విధ్వంసమూ.. వర్తమానమూ...


Sun,March 4, 2012 12:15 AM

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా..
17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో కవిత. కోటకు నలువైపులనే కాదు/వీలైన అన్ని చోట్లా డైనమెట్లు పేల్చి కూల్చనిదే/
దానిగుండె మన పిడికిట్లోకి రాదు
-చెరబండరాజు 1-12-1972 (గమ్యం)
ఇది మిలియన్ మార్చ్ సారాంశం. మరి ఆరు రోజులు గడిస్తే ఏడాది. అగడ్తలు దాటి, ఇనుపకంచెలు దాటి భయం గొలిపే మర్యాదస్తుల మన్ననలు దాటి, నిర్మాణాన్ని ధిక్కరించి, వినిర్మాణానికి ట్యాంక్‌బండ్ ఎక్కిన వీరుల జ్ఞాప కం. ఖాకీ వనాన్ని దాటుకుంటూ , ముళ్లకంచెల్లోంచి, చీరుకుపోయిన శరీరంతో ట్యాంక్‌బండ్ మీదకు చొచ్చుకొని వచ్చి ఈ నేల తల్లిని ముద్దాడిన వాడి జ్ఞాపకం. వాడి ఆగ్రహ ప్రకటనకు హుసేన్‌సాగర్ నీళ్లు అల్లల్లాడి జైతెలంగాణను ప్రతిధ్వనించి నీడలను, జాడలను ప్రతిఫలించిన ఆరోజు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగీతం. విగ్రహ విధ్వంసం మనుషుల్ని వేరు చేసింది. ఎవరు ఎవరో గీటు రాయైంది. మనుషులకోసం కన్నీళ్లు కరువైన వాళ్లు విగ్రహాల కోసం ఎందుకేడ్చారో? తేలిపోయింది.అదుత్త ఉత్సవ విగ్రహాల సంరంభం....నిజమే.. కూలుతున్నవి పెత్తనాలే.. అందుకే.. మిలియన్ మార్చ్ ప్రతి తెలంగాణ వాది గుండెల్లో మోగే దండోరా.. మార్చి 10.. మరి ఆరు రోజుల్లో వస్తున్నది... ఆ జ్ఞాపకాలు..
మిలియన్ మార్చ్ కదం తొక్కుతున్నది. ఎండలు ముదరలేదు. ట్యాంక్‌బండ్ ఆకాశం మీద అప్పటికే పొగలు చిమ్ముతున్నది. నినాదాలు, హోరుగాలి, చిరపరిచితమైన ఆ పాత రెయిలింగ్స్. పైన మబ్బుల్లోకి వ్యాపించింది. ఉత్తేజం. ఒక ఉద్విగ్నత. ఉద్రేకం. చెమట కమ్మిన, శరీరాలు, గాల్లోలేచిన పిడికిళ్లు. ఒకే ఒక్క నినాదం జై తెలంగాణ. సాహసం నిలు వ్యాపించిన మనుషులు. అవును వాళ్లు దేన్నో పడదోసుకొని, తోసుకుంటూ తొక్కుకుంటూ వచ్చారు.
మిలియన్ మార్చ్ ప్రకటన నుంచీ తెలంగాణ చక్రబంధంలో ఉంది. హైదరాబాద్ పోలీసుల మార్చ్‌లో ఉంది. పదఘట్టనల్లో ఉంది. ఊరి నుంచి రానివ్వ రు, ఊళ్లో కదలనివ్వరు, ఇదేమి నిర్బంధం. ఇదెవరి ప్రభుత్వం. ఆగ్రహం. కట్ట లు తెంచుకున్నది కోపం... ఎన్టీఆర్ పార్కు నిశ్చలంగా ఉంది. మూతబడి ఉంది. అసలీ ఎన్టీఆర్ ఎవ్వరు? ఈ ట్యాంక్‌బండ్ మీద నెక్లెస్ రోడ్డు ఏమిటి? అటు ఎన్టీఆర్ పార్క్. ఇటు ఐమాక్స్. ఏమిటీ చిహ్నాలు.. ఎవరివీ చిహ్నాలు..? ఏ ప్రతీకలివి..? కోల్పోయిన చిహ్నాలేమిటి? కోల్పోయిన ప్రతీకలేమిటి? హైదరాబాద్ ఎక్కడున్నది.. హైదరాబాద్ రాజధాని నగరం ఏమైంది. ఇదెవరి అడ్డా..? ఎవరి సంస్కృతీ స్థాపన జరిగిందిక్కడ. ప్రశ్నలు కోకొల్లలు. పట్టరాని కోపం. పక్కన కాలిపోతున్న వ్యాన్. పొగలు ఆకాశం అంటుతున్న దృశ్యం. కదలబారుతున్న జనం. ఆ నాడు ట్యాంక్‌బండ్ నిండింది. ట్యాంక్‌బండ్ కట్టిచ్చినదెవరు?
హుసేన్‌సాగర్ నిండా జలాల్లో చేపలు నిండినట్టు, ఈ నగరం నిండా జనం నిండుకోవాలని కోరుకున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ ట్యాంక్‌బండ్ నిండా పక్కన, వెనకన, ముందున ఎటు చూస్తే అటు ఏ ఎన్టీఆరో నిండుతాడని ఊహించి ఉంటాడా? విగ్రహాలు కూలుతున్నప్పుడు .. శ్రీశ్రీని ముట్టుకోవద్దు. అల్లూరిది వద్దు.. శాలివాహనుడు మనోడే.. ఆగండాగండి.. ఇట్లా వద్దు. అడ్డుపడాలని ఉన్నా చూస్తూ అనేకులు. ఉదాశీనతా కాదు. లోపల కోపమేదో రగిలింది. అంత నిర్బంధంలో, అంత అణచివేతలో, ఒక సాహసం ట్యాంక్‌బండెక్కింది. ఆ సాహ సం లోపల సుడులు తిరిగింది. బహుశా అదే అందరిలోపలా. జర్నలిస్టులమందరం ఒకేచోట గుమికూడి చూసినం.. ఆ విగ్రహాలు మాత్రం వద్దు అని చెప్పి నం. ఎందుకో వద్దనిపించిందా? నిజమా? కానీ.. లోపలొక సాహసం కెరటమ యింది. ద్వైదీభావమేమీ లేదు. అవి విగ్రహాలా? మనుషులేనా? బహుశా ఆరువందలమంది పిల్లలు కళ్లలో కదిలి ఉంటారు. ఆరువందల మంది పిల్లల తల్లుల గర్భశోకాలు...


యాదయ్య! జీవితమంతా తెలంగాణ చెదిరిన కల.. వాడు మనసు వీడడు. వాడిదొక విగ్రహం. మంటల నాల్కల కొసలు చాపుతూ.. ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ.. నిప్పులు చిమ్ముకుంటూ దుంకులాడిన యవ్వన సౌగంధపు త్యాగ పరిమళం. మనసున అది ఒక పొంచి ఉన్న మిసైల్. పేలడానికి సిద్ధం గా ఉన్న గ్రెనేడ్. మనసును వాడి విగ్రహం ఆక్రమించుకుని ఉన్నందువల్ల కావచ్చు. విగ్రహాల మీద ఎగురుతున్న జెండాలు. రెండు పడిపోయినవి. కూల్చి న వాళ్లకు ముఖాల్లేవు. అదొకటే ముఖం. ధిక్కారం మొఖం. తిరుగుబాటు, సాహసం, ఉక్రోశం, ఆక్రోశం కోపంలోనూ వివశతలోనూ.. దగాపడ్డ ముఖం. తండ్లాడిన ముఖం. అది అచ్చ తెలంగాణవాడి ముఖం. బహుముఖాలు ఒక ముఖ్యమైన, అరుదైన జీవితంలో ఎన్నడూ చూడని సన్నివేశం. ఇంతకీ మాకేమీ కన్నీళ్లు రాలేదు. ఇంతకీ ఏదీ తప్పుగానో, విధ్వంసంగానో తోచనూ లేదు. ప్రశ్నలు.. ప్రశ్నలు... ఎవరిదీ ట్యాంక్‌బండ్..ఎందుకీ ఆగ్రహం.. బహుశా ఆగ్రహకారణా లు తెలిసినవి. తెల్లవారింది. సంస్కృతీ విధ్వంసం. చారివూతక విషాదం. మండుతున్నది. ట్యాంక్‌బండ్‌ను చూశాను నేను. మిలియన్ మార్చ్‌ను చూశాను నేను. విధ్వంసమా? అది సంస్కృతీ విధ్వంసమేనా? అయితే ఎవరి సంస్కృతీ విధ్వం సం ఎప్పుడు ప్రారంభమైంది. 1956లో విలీనంతోనే ప్రారంభమయింది. తెలంగాణ సంస్కృతి ఎక్కడ? అది అయిదున్నర దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్నది. షోయబుల్లాఖాన్, అలీ యావర్‌జంగ్, ఈ ట్యాంక్ బండ్ కట్టిచ్చినవాడు. ఈ హైదరాబాద్ పొందిచ్చినవాడు ఎక్కడ? సీరియస్ ప్రశ్నలు. తెలంగాణకు ఒక విశిష్ట సంస్కృతి ఉండింది. అది ధ్వంసమయింది. అదీ చారివూతక విషాదం. రెండు అసమ సమాజాల కలయికలో ఏర్పడిన ఘర్షణల సారం. ఒకటి ఆధిపత్య సంస్కృతి మరో సంస్కృతిని మింగిన ఫలితంగా కోల్పోయిన వాడి ఆత్మఘోషల విధ్వంసం. రెండు అసమ వ్యవస్థలు, రెండు భిన్న చారివూతక అనుభవాలు కలిసిన ఆంధ్రవూపదేశ్ మానసికంగా విడిపోయింది. కానీ వలసాధిపత్యం తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసింది. అదే అసలైన సంస్కృతీ విధ్వం సం.

ఆరు దశాబ్దాలుగా ఒక విశిష్ట సంస్కృతిని విధ్వం సం చేస్తూ, ఈ విధ్వంసం పట్ల మౌనం వహిస్తూ.. ఇల్లెక్కి కూసిన పత్రికల లక్ష్యమేంటి? తమది మాత్రమే సంస్కృతి అని ఇంకెవరికీ సంస్కృతి లేదని, ఇతరులకు కూడా సంస్కృతి నేర్పే బాధ్యత మాదేనని బ్రిటన్ పాలన అవశేషాలను, అలవాట్లను, ధోరణులను ఆకళింపు చేసుకున్న పెత్తందారీ పెద్దన్నయ్య, ఇరుగు పొరుగు సీమాంధ్ర ఏలిక కాదా? ఎన్టీ రామారావు విగ్రహాలను కట్టించిందెన్నడు? ఆ విగ్రహాల్లో తెలుగు వెలుగులు కేవలం ఒక ప్రాంతానివే ఎందుకున్నాయి? మచ్చుకు కొందరు తప్ప అక్కడి సంస్కృతి, అభివృద్ధి నమూనా, జీవన విధానం, ఆర్థిక విధానం వేరయినపుపడు వచ్చిన వైతాళికులు మాత్రమే తెలంగాణ వైతాళికులా? ఈ ప్రశ్నలకు సమాధానమేది? కన్నీళ్లు రాలేదు. కృతకంగా తెచ్చిపెట్టుకున్నా రాలేదు. అట్లని బాధా లేదు. జరగాల్సిందేదో? జరుగుతున్నట్లు సంస్కృతిని విధ్వంసం చేసిన వారు సంస్కృతి గురించి మాట్లాడుతున్నట్టు? చారివూతక విషాదాలకు మూలపురుషులు గిల్లి ఏడుస్తున్నట్లు దొంగ ఏడ్పులు. అట్లని బాధాలేదు
జరగాల్సిందేదో జరిగింది. బహుశా గుండెల్లో ప్రతిష్టించి ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వల్ల కావచ్చు. ప్రతిష్టించి వున్న యాదయ్య మంటలు మండుతున్న విగ్రహం వల్ల కావచ్చు. ఏడవలేము. మర్యాదలేని వాళ్లమే కావచ్చు. ఫర్వాలేదు. తాలిబన్‌లు కూడా అయినా ఫర్వాలేదు. అవును శ్రీశ్రీతో ఊరేగాం. నక్సల్బరీని మోశాం. కమ్యూనిజాన్ని ఊరేగాం. కానీ.. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అజ్. ఈ భూమి మాది. ఇది మాకు చెందిన భూమి. తెలంగాణ. ఇదొక మంత్ర జపం. దగా పడింది. తల్లడిల్లింది. తెగబడింది. ఒక ధిక్కారభూమి విడిపోవడం ఒక చారివూతక అవసరం. కలిసి వుండడం ఇప్పుడొక అసహజ పరిణామం.

ఒక మెసేజ్: అప్పుడు విగ్రహాలు కూలాయి. అది మొదటి ప్రమాద హెచ్చరి క. అవును అప్పుడు విగ్రహాలు కూలాయి. మనుషులు కూలక ముందు.. విడిపోవాల్సి ఉన్నది. శ్రీశ్రీ మీద ప్రేమను కాపాడుకుందాం. అల్లూరిని అలుముకుందాం. మా కొమురం భీమును, షోయబుల్లాఖాన్‌ను, చాకలి ఐలమ్మను, బందగీని, దొడ్డి కొమురయ్యను, మా భాగ్యడ్డి వర్మను, మా మాడపాటిని, మా పాల్కురికిని ప్రేమిద్దాం. ఈ నేలన వికసించిన వజ్రాలను విగ్రహాలుగా మలుద్దాం. కూల్చినచోట కొత్త మొలకలై మొలుద్దాం. సమభావన సంస్కృతి అంటే ఆధిపత్యంకాదు. లొంగుబాటు కాదు. బలహీనత కాదు. అదొక ఆత్మగౌరవ పతాక. విధ్వంసం జరిపిన వాళ్లకు, విషాదాలు సృష్టించిన వాళ్లకు, విడగొట్టిన వాళ్లకు, మనసులను కలపలేని వాళ్లకు, ఆధిపత్య అహంకారులకు అర్హతలేదు. మా కన్నీళ్లింకిపొయ్యాయి. ఇక మాటలు కరువయ్యాయి. విగ్రహం విధ్వంసం గతం.. భవిష్యత్ మాదే. వర్తమానంలో ఇప్పటికీ తెలంగాణ ఒక ధిక్కార భూమి.

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎవరూ వ్యక్తి కాదు. ఆయన చట్టసభల ప్రతినిధుల బందానికి, ముఖ్యంగా రాష్ర్టాన్ని ఏలే మంత్రివర...

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఏమంటారు! సోమవారంనాడే ఎపీఎన్జీవోల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. నిషేధాజ్ఞలు...

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిలబడడానికి యత్నించాలె. తమ మైండ్ సెట్ మార్చుకోవాలే తప్ప బిల్లు ముసాయిదాలో లోపాలు ఉన్నాయనీ, తమకు అన్యాయం జరుగుతున్నదని మొత్...

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా ఇవాళ ఇస్రో అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నదీ అంటే నంబి బృందం ఆనాడు వృద్ధి చేసిన వికాస్ ద్రవ ఇంధన ఇంజన్‌లే కారణ...

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను తప్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహం ఏమై ఉంటుంది? ఈ సందేహాల సంగతి ఎట్లా ఉన్నా ఒ...

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆపద్ధర్మ ప్రభుత్వాలే. ఈ మాత్రం మహద్భాగ్యానికి ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చవలసిన అవసరం ఉన్నదా! ఇటువంటి నిష్ఫ...

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్రా పాలకవర్గాల అవశేషాలు ఇంకా మిగిలే ఉంటాయి. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాయి. వీలైతే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా తెలంగాణ...

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానానికి లేదా చర్చకు సంప్రదాయమని నామకరణం చేసి ఇక్కడ అమలు పరచాలని కోరుతారట! సూటిగా చెప్పాలంటే- ఆ ఉత్తరాది నాటకాన్ని ఇక్కడ కొత్త...

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీరు మీ చీకటి మనస్తత్వాల వల్ల పరుచుకునియున్న వెలుగును గుర్తించ నిరాకరిస్తున్నారు. చివరకు మీరు బైబిలునూ ప్రేమించరు. నమ్మినా...

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలుసు. కానీ ఇంత నటనా ప్రతిభ ఉందని ‘తెల్వకండా’ పోయినందుకు చింతించవచ్చు. కిరణ్ ఇంత ద్విపావూతాభినయం చెయ్యగలడని కూడా ముఖ్యంగా స...

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధాన స్రవంతి రాజకీయవేత్తలు సాధారణంగా డొల్లగా మాట్లాడతారు. ఏదైతే ఉన్నదో, తెలియజేసుకుంటున్నాను, ఈ సభా ముఖంగా చెప్తూ ఉన్నాను ...

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వెంక వయసప్పుడు పదిహేనేళ్లు. చిన్న పిల్లవాడే. టెన్త్‌క్లాస్. ఇప్పుడు ఇంటర్. కానీ ఇప్పటికీ అతని మ...

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్తూనూ రొదలా వెంబడించే జోరీగల సంగీతంలో నిలు పెరిగిన గడ్డి నిండిన వనాలను సంచారిలా చుట్టినవాడు వెంకన్న. కరీంనగర్ జిల్లా హుజు...

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామందికి తెలియదు. నిన్నటికి నిన్న అసెంబ్లీ లైవ్ చూడడం వల్ల జ్ఞానంతో నా కళ్లు తెరుచుకున్నాయి. చంద్రబాబునాయుడు కొడుకు ఎంత గొప...

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు అక్కరకు రాని, పనికిరాని విషయాలనీ భావించే వాళ్లుంటారు. కానీ సంస్కృతిని విధ్వంసం చేస్తేనే మరో సంస్కృతి పాదుకుంటుందని, ఆధి...

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్యాలను లాగడం కాదా! పురోగామి క్రియాశీల శక్తుల ప్రేరణా పదార్థం కదా! అన్నీ ఇట్లనే వుంటాయి. నిన్ను బద్దె పురుగులా కుదిపి, క...

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గదుల్లో పిల్లలతో సహవాసం చేసేవాడు. వాళ్లకు ప్రపంచం గురిం చి చెప్పేవాడు. వాటి ముందుగా ఊరేగుతున్నడిప్పుడు కోటి. అప్పటి పిల్ల...

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇస్తరు నుంచి ‘ఇంకెక్కడి తెలంగాణ’ దాకా ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సామా న్య ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు ఈ ప్రశ్నలు అడిగితే ...

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లకు ఊళ్లను ముంచి, గిరిజన ప్రాంతాలను విధ్వంసం చేసి, నిర్వాసితులను చేసి, బతుకుదెరువు నాశనం చేసే ఏ ప్రాజెక్టుకైనా నేను వ్యతిర...

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూనియన్ సమ్మె అంటే మరోటి కాదనే కష్టకాలాలను చూసినం. ఇప్పుడిక అందరిదీ ఒకే మాట. ఏమయితది సార్. సమ్మె జరుగుతది. తుపాకులు బొగ్గు...

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల కోసం సర్వ జేఏసీలు ప్రచారం చేస్తూ వీధులు, వాడవాడా పాటలు హోరెత్తుతున్న కాలం. బతుకమ్మకు ముందే కాలం బతుకమ్మలాడుతున్న సంద ర్భ...

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాటం. నూతన ప్రజాస్వామ్యం కలలు కనొద్దని కానీ, సామాజికన్యాయం కల వికసించవద్దని కానీ, మాదిగ రిజర్వేషన్లు, వర్గీకరణలు తక్షణమే వ...