కాలమ్ కత్తి మీద సాము


Sat,August 18, 2012 11:32 PM

‘కాలమ్’ ఒక కత్తిమీద సాము. వారం వారం పలవరింత. కలవరింత. ప్రాణహిత నది మున్నూటా అరవై ఐదు రోజులు సజీవంగా పారే నది. ఆ నది మీద భ్రమ. ఆ పేరు మీద పావురం. గోదావరి, శబరి, ప్రాణహిత ఇవి పేరుకే నదులు కావు. ఉత్తర తెలంగాణ జీవన సంగమాలు. అద్దరి, ఇద్దరి ఒరుసుకొని పారే నదుల మధ్య జీవితమే ఉత్తర తెలంగాణ జీవితం. దశాబ్దాల సంక్షుభిత జీవితం. గోదావరిలోయ పొడువునా భూగర్భంలో దాగిన రాక్షసి బొగ్గులాగే రగులుతున్న జీవితం. పోరాడిన నేల. నదుల మీదుగా ప్రవహించే జ్ఞాపకాల మీదుగా, అడవుల గుండా పయనించే ఎర్ర పతాకాల సాక్షిగా ఇక్కడి జీవితం ఒడ్డొరుసుకుని ప్రవహించేదే. అక్కడ పుట్టినవానిగా నదులను అవాహనం చేసుకోవడం ప్రాణహిత పేరుకు ఒక కారణం.‘కాలమ్’ రాయడం ఒక యాతన. అంతసుఖంగా ఉండదు. నొప్పి తెలు స్తూ ఉంటుంది. ‘జీవగడ్డ’ అనే చిన్న పత్రికలో పని చేసినప్పుడు ‘ఎన్నెలకోన ల్లో’ అని చిన్న కాలమ్ తో ప్రారంభమైన వ్యాసంగం, ఆంధ్రజ్యోతిలో‘అల్లంకారం’ తో రెగ్యులర్ కాలమిస్టుగా నాలుగేళ్లపాటు నడక నడిచింది. నిజానికి ‘అల్లం కారం’ అలంకారం మాత్రమే. అప్పటికే స్థానిక పత్రికల్లో ‘బండకింది బతుకులు’ ‘బాతాల పోశెట్టి’ లాంటివి వచ్చేవి. అదే ఒరవడిలో స్వయంగా తెలంగాణ భాషతో అప్పటి ప్రయోగాలు వెరసి ఆంధ్రజ్యోతిలో భాష కోసం రాసిన కాలమ్ అది. వారం వారం అప్పటి రాజకీయ, సామాజికాంశాల మీద తెలంగాణ భాషలో స్పందించడం. కాలమ్‌లో వస్తువుకన్నా రూపం- ముఖ్యం గా భాషా రూపం మీద - సామెతలు, పలుకుబడుల మీద మమకారంతో ఆ కాలమ్ రాసేవాణ్ని. ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రారంభించిన తర్వాత ‘ప్రాణహిత’ ప్రారంభమయింది. దీనికి తక్షణ ప్రేరణ ఆంధ్రజ్యోతిలోనే నేను రాసిన ‘లైఫ్ లైన్’...నిజానికి చలం మ్యూజింగ్స్ చదవకున్నా, నవీన్ అంపశయ్య చదవకు న్నా, జేమ్స్ జాయిన్ గురించీ, చైతన్య స్రవంతి గురించి చదవకున్నా- చేతన, అంతశ్చేతన, స్వైరం గురించి సామాజికశాస్త్ర పాఠ్యాంశాల్లో తెలుసుకోకున్నా- నా కాలమ్ ఇట్లా ఉండేది కాదు. మనసులోంచి రాయాలని, అంతరంగాన్ని ఉన్నదున్నట్టుగా, నేనేమనుకుంటున్నానో, ఏమేమి ఉద్వేగాలకు లోనవుతున్నా నో, ఎంతవడిగా, వేగంగా ఆలోచిస్తున్నానో, ఎంత క్షోభకు, దుక్కానికి, ఎంత గందరగోళానికి గురవుతున్నానో, ఒక అంశం పట్ల నా మనసేమీ స్పందిస్తున్న దో... అవన్నీ ‘చైనత్య స్రవంతి’ శైలిలో రాయాలన్నదే నా ప్రణాళిక. ‘లైఫ్‌లైన్’నాకు ఆ అవకాశం కల్పించింది. ఒక స్వైరం, తక్షణ ప్రతిస్పందన నాటుగా, మోటుగా, ఒక ఆక్రోశంలాగా, ఉక్రోశంలాగా, మనసు చీకటి పొరల్లో కెరలే ప్రవాహాలను అక్షరంలోకి ఒడిసి పట్టాలన్నదే లైఫ్‌లైన్ సారాంశం. ఆ కాలమ్ పదునుదేరి నడుస్తున్నప్పుడు వచ్చిన ప్రతిస్పందనలు చాలా ప్రభావితం చేశా యి. నన్ను ప్రభావితం చేసిన నా తెలంగాణ జీవితం, నా గత వైభవంగా జీవితాంతం కొనసాగే నక్సల్బరీ.. నా చైతన్యాన్ని క్రమానుగతం చేసి, నాకొక ప్రాపంచిక దృక్పథాన్ని ఇచ్చిన రాజకీయ సామాజిక అంశాల ప్రభావాలు, నా చుట్టూ ఉన్న జీవితంలో ఆటుపోట్లు, స్వయంగా నేను ఒక క్రియాశీలక చైతన్యవంతమైన, పూర్తి నిబద్ధత కలిగిన సాహసోపేతమైన, నిత్య సంచలనాల జీవితం నుంచి, సాదాసీదా జీవితంలోకి వచ్చిన నైరాశ్యం ప్రతిఫలాలుగా ఆ కాలమ్ ఉండేది. బహుశా చాలామంది దానితో ఐడెంటిఫై అయ్యారు. ఆ తర్వాతే ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రారంభం అయినాక అదే ఒరవడిలో ఒక కాలమ్ రాయాలని అనుకున్నప్పుడు నాకు ‘లైఫ్‌లైన్’ అనుభవాలు గుర్తొచ్చాయి.


‘ఎందుకంత ఏడుస్తావ్, ఎందుకంత అంగలారుస్తావ్, ఎందుకంత కోపం, సమాజం మీద అంత ఆగ్రహం ఎందుకు’ నుంచి మొదలుకొని ‘పరేషాన్.. పరేషాన్’ కాకు... అనేవాళ్లు, ‘అద్భుతం... మేము ఐడెంటిఫై అయినాం’ అనేదాకా ఈ కాలమ్ స్పందనలు గుర్తొచ్చాయి. ఎట్లా రాయాలి కాలమ్ అనుకున్నప్పుడు పాతధారే అంతరంగం ఆవిష్కరణ. రంగస్థలం సమాజమే పరిణామాలే. ఆ వారంలో నాకు కోపం కలిగించిన, ఆ వారం నన్ను అతలాకుతలం చేసి, కుదిపి కదిపి ఇబ్బందిపెట్టిన అంశాలన్నీ కాలమ్ రాయడమే. నిజానికి పత్రికల్లో పనిచేస్తూ కాలమ్ రాయడం మరో కఠిన పరీక్ష. పత్రిక యాజమా న్యం పాలసీ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. అన్ని రకాల సమాచారం నిష్పక్షపాతంగా లేదా ఎలాంటి చేర్పులు లేకుండా ఇవ్వడం అనేది ఒక ఆదర్శం.జర్నలిస్టులకు అభివూపాయాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి. ఇష్టాయిష్టాలుంటాయి. కానీ పత్రికల్లో వచ్చే వార్తలు, సమాచారం వీటన్నింటికీ అతీతంగా ఉండాలి. మనకు ఇష్టంలేని చాలా విషయాలను రోజూ పోటీపడి ప్రచురించాలి. గణపతి పాలు తాగుతున్నాడని కూడా ప్రచురించాల్సి వస్తుంది. కానీ అదే అంశం మీద ఒక కాలమిస్టుగా వ్యాఖ్యానించాలి. అది మన స్వేచ్ఛ. అది మన స్పేస్. మన పేరుతో అచ్చయ్యే విషయాల్లో మన అభివూపాయాలు. ఇది కాలమిస్టు స్వేచ్ఛ. కానీ పత్రికల్లో పై స్థానాల్లో పనిచేసేవారికి ఈ కాలమిస్టు ముద్ర వల్ల చాలా సమస్యలొస్తాయి. అపార్థాలు ఎక్కువ. కాలమిస్టుగా నా స్వంత అభివూపాయాలు వేరు. ఈ రెండు పాత్రలు ఒకదాని మీద ఒకటి ప్రభావితం చేయకుండా నిర్వహించడం కూడా కత్తి మీద సాము. అది కాకుం డా కాలమ్ వల్ల బయటి సమాజానికి ఏర్పడే అభివూపాయాలు, ఆ అభివూపాయా ల వల్ల పత్రిక నడుస్తున్న తీరు పట్ల ఏర్పరచుకున్న అసంతృప్తులు-అవీ సమ స్యే. దానికి తోడు కాలమ్ చాలా సందర్భాల్లో యాజమాన్యం, పత్రిక పాలసీలను విభేదిస్తుంది. అట్లాంటప్పుడు సున్నితమైన సమస్యలు. పత్రికల్లో పనిచేయడం, ఆ బాధ్యతలను నిర్వర్తించడం, మన కోసం మనం ఒక్క ‘స్పేస్’ ఏర్పరచుకోవడం కాలానికి గీటురాయి. చాలామంది ఈ ‘స్పేస్’ కోరుకోరు కూడా.

జర్నలిజం వృత్తిలో ఇప్పటిదాకా పత్రికాపనిలో ఎలాంటి మాటరాకుండా పనిచేసి, నా ‘స్పేస్’ను నేను ఉపయోగించుకున్నా అనేదే నా వృత్తి సంతృప్తి. జర్నలిజం విధుల్లో ఉండే పరిమితులు, కాలమిస్టుగా నా స్వేచ్ఛ అనే రెండంశా ల సమన్వయంతో చిక్కులు, దానికి తోడు కాలమిస్టుగా బయటి ప్రపంచం పాఠకుల అంచనాకు పాఠకులకు ఆ అంశాలతో ఏకీభావం ఉండటం, స్వీకరించటం ఒక సమస్య అయితే.. వారికి నచ్చేలాగా కాలమ్ ఎత్తుగడలు ఉండ డం మరో సమస్య. కవిత్వ-వచనం సులభం అనిపిస్తుంది కానీ.. అది ఒక్కొక్కప్పుడు విపరీతమైన యాతన పెడ్తూ ఉంటుంది. చైతన్య స్రవంతిలో ఆకుకు అందని, పోకకు పొందని అనేక విషయాలు మెదడులో సుడి తిరుగుతూ ఉంటాయి. ప్రాణహిత ప్రతీ శనివారం కాలమ్. శుక్రవారం నుంచే జ్వరం వచ్చినట్లుగా ఉండేది. ఎంతకీ ఏమి రాయలో తేలేది కాదు. ఇట్లాంటి సమయాల్లోనే సృజన సంపాదకీయాల గురించి రాస్తూ వరవరరావు అన్న మాటలు జ్ఞాపకం వచ్చేవి. అప్పటికప్పుడు తట్టిన ఆలోచనలు, అంశాలు, వ్యక్తావ్యక్తంగా గదికుచ్చి, హడావుడిగా రాసేదే సృజన సంపాదకీయం అని.. ఆగమాగంగా ఉన్న రెండు రోజుల మానసిక స్థితిని కూడదీసుకొని ఏకబిగిన ప్రాణహిత రాసేవాణ్ని. అప్పుడు కాని జ్వరం తగ్గినట్టుండేది కాదు. సహజంగానే నరాలగుండా గ్లూకోజ్ పరిగెత్తేది. డెస్క్‌లోనే కూచొని అరగంటలో అప్పటికప్పుడు ప్రాణహిత రాసేవాణ్ని. ఇదంతా ఎందుకు? పాఠకులకు ప్రాణహిత సంగతులు చెప్పడానికే. ప్రాణహిత నా అంతరంగ ఆవిష్కరణ మాత్రమే కాదు.‘ఏమి నేరము చేసెరా తెలంగాణ ఎదనిండ గాయాపూరా’ అన్న ప్రశ్న అతి కీలకమయినది. మనమేమి చేశామని ఇంత సంక్షోభం, ఇంత హింస, ఇంత వివక్ష, ఇంత నెనరులేని తనం.. బహుశా తెలంగాణలో ఈ గాయపడిన మనస్తత్వమే ఆత్మహత్యలు జరగడానికి ప్రధాన కారణమని భావిస్తాను. వీటన్నింటి సారాంశంగా ప్రాణహిత అనివార్యంగా ఒక్క తెలంగాణ గొంతుక మాత్రమే అయింది.
నిజమే తెలంగాణ జీవితం గొప్పది. అది మనుషులను సజీవంగా నిలిపిన
జీవగడ్డ. పోరాటాలవల్ల, చైతన్యంవల్ల, నిత్యం చలనశీలంగా
ఉన్నందువల్ల ఇక్కడి జీవితంలో ఒక ప్రత్యేకత ఏర్పడింది. అది తెలంగాణ
వాడిగా ఒక గర్వకారణంగా కూడా.. ఆ తెలంగాణను ప్రతిబింబించినదే ప్రాణహిత.

ఆర్‌కె చిరకాల మిత్రుడు. పుస్తకాలు వేయడం అనే ఆలోచనే లేని నాకు ఎకాఎకిన ప్రతిష్టగా భావించే ‘పర్‌స్పెక్టివ్స్’ తరఫున ప్రాణహిత పుస్తకం తీసుకువస్తాననడం, నా వెంటబడి, వీటికి ప్రాణవూపతిష్ట చేస్తున్నందుకు ఆర్‌కెకు, ముందుమాట రాసిన నేను బాగా ప్రేమించి, గౌరవించే హరగోపాల్ గారికి, ‘పర్‌స్పెక్టివ్స్’లోని ఇతర మిత్రులకు కృతజ్ఞతలు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో నాకు స్వేచ్ఛతో సహా, ‘స్పేస్’ ఇచ్చిన, ఎన్నడూ నా ఆగడవు రాతలకు అడ్డం పడకుండా సహనం వహించిన ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారికి, 2002లో ప్రాణహిత ప్రారంభించినప్పుడు ఈ కాలమ్ నాకు ఇచ్చి ప్రోత్సహించిన ఆంధ్రజ్యోతి అప్పటి సంపాదకులు కె.రామచంవూదమూర్తి గారికి, ప్రాణహితను ప్రోత్సహించి కాలమిస్టుగా మరో అవకాశం ఇచ్చిన మిత్రులు ఆంధ్రజ్యోతి ఇప్పటి సంపాదకులు కె. శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రాణహితను ప్రతివారం చదివి నాతో పంచుకున్న పాఠకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు వందనాలు. ప్రాణహితను ఏర్చికూర్చి మళ్లీ మళ్లీ టైప్‌చేసి, ఒక రూపంలోకి తెచ్చిన మా చీఫ్ ఆర్టిస్ట్ భానుకు, పరమేష్‌కు కృతజ్ఞతలు. కవర్ పేజిని అర్థవంతంగా డిజైన్ చేసిన రమణజీవికి వందనాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అవసరాల దృష్ట్యా త్వరలోనే ప్రాణహితలోని మిగతా భాగాలు కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తాను.
నమస్తే తెలంగాణ

-అల్లం నారాయణ
( ఈరోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలో
్ర‘పాణహిత’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా..)

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...