పరకాల పాఠం


Sat,June 16, 2012 11:36 PM

పరకాల ప్రమాదం తప్పింది. అదిప్పుడు పోరు పతాకై నిన్నూ నన్ను నిలబెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్ జర్నలిస్టు మిత్రుల ఫోన్ ‘సార్! కొండా మురళి ఒక్కడే మొగోడు. రెండు రోజుల్ల ఆగమాగం చేసిండు. పోలింగ్ బూత్‌లల్ల గులాబీ గుండెలు కనబడనేలేదు. పత్తకు లేరు. గెలుస్తరేమొ కానీ, టఫ్‌ఫైట్ ఉంటది’ అన్నరు. ఇదేదో ప్రమాదం పొంచి ఉన్నట్టే అనిపించింది. ఓట్ల లెక్కింపునాడు అది నిజమే అనిపించింది. తెలంగాణకు మీడియాలో సుట్టపక్కాలు ఎవరూలేరు. జర్నలిస్టులు తప్ప. ఇక్కడి జర్నలిస్టులందరికీ ఇది పెద్ద రందిలాగ తయారయింది. కానీ ఎంత మొగోడయినా, కొండా సురేఖ తెలంగాణ కోసమే రాజీనామా చేసినా’ అని ఎంతగా మొత్తుకు న్నా.. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, అంతకు ముందు మంత్రిగా పనిచేసినా, ఒకప్పుడు కేవలం సర్పంచిగా పనిచేసిన హంగులూ, ఆర్భాటాలూ, కండబలం, ధన బలం, దర్బార్ల బలం, అట్టహాసం లేని సామాన్య రాజకీయవేత్త మొలుగూరి భిక్షపతి గెలిచాడు. అది భిక్షపతి గెలుపేనా? ఎదురీదాల్సిన పరిస్థితుల్లో ఎదుక్కిన చేపలవలె, నిశ్శబ్ద వాతావరణంలో, రాజన్న రాజ్యం మాయామోహాలను, కొడుకు జైలు, అమ్మ ఏడుపులను తట్టుకొని నిలబడిన తెలంగాణ ప్రజలది. ఎన్నైనా విశ్లేషణలు చేయవచ్చు. కానీ భిక్షపతి గెలుపు నిస్సందేహంగా ఒక అవమానం నుంచి తెలంగాణను కాపాడిన గెలుపు. భారీ మెజారిటీ రాలేదు. నైతికంగా ఓడిపోయినట్టే. మొత్తం టీఆర్‌ఎస్ మోహరించింది. అయినా సురేఖ అల్లల్లాడించింది అని విశ్లేషించినట్టే, లెక్కలు పత్రాలు వేసినట్టే, మరోరకంగా కూడా మాట్లాడొచ్చు. సురేఖ కూడా తెలంగాణ అన్నది. బీజేపీ తెలంగాణ ఇస్తానన్నది. తెలుగుదేశం తెలంగాణ వేపే మేమన్నది. కాంగ్రెస్ ఇచ్చేది మేమే అన్నది. వీటన్నింటి మధ్య ఓటరు తేల్చుకోలేకపోయిండు అని వాదనలకేం అనేకం చేయవ చ్చు. కానీ, పరకాల ప్రమాదం నుంచి వరంగల్ ప్రజలు తెలంగాణను రక్షించా రు. అన్ని ఉప ఎన్నికల విజయం ఒక ఎత్తు. పరకాలలో విజయం ఒకెత్తు అన్నది కఠిన వాస్తవం. నిజమే. టీఆర్‌ఎస్ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టడం లేదు. నిజమే టీఆర్‌ఎస్ ఉద్యమంలో ఒక రీతిన, నిశ్శబ్దాల్లో మరో రీతిన ప్రవర్తిస్తున్నది. నిజమే ఇట్లయితే కష్టమే. 2014లో ఇట్లాంటి టఫ్ పోటీలు చాలా ఉంటాయి. దాని ప్రభ తగ్గుతున్నది దాకా అన్ని అంచనాలూ వెయ్యవచ్చు. నిజమే కూడా పరకాల ఎన్నికల అపజయాన్ని కానీ, విజయాన్ని కానీ ఎన్నిక చుట్టూ, టీఆర్‌ఎస్ చుట్టూ తిప్పి ఆలోచిస్తే ఇవన్నీ నిజమే. కానీ, తెలంగాణ ఉద్యమం మొత్తంగా ఎదుర్కుంటున్న పరిస్థితి, ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా ఉప ఎన్నికలు ఒక ప్రాణాంతక పరీక్ష కావడం, ఆ ఎన్నికల గెలుపు తెలంగాణవాదం మనుగడకు, స్థితిగతులకు గీటురాయి కావడం అనివార్యం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో పరకాలలో నిజంగానే ఓడిపోతే తెలంగాణ ఉద్యమం మీద ప్రభావం ఎట్లా ఉంటుందో? ఊహించడం కష్టం కాదు. టీఆర్‌ఎస్, ఎన్నికల గెలుపోటములు కాకుండా, ఇప్పటికే ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షల విస్తృత పరిధిలో ఈ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకున్నప్పుడే భిక్షపతి గెలుపు గొప్పదనం అర్థమయ్యే అవకాశం ఉన్నది.

తెలంగాణేతర ప్రాంతాల్లో వీచిన ఫ్యాను గాలి తుఫానయింది. ఆ తుఫానును తట్టుకున్నది పరకాల. అవినీతికి, ప్రజల ఉద్వేగాలకూ ఎలాంటి సంబంధం ఉండదని ఇప్పటికి చాలాసార్లు నిరూపణ అయింది. ఉద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు, కొన్ని కన్నీళ్లకు ఓటర్లు కరిగిపోవడమూ మామూలే. కానీ జగన్‌కు తెలంగాణలో పరకాల ఒక ప్రవేశద్వారం. అది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జగన్‌పార్టీ పెట్టుకున్న పరీక్ష. ఆ పరీక్షలో జగన్ గెలిస్తే, కొండా దంపతుల ద్వారా తెలంగాణలో పరకాల వారికి రాచదారి అయ్యేది. ఆ ప్రమాదాన్ని తక్కువ చేసి చూసినప్పుడు, పరకాల ఎన్నికను మామూలు ఉప ఎన్నికలా చూసినప్పుడు కూడా భిక్షపతి గెలు పు సాధారణంగానే కనబడ్తుంది. కానీ పరకాల ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. కండబలానికి, ధనబలానికి, పకడ్బందీ ఎలక్షనీరింగ్‌కు, కొన్ని కన్నీళ్లకు, కొన్ని రాజన్న రాజ్యపు పథకాల భ్రమలకు ఓటర్లు కొంత ఎక్కువమంది లొంగిపోవడ మే మెజారిటీ తగ్గడానికి కారణం. ఏ ప్రలోభాలకూ లొంగకుండా జగనన్న రాజ్యం వస్తే ఏమవుతుందో? అనే ఒక భయం, వస్తే ఇక తెలంగాణ మరిచిపోవడమే అనే పొంచి ఉన్న ప్రమాదం గురించిన తెలివిడి పరకాల ఓటర్ల విజ్ఞతకు పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో పరకాల ప్రజలు నిలబడి, గాలికి ఎదురీది నిలిచి గెలిచారు. పరకాల ఫలితాన్ని అట్లా చూడాలి.అయితే ఇదంతా నాణేనికి ఒకవేపు మాత్రమే. తెలంగాణ ఉద్యమం ఏమయిపోతున్నది? ఎటు మళ్లుతున్నది! ఉద్యమ స్వరూప స్వభావాలు తీవ్ర రూపాల నుంచి, తీవ్ర అభినివేశం నుంచి, స్వల్పమైన ఎన్నికల చుట్టూ తిరిగే పరిస్థితి ఎందు కు వచ్చింది? ఎన్నికలే తెలంగాణ ఉద్యమానికి ఎందుకు? ప్రమాణాలుగా, కొలమానాలుగా తయారవుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ ఉన్నట్టు? ఓడిపోతే లేనట్టా? ఏ ఎన్నికలు ఇన్నాళ్లూ ఇంత తెలంగాణ పోరాటాన్ని నడిపించాయి? ఎన్నికలేతరంగా ఉద్యమం ఏమయింది? ఇవి ఇప్పటి ప్రశ్నలు. లేదా ఎన్నికలే అనుకున్నా.. పరకాల ఎన్నిక పూర్తయింది. ఇప్పుడు ఉద్యమం ఏం చేయవలసి ఉన్నది. ఉద్యమంలో మధ్యమధ్యంలో వచ్చే పోరాటాలే ఎన్నికల రూపపు పోరా టం అనే వరకు బాగానే ఉంది. వినడానికి కూడా సబబే అనిపిస్తున్నది. కానీ ఎన్నికలే కొలమానం దాకా ప్రమాణం దాకా, ఎన్నికల సమయంలో ఉద్యమమంతా ఒకేదాని చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు? వస్తున్నది అనేది ఇప్పటి ప్రశ్న.

పరకాలలో టీఆర్‌ఎస్ మెజారిటీ ఎందుకు తగ్గింది? జగన్ పార్టీ అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చినప్పుడు తెలంగాణవాదం ఉన్న తెలంగాణ ప్రజలు జగన్‌ను కోరుకుంటున్నారా? ఇది కాంగ్రెస్ అధిష్ఠానం దూత వాయలార్ రవి ప్రశ్న. ఈ ప్రశ్న మెజారిటీ తగ్గినందుకే ఎదుర్కున్నది. ఓడిపోతే. ఒక్క రవి కాదు. మీడియా, తగుదునమ్మా అని తానాతందానా అని బయలుదేరి సీమాంధ్ర నేతలు, గాయిగత్తర లేచేది. వాయలార్ రవి మాటలు కాంగ్రెస్ అంతరంగిక మాటలే అయితే. తెలంగాణ మరో ఉధృతరూపం ఉద్యమానికి సిద్ధం కావడమొక్కటే మార్గం. కాంగ్రెస్ దేశంలో అతి ప్రమాదకరమైన పార్టీ. పరకాల ప్రజలు ఆ విషయం గుర్తించారు. కనుకనే ఆ పార్టీని ఐదో స్థానంలో డిపాజిట్లు గల్లంతు చేసి మరీ చావుదెబ్బ కొట్టారు. అదీ పరకాల విజయం.అయినా ఆ విషయం ఏ మాత్రం కనపడని వాయలార్వ్రి, తెలంగాణవాదం ఎక్కడ? అనే ప్రశ్న తెలివిగా అడుగుతాడు. ఎన్నిక ముగిసీముగియగానే కేకే ఇంట్లో సమావేశమూ జరుగుతుంది. ఇంకా ‘తెలంగాణ ద్రోహులం కాదేమో’ అని ఒకించుక సందేహంతో కేకే కూడా తెలివిగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ద్రోహులు అనుకుంటారని భయమేస్తున్నదని చెబుతాడు. ఊదుగాలదు. పీరిలేవదు. సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. నాటకం నడుస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మూడోస్థానం వచ్చినందుకు తెలంగాణ ఇప్పుడు ప్రాధాన్యతాంశం అవునా? కాదా? అనే మీమాంసలో పడ్తుంది. తెలంగాణకు వ్యతిరేకం కాదని తామూ ఎన్నికల్లో పలికిన ప్రగల్భాలను అది మరిచిపోతుంది. భారతీయ జనతా పార్టీ బొక్కబోర్లాపడినా నెపం వేరే విషయాల మీద పెడ్తుంది. ఉద్యమంలో చీలికకకు తమ బాధ్యత ఎంతో? అది మాట్లాడదు. తెలంగాణ ఉద్యమం అంతకు ముందరి ఉప ఎన్నికల కన్నా, కడచిన రెండు ఉప ఎన్నికల్లో, మహబూబ్‌నగర్, పర్కాల ఎన్నికల్లో చీలికను చవిచూసింది. అది వైరి వర్గాలుగా ఉద్యమ శిబిరం చీలిపోయే దాకా ఎదిగింది. ఎన్నికలు కీలకం అయినప్పుడు, ఉద్యమ రూపంగా ఎన్నికలు కాకుండా, ఎన్నికలే ఉద్యమం అయినప్పుడు ఈ పరిణామాలు సహజం. నిజంగానే తెలంగాణ ఉద్యమం ఎన్నికలే పరమావధిగా, పరమార్థంగా జరిగిందా? తెలంగాణ సాధన కోసం జరిగిందా? అనే ప్రశ్న ఇప్పటి ప్రశ్న. సరే.. టీఆర్‌ఎస్ బలహీనతలు టీఆర్‌ఎస్‌కు ఉన్నాయి. ఆ పార్టీ తనను కాపాడుకోవడంలో, బలపడడంలో, సంస్థాగత నిర్మాణాలను పెంచుకోవడంలో, ఉద్యమం మొత్తాన్ని ఐక్యంగా ఉంచడంలో వైఫల్యాలను ఎదుర్కున్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భాగస్వామిగా ఆ పార్టీ తనను తాను శోధించుకొని పొడసూపుతున్న అవలక్షణాలను కానీ, లోపాలను కానీ సవరించుకోవలసి ఉన్నది. కానీ ఉద్యమశక్తుల సంగతేమిటి? జేఏసీలు, ఫ్రంట్‌లు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, టీచర్లు, లెక్చరర్లు, సకల జనాలు, తెలంగాణ మొత్తంగా ఒక ‘ఏకాత్మ’ ప్రతిఫలంగా వీధులను వెలిగించిన క్షణాలేవి? అనేది కూడా తాజా ప్రశ్న.

తెలంగాణ ఉద్యమం ఒకపార్టీకి, ఒక సంస్థకు, ఒక జేఏసీకి, ఒక ఫ్రంట్‌కూ, ఒక ఐక్య సంఘటనకు మాత్రమే పరిమితమైంది కాదు. అది విస్తృత రూపంలో వెల్లడైన అస్తిత్వ ఉద్యమం తీవ్ర వామ పక్షాలనుంచి ఆర్‌ఎస్‌ఎస్ దాకా, సామాన్యుల నుంచి జస్టిస్‌లదాకా కదిలించిన ఉద్యమం. అంతర్గత వలసాధిపత్యం, స్థిరీకరించిన పెట్టుబడుల విస్తరణ ఫలితంగా దోచుకుపోయిన వనరుల పరిరక్షణ, వివక్ష పై పోరాటం, స్వీయ రాజకీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, కొల్లగొట్టిన కొలువులు, మొత్తంగా పొగొట్టుకున్న అస్తిత్వ ఆకాంక్ష. ఇదొక ఉమ్మడి స్వభావం గల అస్తిత్వ పోరాటం. ఇది నువ్వూ, నేనూ మనందరం కలిసి పోరాడే ఉద్యమం. చీలికలు పేలికలుగా కనబడుతూ ఉండవచ్చు. రకరకాలుగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ జయశంకర్‌ను మళ్లోసారి తలుచుకుంటూ కుదిరితే ఉమ్మడి ఉద్య మం...లేదంటే ఒకరికొకరు వ్యతిరేకం కాకుండా సమాంతరంగా పనిచేసే శక్తుల పోరాటంగా తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్దవలసి ఉన్నది. ఎన్నికలు అయిపోయినయి. చాలా మందికి ఈ రూపమే ఇష్టం లేదు. కానీ అయిపోయింది. ఒక గండమూ గడిచింది. పరకాల ప్రజలను, వరంగల్ పోరాట పటిమను, మొత్తంగా తెలంగాణను అంతకన్నా ప్రేమిద్దాం. కానీ ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుదాం. పోరాడనిదే తెలంగాణ రాదు. మళ్లీ వీధులు పోటెత్తి నినదించనిదే తెలంగాణ ఇవ్వరు. ఉద్యమిద్దాం... తెలంగాణ తెచ్చుకుందాం.. మళ్లీ ఒక హైదరాబాద్ ముట్టడి? మళ్లీ ఎర్రెపూరగా పూచే మోదుగు పూలవనాన్ని, మళ్లీ ఒక మిలియన్ మార్చ్‌ను కలగందాం. మరి దారి లేదు.

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...