జర్నలిస్టులు జిందాబాద్..


Sun,May 20, 2012 01:14 AM

వైఎస్‌లేనిలోటు రానివ్వొద్దన్నడు వాయలార్ రవి. ఉప ఎన్నికల్లో వైఎస్ లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడ్తుదన్నది ఈ మాట సారాంశం. రవి ఢిల్లీ దూత. వైఎస్ రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌మోహన్‌డ్డి మీడి యా సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు జీవో జారీ చేశారు కిరణ్‌కుమార్‌డ్డి. ఆయ న రాష్ట్ర ముఖ్యమంత్రి. మన నేత. జగన్ ఉన్నందువల్ల ఆయన ఉనికివల్ల ఏర్పడుతున్న లోటును కిరణ్‌కుమార్‌డ్డి సరిగ్గానే గుర్తించారన్న మాట. అందువల్లే జగన్‌పైన సీబీఐ దాడులు ఒక కీలకమైన మలుపు తీసుకున్నాయి. రెండూ పరస్పర విరుద్ధాంశాలు. పరస్పర విరుద్ధ చర్యలు. మాటలు. ఒకేసారి జరుగుతూ ఉన్నవి. ఇటీవలె రాజ్యసభలో కేవీపీ రామచందర్‌రావు తెలంగాణ ఇస్తే ఎంత ప్రమాదమో చెమటలు కక్కుతూ ప్రసంగించాడు. ఆయన కాంగ్రెస్‌కు లేని లోటు గా కనిపిస్తున్న వైఎస్. రాజశేఖర్‌డ్డి ఆత్మ. కేవీపీ మాటలు అచ్చం బతికున్నప్పు డు వై.ఎస్. రాజశేఖర్‌డ్డి మాట్లాడిన మాటలే. నిజానికి వై.ఎస్ రాజ్యసభలో మాట్లాడినట్టే ఉన్నవవి పొల్లుపోకుండా. కానీ వైఎస్ గొంతులా కమాండింగ్, ఎకసక్కెపు పొగరు లేదు. కేవీపీ వైఎస్ డమ్మీ కనుక ఏదో ఆందోళకరమైన గొంతుతో హడావుడిగా ముగించారు. ఆయన కిరణ్‌కుమార్‌డ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌తోనూ, వాయలార్ రవిని పరిశీలకుడిగా పంపిన ఢిల్లీ దైవదూతలతోనూ బాగానే ఉన్నాడు. వైఎస్ ఆత్మ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయన ఉనికి ఉంటే బాగుండునని ఇప్పటికీ కోరుకుంటున్నది. వైఎస్ ఆత్మబంధువూ బాగానే ఉన్నాడు. కానీ జగన్‌తో ఏదో తేడా ఉన్నది. జగన్ స్వయంగా ఎప్పుడూ ముఖ్యమంత్రి కాదు. క్విడ్ ప్రో కో అనే విధానం ద్వారా మేళ్లు చేసి, ఫలితంగా పెట్టుబడులు దండినవాడు జగన్ కాడు. మ్యాట్రిక్స్ ప్రసాద్‌కు, ఇందు శ్యామ్ సుందర్‌డ్డికి, పెన్నా ప్రతాప్‌డ్డికి, అరబిందో ఏదో ఒక రెడ్డికి, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు, రహేజాలకు ఛప్పన్నారు కంపెనీలకు సెజ్‌లు ఇచ్చింది, భూములు కేటాయించింది, మంత్రుల సంతకాలు చేయించిందీ, ఐఏఎస్‌ల సంతకాలు చేయించిందీ, ఓబుళాపురం గనులు రాసిచ్చిందీ జగన్ కాదు. వైఎస్. రాజశేఖర్‌డ్డి. ఆయనను ముఖ్యమంవూతిని చేసిన ఢిల్లీ పెద్దల అండతో ఆయన ఇవన్నీ చేశారు. కానీ ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీ ఫీలవుతున్నది. ఈ మేళ్ల బేరసారాలు చూసిన కేవీపీ రామచందర్‌రావు బాగానే ఉన్నాడు. మంత్రులూ బాగానే ఉన్నారు. కానీ శ్రీలక్ష్మిలు, బీపీ ఆచార్య, బ్రహ్మానందడ్డిలు బాగాలేరు. వ్యవస్థ బాగానే ఉంది. ఈ వ్యవస్థ అభివృద్ధి నమూనా బాగానే ఉంది. అదింకా ఇదే నమూనాలో నడుస్తూ ఉన్నది. కానీ, జగన్ కూడా బాగాలేడు. వైఎస్ రాజశేఖర్‌డ్డి మేళ్ల ప్రతిఫలాలను అనుభవిస్తున్నందుకు, మేళ్ల ప్రతిఫలంగా వచ్చిన పెట్టుబడుల విస్తరణను చట్టపరం చేసుకుని, అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అయిదేళ్లలో ఒక మహా అవినీతి సామ్రాట్‌గా ఎదిగిన జగన్‌ను సీబీఐ వేటాడుతున్నది. ఎందుకు? ఆయన ఉనికితో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉన్నది. ఆయన రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీని కోస్తాంవూధలో అతలాకుతలం చేస్తున్నడు. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల నుంచి సమైక్యాంధ్ర ప్లకార్డు లాక్కుని ప్రదర్శించి, తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్న జగన్‌లోనూ వై.ఎస్ రక్తమే ప్రవహిస్తున్నది. కేవీపీలో ఉన్న తెలంగాణ వ్యతిరేకత, జగన్‌లో ఉన్న తెలంగాణ వ్యతిరేకత, వై.ఎస్‌లో ఉండిన తెలంగాణ వ్యతిరేకత సారాంశం ఒక్కటే. కానీ చిక్కేమిటంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఆత్మ కావాలి. ఆయన అభివృద్ధి మోడల్ కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న జగన్ నీడను కూడా సహించలేని స్థితి. అదీ అసలు సమస్య. అట్లని జగన్ మీద, ఆయన అవినీతి సామ్రాజ్యం మీద చర్యలతో కాంగ్రెస్ పార్టీ సర్వ అవినీతి ప్రక్షాళన కోరుకుంటున్నదంటే అమాయకత్వమే. ఢిల్లీ పెద్దలకు తమ మాట విని చెప్పుచేతల్లో ఉండే రాజశేఖర్‌డ్డి కావాలి. జగన్ ధిక్కరించాడు. అదీ తన ఉనికి కోసం. ముఖ్యమంత్రి పదవి కోసం. అందుకతను కాంగ్రెస్ పార్టీకి శత్రువయ్యాడు.

పైకిది రాజకీయ సమరంలాగా, ఉప ఎన్నికల ముందు ముదిరిన కక్షలాగా, వేధింపు చర్యలాగా కనపడుతూ ఉండవచ్చు. కానీ సారాంశంలో అది అధికారపు గొడవ. ముఖ్యమంత్రి కావడం అధికారం సాధించడం లాంటి పీఠాల గొడవ కూడా. సోనియాకు ఢిల్లీకి విధేయత గొడవ కూడా. కానీ అందరూ ఒక్కటే. జగన్ అవినీతిపై సీబీఐ ఎడాపెడా చేస్తున్న దాడులను బహు సంబరంగా చూస్తూ కేవలం జగన్ అవినీతితో, వై.ఎస్. రాజశేఖర్‌డ్డి అవినీతితో ప్రపంచమంతా అవినీతి మయమయిందని అపర తమ్ముడు హజారే చంద్రబాబుకూ ఈ విషయాలపై మాట్లాడడానికి ఎలాంటి అర్హతా లేదు. అభివృద్ధి నమూనా, విధానాలు, నీతి, అవినీతి, అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు భ్రమింపజేసిన సుపరిపాలన వ్యవ స్థ ఎవరి ప్రయోజనాలు కాపాడాలో నిర్ణయాలు జరిగింది ఇవ్వాళ్ల కాదు. మూలం ఆర్థిక సంస్కరణల్లో ఉంది. మూలం ఈ దేశంలో సంస్కరణల అనంతరం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాల్లో ఉన్నది. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఈ విధానాల రూపశిల్పి కేంద్రంలో మన్‌మోహన్‌సింగ్ అయితే, రాష్ట్రంలో చంద్రబాబు. సహజవనరులు, భూములు, జాగలు, సెజ్‌లు కార్పొరేట్లకు ధారాదత్తం చెయ్యడం, ఇదే అభివృద్ధి అని ప్రవచించి పెట్టుబడుల విస్తరణ, మార్కెట్ శక్తుల విజృంభణయే విముక్తిగా భ్రమింపజేసిన విధానాలకు కిటికీలు తెరచింది చంద్రబాబు నాయుడు. ఆ కిటికీలను వెడల్పు చేసి తలుపులు బార్లా తెరచి మేళ్లు, ప్రతిఫలాలు పొంది కుమారునికి మహా సామ్రాజ్యాన్ని నిర్మించి పెట్టింది వై.ఎస్. కాంగ్రెస్‌కు జగన్‌లా వై.ఎస్. శత్రువు కాదు. ఆ మాటకువస్తే కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి జగన్ అణిగిమణిగి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లాగే జగన్ కూడా శత్రువయ్యేవాడు కాదు. ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగేది కాదు. ఏ కోర్టు స్టేలో ‘నాట్ బిఫో ర్ మీ’లో ఏ ఉదాశీనత లో, ఎంతకూ ఎడతెగని విచారణలో ఆయనను రక్షించేవి. అంటే అటు కేంద్రంలో క్రిక్కిరిసిన జైళ్లలో బడాబాబులు, కేంద్ర మంత్రులు, రాజా లు, కణిమెళిలు, ఇటు రాష్ట్రంలో నిండిన చంచల్‌గూడలో జగన్ సంబంధిత కేసుల బడాబాబులు, పారిక్షిశామికవేత్తలను చూసి ప్రభుత్వం అభివృద్ధి నమూనాలను మార్చుకున్నదని కానీ, ఇక ముందు ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా నిలుచుని ప్రజల పక్షాన నిలబడి, సహజవనరులను కాపాడుతుందని కానీ, రాజకీయ నేతలు, కార్పొరే ట్లు, బహుళజాతి కంపెనీలు, అధికార గణం ఒక ముఠాగా సాగిస్తున్న ఈ అవినీతిని అంతమొందిస్తుందని కానీ నమ్మితే అంతకన్నా వెర్రి వాళ్లుండరు. సీబీఐ కానీ, మరే సంస్థలు కానీ, అవసరమైన దర్యాప్తులు చేసి, అనవసర విషయాల జోలికి వెళ్లవనేది పాక్షిక సత్యమే కాదు. బహిరంగ రహస్యమే. కనుక జగన్‌పై సీబీఐ దాడితో సర్వం అవినీతి అంతరించి, వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని కానీ, ఇలాంటి విధానాలు ఇక ఉండవని కానీ పొరపాటున కూడా భ్రమలు అక్కరలేదు. విప్లవమేమీ జరగదు. కాకపోతే ఈసారి ఈ విధానాలను ఉపయోగించుకునే సావకాశం జగన్‌కు ఉండదు. ఈ మేళ్లు, ప్రతిఫలాల చట్రాన్ని శాసించే అధికారం జగన్‌కు ఉండదు. కానీ ఈ విధానాలు కొనసాగుతాయి. నీతులు, రివాజు లు, నియమాలు ఆచరించి విలువలతో బతికేవాళ్లు నీతి గురించి మాట్లాడరు. కానీ జగన్ లాంటి సావకాశాలను కొత్తగా అందిపుచ్చుకున్న వాళ్లు నీతిని నియంవూతిస్తా రు. పెట్టుబడులు అంతిమార్థంలో పవివూతమైనవి ఎక్కడా ఉండవు. అది మార్క్స్ చెప్పాల్సిన పనిలేదు. నీతిని ఆర్గనైజ్‌చేసి, ఉల్టా నియ్యత్ తప్పిన వాళ్లే నియ్యత్‌గా బతికేవాళ్లకు నీతులు బోధిస్తూ ఉంటారు. ఇదొక చట్రం. మనం ఆ చట్రంలో నీతి గురించి చెప్పేవాళ్ల బోధనలను, ప్రబోధాలను వినే సామాన్యులం అవుతాం.

జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగితే చింతాకంత చింత కూడా పడవలసిన పనిలేదు. లోటస్‌పాండ్‌లో ఆయన అంబానీ అంటీలియా లాంటి బంగ్లాను జప్తు చేసినా అది సామాన్యుడి సమస్య కాదు. కానీ సాక్షి పత్రిక నడవదంటే నాకు సరికొండ చలపతి గుర్తొస్తాడు. నగేష్ గుర్తొస్తాడు. మా పిళ్లా వెంక గుర్తొస్తాడు. పిడికిపూత్తి సాక్షి కోసం వీధులకెక్కిన మా కురుణ గుర్తొస్తుంది. జీతం కోసం ఎదురుచూసి కట్టుకున్న ఇంటి బాకి కంతికట్టుకోవడానికే ఉద్యోగం చేస్తున్న విజ య్ గుర్తొస్తాడు. జగన్‌పై సీబీఐ దాడులు, ఆయన పోగేసుకున్న కోటానుకోట్ల అక్ర మ ఆస్తులు, పెట్టుబడుల పవివూతత, నీతి, నిజాయితీల సంగతి మాట్లాడేంత పెద్ద మనుషులం కాము మేము. సాదాసీదా జర్నలిస్టులం. రాత్రుళ్లు మేం మా ఎడిటోరియల్ డెస్క్‌లను వెలిగిస్తాం. సమాచారంతో, వార్తలతో, నవ్వులతో, బిట్వీన్ లైన్స్‌లో ఉండే సత్యాసత్యాల విచక్షణతో.. పొంగిపొరలే పదాల మాటున, మా నిద్రలేమి రాత్రులు. మా కోసం ఇంట్లో ముడుచుకుని పడుకున్న మా సహచరి, నాన్న శాశ్వత రాత్రించరుడు అయినా సహించే పిల్లలు. కానీ కేవలం వార్తా ప్రపంచంలో మునిగి తేలేవాళ్లం మేము. భూకంపాలు, విమాన ప్రమాదాలు, రాబోయి మానేసే సునామీలు, సుడిగాలులు, అకాల వర్షాలు, రోడ్డు మింగిన నిస్సహాయు లు, రాజకీయ రంకులు, బోలు మాటలు, ఏమాత్రం విలువ లేని, కనీసం గ్రామర్‌లేని రాజకీయ అధమాధముల మాటలను తీర్చిదిద్ది, పదాలకు తేనె పూసి, శీర్షికలు చేసి, బతికే ఉద్యోగులం. సామాన్య జర్నలిస్టులం. బతకనేర్వని వాళ్లం. ముఖ్యమంవూతులకూ, మంత్రులకూ, అధికార పీఠాలకు, అక్రమాల లాబీలకు దూరంగా బతికేవాళ్లం. ఆవుల కొట్లాటలో లేగల కాళ్లు చిట్లుతున్నప్పుడు దిగ్భ్రాంతిగా చూస్తూ నిస్సహాయంగా.. సరిగ్గా జగన్ అవినీతి సామ్రాజ్యంపై సీబీఐ దర్యా ప్తు. సాక్షిలో పనిచేసే వేలమంది జర్నలిస్టు, నాన్ జర్నలిస్టు పత్రికా సిబ్బందిపై కక్షగా మారకూడదనేది ఇక్కడే. అవును మీరు జగన్‌ను జైలులో పెట్టండి. అవును మీరు ఆయన ఆస్తుల ను జప్తు చేసుకోండి. అవును మీరు అవినీతి సామ్రాజ్యాలు అన్నింటినీ కూల్చండి. కానీ సాక్షిని మాత్రం నడవనివ్వండి. అది కొన్ని కడుపుల ను నింపుతున్నది. పత్రిక నడవనివ్వండి, సాక్షిలో మా సహోదరుల ఆత్మలున్నా యి. పత్రికాధిపతులం కాలేము కనుకనే నిఖార్సయిన జర్నలిస్టులుగా ఉన్నాం. పెట్టుబడులు పెట్టేంత భ్రష్టుపట్టలేదు కనుకనే ఇంకా బతికి ఉన్నాం. పవిత్ర పెట్టుబడులు పెట్టే పత్రికలుంటాయా? అంటారు మీరు. ఏ మీడియా పెట్టుబడులు ఏమిటో? ఎవరు ఎట్లా సాధించారో? చూసుకొని, యజమానులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాల్లో చేరే స్వేచ్ఛ ఒక ఊహాజనిత శాశ్వత భ్రమ. మీడియాబోర్డు రూములు, అంబానీలతో కిక్కిరిసి పోతున్నప్పుడు, పత్రికల సంపాదకుల గదుల్లో అదృశ్య శక్తి, ఆవహించి పరుచుకున్నప్పుడు తెలిసి తెలిసీ, మరి గత్యంతరం లేక పొట్టకూటికి పోలీసయినట్టే, బతకడానికి, జర్నలిస్టులం అయినవాళ్లం. జర్నలిస్టులుగా ఉండి, పత్రికాధిపతులు కావడం ఎలాగో తెలియని అమాయకులం. కానీ.. కానీ యజమానుల నుంచి, పత్రికల్లో కాలమ్‌లల్లో సందు చూపే స్పేస్‌లో, మా పరిమిత స్వేచ్ఛలోనూ కాగడాలా వెలగడానికి ప్రయత్నిస్తున్న వాళ్లం. మా మానాన మమ్మల్ని బతకనియ్యండి. జర్నలిస్టు పత్రికాధిపతి కావడం పతనం. జర్నలిస్టు ఇల్లు లేకున్నా, స్థలం లేకున్నా, బతుకు లేకున్నా, భరోసా లేకున్నా, వీధుల్లో ఉండాల్సిన స్థితి ఉన్నా జర్నలిస్టుగా ఉండడమే గర్వకారణం. జర్నలిస్టులు వర్ధిల్లాలి. జగన్ అవినీతి సామ్రాజ్యమే కాదు. ఈ విధానాలు పోషిస్తున్న సర్వ అవలక్షణాలు నశించాలి. కానీ సాక్షి బతకాలి. పత్రికాస్వేచ్ఛ బతకాలి. మా జర్నలిస్టులు బతకాలి. గర్వంగా తలెత్తుకొని.. జర్నలిస్టులుగానే బతకుతున్నందు కు తలెగరేసుకుని.. జర్నలిస్టులు జిందాబాద్

-అల్లం నారాయణ

35

Allam Narayana

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ

ఫిబ్రవరి, 17. ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారి...

నీరూ.. నిప్పు.. కొంచెం జాగ్రత్త

ముందు వాళ్లు సెక్షన్ ఎనిమిది అన్నారు. గవర్నర్ గిరీతో స్వతంత్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. తోక ముడిచారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఫలితమది. మన తెలంగాణ మన పాలన ఫలితం అది. ఆ తర్వా త టీ న్యూస్‌లోకి చొచ్చుకువచ్చే కుట్ర చేశారు...

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల...

ఆ పదకొండు రోజులు..

పుస్తకం చదువుతున్నంత సేపూ అప్పుడప్పుడు గుండె తడిదేరుతున్నది. లోపల జల ఊరుతున్నది. కళ్లలోకి ఏవో ధారలు ఉబికి వస్తున్నాయి. పుస్తకాన్ని మమేకమై చదివినప్పుడు, పుస్తకంలో విషయాలన్నింటితో ఐడెంటిఫై అవుతున్నప్పుడు కలిగేవన్నీ లోప ల కలుగుతున్నాయి. పూర్తిగా పంచుకున...

వలస విముక్త తెలంగాణ

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో... బస్.... అంతే. కేసీఆర్ నాయకత్వం తొలి విజయంగా, వలస అవశేషాలపై తొలియుద్ధంగా ఇది మొదలుకావడం ఉద్యమం ఇంకా ముగియలేదని వలస విముక్త తెలంగాణ నిర్మాణం కోసం కొనసాగవలసి ఉన్నదని అర్థం చేయించింది. అయితే ...

ఉద్యమమూ...రాజకీయమూ..

గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పిండుడు అన్న సూక్తిని కేసీఆర్ పదేపదే ప్రతిభావంతంగా ఓటర్ల మనసుల్లోకి చొప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రశ్న ఉన్నది. ఈ సంస్కతిలోంచి వికసించిన ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆదర్శవంతంగా ప్రకటించుకున్న పునర్నిర్మాణం సా...

ఒక్క శేఖర్... రెండు క్యాన్సర్లు

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు. శేఖర్ చెయ్యి పువ్వు వలె సుత...

తెలంగాణకు ప్రమాదకరం

రాహుల్‌గాంధీ అతి సునాయాసంగా, ఆయాచితంగా హైదరాబాద్ బ్రాండ్‌వాచీ గురించి ప్రస్తావించారు. కానీ ఆయనకు తెలియ దు. కేంద్రంలో పీవీలు, మన్‌మెహన్‌లు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, రాష్ట్రంలో చంద్రబాబు సంస్కరణల మొనగాడుగా, సీఈవోగా అనుసరించిన విధానాలు ఎన్నడో ప్రతిష...

మనమూ-వారూ...విభజన రేఖ

మనమూ-వారు అనేది అస్తిత్వంలో ప్రధాన విభజన రేఖ.తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వెం టనే ఎన్నికలు వచ్చిపడ్డందున అన్య విషయా లు ఎజెండాలోకి వచ్చి చేరాయి కానీ ఒక అస్తిత్వఉద్యమం విజయవంతమయిన తర్వా త ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని, కంటికి రెప్ప ల...

ఇప్పుడిక నరేందరూ లేడు....

బన్సీలాల్‌పేట ఎలక్ట్రిక్ క్రిమటోరియానికి కేఎన్ చారి పార్థివదేహాన్ని అప్పగించి వరండాలోకి వస్తున్నప్పుడు దుక్కం పొంగింది. అప్పుడు మేం ముగ్గురం. ఘంటా చక్రపాణి, రేవెల్లి నరేందర్, నేను. ఇవ్వాళ్ల పాత ఆంధ్రజ్యోతి నుంచి ఆ మూల బంజారాహిల్స్ తురగా జానకీరాణి గార...

మనసంత మానేరు....

మనసంత మానేరు మాటకోనేరు అనే మాట రాసిన మనిషి ఎంత సున్నితమైన వాడై ఉంటాడు. చెరబండరాజు మీద స్మతి గీతం ఇది. ఈ పాట రాసింది అల్లం వీరయ్య. మా నడిపన్న. ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా రాసుకుంటున్న మా అన్న గురించిన కొన్ని ముచ్చట్లు. మీకు ఏ ...

ఉద్యమమూ.. ఐచ్ఛికత.. విలువ

ఉద్యమ సంస్థలకు ఇంకా చాలా పని మిగిలే ఉంది. ప్రెషర్ గ్రూప్స్‌కు ఇంకా చాలా పని ఉంది. రాజకీయాలు కమ్మేస్తున్న వేళ తెలంగాణ విముక్తం కావాలని ఉన్నది. జాగరూకత, అప్రమత్తత, తెలంగాణ వచ్చినాక ప్రయోజనాలు, ఫలాలు ప్రజలకు అందాల్సిన పోరాటం మిగిలే ఉన్నది. ఐచ్ఛి...

దూరాలు లేవు.. ద్వారాలు లేవు..

కొత్త దూరాలూ... కొత్త ద్వారాలూ మన మధ్య లేవు నారాయణా... -ఇష్టంతో ఉమామహేశ్వరరావు తెలంగాణ బిల్లు రాజ్యసభలోనూ ముద్ర వేయించుకుని వచ్చిన రెండు రోజులకు మా తిరుపతి ఉమా నుంచి నాకు అందిన తొలికథల పుస్తకం మీద ఇష్టంగా రాసిన ఈ మాటలను చాలాసార్లు గుణ్‌గునాయించుకు...

తెలంగాణ ఒక వెలుగుచుక్క...

అమరుల ఆత్మలు నిక్షిప్తమై ఉన్న ఈ గన్‌పార్క్ స్తూపం ముందు మోకరిల్లినప్పుడు జలజలా రాలిపడ్డ దుక్కం. మిత్రులారా! బెంగటిల్లినట్టు... వేల మందిలోనూ లేని వెయ్యిన్నొక్కమంది యాది. గుండెలు పట్టనంత గెలుపు సంబురం. ద్వైదీభావంలో తన్నుకులాడుతున్న మనుసు. ఈ గన్‌పార్క్ ...

జంపన్న వారసత్వం...

జంపన్నా వాగుల్ల అబ్బియా! జాలారి బండల్ల అబ్బియా! నాది దయ్యాల మడుగే అబ్బియా! దండొక్కపొద్దే అబ్బియా జంపన్న వాగుల నీటిని నెత్తిన చల్లుకోవ డం భక్తా? చరిత్ర నుంచి వచ్చిన పూనక మా? నిజమే చరిత్ర నుంచి వారసత్వంగా పరక్షికమాలు, ధీరత్వాలు, సాహసాలు, పోరాటాలు ప...

నయా డాన్ క్విక్సాట్‌ల కథ

అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్‌ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించిన...

మా రాష్ట్రంలో మాదే రాజ్యం..

తెలంగాణ ఒక ధిక్కార భూమి. దాని ఆత్మలో ఇంకిన స్వాభిమాన ప్రకటనే తెలంగాణ. పునరుజ్జీవన ఆకాంక్షల గొంతుకే తెలంగాణ. ఇట్లా అర్థం చేసుకుంటే తప్ప ఆంధ్ర-తెలంగాణ ఎందుకు విలీనమయి విఫలమయిందో? ఎందుకు విడిపోయి తెలుగువారిగా కలిసి ఉండాలో, తెలుస్తుంది. అందుకే పునర్నిర్...

ఆగుతుందంటే... మీ ఖర్మ..

తెలంగాణ వచ్చినట్టే ఉన్నది. వాళ్లకైతే ఎప్పటికీ రానట్టూ ఉన్నది. ఇప్పటికీ ఒక పత్రిక, రెండు ఛానళ్లు తప్ప.. తెలంగాణ వస్తున్నట్టు కానీ, ఇక్కడి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నట్టు కానీ అటులేదు. ఇటు లేదు. గందరగోళం తగ్గలేదు. నాలుగేళ్ల సంది ఇదే ద్వైదీమానం. లోలక...

వసంతగీతం ముందుచూపు

వసంతం విడిగా రాదు, మండే ఎండల్ని వెంట తెస్తుంది. ‘విప్లవానికి బాట’, జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల వెలువడితే, ఇంద్ర మారణకాండ నేపథ్యంలో ‘కొమురంభీము’ నవల వెలువడింది. ఇంద్ర మారణకాండ (ఏవూపిల్ 1981)నాటికే సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ...

యాది..మనాది...

కట్టె సరుసుకపోయి పడి ఉన్నడు భూమయ్య సార్! కాలం లాగే. ఘనీభవించినట్టు.. నాలుగు దశాబ్దాల యాదులు. మనాదులు. కాచాపూర్. వడ్కాపూర్. పెద్దపల్లి నుంచి ఎడంగా ఎంత దూరమైనా వెళ్లవచ్చు. అప్పుడది విప్లవాలు పాడి న కాలం. పల్లెలు పాల్తెం, కనగర్తులై కుక్కలగూడూరు, బసంత్‌న...

Featured Articles