్రాంతాల ఏకవాక్య తీర్మానం ఇది. ఏక

Published: Sun,October 23, 2011 01:47 PM

కొంత చరిత్ర.. కొంత దుఃఖము

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా? శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కో

Published: Sat,October 1, 2011 11:45 PM

సంప్రదింపులకగ్గిదలగ...

పండగపూట మనం పస్తులుంటున్నప్పుడు.. పండుగపూట మనం పీడకలలు కంటున్నప్పుడు.. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా.., ఇంత ఏక పక్షంగా వ్యవహ

Published: Sun,September 18, 2011 12:32 AM

సింగరేణికి జై..

చరిత్ర నిండుగా సింగరేణి నిలబడింది. కావొచ్చు మేము అర్థ రైతులం. అర్థ కార్మికులం.. కానీ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించే ఒక నిప్పురవ్వ మ

Published: Sun,September 4, 2011 12:42 AM

నండూరికి నివాళి

రెండో తరం ప్రథమశ్రేణి సంపాదకుడాయన. బుద్ధిజీవులు, సాహిత్యకారు లు ఆమోదించి అభిమానించిన సంపాదకుడు. జర్నలిస్టుకు సకల పరిజ్ఞానం ఉండాలని

Published: Sat,August 20, 2011 11:29 PM

బానిసకొక బానిసకొక బానిస

-అల్లం నారాయణ ‘పీనుగుల మీద పేలాలు ఏరుకునే జాతి ఏదన్నా ఉన్నదంటే అది మన మంత్రుల జాతే’ ఇటీవల నాకొచ్చిన మెసేజ్ సారాంశం ఇది.

Published: Sat,August 6, 2011 11:54 PM

హంతకుడి జాడ....!

-అల్లం నారాయణ మిస్టర్ చిదంబరం.. హంతకుపూవరో?తెలంగాణ పోల్చుకున్నది. ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుక

Published: Mon,July 18, 2011 05:06 AM

ప్రేమనగరం

-అల్లం నారాయణ మనం తెలుగు వారమే. కానీ పెట్టుబడికి, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ పెట్టుబడికి ప్రాంతం లేదు. అది ఒక ప్రాంతం ఆకాంక్షలను కబ

Published: Sun,July 17, 2011 05:58 AM

ఆకాంక్షల ఆర్తరావం

మీ సున్నితమైన మాటల వెనుక వెక్కిరిస్తున్నది మీ వలస పెత్తనం. మీ సీమాంధ్ర బుద్ధి. మీ నెత్తుటి జాడ. మీ నాయనా అంతే.. తెలంగాణకు మేమెప్

Published: Thu,July 28, 2011 03:20 PM

వెంటాడే తెలంగాణ

మీట్ ది ప్రెస్ ప్రారంభమయినాక ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ న్యాయవాదులు వస్తుంటే మనసేదో శంకించింది. అప్పటికీ సైగలతో అడుగుతూనే ఉన్న. ఏం

Published: Wed,July 27, 2011 09:31 PM

విధ్వంస సార్వభౌముడు

అల్లం నారాయణ ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం

Published: Thu,July 28, 2011 04:42 PM

లగడపాటి బడాయి

-అల్లం నారాయణ జగోపాల్ అంటే ఎవరు? అంటారు? లగడపాటి అనంగానే పూర్తిగా అర్థమయినట్టే ఠక్కున ఓహో జగడపాటి అంటారు. ఎవరు? చిన్నపిల్లలు