పదేళ్ల ప్రస్థానం


Sun,June 3, 2012 12:23 AM

మే, 31, 2002, ఒకానొక మిట్ట మధ్యాహ్నం. మేం పుట్టాం... అప్పుడు గుప్పెడు మందిమి. ఇప్పుడు గంపెడు మందిమి.నిజమే మేము కవులవలెనే కలాలని భుజాన తుపాకుల్లాగా మోశాం. మా కల తెలంగాణ కోసం కలెబడడానికీ సిద్ధపడ్డాం. చరిత్ర మొదటి చిత్తువూపతి జర్నలిజమే అయితే, ఆ చరిత్ర చిత్తువూపతిని రచిస్తూ, రచిస్తూ ఆ చరివూతలో భాగం కావడానికే సిద్ధపడ్డాం. నిజానికి జర్నలిజం ఒక నడుస్తున్న చరిత్ర కూడా... ఆ చరివూతను నమోదు చేస్తూ.. చేస్తూ మేమూ ఆ చరివూతలో భాగం అయ్యాం. కళాకారుల వలె తెలం‘గానమై’ ప్రవహిం చాం. జర్నలిస్టులు ఎటువేపూ ఉండవద్దు అన్నారు. అటో.. ఇటో తెలియనివ్వొ ద్దు అంటారు. తటస్థులం అని కూడా అంటారు. ఇవన్నీ తప్పించుకునే మాట లు. తెలంగాణ ఒక సందర్భం. కాలం కవాతు చేస్తున్నప్పుడు చేపలా ఎదుక్కి న ఉద్యమం చిగురేసిన చింతమానులా నిటారుగా నిలబడింది. తేల్చుకు రమ్మం ది తెలంగాణ. ఎటో ఒక దిక్కే ఉండు, ఏదో ఒక పక్షమే వహించు. రెండు ధర్మా లు, రెండు న్యాయాలు, రెండు నాల్కలూ ఉండవు. ధర్మం ఒకటే. న్యాయమూ అంతే.

అందుకే తటస్థత తెలంగాణకు సంబంధించి ఒక మాయా మోసకారి పదం. ఆధిపత్యానికి కొమ్ముకాసే అవకాశవాదపు పరాకాష్ట. ఇది గుర్రం... ఇది మైదానం అని చెప్పగలిగి వుండీ చెప్పకపోవడం ఒక నిస్సహాయత. కానీ ఇక్కడ పుట్టాం. ఇక్కడ పెరిగాం. ఈ నేలను భుజాల మీద మోసిన రైతుల్లానే, వాళ్ల కడుపులోంచి ఈ నేల మీదికి వచ్చిపడినవాళ్లం. అవును మేము ఈ భూమి పుత్రులం. ఈ నేలను నమ్మినవాళ్లం. తెలంగాణ తల్లి బిడ్డలం. అందుకే తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులం. తటస్థత, నిష్పక్షపాతంలో దాగివున్న ఆధిపత్యాన్ని, దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి సరిగ్గా పదేళ్లు. మే 31 మా జన్మదినం. మేం పెరిగాం. మేం చరివూతను నమోదు చేశాం. చరివూతలో భాగమూ అయ్యాం. బలిదానమూ ఇచ్చాం. బరిగీసీ నిలబడ్డాం. ఇదంతా తెలంగాణ కోసమే. మా కోసమే. 69లో చనిపోయిన అమరుల స్థూపాల సాక్షిగా మేం నిలబడ్డాం.

ఎల్‌బీనగర్ చౌరస్తాలో మరణించిన శ్రీకాంతచారి చిటికెనవేలు స్పర్శ, యాదిడ్డి ఆత్మహత్యతో ఢిల్లీ ప్రకంపనల తీవ్రతలనూ భూకంపాన్ని పసిగట్టే ‘సిస్మోగ్రాఫ్’లా పసిగట్టాం. మేం జర్నలిస్టులం. ప్రవాహాలలో ఏటికి ఎదురీది న వాళ్లం. మట్టి మనుషులం.. మన తెలంగాణ కోసం నిలబడిన వాళ్లం.. తెలంగాణ జర్నలిస్టు ఫోరం గురించి మాట్లాడుకోవాలి. మలి తెలంగాణ పోరాటంలో కలంయోధుల కవాతు లేకుండా అక్షరవనాల్లో ఇవాల్టి అలజడులుండేవి కావు. అక్షరం కూడా ఉద్యమా నికి ఆయుధం అయ్యేది కాదు. ఉస్మానియాలో విద్యార్థుల నెత్తురూ, జర్నలిస్టుల నెత్తురూ కలిసి కొన్నెత్తుటి సంబంధాలు ఏర్పరచుకు న్న అలాయ్‌భలాయ్ దృశ్యరూపమే తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి పదే ళ్లు.అవును జర్నలిస్టులు రాజకీయాలు మాట్లాడరాదు. జర్నలిస్టులు అన్నిటికీ అతీతం.

కానీ మాకు తెలిసే సమాచారం గుండెల్లో ఎగదన్నుతున్నప్పుడు, నగ్నంగా, బహిరంగంగా తెలంగాణ ఒక మార్కెట్ సరుకవుతున్నప్పుడు, ఒక అవకాశవాదం పొడసూపి తెలంగాణ నినాదవూపాయంగా మారినప్పుడు, కుట్రలు తెలంగాణను తవ్విపోసి ఎడారి చేస్తున్నప్పుడు, నేరమే అధికారమవుతున్నప్పుడు, ఆక్రమణ అభివృద్ధి అవుతున్నప్పుడు, క్యాంపస్‌లు తిరుగుబాటు జెండా ఎగరేసి నిర్బంధం చీకటిలో తన్నుకులాడుతున్నప్పుడు, బాష్పవాయువు గోళాలు మండిస్తున్న కళ్లమంటలో విస్ఫులింగాలు చిమ్ముతున్నప్పుడు, ఉరిపోసుకున్న తెలంగాణ వాది త్యాగాల ఊపిరిలో జైతెలంగాణ నాదం మోగుతున్నప్పుడు, బడిపిల్లవాడి చేతిలో తెలంగాణ జెండా రెపపలాడుతున్నప్పుడు, సబ్బండ వర్ణాలు, సకల జనం సమ్మె కట్టినప్పుడు నాలుగున్నర కోట్లమంది ఒక్క గొంతై నినదిస్తున్నప్పుడు ఊరక చూస్తూ కూచున్న ప్రతివాడూ నేరస్తుడే.. అవును తేల్చుకోవలసే ఉన్నది. నువ్వె టు వేపు? నువ్వెవరి పక్షం?
దశాబ్దాల అంతర్గత వలస దోపిడీపై దండయావూతకు సిద్ధపడ్డాం మేము.

అవు ను ఆధిపత్యంపై దండయాత్ర. అబద్ధాలపై జైత్రయాత్ర. చావులూ కదిలించని నిరంకుశ నియంతృత్వ వలసాధిపత్యంపై పోరు పతాక. తెలంగాణ వీధులన్నీ ఒక్కటై నిలుచున్నప్పుడు, ఒకేదారి తీస్తున్నప్పుడు తెలంగాణ పల్లెలు, పట్నాలు, గూడాలు పోటెత్తినప్పుడు, ఎన్‌హెచ్9లు ఫటిల్లున అబద్ధాలను భళ్లున పగుల గొడ్తున్నప్పుడు, అరిగోస పడ్తున్న తెలంగాణ పక్షం నిలబడకపోవడం కుటిల రాజకీయం. విడిపోయే హక్కును గుర్తించకపోవడం, ఆర్టికల్ 3ని గుర్తించకపోవడం, రాజ్యాంగబద్ధతను గుర్తించకపోవడం, విలీనం ఒక కుట్ర. విలీనం తర్వా త చేదుబతుకులు, విష ఫలాల అనుభవాల పునాదుల మీద మా తెలంగాణ మాకు కావాలె. మళ్లించుకుపోయిన నీళ్లు, కొల్లగొట్టిన నిధులు, నిర్బంధం అణచివేత, ఒప్పందాలు, సూత్రాలు, ఆరు దశాబ్దాల తండ్లాట. అవును తెలంగాణ వేరు పడాల్సి ఉన్నది. అది నాలుగున్నర కోట్ల ప్రజల నాభి లోంచి ఎగదన్నిన సహజ న్యాయం.

తెలంగాణ బిడ్డలం. తెలంగాణ జర్నలిస్టులం అందుకే తెలంగాణ కోరడం ఒక రాజకీయం అయితే, ఆ తెలంగాణ కోర్కెవేపు నిలబడ్డం. రాజకీయం అయినా సరే మేం ఆ రాజకీయం వేపు కలాలెత్తి నిలబడ్తాం. మేం నూటికి నూరుపాళ్లు తెలంగాణ పక్షమే. అవును, దీనమై, నిస్సహాయ అయి, పోరాడి, పోరాడి, అలసి, ఫీనిక్స్‌లా మళ్లీ మళ్లీ జన్మించి ఒకే ఒక కలను సాకారం చేసుకునేందుకు బరిగీసి నిలిచిన పోరాట పక్షపాతం మాది. మేం నిష్పక్ష పాతు లం కాదు. తెలంగాణ పక్షపాతులం. అందుకే పదేళ్ల క్రింద గుమికూడాం. ఒకానొక మే ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం. సురవరం ప్రతాప్‌డ్డి పెస్‌క్లబ్) యాదిలో మనాదిలో ‘ఈ తెలంగాణ మాది- ఇక్కడి వనరులు మావి. ఇక్కడి నీళ్లు మావి. ఇక్కడి భాష మాది, మహోత్కృష్టమూ, విశిష్టమూ అయిన చరిత్ర మాది, సంస్కృతి మాది... మా నీళ్లు మాగ్గావాలె. మా బొగ్గు మాగ్గావాలె. మా తెలంగాణ మాగ్గావాలె. అని దిక్కులదిరేలా ప్రకటించిన గుప్పెడు మందిమి. అదే సరిగ్గా పదేళ్ల కిందట మా నెత్తురూ, చెమటా, తెలంగాణ నినాదం కలిపి ఏర్పరచుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం. ఇదొక పదేళ్ల తెలంగాణ ఉద్యమ నెలబాలుడు. ఇప్పుడు గంపెడు మందిగా సాగుతున్న ఊరేగింపు.

విద్యార్థుల్లో కలిశాం. వాళ్ల రెక్కల్లో, బొక్కల్లో, వాళ్ల కన్నీళ్లలో, కష్టాల్లో, ఊరేగింపుల్లో, ఉద్రేకాల్లో, చెలిమిలో, స్నేహంలో భాగమయ్యాం. ఉద్యమం దారిపొడవునా నిజాయితీగా ఎలుగెత్తిన సంస్థలతో కత్తుకలిపాం. కలం కలిపాం. కవాతులూ చేశాం. కళాకారుల ధూమ్‌ధామ్ అయ్యాం. కవుల కవిత్వాలపై తెలంగాణ జెండాలమయ్యాం. చరివూతలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ డిమాండ్ మీద, అవును అచ్చంగా తెలంగాణ ఒక రాజకీయ డిమాండ్ ఆ డిమాండ్ మీద సమ్మె కట్టిన ఉద్యోగులతో నడిచాం. సెమ్మసుతో బొగ్గు తవ్వే నెత్తిదీపంతో బొగ్గు సొరికెల్లో నల్ల వజ్రాన్ని తవ్వే సింగరేణి కార్మికుని సెమ్మసుతో కలాన్ని కలిపి కవాతు చేశాం. ఉద్యమం సందిగ్ధ సందర్భాల్లో, అది దిక్కులు చూస్తున్నప్పుడు, అది బెంగటిల్లినప్పుడు దిక్సూచి కోసం దివిటీ కోసం, బాట కోసం తండ్లాడ్తున్నప్పు డు ఉద్యమంతో కలిసిమెలిసి ఉప్పందించిన వాళ్లం. ఉద్యమాన్ని ఒక్కదారికి తేవడానికి ఊపిర్లూదినవాళ్లం. అందరి వాళ్లుగా ఉద్యమాన్ని భుజాల మీద మోసినవాళ్లం. ఉద్యమం ఉరిమినప్పుడు ఊరేగింపు ముందు భాగంలో నిలబడి అర్సి నినాదాలు చేసిన వాళ్లం. తెలంగాణ జర్నలిస్టులం.

నిర్బంధం ముళ్లకంచెల చాటున, ఇనుప తెరల మాటున వలసాంధ్ర ముఖ్యమంవూతిపై రాయినిగూడెం విసిరిన రాయి ప్రేరకశక్తి జర్నలిస్టు. వల్లెంకుంటలో మరేగొంతూ వినిపించని ఒకానొక నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది జర్నలిస్టు. మున్నూటా అరవై ఐదురోజులూ పోలీస్ యాక్షన్ నుంచీ కొనసాగుతున్న 144 చక్రబంధాన్ని బద్దలు కొట్టి వేలాదిమందితో కలం కవాతులు చేసింది మేము. చరివూతలో నిటారుగా నిలబడ్తాం మేము. ఆత్మలేని ఒక మహానగరం, ఢిల్లీలో వేలమంది జర్నలిస్టులతో తెలంగాణ నినాదాన్ని హస్తిన పురవీధులకు పరిచ యం చేసి, పార్లమెంటు ముందర ధర్నాలు చేసింది మేము. ఉద్యమం పాయలుగా ప్రకోపాలు పెంచుకుంటున్నప్పుడు, మాటల తూటాలు రువ్వుకుంటున్నప్పుడు స్నేహహస్తాలను, అలాయ్ భలాయ్ ఆలింగనాలను అర్గనైజ్ చేసిందీ మేమే.

అవును మేం తెలంగాణ జర్నలిస్టులం. ఒకే ఆత్మగా, ఒకే మాటగా, ఒకే బాటగా ఒకే ఒక్క తెలంగాణ నినాదం కోసం కలిసిరమ్మని సమస్త తెలంగాణ ప్రజలకు, సమస్త తెలంగాణ నాయకత్వానికి సమస్త తెలంగాణ ఉద్యమాలకు ఒక వేదికగా మేమే. ఒక ఐక్యతగా మేమే. పదేళ్లు దోపిడీ పెరిగింది. వివక్ష పెరిగిం ది. కానీ తెలంగాణ రాలేదు. ఉద్యమం ఆగలేదు. మా కలాలు నెత్తురోడాయి. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలతో పాటు మా వీపులూ చిట్లా యి. ఉద్యమంతో పాటు, ఎనిమిది వందల బలిదానాలతో, త్యాగాలతో చరిత్ర నిండుగా పరుచుకున్న భంగపాటు, ఉక్రోశ, ఆక్రోశాలతో పాటు మేమూ తెలంగాణ కోసం కలవరించే వాళ్లమే.

పలవరించే వాళ్లమే.అవును అచ్చంగా మేము తెలంగాణ కోసం నిలబడ్డవాళ్లం. మాకేమీ వద్దు. జీతాలు, వేతనాలు, కరువు భత్యాలు, చాలీచాలని జీవితాలు, వృత్తి ఒత్తిళ్లు, యాజమాన్యాల హూంకరింపు లు, సాటివారి ఓరచూపులు, కల్మషాలు, కన్నీళ్ల మధ్య తెలంగాణ బిడ్డలం. మాకు మా తెలంగాణ కావాలె. తెలంగాణ కొసమే తెలంగాణ జర్నలిస్టులు. మిర్యాల్‌కార్ సునీల్ అమర్ హై.. తెలంగాణ జర్నలిస్టు ఫోరం వర్ధిల్లాలి. పదేళ్ల ఆరాట పోరాటాల విరాట్ స్వరూపాలు ప్రదర్శించిన తెలంగాణ ముద్దుబిడ్డలైన జర్నలిస్టులందరికీ ఉద్యమాభివందనాలు. ఔర్ ఏక్ ధక్కా... తెలంగాణ పక్కా.. పోరాడుదాం.. తెలంగాణ కోసం. తెలంగాణ వచ్చేదాకా.. కవుల వలె, గాయ కుల వలె పాడుదాం తెలంగాణ...

-అల్లం నారాయణ
(తెలంగాణ జర్నలిస్టు ఫోరానికి పదేళ్లు..)

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...