పసిడి రెక్కలు విసిరి కాలం...


Sat,December 31, 2011 11:33 PM

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్యాలను లాగడం కాదా! పురోగామి క్రియాశీల శక్తుల ప్రేరణా పదార్థం కదా! అన్నీ ఇట్లనే వుంటాయి. నిన్ను బద్దె పురుగులా కుదిపి, కదిపి ఇబ్బందిపెడ్తూనే వుంటాయి. కానీ....నడవనీ.. కాలమట్లా నడవనీ.. పసిడి రెక్కలు విసిరి కాలం.. పారిపోయిన జాడపూందుకు?క్యాలెండర్ తిరగబడ్తుంది. గోడమీద మరుపుల, మెరుపుల మరకలు... క్యాలెండర్ స్థానంలో దుమ్ముపట్టని ఆ గజం మేరా చెరగని కాలం లా.. చెదరని జ్ఞాపకాల్లా.. గతిస్తున్న గతంలా... బ్రతుకు నిరంతర ప్రవాహమయితే ప్రతి జనవరి ఫస్టూ ఒక మజిలీ. ఉగాదులు ఎన్నడూ లెక్కగట్టం కదా.. జనవరి నుంచి జనవరి దాకా .. అయినా మనకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. జగమంతా తమస్సులే.. జనమంతా ‘తమస్’కులే.. ‘బీతే హుయె వో దిన్’... వెళ్లిపోయిన దినాలు.. బహుశా చివరి వారం రోజులూ అందరి మనసులోనూ ఒక రకమయిన ఒత్తిడి వుంటుందనుకుంటా. ఇంకో ఏడు మీద పడిం ది. ఏం సాధించాం. ఏం జరిగింది. మంచీచెడ్డా బేరీజు, ఒత్తిడొత్తిడి, తొక్కిడి తొక్కిడి.. అల్లిబిల్లి జ్ఞాపకాలు మనసును కలవరపెడుతుంటాయి.

నువ్వు ఒంటరి పథికుడివైతే ఆ దిగులు బరువూ, మీద వయసు బరువూ. జరగని పనుల తాలూకు ఛాయావూపచ్ఛాయలు, జరగాల్సినవేవీ జరగని చితిచింత, ఓ నిట్టూర్పు, ఓ జాలి చూపు... నువ్వు సామాజికుడివైతే రొటీన్. ప్రతియేడు వచ్చినట్టే వచ్చింది. ‘నథింగ్ న్యూ’ అనుకుంటావ్. జానేదేవ్ యార్. సిద్ధాంతివో, వేదాంతివో అయితే కదా! జరగాల్సింది జరిగింది. ‘అదంతే’ అని చప్పరించేస్తుంటావ్. విజేతలు విజయహాసంతో విర్రవీగితే, పరాజితులు మరింత కృంగిపోతారు. కాలం మాత్రం ఏ మాత్రం ఆగదు... నిలవదు. ‘ఫూల్ ఖిల్‌తే హై, లోగ్ మిల్‌తే హై’ వైసాహీ... పూలు పూస్తాయి. వెన్నెల కాస్తుంది. సూర్యుడు పసిడి రెక్కలు విసురుడుతాడు. మనుషులు కలుస్తారు. విడిపోతారు. జ్ఞాపకాలో, స్మృతులో.. తీపివో, చేదువో అనుభవాలు పండుతాయి. కాలమట్లా కదులుతూ వుంటుంది.
అయినా ‘ఏమున్నది గర్వకారణం’. మనుషులు మరింత ‘ముదిరి’పోవడం తప్ప. మానవ సంబంధాలు మరింత విచ్ఛిన్నమవడం తప్ప. మనుషుల తాలూ కు ప్రతిస్పందనలు, స్పందనలు కనుమరుగై కరువవడం తప్ప. జీవన సమరంలో ప్రేమలూ, ఆప్యాయతలూ, అభిమానాలు, కోపాలు, తాపాలు, విరహాలు, వేదనలు, రోదనలు, నిబద్ధతలు, నిబిడీకృతాలు.. మానవ మేధస్సుకు సంబంధించిన పుర్రెలో పుట్టిన బుద్ధులు, మానవుల రసాయనిక ప్రక్రియలన్నీ అంతరించిపోవడం తప్ప. ‘మోర్ ప్రాక్టికల్’... ‘మోర్ మెకనైజ్డ్’... ఆర్ మోర్ కంప్యూటరైజ్డ్.. మోర్ అండ్ మోర్. అట్లా మనిషి యంత్రం కావడం, బ్రతుకు విధ్వంసం కావడం తప్ప. ‘నీ కోసం చెమ్మగిల్లిన నయనమ్ములేవి?’.. ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు’ మనుషుల్ని దేవులాడుకోవడం మిగిలింది. మనిషి ఈ యాంత్రికయుగంలో ‘ఇంటర్‌నెట్’ల సమాచార వరదలో, బాధలో, భయాల్లో ఒంటరైపోతున్నాడు. ప్రపంచం విస్తరిస్తున్నది. మనిషి మరింత విస్మృతికి జారుకుంటున్నాడు. ఇది నగర నాగరిక జీవనసారం.

సరే. పల్లెలట్లా తగలబడ్తూనే వుంటాయి. మంటల్లో మాడుతూనే వుంటాయి. ఎన్‌కౌంటర్లు పిట్టల్ని కాల్చిచంపుతాయి. అట్లా ఒకరు చచ్చిపోతుంటారు. మరొకరు పేలిపోతుంటారు. పొలాలు బీళ్లవుతాయి. ఊళ్ళు, కన్నీటి సెలయేళ్ళవుతా యి. ‘రెక్కలు విప్పని రెవల్యూషన్’ ప్రపంచం ఊర్థ్వముఖంగా గగనతలంలో తిరుగాడుతుంటుంది. పల్లెలు అథోముఖంగా మరిన్ని బాధల్లోకి జారుకుంటా యి. ఎవరికీ పట్టని ఏకాంత సీమలు. వానలు కురుస్తాయి. తుపాన్లొస్తాయి. పచ్చ ని పంటసీమలు ‘కాడు’పడి, గోడుగోడుమంటాయి. ‘ఎటు చూసినా శవాల కుప్పలు.. రాజకీయుడేడి?.. రాముడేడి’ అదే స్టయిల్ ప్రశ్న మరోసారి. రాజకీయుడు మరింత ‘స్కాం’ డ్రల్‌గా అవతారమెత్తుతున్నాడు. పిల్లి మెడలో కోర్టుల గంటపూన్ని గణగణమోగినా, చీమూ నెత్తురూ లేని వ్యవస్థ. ఇక్కడ ఏమీ జరగదు. అయినా న్యాయమూర్తులే స్వయంగా అన్యాయమూర్తులయిన సరికొత్త సీమ. అవినీతి అందలాపూక్కుతున్నది. విశ్వరూపం ప్రదర్శిస్తున్నది. ‘ఇందూ, అందూ ఎందెందు వెదకినా’ పుచ్చిపోయిన సర్వాంగాలతో సామాజిక వికృత రూపాలు. ముసుగు తొలగించకు.. అదుత్త అస్థిపంజరం. అయినా మరచిపో.. మరిచిపో. నీ కెందుకు? బీ ప్రాక్టికల్... ఒకరి గురించిన కనీస యోచన లేనితనం.. మంచితనం అంతరిస్తున్న జాడలు. ఎవరి గోడూ ఎవరికీ పట్టనితనం. ‘జానేబీదో యార్’ పక్కవాడిదాకా ఎందుకు... నీ పని నువ్వు చూసుకో... చాలు.. పుణ్యమున్నూ, పురుషార్థమున్నూ.

విమానాలు కూలిపోయాయి. గాల్లోనే పేలిపోయాయి. రైళ్లు పడిపోయాయి. ఏటా వచ్చే వరదలూ ముంచాయి. ఉప్పెనలూ ఊడ్చాయి. బస్సులు నదుల్లోకి దూకాయి. కానిస్టేబుల్ కాల్పులు జరిపి రైతుల రక్తం చూశాడు. కొందరు ఉద్యమించారు. మరికొందరు తలలువాల్చారు. రాజ్యాలట్లాగే వున్నాయి. మీ ఇంట్లోకి ‘కోక్’ 1500 మిల్లీమీటర్ల బాటిల్ జార్ వచ్చే ఉంటుంది. మీకు అతి సమీపంగా కదలాడుతూ వుండి వుంటుంది. నో ప్రాబ్లమ్. మీ ఇల్లూ, పిల్లలూ సల్లంగుండ. జీవితం భద్రంగా వుంది. బయట ఉక్క. గదిలో చలి. నాలుగ్గోడలే భద్రం. బావిలో ఆ ఇరుకే నయం. ఎంత విస్తరిస్తున్నామో అంత కుత్సితులవుతున్నామంటే ఎట్లా, కుదరదు. కుదరదు. ‘ఛోడ్‌దేవ్ యార్’..భద్రలోకుల మాట సరే! ‘దోస్త్ దోస్త్ న రహా. ప్యార్ ప్యార్ న రహా’.. మిత్రుడా నువ్వట్లా కలలుకంటూనే వున్నావు. భుజం మార్చుకున్న బంధూకు.. ఎన్నికలలో. బహుశా కలలు కంటున్నందుకు నివ్వింకా నీ నెత్తుటి మూల్యం చెల్లిస్తూనే వున్నావు. అలసట లేదు. నిరాశ లేదు. ఆశల దీపాల్లో వెలుగుతున్నారు.
మూలుగుతున్నారు. నీ జ్ఞాపకం... చిత్తడి అరణ్యాల మధ్య వద్దు... నీ కలలంత ప్రమాదకరమైన ప్రేలుడు పదార్థం ఇంకేదైనా వుందా.. ఆ ఒక్కటీ వద్దు. భద్రంగా.. క్షేమంగా... ఇంటికీ, ఆలికీ, పిల్లలకూ, కార్యాలయానికీ మధ్య అడపాదడపా.. సమావేశ మందిరాల మధ్య ఆసుబోసిన గొట్టంలా ‘గిరగిరాం.. గిరగిరాం’ తిరి గే.. అవునూ, లోపలేదో కుములుతున్నది. అవునూ ఏదో తెములుతున్నది. తల్లి పేగు సంబంధమేదో కదులుతున్నది. హఠాత్తుగా.. మై డియర్ ఫ్రెండ్. ఈ మధ్యన నువ్వే బాగా కెలికీ, కెలికీ.. ఎందుకు మిత్రుడా.. అట్లా మా భద్రలోకాలనీ చెదరగొడ్తావు. ‘సబ్ ఠీక్ హై’జీవితం చాలా ఆనందంగా.. చాలా చిన్నగా.. చాలా భద్రంగా.. చాలా సజావుగా.. సాగుతున్న నదిలా.. జరగనీ.. ‘యువర్ డ్రీమ్ ఈజ్ ఎ బాంబ్ షెల్’.. నీ కల వెయ్యి టిఎన్‌టిల శక్తితో విస్ఫోటనం కాని వ్వు.. మరిచిపో.. మరిచిపో.. కమ్ముకొస్తున్న కాలం.. మీదపడే ముదిమి.. ఏమున్నది. అవునూ ఒక ఏడాదిలో ఏం జరిగింది.. ఏమీ జరగలేదనేదే కదా రంధి. ‘కొడుకా నువ్వక్కడ ఏ రంధీ, రవుసూలేని బతుకు బతుకుతున్నావ్. మేమిక్కడ ఇంకా ఈ పొలాలపొంటి, ఒడ్లపొంటి, నాట్లేసి, కలుపులు తీసి, ఎండల్లో ఎండీ, వానల్లో నానీ.. ‘వద్దమ్మా వద్దు’ అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు.. ‘శివుడా. శివుడా.. నర్రెంగా సెట్టుకింద నరుడో భాస్కరుడా.. అవును నా వేళ్ళు, పల్లెల్లో వున్నాయి. నేనేమిటి? నా దేశం నరనరాలు పల్లెల్లో వున్నాయి.

ఈ యంత్రాలూ, యంత్ర భూతాలు.. సాంకేతిక పరిజ్ఞానాలు..కంప్యూటర్‌లు.. మల్టీ ఛానళ్లు.. మట్టిపొత్తిళ్ల పల్లె బ్రతుకు విస్మృతులు. ఆ పల్లె కూటి ఏటి పాటలు మీటిన రాగాలే. అభివృద్ధి అసమానమైన చోట, నగరాలకూ, పల్లెలకూ మధ్య అంతరాలు కంచుకోటలై పెరుగుతున్నచోట.. అయ్యా నేను పల్లెటూరివాన్ని.. ఓ రైతు బిడ్డను. నాకిదొక విస్మృతి. జీర్ణంకాని వికృత ఫలం. నాకిప్పుడు మనిషి కావాలి. నాకిప్పుడో మానవుడు కావాలి. ‘గో టు హెల్’.. ఆ పాటలూ, మాటలూ.. ఆటలూ.. కోటలు దాటిన మాటల మూటలు.. కలలు.. కడి కన్నీళ్లు. ‘ఒత్తుకున్నాం కంటిలో తడి, ఎత్తుకున్నాం ఎర్ర పిడికిలి’ నువ్వెక్కడున్నావ్ ఎన్.కె. భద్రమా.. ‘జర భద్రం కొడుకో నా కొడుకో కొంరన్న. రిక్షా ఎక్కే కాడ.. తొక్కేకాడ అయినా నల్లగొండ లంబాడీల రిక్షాల చక్రాలు విరిగిపొయ్యి ఏండ్లు గడిచినయ్ కదే గద్దరన్నా. ఇప్పుడంతా మూడుకాళ్లమీద నడుస్తున్న ప్రపంచం. ప్రగతి సాధించాం. ప్రగతి.. సర్లే పోనీ.. మూసిపెట్టు.. ఈ గుప్పిట విప్పకు.. అందరూ కనుమరుగైన కాలంలో... మిగిలీ మిగలని జ్ఞాపకంలా... ‘సముద్రం అలలమీద జాబిలి సంతకంలా’.. అలల మీద సితార మీటి అలసిసొలసిన కలం వీరుడా.. ఈ కాలం నీదా? కాదా? ఎవడు మన కాలం వీరుడు.. బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్యాలను లాగడం కాదా! పురోగామి క్రియాశీల శక్తుల ప్రేరణా పదార్థం కదా! అన్నీ ఇట్లనే వుంటాయి. నిన్ను బద్దె పురుగులా కుదిపి, కదిపి ఇబ్బందిపెడ్తూనే వుంటాయి. కానీ....నడవనీ.. కాలమట్లా నడవనీ.. పసిడి రెక్కలు విసిరి కాలం.. పారిపోయిన జాడపూందుకు? చేతనైతే.. చేవుంటే బతుకు శిఖరం మేరుపర్వతం.. అగడ్తల నుంచి, అగాథాల నుంచీ.. మొలకపూత్తే నమ్మకం. కాలమట్లా కదులుతూ వుంటుంది. మనుషులట్లా ఆకటి, చీకటి కాకుల కీకారణ్యంలో ఇక బతుకు బరువు కానే కాదు.. కొత్త బంగారు లోకాల కోసం కలలతో.. కలతల నిద్రలతో.. వేకువ కోసం.. సూర్యుని కోసం.. శీతల చంద్రకిరణాల కోసం.. ‘ ఎన్నెల కోనా లెన్నియలో మరి ఎలుగూ రవ్వా లెన్నియాలో’...

(ఇది పన్నెండేండ్ల కిందటి పలవరింత. ఏమీ మారని వింత...!)
-అల్లం నారాయణ

36

Allam Narayana

Published: Sun,April 6, 2014 12:21 AM

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గ

Published: Sat,March 8, 2014 01:02 AM

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బ

Published: Tue,March 4, 2014 04:10 AM

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడద

Published: Sat,March 1, 2014 12:30 AM

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రం

Published: Fri,February 28, 2014 12:31 AM

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వార

Published: Wed,February 26, 2014 03:03 AM

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట

Published: Tue,February 25, 2014 12:57 AM

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యల

Published: Sat,February 22, 2014 01:24 AM

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద

Published: Fri,February 21, 2014 01:10 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Fri,February 21, 2014 01:09 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Sat,February 15, 2014 01:08 AM

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిర

Published: Fri,February 14, 2014 12:44 AM

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌స

Published: Tue,February 11, 2014 12:13 AM

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవ

Published: Sat,February 8, 2014 02:29 AM

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇ

Published: Fri,February 7, 2014 01:08 AM

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకా

Published: Fri,January 31, 2014 12:31 AM

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలం

Published: Thu,January 30, 2014 12:33 AM

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగ

Published: Wed,January 29, 2014 02:24 AM

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎ

Published: Tue,January 28, 2014 02:24 AM

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్

Published: Mon,January 27, 2014 12:43 AM

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్

Published: Sat,January 25, 2014 12:56 AM

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెల

Published: Fri,January 24, 2014 12:09 AM

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు.

Published: Wed,January 22, 2014 12:36 AM

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్

Published: Sat,January 11, 2014 02:36 AM

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిల

Published: Wed,January 8, 2014 12:47 AM

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా

Published: Fri,January 3, 2014 01:19 AM

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బా

Published: Thu,January 2, 2014 01:17 AM

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆప

Published: Wed,January 1, 2014 01:03 AM

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆం

Published: Sat,December 28, 2013 12:44 AM

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానాని

Published: Sun,October 6, 2013 01:58 AM

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీ

Published: Sun,August 11, 2013 12:20 AM

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలు

Published: Sun,May 12, 2013 12:08 AM

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధ

Published: Sun,May 27, 2012 12:11 AM

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్

Published: Wed,March 14, 2012 12:40 AM

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్

Published: Sun,March 4, 2012 12:15 AM

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో

Published: Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామ

Published: Sat,January 7, 2012 11:49 PM

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు

Published: Sun,December 4, 2011 12:33 AM

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గ

Published: Sun,November 20, 2011 12:37 AM

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇ

Published: Sun,October 23, 2011 12:51 AM

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లక

Published: Sat,September 24, 2011 10:32 PM

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూని

Published: Sun,September 11, 2011 12:02 AM

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల

Published: Mon,July 25, 2011 12:10 PM

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాట