కోటి బంధం


Sun,December 4, 2011 12:33 AM

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గదుల్లో పిల్లలతో సహవాసం చేసేవాడు. వాళ్లకు ప్రపంచం గురిం చి చెప్పేవాడు. వాటి ముందుగా ఊరేగుతున్నడిప్పుడు కోటి. అప్పటి పిల్లలు ఇప్పుడు యాభైలల్లో. ముఖాల మీద దుఃఖం. కోల్పోయిన తనం. చింత. పాటలు మోగుతున్నయి. పాడుతున్న వాళ్లెవరూ ఇప్పుడు విప్లవంలో లేరు. పాత పాటలు. ఎర్రజెండెపూరజెండిన్నియలో.. వోలీవోలీలరంగవోలీ. ఏది నోటికొస్తే అది. అప్పుడు కోటితో కలిసి పాడిన పాట. నుడుగులు తడబడ్తున్నయి. కిషన్‌జీ అమర్‌హై! ముప్పది నాలుగేండ్ల తర్వాత కోటి తన ఊర్లో తాను ఊరేగుతున్నడు. అయితే విగతజీవిగా. అద్దాల పెట్టెలోంచి చూస్తే తెలుస్తున్నది. చిత్రహింసల కొలిమి. ముఖమే చెబుతున్నది. ఏడుపును ఆపుకోవా ల్సి ఉన్నది. అతనొకప్పుడు అందరి సహచరుడు. చాలామంది ఆగిపోయిన చోట.. అతను ప్రస్థానం కొనసాగించాడు. పెద్దపల్లి నుంచి విప్లవం పశ్చిమబెంగాల్‌కు వెళ్లింది. మల్లోజుల కోటేశ్వరరావు కిషన్‌జీ అయ్యాడు. కానీ, ఇప్పుడు అతని కోసం, ఇక్కడ ఆగిపోయిన వాళ్ల ఊరేగింపు నడుస్తున్నది. కొనసాగింపు నడుస్తున్నది. కోటి బంధం ఎందరిదో? కలిసి నడిచిన వాళ్లు. కలిసి పోరాడిన వాళ్లు. అన్నం పెట్టిన వాళ్లు. ఆశ్రయం ఇచ్చి మంచిపని చేస్తున్నవ్ బిడ్డా అని దీవించిన వాళ్లు.

డ్బైయవ దశకం చివరి పాదపు రోజులు. ఒక తెలంగాణ విద్యార్థి మహా విప్లవకారుడు ఎలా అయ్యాడు. చరిత్ర పురుషుడు ఎట్లా అయ్యాడు. 1969 ఆత్మలు మేల్కాంచిన తెలంగాణ. ఓడిపోయిన తెలంగా ణ. మున్నూటా అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ. అది అప్పటి పిల్లల్లో ఏదో ఒకటి నాటింది. అది తిరుగుబాటు. ఉన్నదాన్ని ఉన్నట్టు.. ఉండనివ్వకపోయే రెబెల్ తత్వం. ప్రశ్నలు. జవాబులేని ప్రశ్నలు మొలకెత్తే కాలం. పుడమి తెలంగాణ. విత్తనం ఉద్యమం. అది నిశ్చల జీవనంలో విసిరిన రాయి. అట్లని కరీంనగర్‌కు. కల్లోలానికి మారుపేరైన జిల్లాకు. ఆ తర్వాత మూడు దశాబ్దాలూ కళ కరీంనగర్‌కు సాయుధపోరాటం లేదా? ఉంది. ఒక గట్టెపల్లి మురళి అదే పెద్దపల్లి సాయుధపోరాట యోధుడు. కోటేశ్వరరావు మనసులోకి భావజాలం దూరే పునాది ఏదో కరీంనగర్ గడ్డమీద అప్పటికే పురుడుపోసుకొని ఉంది. ఆ చరిత్ర డ్బైయవ దశకం మొదటిపాదం చరిత్ర కాదు. దాని తర్వాతిది. మల్లోజుల పూర్తి కాలం విప్లవకారుడు ఎలా అయ్యాడు. ప్రభావాలు సరే. సాహిత్యము, వాతావరణము, ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మొలిచిన ప్రశ్నలు. ఇంతేనా? కాదు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలు కరీంనగర్ ఆదిలాబాద్‌లకు తూర్పు పవనాలను తెచ్చారు.

ముక్కు సుబ్బాడ్డి కరీంనగర్ ఆర్గనైజర్. పేరు రంగన్న. విద్యార్థి ఉద్యమంలో చందుపట్ల కృష్ణాడ్డి, మల్లోజుల కోటేశ్వరరావు, నారదాసు లక్ష్మణరావు, టీచర్ ముప్పాళ్ల లక్ష్మణరావు, పాలిటెక్నిక్ నుంచి తుషార్‌కాంత్ భట్టాచార్య, వడ్కాపూర్ జగన్ పునాది ఏర్పడింది. కొల్లూరి చిరంజీవి ఆర్గనైజర్. ప్రత్యేక తెలంగాణ అతణ్ని మెడికల్ కాలేజీ నుంచి కొండపల్లి బాట పట్టించింది. ఇకనేం. మంథని రెడీ.. పోరెడ్డి వెంకటడ్డి, బయ్యపు దేవేందర్‌డ్డి, మల్లా రాజిడ్డి, అల్లం నారాయణ, జమ్మికుంట సాహితీక్షేత్రం, ఆదర్శ కాలేజీ కన్న త్రీ మస్కిటీర్స్ నల్లా ఆదిడ్డి, చంద్రవూపభాకర్, శనిగరం వెంక తోడు మరొకడు సుధాకర్‌డ్డి.. ఎవన్ని చెప్పినా ఇది తొలి సైన్యం. పూర్తికాలపు విప్లకారుల రీఆర్గనైజింగ్ కమిటీ సైన్యం. మొట్టమొదటిసారి పూర్తికాలపు విప్లవకారులు. విప్లవం కోసం పనిచే హోల్‌టైమర్స్ కరీంనగర్ జిల్లాలో అంతటా పాకిన కాలం. విప్లవం అట్లా పురుడు పోసుకున్నది. అది జగిత్యాల జైత్రయాత్ర కోసం విస్తృతమైంది. ‘రోడ్ టు రెవల్యూషన్’ అధ్యయనం చేసింది. వర్గశత్రు నిర్మూలన ఏకైక పోరాట రూపంనుంచి చారు ముజుందార్ నుంచి ప్రజల బాట పట్టింది. విప్లవం గ్రామాలకు తరలింది. రెండేళ్లలో ఈ చిన్న సైన్యం. కరీంనగర్ జిల్లా పరివ్యాప్తమయింది. చిన్న పాయ నది అయిం ది. నది ప్రవాహం అయ్యింది. ఎవన్ని చెప్పినా అది భవిష్యత్ విప్లవానికి, ఇవాళ్టి దేశవ్యాప్త విప్లవ ప్రాంతాల విస్తృతికి మార్గదర్శి అయ్యింది. ఒక్క కరీంనగరేనా? ఆదిలాబాద్‌లో గజ్జెల గంగారాం, వరంగల్‌లో నరేందర్, జన్ను చిన్నాలు, విశ్వేశ్వరరావు, చెరుకూరి రాజ్‌కుమార్, డీవీ కరీంనగర్ జిల్లాకు ప్రేరణ ఎమ్జన్సీలో తొలి ఎదురుకాల్పుల్లో మరణించిన సూరపనేని జనార్దన్, సుధాకర్, మురళిల అమరత్వం.కార్యక్షేత్రం. సిద్దిపేట.

మెతుకులేని మెదక్‌జిల్లా తోడు ఉస్మానియా మెడికల్ కాలేజీ రూం నెంబర్ సిక్స్. ఎం.ఎఫ్ గోపీనాథ్, వేణుగోపాల్, బాబూరావు, సాయినాథ్‌లు.. ఇంకా పేర్లేన్నో.. ఈ మొత్తం సైన్యం విద్యార్థి సైన్యం. అది ఆర్‌వోసీ వోల్‌టైమర్‌ల కాలం. విద్యార్థి ఉద్యమంలో రాటుదేలి పూర్తికాలపు విప్లవానికి పదుల సంఖ్యలో త్యాగాలకు సిద్ధపడ్డ తరం. ఆ తరం అగ్రగణ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు. ఎందుకిదంతా ఒక్కసారి చెప్పుకోవాలి. కోటి బంధం గురించి మాట్లాడుకోవాలి. నిజమే.. నేను ఆగిపోయినవాణ్నే. రెండు జీవితాలు. ఒక జీవితపు పార్శ్వంలో భాగం కోటి. మరో జీవితం ఇప్పటిది. మొహమాటపు జీవితం. పరిమితుల్లోనూ, చట్రాల్లోనూ, మొహం మీద పులుముకున్న మర్యాదల్లో నూ మప్పితమైన జీవితం. కోటి బంధంతో కోల్పోలేనిది. అయినా జీవితం పొడుగునా అతనితో కొనసాగే బంధం.

జ్ఞాపకాలు పొరలుతున్నవి. కెరలుతున్నవి. గుడగుడ మంటున్న దుఃఖంలా. మా కిరణ్ చనిపోయినప్పటిలాగే అచ్చంగా. భోరున ఏడ్వడానికి కూడా లేదు. శవంమీద పడి తనవితీరా కాకిసోకం పెట్టడానికీ లేదు. కోటి పార్ధివ దేహం కోసం కూడా ఎదురు చూసి.. చిత్రహింసల పాలైన ఛిద్రమైన దేహం. కాళ్లు చెక్కేసిన దేహం.‘అట్లనే ఉన్నవా? పోస్టు మాడర్నిస్టువి అయినవా? రెండేళ్ల కిందట. మీడియాలో కిషన్‌జీ గంటగంటకూ ప్రత్యక్షమైన కాలంలో.. ఫోన్.. హలో.. హలో.. ఎవరూ.. గొంతుకూడా గుర్తుపట్టకుండా తయారయినవా? ధిక్కార స్వరం. ‘ఎవ రూ’..? అసహనంగా అడిగినప్పుడు చెప్పిండు. నేను. కోటిని.. రాత్రి నిద్రలేమి ఎగిరిపోయింది. షాక్. ‘అదేంది? ఇంత ఫ్రీగా ఫోన్‌లో.. ఎట్లా సాధ్యం’ ‘జంగల్‌మహల్ పుణ్యం’. అయితే మాత్రం? అది సరే.. అని అప్పుడడిగిండు ప్రశ్న. పోస్టు మాడర్నిస్టు ప్రశ్న. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో దాదాపు నెలరోజులు కోటేశ్వరరావు లైవ్. నాకు భయం. ఎలుకకు ప్రాణసంకటం. ఏం? భయ పడ్తున్నావా? భయపడక ఫోన్ ట్యాప్ అయితది కదా? అంటే.. అయితే ‘జర్నలిస్టువే కదా !’ అవునను కో.. కానీ జర్నలిస్టును నువ్వు ఇప్పుడేంది? అని ఎవరడగరు? నేను అడుగుతు న్నా.. కిషన్‌జీని.. జంగల్‌మహల్ నుంచి.. ఎప్పుడో .. ముప్పదేండ్ల కింద విడిపోయిన వాళ్లం.. మళ్లీ ఇన్నాళ్లకు జంగల్‌మహల్ నుంచి, జనారణ్యంలో ఉన్న నాకు నా స్నేహితుడి ఫోన్.. అందుకున్నా. అతనెప్పుడూ నన్ను వీడడంలేదు. మధ్యలో మాట్లాడినందువల్ల కూడా కావొచ్చు.
కోటేశ్వరరావు అనే కిషన్‌జీ.. నా జీవితంలో రెండు మలుపులకూ కారకుడు. ఒకటి విప్లవంలో.., రెండు విప్లవం బయటకు రావడంలో ఆయనే ఉండడం.. అది కొనసాగి నా వృత్తిలో భాగంగా మాట్లాడడం వల్ల కావొచ్చు. అతనింకా నాలో బతికే ఉన్నాడు.

మా ఊరు యాదికొస్తున్నది. ఒక మూడు జ్ఞాపకాలు పంచుకుంటాను. మాఊరిలో ఒక లైబ్రరీ .. మేం విప్లవకారులం ఏర్పరుచుకున్న లైబ్రరీ. రెండువేల పుస్తకాలు. మా యూనిట్ మీటింగ్‌కోసం జిల్లా కమిటీనుంచి కోటేశ్వరరావొచ్చిండు. చర్చలు. విమర్శలు. ఆత్మవిమర్శలు. అర్ధరాత్రి దాటింది. నేను సెంట్రీ. దగ్గురాయలింగు, పోరెడ్డి వెంకన్న, నా చిన్ననాటి స్నేహితుడు కిట్టి, గంధం ఆంజనేయులు. కోటి నిద్ర పోతున్నడు. పోలీసుల దాడి.. పోలీస్ అని కేక.. తప్పించుకోగలిగాం. దగ్గురాయలింగు, కిట్టి మా పుస్తకాలు అరెస్టయ్యాయి. కోటి, నేను, ఆంజనేయులు, వెంకన్న తప్పించుకోగలిగాం. నా ఒంటిమీద లుంగీ, బనీ ను ఉంది. వాళ్లు ఎండాకాలం అంగీలు విప్పి పడుకున్న వాళ్లు అట్లాగే లేచి రావ డం. ఊరుదాటి, అడవిదాటి, చాకలి వాళ్లదగ్గర బట్టలు అడుక్కొని..అదంతా ఇప్పు డే జరిగినట్టు.. బగుళ్ల గుట్టల మీదుగా ఆనాడు గ్రేట్ ఎస్కేప్ తర్వాత.. కొన్నాళ్లకు.. కోటికి తుపాకీ గాయమయింది. నేను నా ఏరియాలో ఉన్నా. సెంట్రల్ ఆర్గనైజర్ గా మంథని ప్రాంతంలో అరవై గ్రామాలు.. మరో సహచరుడు తుపాకి బాగుచేస్తూ ఎదురుగా ట్రిగ్గర్ నొక్కినప్పుడు కోటి గాయపడ్డడు.

ఆ వార్త నా ఏరియాకు చేరింది. ఆయనను చూడడానికని బయటకొచ్చిన నేను నాబలహీనతల వల్ల, చేతగాని తనం వల్ల విప్లవం ఇకనేను కొనసాగించలేననే ధోరణికి రావడం వల్లా మళ్లీ ఏరియాకు వెళ్లలేదు. అప్పటికే నిర్భంధం తీవ్రంగా మొదలైంది. ఏరి యా అంతా పోలీసులు. మగతగా..., మాగన్నుగా.. నిద్రలేమి రాత్రులు. మధ్యతరగతి బలహీనతలు వెరసి.., నేనిక విప్లవకారుడిగా ఎంతమాత్రం మనజాలను అని మనసు స్థిరపరుచుకున్నది. కోటేశ్వరరావును చూడడానికి బయటికి వచ్చి.. జీవితంలో మలుపు. చివరకు నాతో మాట్లాడడానికి రాష్ట్రకమిటీ బాధ్యునిగా కోటి కబురు. మేం ఏ బగుళ్ల గుట్టల గుండా పారిపోయామో అవే గుట్టలు. అక్కడ మా చివరి సమావేశం. ‘నేను మన పత్రికల పనిగానీ, లేదా అర్బన్ ఏరియాల్లో ట్రేడ్ యూనియన్ పనిగానీ చేస్తాను గానీ.. ఏరియాలో ఉండను’ అని నేను.. ‘వికలాంగునివా? ఆ పని ఎవరైనా చేస్తారు. ఇంత ఏరియాలో మంచి స్ట్రగుల్స్ వస్తున్నవి. నువ్వు నీ ఏరియాకే వెళ్లాలి’ అని కోటేశ్వరరావు. ‘నా పట్ల నువ్వు కఠినంగా వ్యవహరిస్తున్నావు’ అని నేను.. ఏఎన్.. నువ్వు పార్టీలో కొనసాగాలంతే.. ఈ తప్పించుకునే మాటలు వద్దు. వెళ్తావా ఏరియకు వెళ్లు. వద్దంటే.. మరో ఆలోచన వద్దు.. అదీ మా సంభాషణ. ఆ రాత్రి మా బంధానికి చివరి రాత్రి. అట్లా ఆనాటి చివరి సంభాషణ. నేను సాదాసీదాగా జీవితంలో ఒక సామాన్య మనిషిని అయ్యాను. నేను ఆ తర్వాత ఇంకెంత మాత్రం విప్లవకారునిగా లేను.

నా రెండో జిందగీ జర్నలిస్టు. కోటి మాటలు యాదికొస్తున్నవి. మనిషితో పాటు కొనసాగినట్టే ఉన్నది. బయటి బతుకులోనూ ఆయనే నాకు ప్రేరణ. నా కనీస విలువలు, జీవితం, నాపరిమితుల్లో నా సంఘర్షణ మూలం కోటి... ఇదంతా తలపోతే. మొదటి పూర్తి విప్లవ కారుల జాబితాలో ఇక మిగిలింది ఇద్దరు. మా తరం ఏమయింది? అదిప్పుడు మరి ఇద్దరుగా అడవిలో ఉంది. ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లా రాజిడ్డిల రూపంలో దండకారణ్యం మీద ఎర్రజెండాగా కొనసాగుతున్న ది. అది విస్తృతమై మహా సైన్యమవుతున్నది. ఆగి పోయిన వాళ్లు.. ఇక్కడ కోటి శవం మీద కోటి బంధాన్ని తల పోస్తున్నరు. వలపోస్తున్నరు. ఆగిపోయినవాళ్ల దుఃఖం మంటల్లో కోటి అంటుకుంటున్నడు. లోలోపల.. దుక్కంలాగా.. కన్నీరై కరుగుతున్నడు. బతికుండి విప్లవకారుడిగా, సహచరుడుగా ఉన్నప్పుడు ఆయన మాకు మార్గదర్శకుడు. తాత్విక పునాది. మా బయటి జీవితంలో కనీస విలువలు కాపాడుకొని మనిషిలాగా జీవించడానికి ఒక కాన్షస్ కీపర్. కోటి మరణించాడు.. కనీసం.. మేం మరణించే వరకు. అతను మాలో ఒక సజీవధార. చితిమండుతున్నది. మాలోపలి మంట అంటుకుంటున్నది.
(ఇది సంపాదకీయంకాదు. నా వ్యక్తిగత అభివూపాయాల కాలమ్. ప్రాణహిత. నా స్వంతం.)

-అల్లం నారాయణ

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...