అమ్మా! జగనన్న రాజ్యం మాకొద్దు


Sun,June 10, 2012 12:21 AM

మీరు భర్తను పోగొట్టుకుని దుక్కంతో వచ్చారు. నిజమే.. కొడుకు జైలు పాలయ్యాడు. మనసుపడి కట్టించుకున్న లంకంత క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు మీ శత్రువులున్నారు. వేట సాగుతున్నది. సీబీఐ, ఈడీ ఒకదాని వెంట ఒకటి. జైలుకూ, కస్టడీకి మధ్య ఊగులాడుతున్న భవిష్యత్ సందేహాల్లో మీ కుమారుడు జగన్ చిరునవ్వులతో ముకుళిత హస్తాలతో ఎదురైన వాళ్లకల్లా దండాలు పెడ్తూ ఉన్నడు. బుగ్గలు పుణకడానికి ఎవరూ దొరకక పోవడం ఒక వెలితే. ఏం చేస్తాం. మీకు కాలం కలిసి రాలేదు. అట్లనడానికీ లేదు. జగన్ జైలుపాలయితేనేం. మీరూ, మీ కూతురూ జన సందోహాల మధ్య ఓట్లు అడుగుతూ.. ప్రశ్నలు వేస్తూ.. ఒక్క జగనన్నకే ఇదేమి కర్మమని సెంటిమెంటును పండిస్తున్నప్పుడు మోగుతున్న చప్పట్లలోనే మీ భవిష్యత్తు దర్శనం బంగారు మయంగా కనబడ్తున్నది. రాజన్న రాజ్యం కోసం, జగనన్నను ముఖ్యమంవూతిని చెయ్యడం కోసం మీ ఇద్దరూ ఊరూరు తిరగడానికి, మాకు ఎలాంటి అభ్యంతరమూ ఉండక్కరలేదు.

అవినీతికన్నా, లక్షకోట్ల అక్రమాల కన్నా, జనం ఉద్వేగాలమీద కన్నీళ్లు కార్చినంత కాలం మీకు రెండు కార్తులా, ముక్కారు ఓట్ల పంటలు పండుతాయి. అలాంటి దేశం మనది. కానీ.. అమ్మా! విజయమ్మా.. మా తెలంగాణను మీరు మళ్లీ ఏమి చేద్దామని వచ్చారు. రాజన్న రాజ్యం తెలంగాణను మాట కూడా మాట్లాడనివ్వని ఎటకారపు రాజ్యం రాజన్న రాజ్యం. ‘అయితే ఏంటట!’అని హేళన చేసిన రాజ్యం. ఈ రాజ్యాన్ని తిరస్కరించేకదా? మానుకోట మీ జగనన్న మీద రాయి విసిరింది. ఈ రాజ్యం ఇక చాలనే కదా! మానుకోట జగనన్నను తన నెత్తురు రైలు పట్టాలపైన చిందించి అడ్డుకున్నది. ఈ రాజ్యం వద్దనే కదా! తెలంగాణ ఆరు దశాబ్దాలుగా తన స్వంత గొంతుక కోసం, స్వీయ అస్తిత్వం కోసం, పెనుగులాడ్తున్నది.

ప్రాణాలను గడ్డిపోచల్లా ధారపోస్తున్నది. సరే! రాజన్న రాజ్యం మీకు కావాలి. మాకొద్దని మరీ రెండున్నరేళ్లుగా విడిపోయి, మనసు ముక్కలై, మానసికంగా వేరుపడి తండ్లాడ్తున్నది. విజయమ్మ గారూ! మీ భాష, నల్లమలలో చనిపోయిన మీ భర్త భాషా ఒక్కటే కావడం యాధృచ్ఛికం కాదు. ఒకే చెట్టు మీరు. వేరు ఒక్కటే. మమ్మల్ని ఏలడం మీ ఆధిపత్య చిహ్నం. మా రాజ్యం మాకు కావాలని కొట్లాడ్తున్న వాళ్లతో విడిపోయిన మనసుతో కలివిడితనం కలవదని చెప్పిన వాళ్లతో మీరు ఉప్పులో పప్పేసి పొత్తు కలవడం కాదు. మిమ్మల్ని రాజన్న తర్వాత జగనన్న ఏల్తడని చెప్పి పోతున్నరు. ఎంత ధైర్యం. మా లాంటి బానిసల కోసం పుట్టిన మహా సీమాంధ్ర తల్లుల్లారా.. అక్క చెల్లెల్లారా! ఈ బానిసలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. రాయి విసుర్తున్నారు. జగన్ తెలంగాణ కొడుకు కాదమ్మా.. , రాజన్న వారసత్వంగా రాజ్యం రాసివ్వడానికి..ఆయన సీమాంధ్ర బిడ్డ.

రాజన్న గురించీ, జగన్ గురించీ కష్టాల గురించీ చెప్తే మాకేమీ అభ్యంతరం ఉండేది కాదు. ప్రజాస్వామ్యంలో చెప్పుకునే స్వేచ్ఛను , అందునా ఆడపడుచు ఏ ప్రాంతం వారైనా సరే వచ్చి కొంగు తుడ్చుకుంటున్నప్పుడు మేం వింటాం. విన్నాం. అంతే .. కానీ అమ్మా! మీరు రాజకీయాలు మాట్లాడుతున్నరు. అదీ ప్రమాదకరమైన భాష... ఎనిమిదివందల మంది ఆత్మహత్యలు చేసుకున్నా, ఒకే ఒక్క తెలంగాణ కల కోసం ఉరిపోసుకుని, పరిగెత్తే రైళ్లకు ఎదురేగి, కాల్చుకుని, మంటల్లో మాడి చనిపోయిన అమరవీరుల వనాలల్లోకి వచ్చి మీరు అతి ప్రమాదకరమైన వంచనా భాష మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తాం’..అని అమ్మా ఎవరమ్మ మీరు.

మా రాజ్యాన్ని విలీనం చేసుకుని, తెలంగాణను అంతర్గతవలస చేసుకొని, పీల్చి పిప్పిచేసి, ఒక్క న్యాయమూ, ఒక్క ధర్మమూ అమలు కాక, నేరమే అధికారమై, ఆధిపత్యమై ఊరేగి.. ఇన్నాళ్లకు... ఇన్ని మరణాల తర్వాత వచ్చిన తెలంగాణను అడ్డుకొట్టి అచ్చం మీ భర్తలాగే మీరు మా మనోభావాలను గౌరవిస్తామని మాట్లాడడం... పుండు మీద కారంలా ఎంత నరకయాతనమ్మా.. విజయమ్మా.. తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తే మీరు పరకాలలో అడుగుపె మానుకోటలో విసిరిన రాయి మీకు గుర్తుండి ఉంటే మనసుకు అది తగిలి ఉంటే, మా ప్రతిఘటన, ఇక్కడి ప్రజల మనసు, మనోభావాలు అర్థమై ఉంటే మీరసలు వరంగల్ జిల్లాకాదు తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చేవాళ్లే కాదు. తెలుసా? అమ్మా...
రాజన్న రాజ్యం సంగతి తర్వాత..

ముందు జగనన్న రాజ్యం సంగతి... ఏండ్లకేండ్లు భంగపడ్డ తెలంగాణ, గాయపడిన తెలంగాణ. చావులను కన్న తెలంగాణ. పోరాటాలకూ పోరాటాలకూ మధ్య విరామ చిహ్నాలే కానీ ఫుల్‌స్టాప్‌లు లేని తె లంగాణకు ఒక్క చల్లని కబురు చిదంబరం ప్రకటన. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అన్న ప్రకటన. తరతరాల వైఫల్యాల నుంచి ఒక్క సాఫల్యంగా మేం సంబురపడ్డాం. కానీ అమ్మా! మీ జగనన్న పార్లమెంటులో, ఆగర్భ శత్రువులయిన తెలుగుదేశం చేతుల నుంచి ప్లకార్డు గుంజుకొని, నిలబడ్డాడు . ఆ చిత్తరువు మా మనసులో ముద్రించుకుపోయింది. ఆయన మా వచ్చిన తెలంగాణను అడ్డుకున్న కరడుగట్టిన సీమాంధ్ర దురంహంకార ఆధిపత్యవాది. అందువల్ల వి జయమ్మా! మన్నించాలి. జగనన్న రాజ్యానికి తెలంగాణలో ఇంచుస్థానం కూడా లేదు. ఇది మా ఆన. తెలంగాణలో వందల బలిదానాల సాక్షిగా, అమర వీరుల ఆత్మలను పొదివిపట్టుకుని నిటారుగా నిలబడి ఉన్న స్తూపాల సాక్షిగా... తెలంగాణలో జగనన్న రాజ్యం స్థాపన కుదరదుగాక కుదరదు. మా మనోభావాలను గౌరవించడం అంటే మా రాజ్యం మాకు కావడం తప్ప మరో మార్గం లేదమ్మా!

రాజన్న రాజ్యంల ఏం జరిగిందో? చెప్పమంటరా? అమ్మా? రెండు బొందలగడ్డల గురించి చెప్పాల్సి ఉన్నది మీకు. కొడుకు కోసం వీధుల్లోకి వచ్చిన అమ్మా విజయమ్మా! మీ కొడుకు, లోటస్‌పాండ్‌లో రాజ ప్రసాదం, బెంగుళూరులో శ్వేతసౌధం నిర్మించుకున్న యువరాజే కావొచ్చు. ఆయన కోసం మీ తల్లి మనసు క్షోభిస్తున్నది. తల్లడిల్లుతున్నది. కానీ అమ్మా... మీ కొడుకు కంపెనీలల్లో పెట్టుబడులు పెట్టిన ఒకానొక కంపెనీ కోసం మా పాలమూరు పేద, నిత్యకరువు జిల్లాలో పోలేపల్లి పొరుక పాడయింది. అక్కడి జీవితం పొక్కిలయింది. సెజ్ కోసం భూములు కోల్పోయిన రైతుల కంఠాలకు ఉరితాళ్లు పేనుకున్నవి. చచ్చిపోయినా బొందపెట్టడానికి పోలేపల్లిలో బొందలగడ్డ కరువయింది.

అదొక ఆత్మహత్యల సెజ్. మీకు ఈ విషయం తెలిసే అవకాశమే లేదు. అక్కడి రైతు కుటుంబాల దుక్కమూ, కన్నీళ్లూ తెలిసే అవకాశమూ లేదు. అమ్మా! మీ కొడుకుతోపాటు జైలులో కాపురమున్న మంత్రి మోపిదేవి పాపం ఒక మత్స్యకారుడు. ఒక బడుగుజీవి. కానీ తెలుసా! అమ్మా! వాన్‌పిక్ కోసం వేలాది ఎకరాలు జాగీర్ రాసిచ్చిన కేసు. వాన్‌పిక్‌లో, థర్మల్ కేంద్రాల కోసం, కోస్తా తీరాన్ని వెలుగుల కారిడార్ చేయడానికి వేసిన ప్రణాళిక వెనుక మా బొగ్గు బావులు కోల్పోయిన జీవనం ఉన్నది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన భూగర్భగనుల ప్రాణం తీసి, ఓపెన్‌కాస్ట్‌ల బొందలగడ్డలు తవ్వారు. ఇక ఏమి మిగిలిందక్కడ. సింగరేణిలో. ఊళ్లు లేచినయి.

పల్లెలు లేచినయి. ఉన్న బొగ్గునంతా పదేళ్లలో తవ్విపోసి, మట్టిగుట్టలు, బూడిద పర్వతాలు, ఎక్కడచూసినా బొందల గడ్డలు మిగిలిన సింగరేణిని ఓపెన్‌కాస్ట్ భూతాల గడ్డ చేసింది. మీ జగనన్న కోసమే కదా? విజయమ్మా.. ఇది రాజన్న రాజ్యంల జరిగిందే కదమ్మా.. బహుశా తెలంగాణ తల్లుల కన్నీళ్లకు విలువలేని కాలం... కానీయండి.. మీదే కాలం. మీవే కన్నీళ్లు..

రాజన్న బతికుంటే ప్రాణహిత ప్రాజెక్టు పూర్తయ్యేది అని ఇంకొక మాట మాట్లాడారు. మీరు. అమ్మా.. మీ రాజన్న సంగతి మీకు తెలియదు. మాకు బాగా తెలుసు. చంద్రబాబు కిటికీలు తెరిస్తే రాజన్న దర్వాజాలు తెరిచిండని ఊరికే అనడం లేదు. అదే నమూనా హైదరాబాద్‌ను మింగి, కొండ చిలువలాగా ఒక రింగురోడ్డును వేసింది రాజన్న. ఎన్ని భూములు కోల్పోయామో లెక్కలేదు. అడ్డికి పావుశేరు రింగురోడ్డులో ఎన్ని జీవితాలు విధ్వంసమయినవో లెక్కలేదు. హైదరాబాద్ భూములమ్మి, కడప కడుపు నింపి, అనుంగు బంధుమివూతుల , స్వంత కొడుకు జగనన్న బొక్కసం నింపి రాజన్న పాలన మాకు చిప్ప గతి చేసింది. ఇక నీళ్ల సంగతి మాట్లాడుకుందామమ్మా..

కృష్ణా నీళ్లు చాలలేదని, దూపదీరని రాజన్న, పోతిడ్డిపాడును వెడల్పు చేసి జల చౌర్యం చేసి, పైనుంచి దాదాగిరి చేసిన మహానాయకుడు. అవి చాలవని గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్‌ల వేసి.. తెలంగాణను శాశ్వత ఎడారిని చెయ్యడానికి పోలవరం , పులిచింతల, దుమ్ముగూడెంలకు ప్రణాళికలేసింది రాజన్న రాజ్యంలనే అమ్మా! ఎక్కడన్నా ఉంటదా? ఇంత ప్రేమ. అమ్మా! నిజం నిష్టురంగా ఉంటుంది. రాజన్న రాజ్యం మా తెలంగాణను అరిగోసలు పెట్టింది. గుర్తున్నదా? ఎన్నికల్లో నడిగడ్డ దాటి నంద్యాల వెళ్లి ‘హైదరాబాద్‌కు వీసాలు తీసుకోవాలా?’అని ఎటకారమాడిన రాజన్న రాజ్యం. కొలువా కుమ్మరియ్యా! లక్ష విషయాలు ఎందుకు గానీ.. అమ్మా!మీరు ఇచ్చేవాళ్లు..

మేం తీసుకునేవాళ్లం. మీరు మా అభివూపాయాలను, మనోభావాలను గౌరవించే వాళ్లూ.. మేమూ ఆమాటలకే మురిసి ముక్కలయ్యే వాళ్లంగా ఇంకానా! ఇకపై చెల్లదు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఎవరు ఎంత సంపాదించి నారో? ఎవరు ఎందుకు సంపాదించలేక పోయారో? అది మీ సీమాంధ్ర గద్దల మధ్యసారీ! పెద్దల మధ్య పంపకాల పంచాయితీ. మీ పంచాయితీ మీది. మా పంచాయతీ ఒక్కటే. ఇక మేం బొందల గడ్డలయిన మా భూముల్లో మీ పెత్తనాన్ని హర్కీస్ సహించం గాక సహించం. మా నీళ్లు మాగ్గావాలె. మా బొగ్గు మాగ్గావాలె. మా భూములు మాగ్గావాలె. మా నిధులు మాగ్గావాలె. మా తెలంగాణ మాగ్గావాలె. అన్నింటికి మించి మా రాజ్యం మేమే ఏలాలె. అమ్మా! విజయమ్మా! మన్నించండి. రాజన్న రాజ్యం మమ్మల్ని బొందల గడ్డకు పంపింది.

మీ కొడుకు ఇండ్లు కాదు కాదు రాజవూపాసాదాలు కట్టుకున్న రాజ్యం అది. మేం మా ఇండ్లు కూలిపోయి శిథిలమయిన వాళ్లం. అదే నల్లమల నుంచి కావడికి కట్టిన మాధవ్ శవాన్ని గగుర్పాటుతో భయంతో చూసి ఉన్నవాళ్లం. మమ్మల్ని భయపెట్టకండి. మళ్లీ రాజన్న రాజ్యం మాకొద్దు. జగనన్న రాజ్యమూ వద్దు... మమ్మల్నిట్లా బతకనివ్వండి చాలు. మా తెలంగాణ జోలికి రాకండి.. నమస్తే అమ్మా!

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...