రాజకీయ బానిసల జాతి


Sun,July 8, 2012 12:46 AM


బానిసత్వం కొంచెం సుఖంగా ఉంటుంది. నిశ్చల ప్రపంచంలో నిశ్చలంగా ఉండవచ్చు. కనీసం నిలవ నీళ్లలాగా, యధాతథ స్థితిలో భారం కోల్పోయి గాలిలో తేలియాడుతూ ఉండవచ్చు. ఈక్విలివూబియమ్ స్టేటస్. ఎందుకురా బతుకులు చెడ. ‘న్యాయ విరుద్ధంగా నీళ్లు మళ్లించుకుంటున్నవాడు నీతులు చెప్తుంటే గుడ్లపప్పగించి గుడ్లగూబల్లా చూడ్డానికి, చెవులప్పగించి వినడానికి. శవాల మధ్య బతకడం మాత్రం దుర్భరంగా ఉంటుంది. నిత్య విషాదంలాగా... ఎనిమిదివందల మంది శవాలైనాక కూడా కదలికలు లేని బానిసలు కూడా శవాలే కదా! ఒకగుంపు ఇప్పటికీ చంద్రబాబు కోసం బాంచెతనం చేస్తూ ఉం టుంది. చెక్కలు ముక్కలైన ఆయన దేహాన్ని‘దేశాన్ని ’ కంకబద్దలతో కట్టి, నిలబెట్టి ముఖ్యమంవూతిని చెయ్యడానికి కొందరు బానిసలు ఇప్పటికీ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 8లో, బ్రహ్మానందడ్డి విగ్రహం ముందరి భవంతి ముందర తారట్లాడుతుంటారు. విశ్వాసంగల జంతు సమాజం లాగా..అయిదువందలాపది మట్టంనుంచి డెల్టాకు దర్జాగా అర్థరాత్రి పూట తరలించుకుపోతున్న నీళ్ల గురించి ఒక్కమాట మాట్లాడడు చంద్రబాబు. ఎట్లా నాయకుడాయన మీకు బానిసలారా ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి ప్లీజ్ ఆలోచించగలరా! అయినా చచ్చి శవాలయిన మంద ఏం మాట్లాడుతుంది. శవాలతో కలిసి జీవించడం కడు దుర్భరంగా ఉంటుంది. జై తెలంగాణ అని మొత్తుకుంటున్న నాలుగున్నర కోట్ల మంది కేకలు గొంతులు దాటి ఆకాశానికి ఎగసిన ఉద్యమ సందర్భంలోనే నీళ్లు...నీళ్లు.. డెల్టాకు నీళ్లు మనకు ఎక్కిళ్లు. న్యాయం గురించి నీతులు చెప్పేవాళ్లు ఈ ఒక్కటీ మినహాయించి మాట్లాడతారు. సహజంగానే మీడియాకు నోరు పెగలదు. రాతరాదు. ఇక్కడ న్యాయం గుంటూరు, కృష్ణాకు నీళ్లు. మొత్తం నీటిపారుదల వ్యవస్థ అంటే ఇప్పుడు రెండు ప్రాథమ్యాలు చేసిన పోతిడ్డిపాడు నుంచి శ్రీశైలం నీళ్లు మళ్లించడం ఒకటి. గొంతెండినా సరే.. కృష్ణా గుంటూరు డెల్టాలకు నాగార్జున సాగర్ జలాలివ్వడం. కలుషితం చేశారు మెదళ్లను. అదే న్యాయం. అది అబ్బల జాగీరు. రాసిపెట్టి ఉన్నది. ఒక్క ఛానలూ పలకదు. ఒక్క పత్రికా అవును నీరు.. ఇది నిజం అని చెప్పదు. పైగా నీరు నిప్పయిందంటారు. ఏం చెబుతాం! నీతి.. నియమం..న్యాయం..ధర్మం వాళ్ల ఇంటి ముంగరి కుక్కలాంటి దని తెలిసే సరికే.. అన్నింటికీ రెండు నాల్కలు. అంతిమ ప్రయోజనం. ఆధిపత్యం.

బానిసలారా! ఉవ్వెత్తున ఇట్లా అందరం అల్లిబిల్లిగా, చెల్లాచెదురుగా, కలివిడిగా..విడివిడిగా మాట్లాడ్తున్నప్పుడే ఎవరి కుట్రల్లో వాళ్లున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ.. తుర్రెబాజ్‌ఖాన్ స్తూపం ఉంటుందక్కడ. వీరుని కన్న నేల. దేశంలోనే ఇరవై గొప్ప కాలేజీల్లో ఒకటి.. గాంధీ మెడికల్ కాజేజీ.. ఎవరైనా సరే చదవాలని కోరుకునే కాలేజీలవి. ఇవి అక్కరకురాని కాలేజీలయ్యి..విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ ముద్దొచ్చి నూటాయాభై సీట్లు దంచుకుపోతే బానిసలారా! బానిసజాతి. మన రాజకీయ బానిసల జాతి.. మరో గుంపు జగనన్న రాజ్యం కోసం పడిగాపులు పడ్తున్నది. రాజన్న పురావైభవాన్ని కీర్తిస్తూ, జగనన్న భవిష్యవాణి వైభవాన్ని వినిపించే విజయమ్మా ఒక్కమాట మాట్లాడదు. జగనన్నా మాట్లాడడు. ఒక గుంపు జగనన్న రాజ్యం కోసం చిరుతల భజనకు దిగింది. బానిసల జీవితం కొంత సుఖంగానే ఉంటుంది. నిప్పచ్చి బతుకు. రంధీరవుసులేని బతుకు. ఇజ్జత్ మానంలేని బతుకు.
మరోమంద కాటగలిసి పోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి పేషీలో సొమ్మసిల్లి పో యింది. పట్టు చీరలు ధరించిన స్త్రీ జాతి బానిసలు మంగళారతులిచ్చి, భజన కీర్తనలు పాడి, కిరణ్‌కుమార్‌డ్డికి భుజకీర్తులు తొడిగారు. ఫార్చ్యూన్ కార్లు దిగిన ఎమ్మెల్యేల మంద.. ఒక కాంట్రాక్టు. ఒక ఒప్పందం. ఒక పైరవీ. మళ్లీ ఎన్నికల్లో చిన్నపాటి సీటు రిజర్వేషన్.. బానిసల మంద. మంత్రులు మేళంగా మూగారు. ఒక్కరు.. ఒక్కరూ మాట్లాడరు. కడుపెండుకపోతున్నది. నా ముద్దుల రాజకీయ బానిసలారా! దూపయితంది. దశాబ్దాల దూప..పానీ ఆయే..పానీ ఆయే.. భాగో.. భాగో...

స్తన్యం దక్కని శిశువుల బాధ. తలాపున పారే గోదారి, కృష్ణమ్మ తల్లులు, కన్న శిశువులను ఎండగట్టి, కడగొట్టు బిడ్డలకు స్తన్యమిస్తున్నప్పటి బాధ. పాలధార.. పాలధార.. దూపయితంది.. నా బానిస రాజకీయ నాయకులారా..తీరని దూప.. దశాబ్దాల దూప. కాలొంకర, కన్నొంకర..నల్లగొండ బతుకే వంకర..రాజకీయ బానిసలారా! చచ్చిన శవాలయిన మనుషులారా! నీళ్లు కావాలి..నీళ్లు..నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయితిరి గద.. ఓట్లేసి గెలిపిచ్చి.. నీళ్లు దంచుకుపోయినప్పుడు, సీట్లు కొల్లగొట్టుకపోయినప్పుడు మాట్లాడని ఒక రాజకీయ మూక... పంజాగుట్ట ఫ్లై ఓవర్ ఆ కొస దాటినాక క్యాంపు ఆఫీసు ముందర భజన చేస్తున్నది. నీళ్లివ్వండి దేవరా! అని అడిగితే ఇప్పటికీ అచ్చంగా పదహారో కృష్ణుడచ్చి, ఫ్లోరైడ్ పరిశీలనలు చేస్తున్నడు. ఏం పరిశీలనలు చేస్తరు స్పీకర్ సర్. ఇక్కడి జీవితం మనోహరంగా ఏమీ లేదు. మెలి తిరిగిన అవయవాల బాధ.. సుమ్మర్లు చుట్టుకున్న బాధ. మా ఎముకలు ఫట ఫట విరిగినట్టే.. మా మనసూ విరిగిపోయింది. ఏ రాజకీయ తారా మా నొసట గీసిన విషఫ్లోరైడ్ గీతలను చెరపలేదు. నీళ్లు కావాలి.. నీళ్లు.. గలగల.. జలజలా.. భూగర్భ జలాల్లో నిండుగా పేరుకుపోయి...మా శరీరాలను గాజుబొమ్మల్లా పెళుసుగా చేస్తున్న ఫ్లోరైడ్ పోవాలంటే నల్లగొండ నేలంతా నీరై పారాలి. తలాపున నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెరుచుకోవాలె. గొడ్డళ్లు, బరిసెలు కాదు. మాకు మహబూబ్‌నగర్ ఆర్డీఎస్‌కు నీళ్లు కావాలి. అర్థరాత్రి అపరాత్రి సాగర్‌నుంచి తరలిచ్చుకుపోతున్న మీ ఆధిపత్యం కింద నీటి గోస....సోయిలేని బతుకులు... బానిసత్వం చాలాసార్లు ప్రయోజనకరంగా ఉం టుంది. కోట్ల మందికి చేసిన ద్రోహాలకు, వివక్షలు, మహా దోపిడీ, వనరుల తరలింపు జరుగుతున్నప్పుడు మౌనం వహించినందుకు విశ్వాసంగల జంతువులకు బిస్కట్ ఇస్తరు. ఆ బిస్కట్‌ల మత్తు మందుతో గుర్కాయించుడు, గుర్రుమనుడు మరిచి పన్నట్టు... బానిసలు.. బానిసలు బానిసత్వం సుఖంగానూ, కొన్నిసార్లు ప్రయోజనకరంగానూ ఉంటుంది.

నీతులు మాత్రమే చెప్పడానికి అలవాటు పడిన వాడొకడు ఢిల్లీలో మొరుగుతున్నడు. ఎవరూ అడగకుండానే గాంధీ సమానుడిగా నీతులు బోధించే ఉద్ధార క జాతి అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా ప్రవచిస్తూ కూడా చెక్కు చెదరడం లేదు. తొణకడం లేదు. బెణకడం లేదు. కనీసం.. కనీసం మాట్లాడండయ్యా..అబద్ధాలు వల్లిస్తున్న వాడికి అద్దాలు బద్దలు చేస్తూ కొన్ని నిజాల్ని విసరండి...నిజం మీద తెరవేసిన చీకటి తెరలను చింపేట్టు ఒక్క మాటన్నా మాట్లాడండి. మీ పలుకు బంగారంగాను, నోర్లు పడిపోయిన బానిస జాతి ఒకటి తెలంగాణ మీద తెట్టులా తేలింది. బానిసత్వం మానవ చరివూతలో మృత్యువుకన్నా విషాదకరంగా ఉంటుంది. అది మనిషిని మరి లేవజాలని మత్తులో ముంచుతుం ది. భూములు మింగినవాడు భూ చట్టాల గురించి మాట్లాడతడు. నైతిక విలువలు లేనివాడు నైతికతను బోధిస్తడు. తెలంగాణను వంచించి విలీనమైనవాడి జాతి సమైక్య నీతులు బోధిస్తుంది. బిస్కెట్ ముక్క కోసం విశ్వాసం గల జంతువులు తోకలూపుతుంటాయి. నీళ్లేవి...కాలేజీలేవి... సీట్లేవి. ఎవరికి పుట్టినవ్ బిడ్డా అంటే అంగట్ల పుట్టిన అవ్వా...తెలంగాణ ఒక పరాధీన.

వస్తున్నదా! తెలంగాణ...తెస్తున్నరా! తెలంగాణను చెర్లనీళ్లు చెరు పడినంక. వేల ఎకరాలు మర్నాగులు ఆక్రమించుకున్నంక, మెదడులన్నీ ఆధిపత్య భావనలన్నింటికీ బానిసయిపోయినంక, ఆలోచనలు తాకట్టుపడినంక, స్పృహ లు, చైతన్యాలూ, పౌరుషాలు, త్యాగాలు నిమిత్త మాత్రమైనంక... అవును బానిసల వల్ల తెలంగాణ తెగువకు తెగులు పుడ్తున్నది. ఎవడి కలుగుల్లో వాడు, ఎవడి ప్రయోజనాల కోసం వాడు, రాజకీయమా! వర్ధిల్లకు.. ప్రజలు బారికేడ్లు కట్టారు. తెలంగాణ ప్రజలు వీధుల్లో మోహరించారు. తెలంగాణ ప్రజలు మృత్యువును ముద్దాడారు. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం బానిసత్వం చెర వదిలించుకుని నెత్తురు చిందించారు. కానీ... కానీ రాజకీయమే ద్రోహం చేస్తున్నది. ప్రజావూపతినిధులు అయినవారు, కావాలకున్నవారు, మంత్రులయినవారు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే జాతి ఒకటి తయారయింది. అదే రాజకీయ బానిస జాతి. ఇస్తానని మోసం చేసినవాడినీ నమ్మేజాతి. రెండుకండ్లని మోసం చేసిన నాయకుని కోసం పడిగాపులు పడి ముఖ్యమంవూతిని చెయ్యడానికి కంకణం కట్టుకున్న బానిసల జాతి... జైలులో జగనన్న కోసం ఆయన రాజ్యం కోసం మోకాళ్ల మీద మోకరిల్లిన జాతి. ఒక కిరణ్‌కుమార్‌డ్డి కోసం మాట కూడా మాట్లాడని మౌనం పాటించే జాతి. సీట్లుపోయినా, నీళ్లు పోయినా దోపిడీ, వివక్ష పరాకాష్టకు చేరినా కనీసం ఉలకని జాతి అదే తెలంగాణ రాజకీయ జాతి. మోక్షం లేదు. నిష్కృతి లేదు. నమ్మినం ఓట్లేసినం. గెలిపించినం. కానీ... కానీ...

మంటల్లో కాలిపోయిన శ్రీకాంతాచారి, రైలుకు ఎదురేగిన వీరుడు, పార్లమెంటుకు కనువిప్పు కావాలని శాస్త్రిభవన్ వద్ద ఉరిపోసుకున్న యాదిడ్డి... మరణాలు కలత బెడ్తున్నాయి. బలిదానాలు చేసుకున్న వారి ఆత్మలు కలవరపెడ్తున్నాయి. తెలంగాణ ఇప్పుడొక కుంపటి. లోపట అగ్గి రగలుకున్నది. పైన ఊబిది మాత్రమే కనబడితే అది మీ ఖర్మ. పారాహుషార్. తెలంగాణ బానిస రాజకీయవేత్తలారా! ఆ కుంపటి రేపు మీ గుండెల్లో వెలిగే మంటవుతుంది. ఉద్యమం ఊది ఊది మండించే నిప్పు అంటుకుంటది. తప్పదు పోరాడే బానిస మిగులుతడు. జీవశ్చవమైన వాడు అంతరిస్తడు. బహుశా... రాజకీయ సమాధే.. మీ భవిష్యత్తు.
గులామ్‌కీ జిందగీసే
మౌత్ అచ్ఛీ హై ! - కేవీ రంగాడ్డి

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...