ఇంతకీ కనిస్టీబు మారతాడా?


Sun,September 2, 2012 04:48 AM

సారాజ్జెమొస్తే మన ఊరి కనిస్టీబు మారతాడా?’ కన్యాశుల్కంలో సామాన్యుడి అనుమానం ఇవ్వాళ్ల తెలంగాణ అశేష ప్రజానీకానికి రావాల్సి ఉన్నది. అవునూ... తెలంగాణ వస్తే మన కనిస్టీబు (రాజ్య ప్రతినిధి) మారతాడా? విస్తృతార్థంలో ఇది రాజ్యాంగ యంత్రం ఏమై నా మారుతుందా? అన్న ప్రశ్న విశాలమయింది. అది అసలు ప్రశ్నే అయినా తెలంగాణ సందర్భం కనుక ఆ చర్చలోకి వెళ్లడం సరికాదు. కానీ, పరిమితార్థంలో తెలంగాణ వస్తే మన రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంవూతన్నా మారతా డా?అన్నది ఇప్పటి ప్రశ్న. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ సాధిస్తాం అని ఎర్రబెల్లి దయాకర్‌రావు కుండలు బద్దలు కొట్టినాక ఈ భయం ఇంకొంత విస్తృతమయింది. ఇంతకీ తెలంగాణ ఉద్యమం దేని కోసం అన్న మౌలిక ప్రశ్నా ఉండనే ఉన్నది. స్వీయ అస్తిత్వం కోసం, సంస్కృతీ, చరివూతలపై వివక్ష, చిన్నచూపు నశించడం కోసం మొత్తంగా వలసాధిపత్యం, పెట్టుబడి విస్తరణల ఫలితంగా జరిగిన తెలంగాణ విధ్వంసం నిరోధించడం కోసం ఇట్లా బహుముఖ భావనల సమాహారమే తెలంగాణ ప్రజాకాంక్షల సారాంశం. ముఖ్యంగా స్వీయ అస్తిత్వం అంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే. ఈ రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్థకమైతే ఏది గతి?

తెలంగాణ విధ్వంసానికి మూలకారకులైన వాళ్లే తెలంగాణ తేవడానికి నాయకత్వం వహించడమంటే అర్థమేమిటి? వచ్చిన తెలంగాణను అడ్డుకుని, ఉల్టా ఉద్యమాలకు ఆద్యులైన వారే తెలంగాణ ఉద్యమం చేస్తే ఏం చెయ్యాలి? డిసెంబర్ 7న అఖిలపక్షంలో తెలంగాణపై దమ్ముంటే తీర్మానం చేయాలని ప్రగల్భా లు పలికి, 8న నిండుసభలో మాట్లాడి, తీరా డిసెంబర్9న చిదంబ రం ప్రకటన తర్వాత నోటినిండా కుట్రలు దాచుకొని, ఒక కన్నడిగుడు, ఒక తమిళుడు, ఆంధ్రవూపదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నితే ఒప్పుకుంటామా? అని పార్టీ ఎమ్మెల్యేల ను ఉచ్‌కాయించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ చేతులు కలిపి, లగడపాటి రాజగోపాల్‌నూ ప్రేమించిన పెద్దమనుషులు ఇవ్వాళ్ల తెలంగాణ కోసం పోరాడుతారు. నాయకత్వం వహిస్తారూ? అంటే.. ఇగ ఏమీ మార దా? ఊరిడిసిపోవడమా? ఉరిపోసుకోవడమా? శేష ప్రశ్నే.

బహుశా ఇప్పుడంతా చంద్రబాబు బద్దలుకొట్టే కుండలపైనే అందరి దృష్టీ ఉంది. ఆయన రెండు కండ్ల సిద్ధాంతం మధ్యలో మూడు కండ్లయి బైరెడ్డి రాజశేఖర్‌డ్డి నోట హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లు రాయలసీమ వాళ్లను ఒక్కర్ని కొడితే, పది మంది తెలంగాణ వాళ్లను కొడతామని ఫ్యాక్షనిస్టు పలుకులు పలికిస్తున్నది. మరోవంక తెలంగాణపై స్పష్టత ఇస్తామనే పేరిట పాత లేఖను మళ్లీ ఇచ్చి తెలంగాణకు నాయకత్వం వహిస్తామని ఉబలాటం పెరుగుతున్నది. ఇంతకీ కొంపదీసి చంద్రబాబు తెలంగాణకు నాయకుడవుతాడా? సరిగ్గా కన్యాశుల్కం జట్కాబండివాడి ప్రశ్నే. కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబు, జగన్‌బాబు, మన బాలకృష్ణ ఇట్లా వీళ్లన్నా తెలంగాణకు లేకుండాపోతారా? లేదా వీళ్లే నాయకత్వం వహిస్తారా? వహిస్తే కనుక సొరాజ్జెం గతే తెలంగాణకూ పడితే ఏది గతి?

పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే సర్పరజ్జు భ్రాంతి.. డెఝావు..ఉన్నది లేన ట్టూ, లేనిది ఉన్నట్టు భ్రమ కాలం. మయ సభల కాలం. తెలంగాణకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి, జగన్‌బాబు, బాలకృష్ణ, టీజీ వెంక లగడపాటి రాజగోపాలు, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, సుబ్బిరామిడ్డి, జీవీకే, ఆ ‘కే’ ఈ ‘కే’ అందరూ అనుకూలమే అయితే ఇంకా తెలంగా ణ మాత్రం ఎందుకూ? అని. ఇంతకీ తెలంగాణకు శత్రువు ఎవరూ? అని.. చంద్రబాబుకు కోస్తాంవూధలో ఓట్ల నూకలు చెల్లిపొయ్యాయి. తలకిందికి కాళ్లు పైకి పెట్టినా, ఒంటికాలి మీద తపస్సు పట్టినా చంద్రబాబును కోస్తాంవూధల నమ్మేటట్టు లేరు. జగన్ హవా నడుస్తున్నది.

ఎన్ని ఎన్నికలు పెట్టినా అటు జగన్ గాలి వీస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్టబోయి రెండు సీట్లన్నా గెలిచింది. కానీ మూడేండ్ల కింద రెండో ఓటమి తర్వాత చంద్రబాబు ఎమ్మెల్యేలను కోల్పోవడమే తప్ప, ఏ ఉప ఎన్నిక వచ్చినా ఉన్నోళ్లు ఖల్లా స్ కావడం తప్ప ఒక్కరన్నా గెలిచింది లేదు. నిండు సున్నా, సంపూర్ణ ఓటమి, ఓటు బ్యాంకులు బద్దలై, చెల్లాచెదురైపోయి, పార్టీ కకావికలయిపోయి అంపశయ్యమీద కునారిల్లుతున్న చంద్రబాబు కొత్త ఎత్తుగడ తెలంగాణ. దాంట్లో అనుమానపడాల్సినదేమీ లేదు. ఇటీవ లి కాలంలో ఆయన కూడగడ్తున్న సెక్షన్ల ప్రజా సమూహాలు, ప్రకటిస్తున్న కొత్త ప్రణాళికలన్నీ కూడా తెలంగాణపైకి ఎక్కుపెట్టిన బాణాలే. బీసీలకు వంద టిక్కెట్లంటే తెలంగాణలోని సామాజిక అల్లికలో రెడ్డి, వెలమ వర్గాల ఆధిపత్యం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. ఈ ఆధిపత్య రాజకీయ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే బీసీలను బులుపరించడం ఆవశ్యకత ఎన్టీఆర్ నుంచి స్వీకరించిన ఎత్తుగడ.

ఎన్టీఆర్ తెలంగాణలో ప్రభంజనం సృష్టించడానికి ఏ శక్తులు ఉపయోగపడ్డాయో ఆ శక్తులు బీసీలే అన్నది చంద్రబాబుకు అందరి కన్నా ఎక్కువే తెలుసు. కోస్తాంవూధలో కాపువర్గాలు ఎట్లా కీలకపాత్ర పోషిస్తున్నాయో అట్లాగే తెలంగాణ రాజకీయాలలో బీసీల రాజకీయ సాధికారత కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఇచ్చే స్థితిని, దానం చేసే స్థితిని, ఒక ఆధిపత్య సామాజిక వర్గమే అయినప్పటికీ బీసీల పట్ల ప్రేమ ప్రదర్శించగలిగిన అధికారాల్ని, స్థాయిని, హోదాను ఏమాత్రం చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ఆయన బీసీల ప్రణాళిక ప్రచారం చేసుకుంటున్నా రు. అది పాత ఎత్తుగడ మాత్రమేనని, తెలంగాణ ఆకాంక్ష ముందు ఈ ఎత్తుగడలు చిత్తవుతాయని అందరూ ఏమాత్రం పట్టించుకోకున్నా, అందరూ తెలుగుదేశం బీసీ ప్రణాళికకు గజగజా వణికిపోతున్నట్టు కూడా చంద్రబాబు ప్రచా రం లగాయించుకున్నారు. ఇది స్వోత్కర్ష.. కంఠశోష మాత్రమే. అట్లాగే ఎస్సీ వర్గీకరణ సమస్యపై కూడా ఒక స్పష్టత ఇచ్చి, చాలా కాలం తర్వాత ఆయన మందకృష్ణ మాదిగతో ఫొటోలు దిగారు.

ఉమ్మడి విలేకరుల సమావేశాలు పెట్టా రు. మందకృష్ణది జీవితకాలపు నిఖార్సయిన ఏకైక ఎజెండా వర్గీకరణ. మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం, మనుగడ, భవిష్యత్ అంతా వర్గీకరణయే అందుకోసం మందకృష్ణ ఎవరితోనైనా కలవడానికి సిద్ధమే. అందుకే చంద్రబాబుతో చాలాకాలం తర్వాత ఆయన కనిపించారు. కానీ మందకృష్ణ తెలంగాణవాది కూడా అదీ సమస్య. చంద్రబాబు తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే మంద కృష్ణలో ఉన్న తెలంగాణ ఆత్మ ఏం సమాధానం చెబుతుందో? ఉహించలేని విషయమేమీ కాదు. కానీ తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ల సమస్య భిన్నమైంది. జనాభా పరంగా అది తెలంగాణలో పూర్తిగా సానుకూలమయిన డిమాండ్. చరిత్ర, వారసత్వం, పోరాట సాంప్రదాయాలు, చైత న్య స్థాయి వల్ల తెలంగాణలో వర్గీకరణకు వ్యతిరేకత తక్కువ. కోస్తాలో మాదిగల బలం తక్కువే. ఓట్లను, రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేయగల మాదిగల జనాభా తెలంగాణలో ఉన్నది. అదీ చంద్రబాబు ఎత్తుగడ. ఓ వంక బీసీలు, మరోవంక మాదిగల వర్గీకరణ సమస్య మీద స్పష్టత ఈ తెలంగాణకు సూటి పెట్టడం నుంచే వచ్చినవని సులభంగానే అర్థమయ్యే విషయా లు. కోస్తాలో చంద్రబాబు ఏమవుతాడన్నది కాదు రంధి. అక్కడలేని అధికారాన్ని తెలంగాణలో వెతుక్కుంటే తెలంగాణవాళ్లకు ఇగ పర పీడన ఎట్లా విరగడవుతుందన్నదే అసలు సమస్య.

కాలమెట్లా ఉన్నదంటే చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు, వైఎస్. రాజశేఖర్‌డ్డి ఆరేళ్లు మొత్తంగా పదిహేను సంవత్సరాలు రాజ్యమేలినాక మన రాష్ట్రానికి విద్యుత్ సమస్య ఇంత పరాకాష్టకు చేరుకున్నది. కరెంటు తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితులు నిజంగానే వచ్చినవి. కానీ విషాదమేమంటే ఇదేకంటు సమస్యల మీద ఇటు చంద్రబాబు, అటు వై.ఎస్. రాజశేఖర్‌డ్డి తనయుడు జగన్‌బాబు ఇద్దరూ పోటీపడి కరెంటు ఉద్యమాలు నడుపుతున్నారు. ఇంతకీ ఈ కరెంటు సమస్యకు కారణం పదిహేనేళ్లు ఏలిన వాళ్లా.., వాళ్ల ఏలికల్లో కుక్కిన పేనులైన ప్రజలా? దీన్నే ‘దొంగే దొంగా దొంగా’ అని అరచినట్టు అంటారు. అట్లానే విలీనం నుంచి తెలంగాణకు వేళ్లమీద లెక్కబెట్టదగినన్ని, ఏళ్లు తప్ప, అన్ని సంవత్సరాలూ ఏలికలు ఆంధ్రులే. మరీ ఎన్టీఆర్ నుంచి అంటే మూడు దశాబ్దాల కాలంలో ఈ ముఖ్యమంవూతుల హయాంలోనే తెలంగాణ పోరుకపోడు అయింది. తెలంగాణ మరింత దుక్కాన్ని, వేదనను, వివక్షను, అణచివేతను అనుభవించింది. కానీ ఇదే చంద్రబాబు మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించడమంటే ఏమిటీ దాని అర్థం.
తెలంగాణ కల సాకారమవుతుందనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో, కొందరు దాన్ని చిత్తశుద్ధితో నమ్ముతున్న కాలంలో ఉన్నాం మనం.

తెలంగాణ ను వ్యతిరేకించే వాళ్లకన్నా, ముందునుంచీ తెలంగాణకు అడ్డం పొడుగూ నిలుచున్న వాళ్లకన్నా...ఇట్లా తెలంగాణ నాయకత్వం వహించే వాళ్లే బహు ప్రమాదకారము. ఈ స్పృహ లేకుంటే తెలంగాణ వచ్చినా...కనిస్టీబు మారడు. చంద్రబాబు మారడు. మన బానిస తనానికి విముక్తి లభించదు. ఇంతకీ మరోసారి అసలు ప్రశ్న తెలంగాణవస్తే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి, జగన్‌లే ముఖ్యమంవూతులా? ఎవరో ఒకరు తెలంగాణవాళ్లు ముఖ్యమంవూతులా? ఇంతకీ మన కు నాయకత్వం మారుతుందా? మారదా? ఇంతకీ మనశవూతు ఇంతకీ స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే అంతిమంగా చంద్రబాబు నాయకత్వం వర్థిల్లడమేనా? మనం ఎన్నాళ్లయినా బానిసకొక బానిసకొక బానిసవోయి బానిసలమేనా? తెలంగాణ ఈ కొత్త ప్రమాదాన్ని పసిగట్టాల్సే ఉన్నది. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం అసలైన కొట్లాట కొట్లాడాల్సే ఉన్నది.

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...