అవునూ...ఇస్తరా! చస్తరా!


Sun,August 5, 2012 12:33 AM

డేట్‌లైన్... రవీంద్రభారతి మిట్ట మధ్యాహ్నం కిక్కిర్సి ఉన్నది. ఇక్కడేదో దారి దొరుకుతున్నది. బహుశా ఇది తెలంగాణకు దగ్గరి దారి భవిష్యత్ దారి ‘తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు.అందుకే ఏడువందల మంది ఆత్మహత్యలు చేసుకున్నరు’ ఈ మాటలు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. కేశవరావు. ఆయన ఉన్నదున్నట్టు శషభిషలు, తటపటాయింపులు లేకుండా మాట్లాడారు. నిజానికి కాంగ్రెస్‌లో కాస్త వివేచన, పాత జీవితం వాసనల వల్ల సమస్యలను ఒక క్రమపద్ధతిలో అవగాహన చేసుకునే ప్రాపంచిక దృక్పథం కేకేది. ఆయన అనర్ఘళంగా అనేక భాషల్లో మాట్లాడడం వల్ల చాలామంది ఆయనను వేరే విధంగా అంచనా వేస్తుంటారు. సహజంగానే బుద్ధీ, వివేచన, ఎక్కువ మోతాదు జ్ఞానం ప్రధాన స్రవంతి రాజకీయాల్లో రాణింపును అడ్డుకుంటాయి. అయినా కేకే జాతీ య నాయకుడిగా ఎదిగారు. తెలంగాణపైన ఆయన ఇట్లా కుండబద్దలు కొట్టి చెప్పడానికి బహుశా ఆయన గుండెల్లో నొప్పి.., ఆత్మహత్యలు రేపిన విషాదం, ఒక తెలంగాణవాడిగా అన్నీ గమనిస్తూ వచ్చే అంగలార్పు, తెలంగాణ కోసం తపన, తండ్లాట కూడా కారణం కావచ్చు. కానీ కేకే కాంగ్రెస్‌ను విడవడు.

మోసం చేసిన వాళ్లను ఇట్లా సభల్లో తిడతారేమో కానీ, సమయమొచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లుల అనివార్యత వల్ల హాజరుకాక తప్పదంటారు. బహుశా పొన్నం ప్రభాకర్ అయినా ఆ పార్టీ ఇతర ఎంపీలయినా సభల్లోనూ టీవీలలోనూ మైకుల ముంద రా మాట్లాడినప్పుడు, తెలంగాణ సమూహాలతో ఉన్నప్పుడు వాళ్ల ఆత్మ మేల్కొంటుంది. కానీ ఆ ఆత్మకుగల నిజాయితీ జీవితకాలం వరిగడ్డి మంటంత. అట్లా ఎగసి అట్లా చల్లారిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు ప్రత్యామ్నా యం ప్రజల వెంట ఉండడం. అనివార్యత సృష్టించడం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దిక్కుతోచకుండా చేయడం. కానీ కాంగ్రెస్ తెలంగాణ వాదులు మాటలు ఎన్నైనా మాట్లాడుతారు. కానీ ఇప్పటి వరకు వాళ్లు చేపట్టిన కార్యక్షికమాలు, పార్టీలో ఉంటూనే తీసుకున్న ఆందోళనల రూపాలతో ఆ పార్టీ ఇంచుకూడా కదలలేదు. ఊదు కాలలేదు. పీరి లేవలేదు. ఇది అనివార్యంగా కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ఆత్మగల మనుషుల పరిమితులను, వారి ద్వంద్వ ప్రవృత్తిని చెప్పకనే చెబుతున్నది. అదీ సమస్య.

కానీ కాలం ఎల్లవేళలో అట్లా ఉండదు. తేల్చుకోవాల్సిన సమయమొకటి వస్తుంది. పొన్నం ప్రభాకర్ అయినా, కేకే అయినా వారిని వారివారి పరిమితుల వల్ల ఎంతకాలం తెలంగాణ సహిస్తుందన్నదే ఇక్కడి సమస్య. తెలంగాణ రాకపోతే, కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ముందు చిక్కుల్లో పడేది ఈ నేతలే. తెలంగాణ వీళ్లను తేల్చుకురమ్మంటున్నది. బహుశా రాబోయే కాలంలో అది ప్రధానం అవుతుంది. ఇవ్వకపోతే ఒకవేపు రాజకీయ సమాధి, మరోవేపు ఇప్పు డు మాట్లాడుతున్న మాటలకు వీసమెత్తు విలువా ఉండదు. అంటే కాంగ్రెస్ నేతలు బాతాల పోశెట్టిలు కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఆత్మగల నాయకులు. బలిదానాల నొప్పి తెలిసిన నాయకులు తేల్చుకోవాల్సి వస్తుంది. సిద్ధమా?
స్వామిగౌడ్ తెలంగాణకు సంబంధించి ఒక సాహస నేతగా ఎదిగారు. ఆయన పదవీ విరమణ సభలో ఈ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. రవీంద్రభారతి నిండుగా ఉద్యోగుల సమూహం ఒకకెరటంలా అగుపించింది.

తెలంగాణ ఇవ్వకపోతే అన్న ప్రశ్నకు ఇవ్వాల్టి రవీంవూదభారతి ప్రాంగణంలో ఒక అర్థమేలేదు! అన్నట్లు ఒక పోరాట పతాక ఎగిరినట్టు సభ నడిచింది. భవిష్యత్ మీద ఆశ మాత్ర మే. చలో.. చలో.. ఒక భరోసా. ఉద్యోగులు చరివూతాత్మక నలభై రెండు రోజుల సకల జనుల సమ్మె నాయకులు. వారు ముందున్నారు. జీతాల కోసం, ఇంక్రిమెంట ్లకోసం, ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం, జీవోల కోసం కొట్లాడే ఉద్యోగులు తెలంగాణలో మాత్రం జీవన్మరణ సమస్యను నెత్తికెత్తుకొని పోరాడారు. వాళ్లకు తెలంగాణ కావాలె. మారిన కాల మాన పరిస్థితుల్లో ఉద్యోగవర్గం సంకుచితంగా, స్వార్థపూరితంగా, ప్రజలకు వారి ఆకాంక్షలకు దూరంగా జరుగుతున్న సందర్భం. ఈ సందర్భాన్ని బద్దలు కొట్టి ఒక రాజకీయ డిమాండ్‌పైన సుదీర్ఘ ఉద్యమం నడిపినవాళ్లు తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు. వారి నేత స్వామిగౌడ్. ఆ మాటకొస్తే ఇటీవలి కాలంలో స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తెలంగాణ ఇంటింటి పేర్లయ్యాయి. వాళ్లు పోరాడారు. సమ్మె విరమణ మీద విమర్శలనూ ఎదుర్కున్నారు. కానీ చరిత్ర సృష్టించారు. ఆ చరివూతకు నాయకుడే స్వామిగౌడ్. ఆయన శరీరంలో 1969లోనే ఒక బుల్లెట్ దిగింది. తొలి తెలంగాణ ఉద్యమాన్ని అతని నెత్తురు కూడా ఎరుపెక్కించింది.

హైదరాబాద్ నుంచి తడీపార్ అయి, ట్యాక్సీ డ్రైవర్‌గా అవతారమెత్తి, సామాన్యుల జీవితాల్లో ఉండే అన్ని రకాల కష్టాలను, నష్టాలను అనుభవించి తెలంగాణ ఉద్యోగులకే నాయకుడిగా ఎదిగారాయన. ‘‘తాడి చెట్టెక్కితే ఏమస్తది. కల్లొస్తది.. కల్లొస్తే ఏమస్తది కొన్ని పైసలస్తయి. కానీ తాడిచెట్టు ఎక్కే సాహసం చేసేవాడు గోలకొండ ఖిల్లాను కొడితే ఏమస్తది. రాజ్యం వస్తది.’’ ఇది సర్వాయి పాపన్న స్ఫూర్తి. బహు శా 1956లో ఆంధ్రులకు పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్లీ పొందడానికి, తన రాజ్యం తనకు దక్కించుకోవడానికి కావొచ్చు. స్వామిగౌడ్ సర్వాయి పాపన్న స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమ కాగడా అందుకున్నారు. అది ఆయన జీవన సాఫల్యం. బహుశా ఈ విరమణ సభ ఒక పోరుకేకలా జరగడానికి ఇదే ప్రధాన కారణం. దేవీవూపసాద్ కూడా ఒక పోరాట వారసత్వం నుంచి, సాంప్రదాయం నుంచి వచ్చిన నాయకుడు. స్వామిగౌడ్ అందించిన కాగడాను ఇప్పుడాయన వెలిగించి ఊరేగాల్సి ఉన్నది. ఈ సందర్భంగా జరిగిన సభ తర్వాతే ఒక స్పష్టత వస్తున్నది. అవును ఇప్పుడు తెలంగాణకు స్పష్టత కావాల్సి ఉన్నది.


చుక్కా రామయ్యకు ఎనభై ఆరు సంవత్సరాలు. ఆయన అరవై సంవత్సరాల తెలంగాణను చూసి ఉన్నారు. దాని గుండె సవ్వడి విని ఉన్నారు. వృత్తికి ఉపాధ్యాయుడే అయినా ఆయన జీవితం పోరాట పంథాలో సాగింది కనుక పరమ సాత్వికుడైన చుక్కారామయ్య, పిల్లల మరణాలకు కలత చెంది కన్నీరు పెట్టుకునే రామయ్య ఇవ్వాళ్ల తెలంగాణ రాకపోతే లాఠీలు పట్టాలని, యుద్ధం చెయ్యాలని ఇచ్చిన పిలుపు దేనికి సంకేతం. అవును తెలంగాణకు సంకేతాలు సరిపోవడం లేదు. సంకేత వైఫల్యాలు అసలే కుంపటిలా ఉన్న తెలంగాణను ఉడికిస్తున్నవి. బహుశా బద్దలవుతుంది దునియా.. ఊరుకోదు తెలంగాణ. ఆకలితో, జీతభత్యా లు లేని లేమిలో పండుగలు జరుపుకున్న ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, అధికారులు సబ్బండ జనం మనసులో తెలంగాణ నొప్పి ఉన్నది. అవును మనమే మొదలు పెట్టామీ తెలంగాణ ఉద్యమాన్ని మనమే ముందుకు తీసుకుపోతాం. తెలంగాణ వ్యతిరేకులను తోసుకుంటూ ముందుకుపోతాం అనే స్పృహ ఉంది. చివరికి నాగం జనార్దన్‌డ్డి పిలుపు ఇవ్వనే ఇచ్చిండు.

హింస ప్రజ్వరిల్లుతది. ప్రజాస్వామ్యం విఫలమైతే ఇంకేం చేయాల్సి ఉంటుంది. అవును ఇంకేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యాలో అది తప్పదు. ఆయన జాన్‌ఎఫ్ కెనడీని మర్యాద కోసం అడ్డం పెట్టుకుని మాట్లాడారు. నిజమే ప్రజాస్వామ్యం విఫలమైతే శాంతియుత పద్ధతులు విఫలమైతే, మంచి మాటలు విఫలమైతే ఏం చెయ్యాలి తెలంగాణ. చుక్కా రామయ్య చెప్పింది చెయ్యాల్సిందే. నాగం జనార్దన్‌డ్డి జాన్‌ఎఫ్ కెనడీని అడ్డంపెట్టుకుని చెప్పింది చెయ్యాల్సిందే. ఇన్నాళ్లూ తెలంగాణ పరాయిలకు, పక్క ప్రాంతం పెత్తందార్లకు పూలనే ఇచ్చింది. పూల సువాసనలనే పంచింది. కానీ రాళ్లు రువ్వినప్పుడు ఎవరు మాత్రం తప్ప పట్టగలరు.

నిజమే. ఇస్తరా! చస్తరా! తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. నిజమే తేల్చుకోవాల్సింది సీమాంధ్ర సోదర రాజకీయ పార్టీలు. కేసీఆర్ ఈ సంకేతం బావున్నది. కేసీఆర్‌కు అందుతున్న సంకేతాలు ఆయన స్వంతం. అవి ప్రజలకు విశ్వాసాన్ని ఇవ్వవచ్చు. ఇవ్వకపోవచ్చు. కొందరు నమ్మవచ్చు. నమ్మకపోవచ్చు. కానీ సంకేతాలు విఫలమైతే ఆగస్టు 20నుంచి సంగ్రామమే అని కేసీఆర్ తెలంగాణ ప్రజల కు ఇచ్చిన సంకేతం బావున్నది. అవును ఈ సంకేతం కావాల్సి ఉన్నది. రావాల్సి ఉన్నది. వచ్చింది. ఊరికే ఉండదు తెలంగాణ. ఊరికే ఉండనివ్వదు త్యాగం. ఉత్త గా జీవించలేం. మరణాల మీద మనం నిలబడి ఉన్నం. బలిదానాల మీద మనం నిలబడి ఉన్నం. ఒక ఊతం త్యాగం. ఇదొక త్యాగాల గడ్డ. ఇస్తరా.. ఇవ్వరా! ఇవ్వకుంటే చస్తరు. ఇది శాపం కాదు. స్పష్టత. ఊరుకోదు తెలంగాణ. పోరాడుతుంది. పోరాడి నిలుస్తుంది. అదీ సంకేతం.

ఒక పదవీ విరమణ అభినందన సందేశాలు ఇవి.. సాధ్యమేనా? వేరే ప్రాంతా ల్లో.. అవును ప్రకటించి ఉన్నరు తెలంగాణ. తెల్లారే సరికే గత్తర లేపింది ఆధిపత్య రాజకీయ అహంకారం. అది అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఒక అహంభావం. ఎక్కడా ఊరటలేని దోపిడీ. పోరాటం నడుస్తుంటే పరాచికాలు. సీట్లు రావు. నీళ్లు తీసుకుపోతరు. ఎన్నని చూస్తుంది తెలంగాణ. మరి దారేముంది తెలంగాణకు. మసలుతున్నది ఎసరు. ఎసరు ఎక్కొస్తున్నది. దేనికైనా ఒక బాయిలింగ్ పాయిం ట్. ఉష్ణోక్షిగతలు విరజిమ్మే ఉష్ణ కాసారాల్లో ఎవరి బతుకూ అంత సులభంగా ఉండదు. బహుశా పదవీ విరమణ సభ ఎత్తిన పోరుపతాక ఇదే దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది.

చూద్దాం.. చేద్దాం.. అన్న మాట పాతది. సకల జేఏసీలు ఇప్పటికే రంగంలో ఉన్నవి. సంకేతాలు కావాల్సి ఉన్నది. ఒక పోరు మరోసారి విజృంభణై విశ్వరూపమై, అన్యాయం మీద దండయాత్ర చేయాల్సి ఉన్నది. అన్నీ ప్రజాస్వామ్యం ప్రకారమే చేసినవాళ్లు, అన్నీ శాంతిని గాంధీని నమ్మి చేసినవాళ్లు, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలో ఉద్యమించిన వాళ్లు, అయినా రానప్పుడు ఒక స్పష్టతకు రావాల్సి ఉన్నది. బహుశా ఇవ్వాల్టి సభ ఆ స్పష్టత ఇచ్చింది. ఇప్పటి దాకా ఉద్యమం పరిధుల్లో జరిగింది. ఇప్పటి దాకా ఉద్యమం ఓట్లల్లో జరిగింది. ఇప్పటి దాకా ఉద్యమం రాజకీయ ప్రక్రియల్లో జరిగింది. కానీ చట్టసభలు, రాజకీయ పార్టీలు వాగ్దాన భంగం చేసిన తర్వాత, ప్రజాస్వామ్యాన్ని హననం చేసిన తర్వాత ఇక తెలంగాణకు ఒక స్పష్టత రావాల్సి ఉన్నది. ఆ స్పష్టత తెచ్చి తెలంగాణ వెంట నడిస్తేనే ఎవరినైనా తెలంగాణ తలకెత్తుకుంటుంది. కాదంటే చరిత్ర పెంట కుప్పల మీద మరిన్ని శవాలు. అనివార్యత. తెలంగాణ రావాల్సి ఉన్నది. అనివార్యత తెలంగాణ ప్రకటించాల్సి ఉన్నది. కానీ తేడావస్తే.. ఇప్పటిదాకా వీధులు వంటా వార్పులను, బతుకమ్మలను, బోనాలను చూసినయి. కానీ ఇవే భాగ్యనగర వీధులు 1969లో ఉసిళ్ల పుట్టలా పగిలిన జనం రాజ్‌భవన్ రోడ్డును ఆక్రమించుకున్న ఉచ్ఛతర రూపాన్నీ చూసినవి. మిలియన్ మార్చ్‌నూ, ట్యాంక్‌బండ్‌నూ చూసి ఉన్నదీ భాగ్యనగరం. బహుపరాక్ ఏలికలారా! తెలంగాణ ఇవ్వకపోతే ఇక తెలంగాణ టెంట్ల కిందకాదు. వీధుల్లో ఉంటుంది. అప్పుడా వీధుల్లో ఏమి పారుతుందో? ఊహించలేరు మీరు. వీధులు పోటెత్తే కాలమొకటి వచ్చినప్పుడు తెలంగాణను ఆపతరం కాదు. అదీ అసలు సమస్య. ఏలికలారా! ఇస్తరా! చస్తరా!

-అల్లం నారాయణ
allamnarayana@yahoo.co.in

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...